Friday, December 18, 2009

మది లోని మధురానుభూతులు అలా . . . అలా . . .

కౌంట్ డౌన్ – 5

బ్లాగు అంటే అమితాబచన్ నే రాస్తాడు , ఇంకెవరూ రాయరు అనుకునేదానిని . కాదు అందరూ వ్రాయవచ్చు , అందులోనూ తెలుగు లొ వ్రాయవచ్చు , అని తెలిసి బ్లాగ్ మొదలుపెట్టాను . కాని ," పండిత పుత్ర పరమశుంఠ " అన్నట్లుగా అసలు అదేమి తెలుగు , అసలు తెలుగేనా ? నేను వ్రాసేది నాకే చదవ బుద్ది కావటము లేదు , అర్ధమే కావటము లేదు ." వున్న మతి పోయెనే చంద్రమతి " ," బతికివుంటే బలుసాకు తినొచ్చు " ఇలా నాకు తెలిసిన సామెతలు గుర్తుతెచ్చుకొని వ్రాయటము మానేద్దాము , అనుకుంటున్నప్పుడు లేఖిని గురించి తెలిసింది .ప్రాణం లేచివచ్చింది .అమ్మయ్య అనుకొని ఊపిరి గట్టిగా పీల్చుకొని వీర లెవల్లో మది లోని మధురానుభూతులు అలా . . . అలా . . . వ్రాసేయటము మొదలు పెట్టేసాను .


ఆంద్రజ్యోతి లో బ్లాగుల గురించి వచ్చింది చదివి , ఆ లింక్ లను ప్రయత్నము చేస్తూ , కూడలి లో , తెలుగు బ్లాగ్ గ్రూప్ లో ఎలా చేరానో నాకే తెలీదు . నిజం . మీరు తెలుగు గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది అన్న మెయిల్ చూసి గాభరా పడ్డాను . అలాగే , కూడలి లో మీ బ్లాగ్ చేర్చబడింది . మీకు వీలైతే కూడలిని మీ బ్లాగుకు లింకేయండి అన్న మెయిల్ చూసికూడా ఏమీ అర్ధము కాలేదు . ఆ తరువాత , అసలు ఎలా చేరాలో తెలీయటము కోసము , మా జయ తో , మా కజిన్ పార్వతి తో బ్లాగ్ తెరిపించి , కూడలి లో కలిపాను . వాళ్ళు ఆ విషయం చాలా లైట్ గా తీసుకున్నారు . అసలు నా కష్టం పట్టించుకోలేదు కూడా హూం ! ఇదో ఈ మద్య జయ బ్లాగటము మొదలు పెట్టింది . ఇహ పార్వతిని పోరాలి .


అందరి బ్లాగ్ లు చదువుతుంటే నాకూ అలా ఫొటోలు , పాటలు పెట్టాలని , ఇంకా వ్రాయటము కూడా మెరుగుపరుచు కోవాలని అనిపించింది .అంతే మా వారి ప్రోత్సాహము తో మా మనవరాలి తో పాటు అనిత దగ్గర ట్యూషన్ లో చేరాను . తను కూడా చాలా ఉత్సాహముగా హెచ్ .టి .యం .యల్ కోడ్స్ వగైరా నేర్పించింది . అవి నేర్చుకోవటానికి మొదలు పెట్టిన ఒక్కొక్క టెస్ట్ బ్లాగ్ నచ్చి , సాహితి కి తోడుగా , ప్రయాణాల అనుభవాలు వ్రాయటానికి , " చల్తే చల్తే " , నచ్చిన పాటలు వ్రాసుకోవటానికి " కమ్మటికలలు " , టెంప్లెట్ చేయటము నేర్చు కోవటానికి మొదలు పెట్టినది తెగ నచ్చేసి " ప్రభాతకమలం " ఇలా నాలుగు బ్లాగులు పోగేసుకున్నాను. ఒక్క వాక్యము వ్రాయటానికే బద్దకించే నేను ఇన్ని వ్రాస్తున్నాను అంటే నామీద నాకే ఆశ్చర్యం వేస్తోంది ! ! !


మరి ఇన్నివ్రాస్తున్నప్పుడు , ఎందులో ఏది వ్రాస్తున్నానో తికమక కాకుండా ఓ నోట్ బుక్ పెట్టి , దాని లో వ్రాద్దామనుకున్న టాపిక్ గురించి వ్రాసుకొని , దానికి సంబందించిన చిత్రాలు , పాటలు , వెతుక్కొని వ్రాసి , దానిని వర్డ్ డాక్యుమెంట్ లో పేస్ట్ చేసుకొని , అబ్బ ఎన్ని తిప్పలు పడుతున్నానో ! అప్పుడు కాని ఈ మాత్రము రావటము లేదు . ఎంత చూసుకున్నా తప్పులు వస్తునే వున్నాయి . ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చు కోవాల్సింది వుంటునే వుంది .


నా పోస్ట్ లలో నాకు చాలా నచ్చింది , చల్తే చల్తే లో హైదరాబాద్ గురించి వ్రాసిన మూడు పోస్ట్ లు . అలాగే కమ్మటికలలు లో జీవనతరంగాలు అనే పేరు తో సీరియల్ గా వ్రాసిన పోస్ట్ లు .దాని కోసము చాలా కష్ట పడ్డాను . ఎక్కువగా వ్రాయకూడదు , పాటలు ఆ సంధర్భానికి సరిపోయేవి కావాలి , అందులోనూ పాత సినిమాలవి కావాలి . చాలావరకు అనుకున్నట్లు గానే వ్రాసాను . ఇక సాహితి లో అయితే నచ్చినవి చాలానే వున్నాయి . కాని అసలు ఏమాత్రము నచ్చనిది మాత్రము " తొలకరి " . దాని గురించి చాలా ఊహించుకున్నాను . కాని ఎందుకో నా ఉహకు సరిపోను రాలేదనిపిస్తుంది . సృజన కావలిసిన ఫొటో కూడా వెతికి ఇచ్చింది . టైటిల్ , ఫొటో వున్నంత అందముగా పోస్ట్ రాలేదని పిస్తుంది . అప్పుడప్పుడూ తీసి చూస్తూ వుంటాను ఇంకా ఎంత బాగా వ్రాయగలనా ? ఏమి మార్పులు చేయాలి అని . ఏది ఏమైనా , ఏమి వ్రాసినా , ఏదీ వివాదాస్పదమైనది వ్రాయకూడదు , ఎవరినీ నొప్పించేట్లుగా వ్రాయకూడదు అని మటుకు నిర్ణయించుకున్నాను.


బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ బ్లాగ్ లో మూడు ఆర్టికల్స్ రావటము , పుస్తకము లో ఒక ఆర్టికల్ రావటము చిన్నపాటి విజయాలు . మా అమ్మా నాన్నగారు ల గురించి , నేను జయ కలిసి వ్రాయటము ," ఈ రోజు ఏమీ కొనకూడదుట " పోస్ట్ పూర్తి సంభాషణగా వ్రాయటము ఓ బుజ్జి ప్రయోగాలు .



మొదట్లో నేను వ్రాసిన పోస్ట్ లు కొన్ని మార్చాను కాని అన్నీ మార్చలేదు . అప్పుడు ఎలా వ్రాసానో తెలియటానికి , అప్పుడప్పుడు చదువుకొని నవ్వుకోవటానికి అలానే వుంచుదామనుకుంటున్నాను . ఎవరైనా చదివి తలనొప్పి తెచ్చుకుంటే నా భాద్యత కాదు !


ఇక నామీద జరిగిన కుట్ర గురించి తెలుసుకోవాలంటే 20/12 న వచ్చే పోస్ట్ కౌంట్ డౌన్ 4 లో చదివి తెలుసు కోండి .

14 comments:

మరువం ఉష said...

good effort. all the best. Sure blogging is like a journey for anyone. I hope you have much more fun with this ride together with many.

Kalpana Rentala said...

మాలా కుమార్ గారు,

మీరు కష్టపడినా అభివృధ్ధి సాధించారు. నాకైతే ఇంకా బ్లాగ్ కొత్త కొత్తగానే వుంది. కామెంట్లు రాయడం ఒక పెద్ద ప్రహసనం లా అనిపిస్తుంది. మీ అందర్ని చూస్తే ముచ్చటేస్తుంది.

మురళి said...

Congratulations.. Kutra??

cartheek said...

బావుంది అక్క మీ బ్లాగింగ్ అనుభవం

ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చు కోవాల్సింది వుంటునే వుంది .

మనిషి ఎప్పుడు నిత్య విధ్యార్దే కదా!

any way congrats sister...

సిరిసిరిమువ్వ said...

మాల గారూ, ఆ మధ్య ఓ రోజు వరసపెట్టి మీ టపాలన్ని చదివా..మీ భావ వ్యక్తీకరణలో వాక్యనిర్మాణంలో ఎంత బాగా మార్పు వచ్చిందో అనుకున్నా..ఇన్ని కష్టాలు పడ్డారన్నమాట. కష్టే ఫలి అన్నారు పెద్దలు మరి!

మీరు బ్లాగు మొదలుపెట్టిన కొత్తలో మీరు వ్రాసిన టపాలు నాకు బాగా గుర్తే! అప్పటికి మీరెవరో తెలియదు కదా...ఈవిడ ఎవరో కాని తెలుగు మీద ప్రేమతో ఎంత ఓపికగా వ్రాస్తున్నారో..అనుకునేదాన్ని. మీ కబుర్లు చదివి మీరు కూడా జ్ఞానప్రసూనగారి లాగా చాలా పెద్దవాళ్లు అయి ఉంటారు అనుకున్నా :))

మీ ఓపికకి, కార్యదీక్షతకి, మీ తెలుగాభిమానానికి నా అభినందనలు.

శ్రీలలిత said...

మాలాకుమార్ గారూ,
ఎంత ఓపికండీ మీకు... ఎంతైనా మెచ్చుకోవచ్చు మిమ్మల్ని. కొత్త విషయం నేర్చుకోవాలనే ఆసక్తి ఉండడంతో పాటు అంత శ్రధ్ధగానూ దానిని నేర్చుకోవడం చాలా గొప్ప విషయం. మీ మీద కుట్ర చేసేవారెవరో చెప్పండి... వాళ్ళ పని పడతాం..శ్రీలలిత.

కొత్త పాళీ said...

మీ మొదటి టపాలు చదివిన గుర్తుంది. చాలా దూరం వచ్చారు ఆ మొదటి అడుగు నించి. అభినందనలు

మాలా కుమార్ said...

ఉష ,
మురళిగారు ,
కల్పన రెంటాల గారు ,
థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

థాంక్ యు తమ్ముడు .
* సిరిసిరి మువ్వగారు ,
మీకెంత ఓపికండి ! అంత ఓపికగా నా పాత టపాలన్నీ చదివినందుకు చాలా చాలా థాంక్స్ అండి .
ఇంతకీ నేను పెద్దదాన్నా ? చిన్న దాన్నా ? హి హి హి .

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు ,
మీ అండ చూసుకొనే రేపే చెప్పేస్తానండి , ఆ కుట్రదారులెవరో .


* కొత్తపాళి గారు ,
ధన్యవాదాలండి .

భావన said...

Very Nice Mala garu. అవును ఎంత మార్పు వచ్చిందో మీ బ్లాగ్ లో.. అస్సలు మిస్ అవ్వకుండా నేను చదివే బ్లాగ్ ల లో మీది ఒకటీ. All the best.

మాలా కుమార్ said...

thank you bhavana

సుభద్ర said...

మాలగారు,
ప్రయెగాల కోస౦ బ్లాగ్స్ సృష్టి౦చట౦ అలా వదిలేయకు౦డా వాటిని మాకోస౦ ఎ౦తో ఓపిగ్గా
రాయట౦ ...మీ వాళ్ళతో కుడా రాయి౦చట౦ ,అన్ని నేర్చుకు౦టూ...నేర్పుతూ...
మీరు నాకు ఇచ్చే స్ఫూర్తి ...మీకు మీరే సాటి...

i wish u all the best..

కౌ౦ట్ డౌన్ లెక్కపెడుతూ..

Srujana Ramanujan said...

Congrats. 20000 hits. Me made it