Friday, January 30, 2009

బంగారక్క

కొత్త మురిపెం అనుకుంటూ ఎంత భయం ,ఆదుర్దా ,ఆందోళన ,మొదలైన రకరక్లాల భావాలతో కొత్త్త బంగారు లోకం లోకి వెళ్ళానో అంతే భావాలతో అమెరికా కి ప్రయాణం అయ్యాను. 84 లో హైదరాబాద్ తిరిగి రావటము పిల్లల చదువులు , పార్లర్ పెట్టుకోవటము ,సంజు పెళ్లి అన్ని చకచకా జరిగి పోయాయి.ఆర్మీ నుంచి రావటము బాద లేదు కాని అయన యునిఫారం ని ఊర్లు తిరగాటని చాల మిస్ అయ్యాను. 12 సంవత్సరాల తరువాత ప్రయాణము.మల్లాది పిల్లల బుక్ ,కొన్ని కథల బుక్స్ కొన్నాను.అలక ఫ్రెండ్ దగ్గర కొన్ని ఫ్రాక్స్ కుట్టించాను.పూనా లో నేను ఫ్రాక్స్ కుట్టినప్పుడు అందరు అమ్మాయి పుడుతుంది అన్నారు.ఇప్పుడు కూడా ఫ్రాక్సే కుట్టించాను .ఇప్పుడు కూడా అందరు అమ్మాయే పుడుతుంది అన్నారు.అయితే ఏమవుతుంది.అమ్మాయిలు వుంటేనే ఇంట్లో సందడి అన్నాను.ప్లేన్ నుంచి దిగే సరికి సతీష్ వచ్చి వున్నాడు.ఆ రోజంతా నిద్ర పోతూనే వున్నాను.ముడో రోజు రాత్రి సంజు కు నొప్పులు మొదలయినాయి.వెంటనే హాస్పెటల్ కి వెళ్ళాము.సంజు ఫ్రెండ్ శాంతి వచ్చింది.ఇక్కడ సంజు తో పాటు మేము కూడా వుండటము తప్పనిసరి అట.నేనేమో చూడ లేను.కొంచము సేపు వుండటము బయట కి వచ్చి కూర్చోవటము ,.బయట కూర్చో ని హనుమాన్ చాలీసా లలిత చదువు కుంటూ వున్నాను.అప్పుడే ఒక కపుల్ అక్కడే ఏవో వ్యాయామాలు చేస్తున్నారు.వాళ్ళు చేసేవి చూస్తుంటే చాల నవ్వు వచ్చింది.అలా నవ్వ కూడదని తరువాత సంజు చెప్పింది.
కొద్ది గ కళ్లు మూతలు పడ్డాయి.సోఫా లో వెన్నకి వాలి కళ్లు మూసు కున్నాను.ఏదో అమ్మవారి గుడి కి వెళ్ళాను.అందరు అమ్మవారిని చూసి వెళ్లి పోతున్నారు.నేను కూడా వెళ్ళు తుంటే పూజారి,వెళ్లి పోతావేమిటి దండం పెట్టు కో అన్నాడు.నేను దండం పెట్టుకుంటూ పెట్టు కుంటూ వుంటే శాంతి వచ్చి లేపి ఆంటీ పాపా పుట్టింది అని చెప్పింది.వక్క నిమిషం నేను ఎక్కడ వున్నానో తెలిలేదు.తరువాత చాల సంతోషం వేసింది.అమ్మవారే వచ్చింది అనుకున్నాను.(తరువాత అను వాళ్ళ అమ్మ తో కట్టే మైసమ్మ గుడి కి వెళితే నాకు కల్లో వచ్చిన గుడి అదే అని ఆశ్చర్య పోయి చూస్తూ వుంటే అప్పుడు కూడా పూజారి దండం పెట్టుకొమ్మ అని కలలో అనినట్లే అన్నాడు.) వెంటనే వెళ్లి చూసాను.ఎంత ముద్దుగా వుందో.పుట్టిన వెంటనే నేను చూసిన మొదటి పాపా అదితి నే.ను నా పిల్లల ని పుట్టిన చాల సేపు తరువాత చూసాను.ఇంక స్నానం చేయించ నే లేదు అప్పుడే కళ్లు తెరిచి చూస్తోంది.అదితి కి స్నానం చేయించటము కూడా భయం భయం గా చేయించాను.అక్కడ నేనే పెద్ద దిక్కు.ఆ పెద్దరికము కూడా బాగానే వుంది .
రోజు స్నానం చేయించటము, నా కొచ్చిన పాటలని పాడటము.ఎన్ని పాట లో పాపం పిచ్చ్చి పిల్ల నాపాటలన్నీ వింది.నా ప్రావిణ్యం అంత దాని మీదే.నేను ఎటు వెళితే అటు కను రెప్ప వేయకుండా చూసేది.ఎనమిది నెలలు చాల ఎంజాయ్ చేశాను.చాల గుడ్ గర్ల్.హైదరాబాద్ వచ్చే టప్పుడు ప్రయాణం లో కూడా ఏడవ లేదు.
తిరుపతి లో గుండు చేయించి నామాలు పెట్టి,పింక్ కలర్ డ్రెస్ వేస్తే ఎంత బాగుందో.వాళ్ళు తిరిగి వెళ్లి పోయాక నేను అదితి ని చాల మిస్ చేశాను.తిరిగి రెడేళ్ళ తరువాత నేను మళ్ళి అట్లాంటా వెళ్లి నప్పుడు చూసాను.అప్పటి కి కొంచము పెద్దది అయ్యింది.ఈసారి అన్ని కథల బుక్స్ తీసుకెళ్ళాను..చాల మాటలు,పద్యాలూ చెప్పేది.ఎంతసేపు మాల్ ఆటలు ఆడేది.బయిటికి వెళ్ళితే ఇంటికి రావటము ఇష్టము వుండేది కాదు.వేరే మాల్ కు వెలుదాము ఇంకులోకి వద్దు అనేది. హంట్స్ విల్ల్ లో ఇద్దరమూ కాలనీ అంత తిరిగే వాళ్ళము.బిపు ఇంటి ముందు ఒక పూల చెట్టు వుంది. .దాన్ని నిండా పింక్ కాలర్ పూలు వుండేవి.అ చెట్టును వూపుతే జల జలా పూలు రాలేవి.అప్పుడు మల్లె పూల వాన అని పాడేది.కొన్నిసార్లు అను కాలేజీ కి వెళుతూ మమ్మలి ని మాల్ లో దింపి వెళ్ళేది.తిరిగి వెళ్ళేటప్పుడు తీసు కేల్లేది.వకసారి అదితి చేతు లో నించి పాప్కార్న్ పడిపోయాయి.అను గబగబా ఎత్తుతుంటే అదితేమో ఎవ్రి బడీ క్లీన్ అప్ అని పాడటము మొదలు పెట్టింది.అందరూ నవ్వటమే.ఎ పని చేసిన క్లీన్ గ చేసేది .బయట నుంచి రాగానే ఫ్రాక్ విప్పి హాంగర్ కి తగిలించేది..నేను పని చేస్తుంటే హెల్ప్ చేయటాని కి వచ్చేది.కొత్తిమీర ఒకొక్క ఆకు ఎంత బాగా తుంపేదో .పక్క వేస్తుంటే చక్కగా ముడతలు లేకుండా వేస్తుంది.ఇప్పటి కి ఆ జాగ్రత్త అలాగే వుంది.అందరి తో కలిసి పోతుంది. .పెద్ద అమ్ముమ్మ కి అదితి పాటలంటే చాల ఇష్టము.ఎప్పుడు పాడమని అడుగుతూ వుంటుంది.తాత మా అదితి చిన్న బంగారు తల్లి అంటారు.గౌరవ్ అయితే ఎప్పుడు అదితి ఇంటికి వెళ్ళాలి అంటుంటాడు. నా ఇష్టాలు కొన్ని అదితి కి వచ్చాయి అనుకుంటాను.నా కుట్లు అల్లికలు బుక్ దాని కే ఇచ్చాను.నా బర్త్డే కి చిన్న గుండ్రాయి మీద పెంట్ చేసి ఇచ్చింది.చాల బాగుంది.ఇంట్లో అందరి కి లవ్లు బేబీ. అన్నం పెట్టి మింగావా అంటే మింగాను అనటము రాక మింగు అనేది.అన్నం తిన్నప్పుడల్లా సుబ్బలక్ష్మి స్టొరీ చెప్పుకు నే వాళ్ళము.మా పిల్ల లందరికి మింగావా మింగు,సుబ్బలక్ష్మి స్టొరీ అలవాటు అయ్యింది.ఇప్పుడు అందరు సుబ్బలక్ష్మి స్టొరీ వద్దు అన్నం తింటాం అంటారు.అదితి కైతే సుబ్బలక్ష్మి స్టొరీ బోర్ అయ్యిందట.మొదలు పెట్టగానే వద్దు వద్దు అంటారు.అదీ సంగతి. ఇక ఇదు రోజుల లో టీన్స్ లో కి వేలుతానని ఎదురు చూస్తోంది.ఇప్పుడు నాకే అన్ని నేర్పిస్తూ ఉంది .నీ మెయిల్ ఐ.డి ఇమ్మంటే నువ్వే కాలం లో వున్నావు.మేము పేస్ బుక్ వాడుతాము అంది .ఫ్రెండ్స్ అంతా పేస్ బుక్ చూస్తారట.అందు లో నే చాట్ చేస్తారట.నొవెల్స్ చదువు తోంది.చూస్తూ వుండగానే ఎంత పెద్దది అయిపోయిందో. కాని నాకు మాత్రం చిన్నప్పుడు తనకిష్టమైన బార్నీ షో లోని పాట ఐ లవ్ యు ,యు లవ్ మీ పాడు కుంటూ ,టెల్లీ టబ్బీస్ చూస్తూ గెంతుతూ వుండే ,చిన్న చిన్న ఫ్రాక్స్ వేసుకొని ముద్దు ముద్దు గా ఉన్న అదితి లాగానే కనిపిస్తుంది..మా చిన్ని అదితి మాకు ముద్దు.

Thursday, January 15, 2009

బిపు, సంజు

బిపు పేర్ల లిస్టు
బిపు పుట్టినప్పుడు అయన కి ఇచ్చిన టెలిగ్రాం
సంజు పేర్ల లిస్ట్Wednesday, January 14, 2009

సంక్రాంతి

ముచ్చటగా మూడు రోజుల పండుగ సంక్రాంతి.వాటిని భోగి,సంక్రాంతి,కనుమ అంటారు.వుత్సాహంగా జరుపుకునే సంక్రాంతి లో ఎన్నో విశేషాలు వున్నాయి.హేమంత రుతువు లో గడగడా లాడించే చలి లో మంచు లో పంట పొలాల మీదు గా శుభాలు వెంట తీసుకొని వస్తుంది ధాన్య లక్ష్మి,అందరి ఇండ్ల లో కి ఆ రోజున.సుఖ సంపద ఇచ్చే ఆ దేవి కి శుభ్ర మైన వాతావరణం లో ఆహ్వానం పలకాలి.అందు కే అందరు ఇంటి కి రంగు లు వేసి,గుమ్మా ని కి పసుపు,కుంకుమ పెట్టి,తోరణాలు కట్టి ధాన్య లక్ష్మి కి పూజ లు చేస్తారు.
అదే రోజు సూర్య భగవానుడు మకర రాశి లో ప్రవేశించటము వలన ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది.అది చాల శుభ ప్రదం గా భావిస్త్రు, నదీ స్నానం చేసి దాన ధర్మాలు చేస్తారు.
ఆ రోజు సూర్యోదయా ని కి ముందే స్నానం చేసి,కొత్త బట్టలు కట్టుకోని పొంగలి తినటము సాంప్రదాయము .
మొగ పిల్లలు డాబా ల మీద గాలి పటాలు ఎగుర వేస్తారు.
ఆడపిల్లలు ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేస్తారు.
కొత్త అల్లుళ్ళు అత్తవారి ఇంటి కి వస్త్తారు.కొత్త బట్టల తో,పిండి వంటల తో అత్తవారు వారిని సంతోష పెడుతారు.
ఇల్లు కొత్త పంటల తో కళకళ లాడుతాయి.జంగమ దేవరులు,హరిదాసులు,గంగిరెద్దులవారు కను విందు చేస్తారు.
భోగి రోజు చిన్న పిల్లలకి భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు .బొమ్మల కొలువు పెడతారు.
తరవాతి రోజు కనుమ.ఈ విధము గా మూడు రోజు లు పండుగ సంబరాలు జరుపు కుంటారు.

Monday, January 12, 2009

సంజు -బిపు

సంజు డాడి మీద చాల బెంగ పెట్టుకుంది.అయన ఇంట్లో వునంత సేపూ అయన తోటే వుండేది.పెద్ద గ అయ్యాక కూడాఏ అవసరం అయినా డాడీ అనటమే అలవాటు. ముందు మాట కూడా డాడీ అనీ అంది.నిద్ర లో డాడీ అన్గానే ఈ రూమ్ నుంచి వస్తున్న తల్లి అనేవారు.కాని ,ఆ డాడి కాని,ఈ కూతురు కాని లేచే వారు కాదు అంతా నిద్ర లోనే .లేచి నిద్ర పాడు చేసు కునేది నేను, బిపు. నిద్ర లో కలవరించే అలవాటు అదీ దొంగ,దొంగ అని మమయ్యగారి కి ఈయనకి వుంది.. దొంగ లేరు ఎవరు లేరు పడుకో అనేవారు అత్తయ్యగారు.ఇప్పుడు మా అయన కైతే ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ వస్తారు.వాడి కి ఇంగ్లిష్ లో స్పీచ్ ఇస్తూవుంటారు.వుంటారు.మీ స్పీచ్ కి మహా మహా వల్లే తట్టుకోలేరు పిచ్చి వెధవ ఎపుడో పారిపోయి వుంటాడు వుంటాడు అంటాను.ఇప్పు ఐతే పరవాలేదు.కల్నల్ దత్త చెప్పారు,వార్ లో వున్నప్పుడు చోర్ చోర్ అని గట్టి గా అరిచారట.అందరూ గన్స్ తీసుకొని వచ్చారట. అర్దేర్లీ సర్ నిద్ర లో కలవరిచారు అని చెప్పాడట.ఇప్పుడు గౌరవ్ కి అదే అలవాటు గట్టి గట్టి గా ఏదో అరుస్తూ కాళ్ళ తో తో తంతు,తల తో కుమ్ముతు వుంటాడు.రాత్రంతా ఇద్దరి ని సవరించట మే సరిపోతుంది.పైగా ఎందు కు లేస్తావ్ పడుకో అంటారు.

సిలిగురి కి రమ్మని నాకు,సంజు కు ప్లేన్ టికెట్స్ పంపారు.సిలిగురి లో దిగేవరకు ఏడుస్తూ నే వుండి.అయన ను చూసి ఆపింది.కలకత్తా లో వక ఫ్రెండ్ ఇంట్లో (వాళ్ళు లీవ్ లో వెళ్లారు).వున్నాము.శాంతినికేతన్ చూడాలని చాల వుండింది.కాని చూడ లేక పోయాము.డార్జ్లింగ్ వెళ్ళాము.వక వారము అంత తిరిగి ఎంజాయ్ చేసి వచ్చాము.

ఖమ్మం వెళ్ళుదామని బస్ ఎక్కాను. టు ఇయర్స్ అని సంజు కు టికెట్ థీసు కొ లేదు.దీని వగుడు చూసి కండక్టర్ టు ఇయర్స్ అంటే నమ్మలేదు.పైగా సంజు కూడా నాకు థ్రీ ఇయర్స్ అంది.అనటంతో ఎందుకమ్మ చదువుకున్న వాల్లు అభదం చెపుతారు అన్నాడు సిగ్గని పించి టికెట్ తీసుకున్నాను.

ఇంట్లో అందరూ సంజును ముద్దు చేసే వారు.. శేషు చాలా ముద్దు చేసేది.సంజునే కాదు బిపు గౌతం అందరి ని తేసుకొని బయటకు వెళ్ళేది.గల్లి లో అందరు మమ్మీ మమ్మీ మోడరన్ బ్రెడ్ అని ఏడిపించేవారు.నాతో పాటు కాలేజీ లైబ్రరీ కి తీసు కెళ్తే అక్కడ నా పని అయ్యే వరకు ఆయా తో ఆడు కుంటూ వుండేది.అప్పుడప్పుడు స్నెహ దగ్గరి కి వెళ్లి హావ్ మోర్ లో ఐస్ -క్రీం తినే వాల్లము.స్నేహ ని ఐస్క్రీం ఆంటీ అనేది.

సెకండ్ టైం ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుదు అబ్బాయి కావలి అని చాల అంపించింది.ప్రథి మంగళ వారం అంజనేయ స్వామి గుడి కి వెళ్ళేదాన్ని.వకవెల కొడుకు కాకపోతే-అయినా నా పిల్లలని నేను ప్రేమించనా ? అయిన అదొ కోరిక.బాబు పుట్టగానే లక్ష్మి బాబు పుట్టాడు అంగానే చాల సంతోషం అని పించింది.వెంకట్ కూడా లొపలి కి వచ్చి చూసారు. మొత్తాని కి ఆంజనేయ స్వామి నా కోరిక తీర్చాడు. అప్పుడే అమ్మ ఇంట్లో సుందరాకాండ పారాయణ చేయిస్తోందట. ఏడోరోజు పుట్టాడు ఆంజనేయ వరప్రసాదం అని పారాయణ చేస్తున్న బ్రాహ్మడు అన్నడట !. అందుకే ఆంజనేయ స్వామి పేరు పెడదామని వుండింది .కాని పెట్టుకో లేదు.కాని, నక్షత్ర నామం నాకిష్టమైన సుభాష్ చంద్ర బోస్ పేరు నేతాజీ వచ్చింది.చిన్నప్పుడు అమ్మ చెప్పిన కథల లో నేతాజీ ,కర్ణుడు ,బుడుగు చాల ఇష్టం ఐనవి. .బిపు నేతాజీ ,ఐతే విక్కీ, గౌరవ్ బుడుగులయ్యారు.

మా బిపు పుట్టట మే మధురానుభూతి ఐతే , మరునాడే బి. ఏ ఫైనల్ ఎక్షాం రాసి పాస్ కావటము నా జీవితము లో ఇంకో మరచి పోలేని మధురానుభూతి.

అప్పుడే సిలిగురి ని ఫామిలీ స్టేషన్ చేసి మాకు ఇల్లు ఎలాట్ చేసారు.ఏప్రిల్ లో వచ్చి మమ్మలిని తీసు కెల్లారు.ఈస్ట్-కేస్ట్ ఎక్స్ ప్రేస్ లో బయలు దేరాము.చాల ఎండలు. పిల్లల కి ఎండ తగల కుండ కూపె లో నా కాటన్ చీరలు తదిపి కట్టి థీసు కెల్లాము.కల్ కతా స్టేషన్ లో జల్పాయిగురి కి టికెట్స్ కంఫర్మ్ చెసుకొవతాని కి ఈయన వెళ్లారు.తిరిగి వస్తుంటే సంజు ఎవరో ముసలాయన చేయి పట్టుకొని వెల్తోందట.ఈయన వెంటనే ఆపి సంజు ను తీసుకొని వచ్చరు.నేను ఈయన తో వెళ్ళింది అంకున్నాను .ఎందుకెళ్ళావు అంటే తతయ్య తొ వెల్లను అంది. ఎంత లక్కీ ! ఈయన చూడక పోతే తలచు కుంటే గుండె ఝల్లు మంటుంది.

Sunday, January 11, 2009

సంజు -బిపు

డిసెంబర్ ఇరవయ్ రెండు.మంగళవారం.అత్తయ్యగారు bఅడిచావిడి ఆంజనేయస్వామి గుడి కి వెళ్లారు.నేను కూడా ప్రతి వారము వెళ్ళుతున్నాను కాని ఆ రోజు చాతకాలేదు.వంట అంత చేసి చారు పోపు వేస్స్తూ వుండగా చాల రెస్త్లెస్స్ గా అన్పించి విజయ ను చారు కింద బంద్ చేయమని చెప్పి వెళ్లి పడుకున్నాను.వెంకట్ నా పక్కనే చదువు కుంటూ కూర్చున్నారు. అయన కాల్లెజ్ నుంచి వచ్చే సరికి చాల రాత్రి అయ్యింది.అప్పటి వరకు వెంకట్ వుండి తరువాత బాబి పెళ్లి kఅని బందర్ వెళ్లారు.పొద్దున్న విజయ మేరీ నరిసింగ్ హోం కి వెళ్ళాము.డాక్టర్ cచూసి మొన్న మీ అమ్మ తో చెప్పాను కదా జనవరి పది వరకు డెలివరీ కాదని అంది.అత్తయ్యగారు నిన్నటి నుండి నలత గా వుంది eఎ రోజు ఇక్కడ వుంటాము అన్నారు.ఆ రోజు రాత్రి కి ఈయన కూడా హాస్పిటల్ కి వచ్చారు.డాక్టర్ ఆయన తో కూడా తీసుకెళ్ళమని అంది కాని ఎందు కో అత్తయ్యగారు రేపు వెళ్తాము అన్నారు. రాత్రి పదింటి కి చాల చికాకు గా వుండింది.అత్తయ్యగారు నన్ను లేబర్ రూమ్ లో కి తీసు కేల్లమని సిస్టర్స్ ని తొందర చేశారు.వాళ్ళు ఈ విడ చేపెతే వినదు aన్కుంటూ లోపలి కి తీసు కెళ్ళారు. అక్కడ ఒక అమ్మాయి నొప్పులు పడుతూ గట్టిగ కేకలు పేడు తోంది.నాకు ఆమెని చూస్తుంటే బయం వేసింది.ఒక సిస్టర్ బయటి కి వెళ్లి ఈయనతో కాఫీ తీసుకు రnడి తాగుతే సడురుకుంటుంది.అంది.లోపల నేను కూడా ఈ అమ్మాయి లాగ అరుస్తాన అని చూస్తున్నాను.ఇంతలో వక సిస్టర్ అరె డెలివరీ అవుతోంది అంది.నేను పక్క అమ్మాయి కి అనుకున్నాను.కాని నాకే పాపా పుట్టిందట.సిస్టర్స్ ఇద్దరు హడావిడి పడిపోయారు.ఏంటి అని నేను అడుగుతే పాపా పుట్టింది అన్నారు .ఏది అంటే రూమ్ లో వక పక్కవుందన్నారు.గోడ పక్కన చిన్నగా కనిపిన్ చింది.అత్తయ్యగారు కల్లుతిరుగు tఉన్నాయని బయటి కి వెళ్లారు.కొంచముసేపు తరువాత రూమ్ లో పడు కో పెట్టారు.నాకు నిద్ర వచ్చేసింది.తెల్లవారుజామున మెలుకువ వచ్చింది.కొద్దిసేపు ఎక్కడ వున్నానో తేలి లేదు.తరువాత చూస్తే నా మంచం పక్కన ఉయ్యాల వుంది. పక్కన ఈయన నిలబడి చూస్తున్నారు.నేను లేచింది చూసి నువ్వు ,అమ్మ అలసిపోయి పడుకున్నారు.అందుకే ఇక్కడే వున్నాను పాపా ని చూస్తున్న అన్నారు.చూడు అప్పుడే కళ్లు తెరచి నన్ను చూస్తోంది అన్నారు.అప్పుడే వల్ల దాడి ఫాన్ అయిపోయినట్లుది.బారసాల చాల గ్రాండ్ గా అయ్యింది.క్రిస్మస్ పార్టీ లో అందరి ని పేర్లు రాసి ఇమ్మన్నారట.ధర్మదికారి మిసెస్ రాసిన సంజ్యోత్ సెలెక్ట్ చేశారు.చివరి వరకు ఎవ్వరి కి చెప్పలేదు.పింకీ అని పిలవాల ని అనుకున్నారు.కాని నాకు నచ్చలేదు.చివరకు సంజు చేశారు.అందరు పేరును బట్టి అబ్బాయి అనుకునేవారు.ఫిఫ్త్ మంత్ లో గోరియక్ వల్ల ఇంట్లో మొదటిసారి ఫోటో లు తీసాడు.చాల బాగా వచ్చాయి.సంజు కు మూడో నెల నిండక రెడ్డి కాలేజీ లో సెక్కండ్ ఇయర్ బి.ఏ లో చేరాను.పొద్దున్న ఎనిమిదిన్ టి నుంచి పన్నెండు వరకు వుండేది.పెర్మిస్సన్ తీసు కొని మద్యలో ఇంటి కి వచ్చి పోయేదాన్ని.స్వర్ణ,లలిత ఫ్రెండ్స్ అయ్యారు.ఇంగ్లీష్ లిటరేచర్ క్లాసు అంత ఫ్రెండ్లీ గా వుందేవల్లము.అందరు సజును కోసం ఇంటికి వచ్చేవారు.నీ కూతురు చాల ముద్దుగా వుంది అనే వారు.(అందులో ఖడ్గమాలా చాల ఎడ్లతరువత పద్మజ వదిన వియ్యపురలిగా ఈమద్య కనిపించింది.ముందు గ సంజు ఎట్లా వుంది అని అడిగింది.)స్వర్ణ నవేల్స్ బాగా చదివేది .తనతో అర.కే. లైబ్రరీ కి వెళ్ళెను.అట్లా నవల్స్ చదవటము అలవాటు అయ్యింది.సజు కు పాకతము లేట్ అయ్యింది.కాని నడక ,మాటలు చాల తొందరగా వచ్చాయి.కాలు,నోరు ఖాలిగా వుండేది కాదు.మొదటి సారిగా హంతి దంతి రయం చెప్పింది.వెంకట్ పెళ్లి కి వాన్ ఇయర్ అయిన పెద్ద పిల్లలాగా తిరిగింది.ఫిర్స్త్ బర్త్డే కిఖన్నా బెలున్స్ తో వరండా లో దేకారేట్ చేస్తుంటే వెంట వెంట తిరిగింది.బర్త్డే ఫంక్షన్ బాగా అయ్యింది.అప్పుడే బంగ్లదేస్ వార్ జరగతము మూలంగా ,అందరూ యునిఫరం లో వచ్చారు.ఆ ఇయర్ న్యూ ఇయర్ పార్టీ కి సేసెంద్రబాడ్ క్లబ్ కి వెళ్ళాము.రాత్రంతా డాన్స్ చేసి పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ చేసి ఇంటి కి వచ్చాము.సిలిగురి పోస్టింగ్ వచ్చింది.ఫెఇల్ద్ పోస్టింగ్ వలన ఫ్యామిలీ ని ఎలోవ్ చేయలేదు.బి.ఏ థర్డ్ ఇయర్ మొదలియింది.వక్కరే సిలిగురి వెళ్లారు.

Friday, January 9, 2009

ఆ పాత మధురాలు

ఆనంద్ వచ్చాడు నన్ను వైదేహీ అత్తయ్య తీసుకొని రమ్మన్నదట.వెళ్ళాను.పాప విజయ్ ,చారి మామయ్యగారు అందరూ ఇంట్లోనే వున్నారు.అప్పుడే మా మూర్తి తాత అవుతున్నాడు. నాకు మేము ఇంక స్కూల్ కి వేల్లుతున్నట్లుగాన్నే వుండి అని మామయ్యగారు అన్నారు.అత్తయ్య కి ఎప్పుడు నన్ను చూసిన పాత రోజులు గురుతుకు వస్త్తాయి.ఇప్పుడు ఇంత జుట్టు వుండి కాని పుట్టిన్నప్పుడు గుండె.ఆముదము రాస్తే జారి పోయేది.అంది.చిత్లపాడు ను గర్తుచేసింది చ్చిన్నప్పుడు చింతలపాడు వెళ్ళాలంటే కీసర దగ్గర బస్ దిగి బండి లో వేల్లీవాల్లము అమ్మమ్మ అన్నం ,కందిపచ్చడి,పెరుగు, పంపేది.వాగు దగ్గర తిని వెల్లేవాల్లము.పెద్దిల్లు.,వాకిలి మెట్లు ఎక్కి ఇంట్లో కి వెళ్ళే ముందు వరండా లో తాతగారు వుండేవారు.ఆయన పడక కుర్చీ దాని కింద రాగి చెంబు తో నీళ్లు వుండేవి.కింద కూర చోని రాయటానికి చిన్న బల్ల వుండేది.వెనక పెరడు లో చిన్న బొమ్మరిల్లు వుండేది.తిరనాళ్ళ అప్పుడు ఊరంతా కిట కిట లాడేది. అప్పుడు ఊరి అల్లుళ్ళు ను బస్ టాప్ ఎక్కించి తీసుకు రావటము (బస్ లో చోటు లేక )పద్దతి అని మా చిన్న మామయ్య అంటే చాల రోజులు నిజమే అనుకున్నాను.ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులున్దేవి.రధం వచినప్పుడు అవి ఎక్కి కూర్చొని చూసేవాళ్ళము.పీ.యు.సి.ఇంగ్లీష్ అక్కడే వుండి మురళి మాస్టార్ దగ్గర చదువుకున్నాను.అప్పుడే కొంచం సంగీతం కూడా నేర్చు కున్నాను.చిన్నపుడు ఒకసారి వెళ్ళినప్పుడు పిన్ని తో బాబాయిగారి ఊరు కోడూరు వెళ్ళాను.వల్ల కి నిమ్మ తోట మల్లె తోట వుండేవి.నాకు పిన్ని అత్తగారూ కొన్ని బొమ్మలు ఒక చిన్న చేక్కపెట్టే లో పెట్టి ఇచ్చింది.అది పరుపు చుట్ట లో పెట్టిబస్ పైన పెట్టారు.దిగేటప్పుడు తీసు కోవతము మరచి పోయాము.ఆ పెట్టె ఇంకా మరచి పోలేదా అని అందరూ నవ్వారు.బహుశా ఆ సంగతి పాప మరచి పోయి వుంటుంది.మా పెళ్లి లో ఆనంద్ బావమరిది పాత్ర పోషించాడు.(అప్పుడు భాస్కేర్ రాలేక పోయాడు.)నేను,జయ సెలవల్లో మిర్యాలగూడెం వెల్లేవాల్లము. లేకపోతే,ఆనంద్,విజయ్,పాప పోట్టిచేలమ వచ్చేవాళ్ళు.అప్పుడు అందరమూ కలిసి పినిక్ వెల్లేవాల్లము.అట్లా అందరమూ కలిసి వెళ్లి చాల రోజులు అయ్యింది,సినిమా కి వెళ్దామా అని పాప అంది .కాని అత్తయ్య ఒప్పుకోలేదు.కావాలంటే కమల దేలిఎవరీ అయ్యాక వెళ్ళండి అంది(ఆ రోజు ఇంత వరకు రాలేదు.ఎప్పుడు అన్కోవటమే కాని వీలవలేదు.)విరజాజి పూలు కోసి కట్టి ఇచ్చింది.నేను kuttina fracks choopinchaanu.mee అమ్మ కూడా kuttadi అంది అత్తయ్య అవును నాకు gurthundi అప్పుడు కొన్న kutlu allikalu,maalathi chandoor బుక్ naakichchindi annanu.pottichala లో intita grandalayam లో కట్టి books theppinchedi.taamsayar,hakalberiphin chadivanu annanu. అవును mee అమ్మ చాల pusthakalu chaduvuthundi naakantha opika లేదు అంది.నాకూ చిన్నప్పుడు chandamama ,balamithra,chadavatamu alvatu చేసింది., budugu ,dumbu ,nethagi,karna అన్ని కథలు cheppedi.dairy raayatamu కూడా choopinchidi కాని nake రోజు rase opika లేదు.కాని దాని moolanga rooju karchulu raasukov atamu,edyna పని వున్నా ,party వున్నా vivaranga rasukovatamu alavatu అయ్యింది. saayankalamu daaka ఇలాగే kabrlu cheppukunnamu.అప్పుడే kaadu ippudina koddisepu naa chinnappati సంగతులు ఆవిడ ఎప్పుడు గుర్తు చేసుకుంటూ వుంటారు.అత్తయ్య cheputhunte nakoo బాగుంటుంది.అందరి కి వల్ల chinnapati సంగతులు vintamu istamega.అత్తయ్య chesipettinavi తిని అందరి తో kabrlu cheppukoni ఇంటికి bayaluderanu.ఆనంద్ ఇంటి దగ్గర vadiladu.thripuraram vella లేక poyanu అన్నా bada కొంచం teerindi.

Thursday, January 8, 2009

ఆ పాత మధురాలు

త్రిపురారం వెళ్లి కొన్ని రోజులు వుందామని బయిలు దేరాను.మళ్లీ eక్కువ రోజు లైతే ప్రయాణము చేయలేను.డెలివరీ కి హైదరాబాద్ లో నే బాగుంటుందని అనుకోని అమ్మని నాన్నగారిని ఒప్పించారు.ఈ లో వెళ్లి రావాలని అనుకున్నాను.యెవీనిగ్ బస్ లో బయిలుదేరము.నార్కెట్పల్లి లో బస్ ఆగి పోయింది.బయిలు దేరటానికి ఎదురు చూస్తూ కూర్చోన్నాము.నా చిన్నతనం అంతా గుర్తుకు వచ్చింది. నాన్నగారు రాయచూర్ లో పని చేస్తుండగా నిన్తీన్ ఫిఫ్టీ వన్ జూలై ట్వంటీ ఫిఫ్త్ న పుట్టాను. అప్పటి సంగతులు వైదేహీ అత్తయా చెపుతూ వుంటుంది.అందరూ నన్ను చాల ముద్దు చేసే వారట.చారి మామయ్యగారు ఎప్పుడూ ఎత్తుకునేవారట. అత్తయ్య చెపుతుంది నన్ను ఎత్తుకొని బంగారు పాపాయి బహుమత్లు పొందాలి పాట పాదేదట అనుడుకేనేమో నాకు ఆ పాట అన్నా అది పాడిన రావు బాల సరస్వ్వతి అన్నా ఇష్టం.ములుగు కొద్ది కొద్ది గా గురుతు.నాన్నగారి ఆఫీసు .లో పున్నాగ చెట్టు కింద పూలు ఎరుకోవతము బద్రవతి అత్తయ్య పెద్ద పెద్ద రొండు జడలు మాత్రమే గుర్తున్నాయి.తరువాత మానుకోట వెళ్ళాము.అక్కడ స్కూల్ లో చేర్చటని కి నాన్నగారు తిసుకేల్లారు హెడ్మాస్టర్ ఒక సర్ ని పిలిచి నాకు టెస్ట్ పెట్టమన్నారు.నేను రాసిన పేపర్ చూసి నాన్నగారి తో మాథ్స్ బాగా చేసింది.థర్డ్ క్లాసు లో కాదు ఫిఫ్త్ క్లాసు లో చేరచ్చు కుంటాము అన్నారు. అలా ఫిఫ్త్ క్లాసు లో చేరాను.అప్పటి నుండి మాథ్స్ అంటే చాల ఇస్టం.మా యింటి పక్కన బామ్మగారు మాకు పేపర్ లు మెంతులు కలిపి రుబ్బి చిన్న చిన్న గిన్నెలు చేసి అందు లో పప్పులు వేసి ఇచ్చే వారు.వారి మనవరాలు భాను ,నేను ఆడు కునే వాళ్ళము.సెలవల్లో అత్తయ్య పార్వతి,శ్యామల వచ్చేవారు.జయ,శ్యామల ఆడుకుంటూ వుంటే నేను,పార్వతి స్కూల్ లో నేర్చు కున్న పాటలు,డాన్సు లు ఒకరి కి ఒకరం చూపించు కునే వాళ్ళం.భలే తాత బాపూజీ బాలల తాత బాపూజీ,ఆటలు ఆది పాట లు పాడి అలసిపోయమే ,లాటి పాటలు చిన్న చిన్న నాటకాలు చేసు కొనేవాళ్ళం .చదమామ లో భేతాళ ఖాతా లో పజిల్ చేసే వాళ్ళము.ఇద్దరి కి చిన్న కుండ లో డబ్బులు దాచుకునే అలవాటు వుండేది.అదేమిటో ఎప్పుడూ పార్వతి కుండ దొంగలు ఎత్తుకేల్లెవారు.నా మని తో ప్రతి సంక్రాంతి కి బొమ్మ కొనుకునే దాన్ని.దీపావళి కి నాన్నగారు బుట్ట నిండా టపాకాయలు తెచ్చే వారు.మేము కూడా వల్ల ఊరి కి వెల్లేవాల్లము.కారీమ్నగర్ ఆసిఫాబాద్,బూర్గుమ్పాద్ వెళ్ళిన గురుతు.బూర్గంపాడ్ లో ఒక సవత్సరము కలిసి వున్నాము.ప్రతి శని ,ఆది వారాలు బాలానందం,బాలవినోదం తప్పక వినేవాళ్ళము.మానుకోట లో స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు రైల్ పట్టాలు దాటి వెళ్ళటము,ఇంటి పక్కన మామిడి తోట లో ఆడుకోవతము కొద్దిగా గురుతే.అక్కడి నుంచి వరంగల్ వెళ్ళాము.అక్కడే ఉష పుట్టింది.ఉదయ అని పెట్టాలా,ఉష అని పెట్టాలా అని అందరమూ చర్చించి ఉష అని సెటిల్ చేసాము.అప్పుడే శాంతి నివాసం సినిమా చూసి అత్తయ్య అందు లో వున్నా చిట్టి అనే పేరు నచ్చి చిట్టి అని పిలవతము మొదలు పెట్టింది. కాని ఉష కి అలా పిలి స్తే ఎంత కోపమో.నేను,జయ,భాస్కేర్ ,సీత రోజు వేయిస్థంబాల గుడి లో ఆడుకునే వారము.స్కూల్ లో పంకజ టీచర్ కి నేనంటే అభిమానం వుండేది.ఎప్పుడూ మాథ్స్ లో ఫాస్ట్.మార్క్ వచ్చేది.స్కిప్పింగ్ లో కూడా ఫస్టే .మా హెడ్ మిస్త్రెస్స్ సుజాత రెడ్డి చాల బాగుండేది.అద్దాల జాకెట్ ,గద్వాల్ చీర కట్టేది.(ఈ మద్య బర్మింగ్హాం లో నాథ్ ఇంట్లో కలిసాను.చాల మారి పోయింది.హెల్త్ కూడా బాగా లేదట.చాల బాధ అన్పించింది.మీ స్టూడెంట్ ని అని చాలమంది వస్తారు.చాలా సంతోసన్ గా వుంతుడి అన్నారు.)నాకు ఎప్పుడు టెన్త్ లోపలే రాంక్ వచ్చేది.అక్కడనుంచి నాగార్జున సాగర్ వెళ్ళాము.మరి ఎట్లా తప్పు రాసాడో క్లార్క్ కమల రాణి బదులు కమల దేవి అనిమారి పోయింది.టెన్త్ కాబట్టి ఆప్షనల్ తిసుకోవలత.జనరల్ న కామ్పోసిత అని అడిగాడు.నాకు తేలి లేదు.అమ్మాయిలంతా జెనరల్ లో వున్నారు నువ్వు అదే తీస్కో అన్నాడు.సరే అన్నాను.మాథ్స్ సర్ రాజూ మాస్టర్ నా పేపర్ అందరి కి చూపి నన్ను మెచ్చుకునే వారు.మాడపాటి అని పిలిచే వారు.ఏజ్ తక్కువ మూలంగాయస్.యస్.సి. రిజల్ట్స్ ఆపారు.ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయ్యి రేసల్త్స్ వచ్చేసరికి లేట్ అయ్యింది.గుంటూర్ వుమెన్స్ కాలేజ్ లో పే .యు.సి.లో చేరతని కి వెళ్ళాను. మాథ్స్ కావాలని అడిగాను.కాని నాది జెనరల్ ఒప్తిఒన్ కాబట్టి రాదు అన్నారు.కపోసిట్ వుండలత.అప్పుడు ఏమి చేయగలను.నాకు కావలసి న ఇష్టమైన మాథ్స్ ని వదులు కో వలసి వచ్చింది.నా జీవితం లో పెద్ద అశాబంగం.హాస్టల్ లో చేరాను.ఎదుగురము ఒక రూమ్ లో వుండే వాళ్ళము.మని చాల క్లోజ్ ఫ్రెండ్ అయ్యింది.హాస్టల్ లైఫ్ చాల ఎంజాయ్ చేశాను.మని తో వల్ల ఊరు ఒంగోలు కూడా వెళ్ళాను.తను కూడా పోట్టిచలమ వచ్చింది.ఆ రోజు ల లో నాగార్జున సాగర్ లో సినిమా శూటింగ్స్ అవుతుండేవి.మేము వెళ్ళినప్పుడు ఏదో జానపద సినిమా షూటింగ్ అవుతోంది.నాన్నగారు తీసు కెళ్ళారు.కాంత రావు రాజనాల పోత్తోపోట్టి ఫ్రాక్స్ వేసుకొని వున్నారు.రాజశ్రీ పక్కన కూర చోని వుండి.కాసేపు చూసి నవ్వుకొని వచ్చేసాము.మా ఇంటి తోట మని కి చాల నచ్చింది.మా తోట చాల బాగుండేది.నాకు కూడా మనీ వల్లఊరి బీచ్ సముద్ర స్నానం చాల నచ్చాయి.నేను గుంటూర్ నుండి ఎప్పుడు వచ్చిన జయ అన్ని సంగతులూ అడిగి తెలుసుకుంటూ వుండేది.అప్పటికి ఇప్పటికి జయ నాకు పెద్ద శ్రోత.పీ.యు.సి ఇంగ్లిష్ లో ఫెయిల్ అయ్యాను.సేప్తంబెర్ లో రాసి పాస్ అయ్యాను. డిసెంబెర్ లో పెళ్లి అయ్యింది.అప్పుడు పాస్ అయ్యి వుంటే గుంటూర్ లోనే బి.ఏ చే సే దనినేమో.రాగిణి,మనోరం ,సూర్యలత ,అందరూ హైదరాబాద్ లో కూడా కలి సారు.అప్పుడు సూర్యలత ఇంటికి శ్రీనగర్ కాలనీ వచ్చినప్పుడు బిపు ఇక్కడ ఇల్లు కొంతదని కాని మేము ఇక్కడవుంతమని కాని అనుకోలేదు.ఇంతలో ఈయన పిలవతము తో నా ఆలోచనల లో నుండి బయటకి వచ్చాను.మా బస్ బగావలేదు.హైదరాబాద్ వెళ్ళే బస్ రావటము తో వెనక కి వచ్చేసాము.