Sunday, April 12, 2009

నా ఓటు

పొద్దున్నే శ్రీవారు ఆఫీస్ కి వెళుతూ అమ్మ నాన్న తో వెళ్ళి వొట్ వేసిరా,అని బాల్లెట్ పేపర్ ఎలా వుంతుందో ,బి.జె.పి గుర్తు ఎలా
వుంటుందో ,దాని మీద స్టాంప్ ఎలా వేయాలొ వివరంగా చెప్పారు.ఆయన వాజ్పాయ్ కి వీరాభిమాని.వకసారి ఏర్ పొర్ట్ లో అయనతో మట్లాడారట కుడా .
కొద్దిసేపు అయ్యాక మామయ్య గారు వొట్ వెయటానికి వెళ్దా మని పిలిచారు.వెళ్ళెటప్పుడు కాంగ్రెస్స్ గుర్తు ఎలా వుంటుందొ దానిమీద స్టాంప్ ఎలా వేయాలొ నాకు అత్తయ్య గారి కి వివరించి కాంగ్రెస్స్ కే వొట్ వేయమని చెప్పారు.ఆయన కాంగ్రెస్స్ వాది మరి.
వచ్చాక కాంగ్రెస్ కె వేసావా అని అడిగారు.బుర్ర ఊపాను.
మావారు బి.జె .పి కే వేసావా అని అడిగారు.అక్కడా బుర్ర ఊపాను.
కాని నాకే అనుమానము,కాంగ్రెస్స్ కి వేసానా- బి.జె.పి కి వేసానా
రెంటి కీ వేసానా - అసలు ఇంకొదేనికైనా వెసానా ఏమో మరి.
ఆ తరువాత మమయ్య గారి తొ వెళ్ళినప్పుడు కాంగ్రెస్ కి ,శ్రీ వారి తొ వెళ్ళినప్పుడు బి.జె.పి కి వేస్తూ వచ్చాను.
అలా అలా రెండో ఐదొ ,ప్పదొ సార్లు కాలం గడిపేసాను.
ఈ సారి నలుగురమూ కలిసి వెళ్ళాల్సి వచ్చింది.షరా మామూలే,నాకు మా అత్తగారి కి పాఠా లు.
వేసి బయటకు వచ్చాము .అక్కడా షరా మామూలే,మామయ్యగారు అడిగారు ఎవరికి వొట్ వేసావు అని కాని షరా మామూలు కాక
మాట్లాడకుండా వూరుకున్నాను.ఎవరికి సినిమా వాళ్ళకి వేసావా అని నాజవాబు వినకుండా నే చివాట్లు వేసేసారు.
ఇంట్లొకి వెళ్ళాక మా వారి కి ఎవరి కి వేసానొ చెప్పపొతుంటే ఎవరి కి వేసినా నీ సొంతముగా నిర్ణయము తీసుకున్నావు గుడ్.అన్నారు.
మరి పెపర్ చదివించి అన్నిటి గురించి చర్చింటము అలవాటు చేసింది ఆయనేగా .
పోయినసారి ,లోకసత్తా గుర్తు విజిల్ అనిచెప్పి వూరుకున్నారు.
లోకసత్తా కాండిడేట్ అన్ని వోట్లు వస్త్తాయని అనుకోలేదట మీరే వేసివుంటారు అని అందరూ అంటుంటే అవును మా ఖైరతాబాద్
వాళ్ళు విద్యావంతులు అని చెప్పాను.
మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి.లొకసత్తా వాళ్ళు వచ్చి వొట్ అడిగితే ,పొయినసారి మీరు అడగకుండానే మీకే వొట్ వేసాము .
అనిచెప్పాను.అయినా అడగటము మా భాద్యత కదండి అని చెప్పివెళ్ళారు.
సరే అయితే ఇప్పుడు ఏందుకు ఈ సొద అంటున్నారా?
మరి విజయరామారావు తెలుగుదెశం తరుపున బరి లొకి దిగారే!ఆయన ఎప్పుడూ తెలుగుదెశమే.కాని,
ఇంతకు ముందులా ఇప్పుడు తెలుగుదెశం నచ్చటము లేదే !
సంకట పరిస్తితి ,
విజయరామారావా ? లోకసత్తానా?
లోకసత్తానా??? విజయరామారావా????
విజయ--------- లోక ???????

Friday, April 10, 2009

పాటల సందడి - అడుగడుగున గుడి ఉంది

పాట వింటూ చదవండి..

అడుగడుగున గుడి ఉంది
అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది
అదియే దైవం.....

అడుగడుగున

ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ
ఈశుని కొలువనిపించాలి
ఎల్లవేళలా మంచు కడిగిన
మల్లెపూవులా ఉంచాలి
దీపం మరి మరి వెలగాలి
తెరలూ పొరలూ తొలగాలి

అడుగడుగున

తల్లీ తండ్రీ గురువు పెద్దలు
పిల్లలు కొలిచే దైవం
కల్లా కపటం తెలియని పాపలు
తల్లులు వలచే దైవం
ప్రతిమనిషీ నడిచే దైవం
ప్రతి పులుగు ఎగిరే దైవం...

అడుగడుగున

చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా.
గానం : పి.సుశీల
రచన :దేవులపల్లి కృష్ణశాస్తి


ఈ రోజుల్లో పిల్లలకు మంచి మాటలు చెప్పడం కరువైపోయింది. అసలు పిల్లలకు వినే ఓపిక, సమయం కూడా ఉండడం లేదు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పోకడలు.. అలాగే మన సమాజంలో కూడా విలువలు మారిపోతున్నాయి. పొద్దున్నే లేవడము, స్నానం చేసి దైవప్రార్ధన చేసి బొట్టు పెట్టుకోవడము, పొందికా వగైరా ఏవీ పట్టింపు లేకుండా పోతుంది. పెద్దవాళ్లు చెప్పినా అది చాదస్తం కింద కొట్టేస్తున్నారు. గుడి ,చర్చి, మసీదు, కులాలు, కుమ్ములాటలు అని విబేధాలు మరోవైపు.. అందుకే పిల్లలకు చిన్నప్పటినుండే సరైన పద్ధతులు నేర్పించాలి. దేవుడు ఒక్కడే! ప్రతి మనిషిలో గుడి ఉంది. అతను ఒక నడిచే దైవం. ప్రతి పులుగు ( పక్షి ) కూడా ఎగిరే దైవం, ఇల్లూ వాకిలి, శరీరం అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. మనస్సులో చెడు ఆలోచనలు లేకుండా కడిగిన మంచులా, స్వచ్చమైన మల్లెపూవులా ఉండాలి, పెద్దలను, తల్లి తండ్రులను, పిల్లలను కూడా పూజించాలి.. గౌరవించాలి అని నేర్పించాలి. ఈ మాటలు అలనాడు దేవులపల్లిగారు అందమైన పాటలో చెప్పారు... మహానుభావులు.

ఇక నా పాటల ప్రయాణంలో మరో మజిలీ ... కమ్మటి కలలు.. పదండి వెళదాం...

Sunday, April 5, 2009

అనాబ్ షాహి

లేత ఆకుపచ్చ రంగులో ,పలచటి చర్మం తో ,లోపల ముట్టుకుంటె జారిపొయె
గుజ్జు తో,పొట్ట నిండా రసము,గింజల తో ,బొటన వేలు ప్రమాణము తో,
సొగసు చూడతరమా అన్నట్టు గా వుండే హైదరాబాదీ అనాబ్ షాహి ఏది?
చలకుర్తి నుంచి వచ్చెటప్పుడు ఇబ్రహిం పట్టణం దాటగానే చెరువు పక్కనుంచి
చల్లటి గాలి ని అనుభవిస్తూ ,కొంచము ముందుకు వెళ్ళగానే ,గుత్తులుగుత్తులు
గా వేళ్ళడుతూ సన్నటి పరిమళాలు వేదజల్లుతున్న అందమైన అంగూర్ భాగ్ లు.
రోడ్ మీద తడికల షాప్ లు.వాటినిడా అనాబ్ షాహి లు.అసలు వూర్లోకి ఎప్పుడు
చేరుతామొ తెలీదు. ఫిబ్రవరి చివరి కల్లా రావటము మొదలైయేవి .ఏక్ రుప్యా కిలొ
బేరమాడిన వారి కి బారాణా కే. సైనిక్ పురి లొ మా ఇంటి వెనుకనే చెరువు.
అక్కడ అన్నీ భాగ్ లె.అక్కడ ఐతె అటాణా కె కిలొ.అక్కడ సీడ్ లెస్ వి కూడా
దొరికేవి. అవి దొ రూప్యా కిలొ.
బర్కత్ పురా లో మా ఇంట్లొ కూడా వెనకా ముందూ తీగెలు వుండేవి రావటము
మొదలు ఐయినప్పుడు బుజ్జి బుజ్జి గుత్తులు ఎంత ముద్దుగా వుండేవొ .
వేరే వూరు లో వున్నప్పుడు,లీవ్ లో వచ్చి వెళ్ళే టప్పుడు,ఆవకాయ తో పాటు
వక బుట్టెడు అనాబ్ షాహి తెసుకెళ్ళా లిసిందె.అయినా సరిపోయేవి కావు.
ఇప్పుడు ఏప్రిల్ వచ్చినా ఇంకా అవేవీ కనపడటము లేదు.అసలు అనాబ్ షాహిలే
కనపడటములేదు. అన్ని సీడ్ లెస్ లే.రిలయన్స్ లాంటి మాల్స్ లొ పెద్దవి ఏమైనా
వున్నయేమొ.
ఇప్పుడు విజయవాడ వైపు నుంచి వస్తుంటే అంతా యల్ .బి నగర్ ,వనస్తలి పురం
వగైరా లే.ఆ చెరువులూ లేవు,ఆ భాగ్ లూ లేవు.
ఈ రోజు ఉదయము మా అబ్బాయి ని బాబా నీకు అనాబ్ షాహి ఏమిటొ తెలుసా అని
అడిగాను .ఆ అన్నడు ,ఏమిటి అది అన్నా ,పేరు విన్నాను కాని ఏమిటో మరిచిపొయాను.
అవి ద్రాక్ష పండులలో వక రకము.హైదరాబాద్ లో ఎక్కువగా పండించే వారు.
వకప్పుడు హైదరాబాద్ అనగానే ద్రాక్ష తోటలు ,అందులో నూ అనాబ్ షాహి ఫేమస్.
అంతా గత చరిత్ర అయిపొయింది.
మా అమ్మాయి అన్నట్లు రింగులు తిప్పుకోవటము ఆపి సర్దుకు పోవాలి.

Saturday, April 4, 2009

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

పిడికిట తలంబ్రాల పెళ్ళికూతురుపవమాన సుతుడు పాదాలు పట్టగా
పట్టాభి రామయ్య పరంధాముడుశ్రీ రామ నవమి శుభాకాంక్షలు

(ఈ వారము స్వాతి లో వచ్చిన బాపు బొమ్మలు-థాంక్స్ టు స్వాతి.)

Friday, April 3, 2009

శ్రీరామ నవమి


కను మేటి విల్లు విరిచి కలికి ని చేపట్టు
కళ్యాణ రామయ్య కమనీయుడు

కళ్యాణం కమనీయం
ఎల్లరకూ సీతారాముల కరుణాకటాక్షము లభించాలని కోరుతూ