Saturday, March 28, 2009

ఉగాది

ఉగాది ఇతర పండగ ల మాదిరి ఏదొ వక దేవత ను పూజించే పండుగ కాదు.కాలానికి సంబందించిన పండుగ.కాలాన్ని మన వీలు కొసము సంవత్సరాలు గా లెక్కించి నారు.సంవత్సరము మొదలు అయిన రొజు ఉగాది పండుగ.ఉగాది జాతీయ పండుగ. దేశము లోని వివిద రాష్ట్రాల లొ ఈ పండుగను రక రకా ల పేర్ల తో జరుపు కుంటారు. ఉగాది రొజు ఇష్ట దేవతను పూజించి ఉగాది పచ్చడి ని పెద్దవారి తొ పెట్టించుకొని తినాలి.ఆరు రుచులు కలిపి చేసిన ఉగాది పచ్చడి జీవిత ము లొని కష్ట సుఖముల కు ప్రతీక.ఉగాది నాడు సాయంకాలము దేవాలయము లొ కాని, గ్రామ చావిడి లొకాని , నగరాల ,పట్టణాల లొ అడిటొరియము లలొ పంచాంగ శ్రవణము చేస్తారు . పంచాంగ శ్రవణము లొ ఆ సంవత్సర పలితాలను అంచనా వేస్తారు .ఉగాది ని సాంప్రదాయ బద్దముగా పాటించటము వలన సకల శుభాలు కలుగుతాయి.

Friday, March 20, 2009

తండ్రి-కొడుకు

పొద్దున్నే గట్టిగా అరుపులు విన్పిస్తుంటే వంటింట్లోనించి బయటకు వచ్చాను.
డాడీ నా బనియనులు ఎందుకు వేసుకున్నావు?
నేనెక్కడా వేసుకున్నాను.నేను నా బనియన్ నువ్వేసుకున్న వనుకుంటున్నాను.
ఏమి కాదు. నువ్వే నా వి వేసుకుంటావు.సాక్స్ మీద ఫి.aని కుట్టించుకోని కుడా నా సాక్స్ వేసు కొని లుస్ చేస్తావు.
నువ్వే కదరా నా చెప్పులు వేసుకొంటావు.మొన్న నా బెల్ట్ కుడా యు.యస్ తేసుకేల్లవు.వెతికి వెతికి కొత్తది కొనుకున్నాను.
ఎందుకు వెతికావు (కొంచము ఫోర్స్ తగ్గింది ).మమ్మీ కంప్యూటర్ నేర్చుకుంది కదా .వక మెయిల్ ఇప్పిస్తే చెప్పేవాడిని నాదగ్గరే వుందని.
ఆ కంప్యూటర్ నేర్చుకొనే బ్లాగ్ లో పడిఇంటిని పట్టించు కోవటము లేదు మీ మమ్మీ.
హత్మోషి,మాములా బహుత్ గంభీర్ హొరయ్.నా బ్లాగ్ కే ఎసరు వచ్చేట్లు గా వుండి.అనుకోని ,కోడలి కి గుడి కి వెళుతున్నాను అని చెప్పి,వెళ్ళిపోయాను.గుడిలో దేవుడిని చూస్తూ దిక్కులు చూస్తూ అరగంట గడిపి ఇంటికి వచ్చాను.అమ్మయ్య రెండు కార్లు లేవు.ఇల్లంతా నిశబ్దం గా వుండి.శారద ఇల్లు వుడుస్తోంది.శారదా వీళ్ళ బనియన్స్ అన్ని ఏమిపోయాయి .వెనక కి రండమ్మా అని వెనకకి తిసుకేల్లింది.అక్కడ సరస్వతి దీక్షగా బకెట్ నీళ్ళ లో బ్లూ కలుపుతోంది.పక్కన బనియన్లు గుట్టగా `వున్నాయి.ఏమిటి ఇన్ని వుతక లేదా?కాదమ్మా అన్నిటికి వకేసారి బ్లూ పెడదామని వుంచాను.సరే కానియ్ .
అమ్మాఆఆఆఆ
మాలాఆఆఆఆఆఆఆ
ఇప్పుదేమయ్యింది .ఈ గావు కేకలు ఎందుకు అని చూద్దును గా ఇద్దరి చేతులలో బనియన్లు.వాటి అందము వర్ణించలేనిది.వకటి సగము బ్లూ ,సగము బ్రోవన్.ఇంకొకటి బ్లూ,బ్రోవన్ ,వైట్ మచ్చలు.ఇక చేసేది ఏమ్వుంది.ఈ రోజు పూజారి తొందరగా వెళ్ళా లత గుడి తొందరగా ముసేస్తారట అని,ఇంకో పూజారి లేదా,తొమ్మిది గంటలకే గుడి ముసేస్త్తరా అనే ప్రశ్నలకి అవకాసము ఇవ్వకుండా వాళ్ల వయపు చూడకుండా బయట పడ్డాను.
తప్పించు కు తిరుగు వాడు ధన్యుడు సుమతి.

Tuesday, March 17, 2009

ప్రణీత

కొన్ని రోజుల క్రితం ,సాయంకాలము బాల్కనీ లో వుండగా ,టి.వి.నయన్ వారు అటుగా వెళుతూ ,నన్నూ చూసి లోపలికి వచ్చారు.ఏమిటా అనుకున్నాను.ఆ రోజు ఉదయము వక స్కూల్ బస్ కాన్దక్తర్ ఆరు సంవస్థరాల పాప ని వేదిన్చాడట. దీని పయి మీ స్పందన ఏమిటి అని అడిగారు.స్పందనా ?అసలు ఆ విషయము వినగానే మనసు ,మెదడు మొద్దుబారి పోయింది.సారీ నేనే మీ మాట్లాడలేను అన్నాను.

నా పార్లర్ కి వక రోజు వక అమ్మాయి చాల గాభరా గా వచ్చింది.ఎంతమ్మ అంటే కాలేజీ దగ్గర వక అబ్బాయి వెంట పడ్డాడని బయపడుతూ చెప్పింది.మంచినీళ్ళు ఇచ్చి కొద్దిసేపు తరువాత మేరీ ని తోడిచ్చి ఇంటి కి పంపాను.ఇలాంటి సంగటనలు ఎన్నో.అందరు మేరీ ఇంత పెద్దది ఏమిపని చేస్తుంది అనేవారు.అమ్మ ఆడ రౌడీ ని పోసిస్తున్నవా అనేది .నిజమే మేరీ ఎత్తుగా లావుగా వుండేది .దాంతో నా పార్లర్ దగ్గర అమ్మాయిలని ఎదిపించతాని కి బయపదేవారు.అయినా కాలేజీ పక్కనే వుండట ము వలన ఈవే తీజేర్స్ బాద తప్పేది కాదు.

యన్.టి.ఆర్.రాగానే వెరీ ఏమి ఏమి చేసారో కాని ఈవ్ టీజర్స్ బాద తప్పింది.కాలేజీ చుట్టూ పక్కల మఫ్టీ లో పోలీసులు ,లేడీ కానిస్తేబ్లేస్ వచ్చారు.ఓల్డ్ సిటీ నించి వచ్చే అమ్మాయిలు కూడా ఇప్పుడు చాల సేఫే గా వుండి అనేవారు.

ఈవ్ టీజర్స్ కంటే ఘోరం గా ఆసిడ్ దాడులు,అత్యాచారాలు మొదలయ్యాయి.మనము పురోగ మిస్తున్నమా ,తిరోగా మిస్తున్నమా.ఈరోజు పేపర్ లో ఆసిడ్ దాడి లో గాయపడ్డ ప్రణీత
ఎగ్జామ్స్ రాస్తున్న ఫోటో వేసి ,వార్త రాసారు.

నీ ఆరోగ్యము కుదుట పదాలని,ఎగ్జామ్స్ లో పాస్ అయి నీ కల లను సాకారం చేసుకోవాలని ఆశిస్తున్నాను.

గాడ్ బ్లెస్స్ యు.

బెస్ట్ అఫ్ లక్ ,ప్రణీత.

Monday, March 16, 2009

అత్తా -కోడలు

ఎండాకాలం అనగానే వచ్చేవి మల్లెలు ,మామిడికాయలు,వేపగాలే కాదు ఇంకోటి వుంది. aదే మాఘం నుంచి వైశాఖము దాకా జరిగే పెళ్ళిళ్ళ సందడి.అబ్బో ఎన్ని పెళ్లి పిలుపులో.ఎంత హడావిడో.
కొత్త కోడళ్ళు ,కాబోయే కొత్త కోడళ్ళు మీ పెళ్లి సందడి నుంచి బయటకి వచ్చి నాదో cహిన్న మాట వింటారా .ఈ హడావిడి లో ఈమె సుత్తి ఏమిటి బాబు అన్కుంటూ వున్నారా ?అయినా చెబుదామను కున్నాను చెపుతున్నాను.
పెళ్లి అయిపోగానే తుర్రుమని పారిపోకుండా వక నెలరోజులు మీ అత్తగారి కి కేటాయించండి.అమ్మ ,ఆయన లేకుండా పూర్తిగా అత్తగారి తో గడపండి.మేమసలె టెన్షన్ లో వున్నాము,అత్తగారితో గడిపి ఇంకా టెన్షన్ పెంచు కోవాలా అనుకోకండి.ఏమి పెరగదు,దానికి నాది పూచి. కొత్తగా పెళ్లి ఇయింది.అప్పుడే ఆయనకు దూరంగా వుండాలా అంటే ,రాత్రి టేబుల్ లైట్ వెలుతురు లో కిటికీ లోంచి చందమామను చూస్తూ శ్రీవారి కి రాసే విరహ లేఖ ఆనందాన్ని జీవితమంతా గురుతు కు వుంచుకునే మధుర స్మృతి ని కోల్పోతారు.మరి వుద్యోగామో. వుద్యోగము ఎంత ముఖ్యమో అత్తగారి తో అనుబన్ధమూ అంతే ముఖ్యం.అత్త గారి దగ్గర వుండి eమీ చేయాలి ,
పొద్దున్నే లేచి తలకు టవల్ కట్టి హారతి పల్లెము తో అత్తగారి ని నిద్ర లేపాలా?ముత్యాల ముగ్గు ,దేవత స్టైల్లో వుండాలా అని చిటచిట లాదకండి.అలా చేస్తే అత్తగారు దడుపు జ్వరం తెచ్చు కోవతము కాయం.అవేవి వద్దు.చక్కగా అత్తయ్యా అని పిలుస్తూ వెనక వెనక తిరుగుతూ కబురులు చెప్పండి.మీ వారి చిన నాటి ముచ్చట్లు అడిగి వినండి.అయన కు ఇష్టమైన వంటలు అత్తగారి పద్దతి తో నేర్చు కొండి.ఆవిడ తో శాప్పింగ్లు,సినమాల కు ,ఆవిడా ఫ్రెండ్స్ ఇంటికి చుట్టాల ఇండ్లకు వెళ్ళండి.పెళ్లి చేసు కొని వెళ్లి పోయిన కూతురి ని మరిపిస్త్తు వెంట వున్నా కోడలంటే ye అత్త కి ఇష్టము వుండదు.?ఇవన్ని చేయతని కి ఇప్పుడే వుండాలా తరువాత లీవ్ లో వచ్చిన్నప్పుడు చేయవచ్చుగా అని వాడిన్చకండి. .నా కు తెలిసినంతవరకు కోడలు తీసుకొచ్చే కట్న కానుకలకన్న కోడలు చూపించే అభిమానాని కే ఈ కాలం అత్తలు పదిపోతున్నారు. మా కోడలు మాతో కలిసి పోయింది,ఎంత కలివిడిగా వుందో అని మురిసి పోతారు.ఆయింట్లో మీరు అతిధి కాదు ,ఆ కుటుంబ సభ్యులే అనుకోవాలంటే మొదట్లోనే వీలవుతుంది.మీకు కొత్త పోతుంది.మీ కో సంగతి తెలుసా ?మీ శ్రీవారి హృదయాని కి దారి మీ అత్తగారి హృదయమే ఆవిడ దగ్గర స్థానం ఏర్పరుచు కుంటే గారాల కొడుకు భార్య గారాల కోడలే అవుతారు.హాయిగా మీ అయన మీద పితురిలు ఆవిడ కే చెప్పవచ్చు.
అత్తా -కోడళ్ళ బంధాని కి కొత్త అర్ధము చెప్పండి.మీ అందమైన కొత్త కాపుర భవంతి కి చక్కని సోఫ్ఫా నాలను వేసుకోండి.
అల్ ది బెస్ట్.

Sunday, March 15, 2009

ఆవకాయ

పొద్దున్న ఆరు అయింది.మీరింకా తేమ్లేదా మామయ్యగారు పిలుస్తున్నారు అని అత్తయ్యగారు తొందర చేసారు.నేను ,లక్ష్మి మమయ్యగారి వెంట బయిలు దేరాము.ముందు మామయ్యగారు,వెనుక రామయ్య సంచులతో ,ఆ వెనుక నేను లక్ష్మి.ముందు చిక్కడపల్లి వెళ్ళాము.ఎంతకీ బేరము కుదరదు.ఈ పిట్టలోల్లు పడనియారు . cహేసేది ఏముంది పదండి నల్లకుంట .ఇది ఎప్పుడు వుండేదే ముందే నల్లకుంట వెళ్ళితే పోయేది.అమ్మో ఇది పైకి అనే ధైర్యం ఏది.అక్కడ ఇంకా బస్త్తాలు ఇప్పరు.అయిన సరే వెల్ల వలిసిందే .మొత్తాని కి బేరం కుదుర్చుకొని మామిడికాయలు కొని తొమ్మిదింటికి ఇల్లు చేరాము.మమయ్యగారి బంటు రామయ్య వెదురు వల్ల దగ్గరి కి వెళ్లి ముక్కలు కొట్టేవాడిని తీసుకొచ్చాడు.మళ్ళి బేరం కుదిరి కొట్టటము మొదలయ్యేలోపు మేము గబ గబ పిల్లల స్నానాలు,టిఫిన్లు కానిచ్చేసాము.వాడు ముక్కలు అన్ని వకెలా వచ్చేట్లు,ముక్క చితక కుండా వాడి ని అదిలిస్తూ అత్తయ్య గారు అన్ని కొట్టించారు.అప్పటికల్ల పెంటమ్మ ఆవాలు కొట్టటానికి వచ్చేసింది.వారం క్రితమే వదినగారు ఖమ్మమం నుండి ఆవాలు పంపటము వాటిని కడిగి అరబోయతము అయిపొయింది.రామయ్య ,మామయ్యగారు నునే కోసం కామాక్షి గానుగ కి వెళ్లారు.విజయ,ఉష,శేషు పిల్లల తో వచ్చేసారు.పిల్లలను బతిమిలాడి,గోల్డ్ పాస్ లంచం చూపించి ముక్కలు తుదిపించాము.ముక్కలు మద్యలో చుట్టూ పిల్లలు ,పెద్దలు మద్య వరండా లో .మద్య తలుపు బంద్. ముందు వరండాలో పేపర్ తో మామయ్యగారు కాపలా.అయినా ఎవరైన బయట వాళ్ళు తప్పించు కొని వచ్చారో అత్తయ్య గారి చూపులకు మటాష్.ముక్కలు తుడిచి బోజనాలు కానిచ్చి,వకోక్కరే లోపలి కి వెళ్లి వాళ్ల వల్ల ఆవకాయ కలుపుకోవాలి.ఉష మటుకు ఉఉహు నా ఆవకాయ మీరే కలపాలి నేను పిల్లలని చుసుకునటువుంతాను అని తప్పిచ్చుకునది.అత్తయ్యగారు స్టూలు మీద కూర్చొని చెపుతుంటే ఆవకాయ కలిపాము.ఆవకాయ కి మాకు దిష్టి తీసి జాది లు లోపల పెట్టించారు.అప్పటికల్ల అన్నము వందేసాము.ఆవకాయ కలిపిన బేసన్ లో వేడి అన్నము ముద్దా పప్పు నెయ్యి వేసి కలిపేసారు అత్తయ్యగారు.పిల్లలంతా చుట్టూ చేరిపోయారు వాళ్ళతో పాటే మేమును.అమ్మయ్య ఆవకాయ పని అయ్యింది అని నడుములు సవరించుకున్నాము.అప్పుడేనా ముడో రోజు తిరగ కలపాలి, వుప్పు ,నునే చూడాలి,అందరికి రుచి కి పంపాలి.
ఇదంతా ఇప్పుడే జరిగి నట్లుగా వుంటుంది.అందరి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు.ఎవరి కుటుంబం వారిది అయ్యింది.ఇప్పుడు అంత ఆవకాయ అవసరము లేదు నేను పది కాయలే పెడుతున్నాను అని వకరంటే నేను పదిహేను అని ఇంకొకరు ఎవరికీ వీలు అయినప్పుడు వాళ్ళు కలిపెసుకుంటున్నారు.ఉష ఆవకాయ కలపటము నేర్చుకుంది.
మాకుమటుకు మా పిల్లలు నాలుగు ఏండ్ల క్రితము అమెరిక నుండి వచ్చేయతము తో మా ఆవకాయ సేస్సన్ మొదలయింది.సంజు ,అను ఇద్దరి కి కలపటము సరదా.కాకపోతే మా అత్తయ్య గారి లా నాకు గోల్డ్ పాస్ తో సరిపోవతము లేదు.ప్రసాద్ లో సినమా చూపించాలి.అదితి,మేఘ కి కథలు చెప్పాలి.
ఉప్పు వున్నా వురగాయ కి అత్త చేతి కింది కోడలి కి తిరుగు లేదు.

కూడలి

జయ చెప్పటము వలన ఆంద్రజ్యోతి లో బ్లాగుల గురించిన ఆర్టికల్ చదివాను . అందులో వున్న కూడ్లి లింక్ తో దానిన్ ఓపెన్ చేసి , అదేమిటో అర్ధము కాకపోయినా , బ్లాగును చేర్చు ను చూసి , ఏమిటో చూద్దామనుకొని దాని మీద క్లిక్ చేసాను . రెండు రోజుల తరువాత మీ బ్లాగ్ కూడలి లో చేర్చబడినది , మీకు వీలైతే మీ బ్లాగులో కూడలి లింక్ ఇవ్వగలరు అని మేయిల్ వచ్చింది .అరే ఇదేమిటి అని మా అబ్బాయికి చూపిస్తే , చూసి ఇక్కడ అన్ని తెలుగు బ్లాగులు వున్నట్లున్నాయి . అయినా ఎక్కడైన చేరు అనగానే ముందు వెనక తెలియకుండా చేరిపోకు . అని క్లాస్ పీకాడు .

ఇక్కడ కి అన్ని తెలుగు బ్లాగులు వస్తాయని తెలుసుకున్నాను. నాలాంటి కొత్తవారీకి వేదిక గా మలచిన కూడలి బృందానికి అభినందనలు . నా బ్లాగ్ ను చేర్చుకున్న కూడలి బృందానికి ధన్యవాదములు .

Saturday, March 14, 2009

మల్లెలు మల్లెలు

ఎండాకాలం వస్తూ ఎండలని,వడగాలినే కాదు మల్లెల ని,మామిడి రసాలని వేప గాలి ని వెంట పెట్టుకొని వస్తుంది.సాయంకాలము చల్లటి నీళ్ళ తో స్నానం చేసి,తెల్లటి గ్లాస్కో చీరను కట్టుకొని ,మల్లెపూలు పెట్టుకొని వేపచెట్టు కింద నులక మంచం మీద పడుకొని ,కొబ్బరి ఆకుల మద్యలోనించి కనిపిస్తున్న చంద్రుడి ని చూస్తూ బినాకా గీతమాల వింటూ వుంటే ఈ వడగాలి,ఎండా చమట ఎం చేస్తాయి.మామిడికాయ పప్పు లో చల్ల మిరపకాయలు ,గుమ్మడి వడియాలు ,కొత్త మామిడికాయ ముక్కల కారం,కొత్తావకాయ,మామిడి పండ్లు ఎండలని లెక్క పెట్టనిస్తాయా?మల్లెపూల సువాసన ముందు అన్ని బలాదూర్.వాటి తెల్లదనము ముందు సూర్యుడు వెలాతెలా .

పోట్టిచలమా లో ఎండాకాలం వస్తూనే అమ్మ ఖాళీ జాగా లో తాటాకుల గుడిసె వేయించేది.రోజు అందులో నీళ్లు చల్లి మంచాలు వేసేవాడు పెద్దులు.ఉష ను ఆడిస్తూ నిద్ర పుచ్చుతూ నేను జయ ఎన్ని కబురులో అమ్మ పడుకోండి అని హెచ్చరించే వరకు సాగి పోతూనే వుండేవి.

గుంటూరు హాస్టల్ లో డాబా మీద హేమ ,ఇది మల్లెల వేళ అని పాడుతుంటే ,పక్కనుంచి రాధా మాధవ పూల సువాసన వస్తువుంటే నేను , మణి ఇంకా పాడించు కునే వాళ్ళము.మణి పెద్ద పెద్ద మల్లెపూల దండలు నా రెండు జడలకి ఎంతో ఆప్యాయం గా పెడుతుండేది.ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడ వున్నారో.చింతలపాడు లో అరుగుల మీద పడుకుంటే ,పద్మ ని నిద్ర పుచ్చటాని కి అమ్మమ్మ బూచివాడు వచ్చి బుట్టల్లల్లు తున్నాడు అని పాడేది.ఆమె ఫేవరేట్ పాట మీరా జాల గలదా జావళి పాడుతూ మల్లెపూలు కడుతూ వుండేది.పాలేరులు కింద నీళ్ళు చల్లటము తో వచ్చే మట్టి వాసనా,వెనక నించి వచ్చే వేపగాలి ,మల్లెలలసువాసన అమ్మమ్మ పాట మరుపురానివి.

పోలంపల్లి లో ఏప్రిల్ లో వున్నా పది రోజులు డాబా మీద పక్కలు , వేపగాలి చెప్పలేని ఆనందం.

బర్కత్పురా లో బండలు కడిగి కిందనే పక్కలు వేసుకునే వాళ్ళము.మల్లెపూల దండ పెద్దదాని కోసము,ట్రాన్సిస్టర్ కోసము నాకు విజయ కి కాంపిటీషన్ .ఆవకాయ కలిపే రోజు ఇంట్లో పండగ వాతావరణమే.ముక్కలు తుడిచిన పిల్లల కు గోల్డ్ పాస్ (గోల్డ్ స్పాట్) లంచం.ఆవకాయ కలిపిన బేసన్ లో వేడి అన్నము నెయ్యి కలిపి బామ్మ ముద్దలు పెడుతుంటే పిల్లలందరూ దానికి పోటి.

బాల్కానీ లో కూర్చొని వేప చెట్టు గాలి ని అనుభవిస్తూ కాఫ్ఫీ తాగుతూ నేను సంజు ఎన్ని కబురు లో .బర్కత్పురా వదిలాక వేపచెట్టే లేదు.ప్రతి ఎండాకాలం మొదట్లో బడీ చావిడి వెళ్లి కృష్ణ లో రొండు గ్లాస్కో చీరలు వాటికి చక్కటి అంచులు కొంగులు వున్నవి తప్పక తెచ్చు కోవలిసిందే.అక్కడ గన్నే క రస తాగ వలిసిందే .డి.డి.కాలోనీ లో వున్నప్పుడు అదితి విక్కీ కి కి డాబా మీద వెన్నెల్లో అన్నం తిపిస్తే ఎంత త్రిల్ అయ్యే వాళ్ళో !
వక నులక మంచం కాని చిన్న నవారు మంచం కాని కొనమంటే కొంటాను కాని ఎక్కడ వేసుకుంటావు అంటారు మా వారు.నిజమే కదా ఎక్కడ వేస్తాను.వక్కరోజు మురిపెంగ మూడో అంతస్తు ఎక్కగలను కాని రోజు ఎక్కలేను గా. కొబ్బరి చెట్లు వున్నాయి వక వేపచెట్టు పెడదామని మెట్ల పక్కన వేసాను.వానాకాలం చక్కగా చిగురిస్తుంది.కొమ్మ రెమ్మా రాగానే ఎండకాలము వాడి పోతుంది.పాపం దాని కి జాగా సరి పోవటము లేదు.నా ఆశ లా రెపరెప లాడుతోంది.పోనీ కొబ్బరి అకులోనుంచి చంద్రుడిని చూసి సంతోషిస్తాను హుం ! చంద్రుడి కి కొబ్బరాకులకి ఏమి అవినాభావ సంబందమో.

మొన్న మల్లెపూలు వచ్చాయమ్మా అని శారద మల్లెపూలు తెచ్చింది.చటాకు పన్నెండు రూపాయలట ! .ఎంత చిన్నగా వున్నాయో.తిరుపతి లో ,విజయవాడ లో చాలా బాగుంటాయి.విజయవాడ లో చెరుకు రసాలు కుడా ఎంత బాగుంటాయో.మొహిత్ పుట్టినప్పుడు సుబ్రహ్మణ్యం తెచ్చారు.అప్పటి నుండి వాటి రుచి మరిగాము.ఎప్పుడు మా వారు అటునుండి వస్తున్నా ఈ సీజన్ లో తప్పక తేస్త్తారు.మల్లెపూలు వచ్చేసాయి.చిన్న మామిడి కాయలు వచ్చేసాయి.ఇంకేమి కావాలి .

Thursday, March 12, 2009

హోలీ

నిన్న హోలీ పిల్లలు బాగా ఎంజాయ్ చేసారు.మా చిన్నప్పుడు పోట్టిచేలమ లో ఆడవాళ్లు పిల్లలము కలిసి హోలీ చేసుకునే వారము.పెళ్లి తరువాత ఆర్మీ లో చాలా పెద్దగా చేయటము చూసాను.అందరు తెల్ల పైజామా,కుర్తా వేసుకునేవారు.కలర్స్ ,డ్రింక్స్,స్వీట్స్,నమ్కిన్స్,ఫుడ్ అన్ని ఆఫీసర్స్ మెస్ లో అర్రెంజ్ చేసేవారు.పిల్లలు ,పెద్దలు అందరు వచ్చేవారు.డోలక్ వాయిస్తూ పాటలు డాన్స్ లు చాలా ఎంజాయ్ చేసే వాళ్ళము.మేమిద్దరమూ కలర్స్ తో మద్యఃనము స్కూటర్ మీద వస్తుంటే ,సికింద్ర బాద్ దాటాక అందరు మమ్మలిని వింతగా చూసేవారు.ఇది నలభయ్ సంవత్సరాల క్రితం సంగతి.
ఎప్పుడు హోలీ చేసుకున్న మరపురాని సంగతి-అందరమూ చాలా సరదాగా హోలీ ఆడాక చూసుకుంటే కెప్ట్.షరీఫ్ వల్ల బాబు కనపడలేదు.అంతా వెతికాము చివరి కి వాటర్ ట్యాంక్ లో కనిపించాడు.మూడు సంవత్సరాల వాడు మాదగ్గరే వున్నాడు ఎప్పుడు atuvellaad0.చాల ముద్దుగా వుండే వాడు అందరు వాడిని చాల ముద్దు చేసే వాళ్ళు.అప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్.ఆ విషాద సంగటన ముప్పయ్ ఇదు సంవత్సరాల క్రితము జరిగినా ఇప్పటి కి ప్రతి సంవతసరము హోలీ రోజు తప్పక గుర్తు కు వస్తుంది.నాకే ఇట్లవుంటే పాపం ఆ తల్లి ఎట్లా వుందో.
ప్రతి సారి హోలీ మరురోజు ఇలాంటివి వకతో ,రెండో పేపర్ లో కనిపిస్తూనే వుంటాయి.

Sunday, March 8, 2009

అగ్రహారం

నాటి చాణిక్యుడు,తిమ్మరుసు,అక్కన్న ,మాదన్న ల నుండి నేటి పి.వి నరసింహ రావు వరకు హిందూ సామ్రాజ్య స్థాపనలో కాని ,రాజు (పాలకుల )కు ల కు సలహాలు ఇవ్వటము లో కాని బ్రాహ్మణు ల మేదస్సు మరువ లేనిది.ఆ పాండిత్యము ను గుర్తించారు కనుకనే పూర్వము రాజు లు పండితుల కు వక ఊరి నే కానుక గా ఇచ్చేవారు.అక్కడ వారు వాడల ను ఏర్పరుచుకొని బ్రాహ్మణా సత్ కార్యములను నిర్వహించే వారు.ఆ వూరు ల నే అగ్రహారాలు అనే వారు.కాల క్రమేణా బ్రాహ్మణు ల కు ఆదరణ తగ్గి,వారు కూడా వేరే వుద్యోగాలు చూసుకొని వివిధ ప్రదేశాలకు వెళ్లి పోయారు.అగ్రహారాలు రూపు మార్చు కొన్నాయి.కొన్ని వూళ్ళ లో అయితే బ్రాహ్మలే లేరు.అగ్రహారాలు,బ్రాహ్మణా వీధు లు కనుమరుగు అవుతున్నాయి( అయ్యాయా?)అగ్రహారము అంటే ఏమిటి అని ఎవరి ని అడిగినా ఇంతకంటే ఎక్కువ ఎవ్వరు చెప్పలేక పోయారు.నాకు తెలిసింది కూడా ఇంతే.మాకు కనీసము అగ్రహారము అనే పేరైన తెల్సు.మా పిల్లల కు అదీ తెలియదు.

నేను ,సత్య ఏడాది క్రితం మెల్కోటే వెళ్ళాము.అది చిన్న హిల్ స్టేషన్ .అక్కడ నారాయణ మూర్తి దేవాలయము చాల ప్రసిద్ది.చాల పురాతన దేవాలయము.సత్య ఫ్రెండ్ కుముద వల్లి కుమార్తె అరుణ అత్తవారిల్లు ఆ వూరు.వారి ఇంట్లో నే బస చేసాము.ఆ వీధి దేవాలయము ముందు వున్నది .అ వీధి లో అందరు బ్రాహ్మణు లే.అందరు కన్నడ కట్టు లో గోచి ప్పోసి చీరలు కట్టారు.వీధి అంతా చిన్న చిన్నవి పాత ఇల్లు లు.ఇంట్లోనే బావి.మా కు కింద అరిటాకులు వేసి భోజనము పెట్టారు .అతిధి ల కు ఆకులో నే పెడతారట.వాళ్ల మామ గారి కి కూడా ఆకులో నే పెట్టారు.చాలా ఆప్యాయము గా అడిగి అడిగి మరీ వడ్డించారు.అంతా మది ఆచారము.ఎప్పుడో నా చిన్నప్పుడు పాటించి నవి మరచి పోయాను.ఎక్కడ తప్పు చేస్తానో అని భయం వేసింది.ఆ వూరు వకప్పుడు అగ్రహారం అట.పక్క నే చిన్న రాతి మండపము.అక్కడ సత్ సంగం చేస్తారు .సాయంకాలము కాగానే కొంతమంది ఆడవాళ్లు భజన చేసారు.అంతా సాంప్రదాయ పద్దతి.చివరకు పిల్లలు కూడా హరివేనం ,ఉద్దరిన దేవుడి బొమ్మ ల తో ఆడుతున్నారు.అక్కడ వునంత సేపు వేరే ప్రపంచము లో వున్నట్టు గా వుండి.

ఈ ఉపోద్ఘాత ని కి కారణము ,

ఈ మద్య కామా రెడ్డి సబ్ స్టేషన్ ఇనాగు రేషన్ లో పవర్ మినిస్టర్ షబ్బీర్ అలీ ఆ వర్క్ చేసిన కంట్రాక్టర్ ల ని,ఇంజనీర్ ల ని షాలువాతో సత్కరించారు.ఆ తరువాత కొంత మంది బీద బ్రాహ్మణు ల కు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు.ఎ హిందూ మిన్స్టర్ చేయని పని వక ముస్లిం లీడర్ చేసారు అని మా వారు ఆయనకు శాలువా కప్పి సత్కరించి దాని కన్నా ఎక్కువ గా సంతోషించారు.వోట్ల కోసమే అయినా బ్రాహ్మణు లను గుర్తించారు కదా అనుకున్నారు.దీనితో మరి కొంతమంది లీడర్ లు షబ్బీర్ అలీ బాట పట్టవచ్చు.నూతన అగ్రహారాలు వచ్చే అవకాశాలు వున్నాయా?

Wednesday, March 4, 2009

శతాయుష్ మాన్భవ

ఈ రోజు పేపర్ లో మూడు ఆసక్తి కరంగా మూడు న్యూస్ లు కనిపించాయి.

శతాయుష్కి చేరువ అవుతున్నా అని 98sఅమ్వత్సరాల వెలిచాల రాధా దేవి అనే ఆవిడా ఇంటర్వ్యూ వకటి.మీ ఆరోగ్య రహస్యం ఏమిటి అన్నా ప్రశ్నకు ,రహస్యం ఏమి వుంటుంది,ఎన్ని సమస్యలు వున్నా వక్క సారీ గాభరా పడలేదు.ఇప్పటి కీ ఏ విషయాలను మనసులో పెట్టుకొని కుమిలిపోవతము ,బెంగపడటం, వంటి వి లేవు .మనసు ప్రశాంతం గా వుంచు కోవతని కి ప్రయత్నము చేస్తాను.అందరి విషయాలు తెలుసుకుంటాను ,కాని ఎందులోనూ పెద్దగా జోక్యము చేసుకోను,అడగకుండా సలహాలు ఇవ్వను.అన్నారు.నిజంగా అల్లా వుండటము గొప్పే.

అన్నా దాత సుఖీభవ అన్నదాన్ట్లో హెల్ప్ నీద్ సంస్థ గురించి రాసారు.ప్రతి రోజు ఉదయం వేడి వేడి అన్నము ,కూరల తో నిమ్స్ లో షెల్టర్ కింద వున్నా రెండు వందల మంది రోగు ల అటేన్దేర్ల కు భోజనము వద్దిస్తున్నారట.నెలల తరబడి రోగు ల తో వుండే పేదవారి ఆకలి తీర్చటని కి ముగ్గురి తో మొదలియిన సంస్థ ఇప్పుడు అరవయ్ మంది తో నడుస్తోంది అట.ఈ సంస్థ మొదలు పెట్టిన రాం బాబు గారు అభినందనీయులు.

కుళ్ళు రాజకీయాలు వద్దు.నో క్రిమినల్స్ ఇన్ పాలిటిక్స్ అనే జాతీయ స్థాయి ప్రచార ఉద్యమం వకటి ప్రారంబం అయ్యింది.ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయతని కి ఇష్ట పడే కొందరు వ్యక్తులు కలిసి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ స్థాపించారు.ప్రజలు అందరు పాల్గొనే లా,అన్ని రాజకీయ పార్టీలు లు పట్టించుకు నే లా పెద్ద ఎత్తున మొదలియింది ప్రచారము.ఎన్నికల లో ఈ రాజకీయ పార్టీ నేరచరితుల కు టికేట్స్ ఇవ్వక పోవటము,రాజ కియాల లో ప్రమాణాలు నిలబెత్తతము,మళ్ళి వక ఉచ్చ స్థితి ని అందుకోవాలని లక్షము.

నో క్రిమినల్స్ @ జి మెయిల్ .కం ద్వారా నియోజి క వర్గాల వారి గా అబ్యార్డుల నేర చరిత్ర తెలుసు కోవచ్చు.అందరు ఈ అవకాసము వుపయోగిచు కొని వోటు ని సదివినియోగ పరుస్తే బాగా నే వుంటుంది.ఆసయము మంచిదే.

ఇలాంటి ఉదాత్తు లదరి కి శతయుష్ మాన్భ వ .