నిన్న హోలీ పిల్లలు బాగా ఎంజాయ్ చేసారు.మా చిన్నప్పుడు పోట్టిచేలమ లో ఆడవాళ్లు పిల్లలము కలిసి హోలీ చేసుకునే వారము.పెళ్లి తరువాత ఆర్మీ లో చాలా పెద్దగా చేయటము చూసాను.అందరు తెల్ల పైజామా,కుర్తా వేసుకునేవారు.కలర్స్ ,డ్రింక్స్,స్వీట్స్,నమ్కిన్స్,ఫుడ్ అన్ని ఆఫీసర్స్ మెస్ లో అర్రెంజ్ చేసేవారు.పిల్లలు ,పెద్దలు అందరు వచ్చేవారు.డోలక్ వాయిస్తూ పాటలు డాన్స్ లు చాలా ఎంజాయ్ చేసే వాళ్ళము.మేమిద్దరమూ కలర్స్ తో మద్యఃనము స్కూటర్ మీద వస్తుంటే ,సికింద్ర బాద్ దాటాక అందరు మమ్మలిని వింతగా చూసేవారు.ఇది నలభయ్ సంవత్సరాల క్రితం సంగతి.
ఎప్పుడు హోలీ చేసుకున్న మరపురాని సంగతి-అందరమూ చాలా సరదాగా హోలీ ఆడాక చూసుకుంటే కెప్ట్.షరీఫ్ వల్ల బాబు కనపడలేదు.అంతా వెతికాము చివరి కి వాటర్ ట్యాంక్ లో కనిపించాడు.మూడు సంవత్సరాల వాడు మాదగ్గరే వున్నాడు ఎప్పుడు atuvellaad0.చాల ముద్దుగా వుండే వాడు అందరు వాడిని చాల ముద్దు చేసే వాళ్ళు.అప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్.ఆ విషాద సంగటన ముప్పయ్ ఇదు సంవత్సరాల క్రితము జరిగినా ఇప్పటి కి ప్రతి సంవతసరము హోలీ రోజు తప్పక గుర్తు కు వస్తుంది.నాకే ఇట్లవుంటే పాపం ఆ తల్లి ఎట్లా వుందో.
ప్రతి సారి హోలీ మరురోజు ఇలాంటివి వకతో ,రెండో పేపర్ లో కనిపిస్తూనే వుంటాయి.
Thursday, March 12, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment