Showing posts with label సమీక్ష. Show all posts
Showing posts with label సమీక్ష. Show all posts
Sunday, July 17, 2022
భాగ్యలక్ష్మి దేవాలయము -చార్మినార్
భాగ్యలక్ష్మి దేవాలయము చార్మినార్
నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం.
బోనాలజాతర సంధర్భంగా మనము దర్శిస్తున్న అమ్మవారి దేవాలయాలలో ఈ రోజు చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుందాము రండి.
ఈ దేవాలయము ఎప్పుడు వెలిసినది అన్నదానికి వివిధకథలు వినిపిస్తున్నాయి.
ఓసారి చార్మీనార్ దగ్గరికి అమ్మవారు నడుచుకుంటూ వస్తే అక్కడి కాపలావారు ఆవిడను అడ్డగించారు. దేవి తనగురించి చెబితే రాజానుమతి తీసుకొని వస్తామనీ, అప్పటి వరకూ అక్కడే ఉండమని ఆ కాపలాదారు లోపలికి వెళ్ళి రాజుతో చెప్పాడు. అప్పుడు రాజుకు ఆ వచ్చింది అమ్మవారేనని అనిపించి, కాపలాదారు వెళ్ళకపోతే ఆవిడ ఇక అక్కడే ఉండిపోతుందని అనుకొని అతనిని వెళ్ళవద్దంటాడు. దానితో ఆ దేవి అక్కడే ఉండిపోయిందట.
“ఇక్కడ వందల ఏళ్ల నుంచీ అక్కడ పూజలు జరుగుతున్నాయి. కాకపోతే గుడి ఉండేది కాదు. అమ్మవారు ఇప్పుడున్న రూపంలో కాకుండా, బొడ్రాయి రూపంలో ఉండేది.
1979 లో వక బస్ డ్రైవర్ ఆ రాయిని ఢీకొట్టాడు. అది ప్రమాదవశాత్తు జరిగింద లేక కావాలని చేశారా అనే గొడవ నడిచింది. అప్పుడు చెన్నారెడ్డిగారు ముఖ్యమంత్రి. ఆయనే అప్పుడు అక్కడ ఒక గుడిలా కట్టడానికి సహకరించారు. అప్పట్లో ఆ గుడి పూజారి కర్ఫ్యూలో కూడా పూజలకు వెళ్లేవారు. శుక్రవారం పూట మధ్యాహ్నం 12 గంటల నమాజు సమయంలో ఆయన హారతి గంట కొట్టకుండా పోలీసులు ఆ గంట పట్టుకుని కూర్చునేవారు.
పగిలిన రాయిని పూజించకూడదు కాబట్టి ఒక పటం పెట్టి పూజించేవారనీ, ఆ తరువాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేసారనీ, విగ్రహము పాదాల దగ్గర రెండు వెండితొడుగుల కింద ఆ రాయి ముక్కలను ఉంచారనీ అక్కడి పూజారులు చెపుతారు.
ఇంకా ఈ దేవాలయము గురించి ఉన్న చాలా కథలు, ఈ దేవాలయము గురించిన పరిశోధనల పూర్తి వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు గూగులమ్మను అడుగుతే చెపుతుంది.
బోనాల చివరిరోజున అమ్మవారి రథయాత్ర ఇక్కడ నుంచి సాగుతుంది.
ఇందులోని పాట మా అమ్మమ్మ కీ|శే|శ్రీమతి. వరలక్ష్మమ్మగారు దాదాపు నలభైయాభై సంవత్సరాల క్రితం పాడినది.
ఇదండీ ఈనాటి మనదేవాలయ దర్శనము. వచ్చేవారం మరో దేవాలయ దర్శనములో కలుసుకుందాము. నా పోస్ట్ లను శ్రద్దగా వింటున్న మితృలకు ధన్యవాదాలతో సెలవు. నమస్తే.
https://www.youtube.com/watch?v=E4LQ1DUJIgs
Tuesday, January 21, 2020
చోరీ చోరీ
చోరీ
చోరీ
మేము
బరోడాలో ఉన్నప్పుడు ఓ సారి సినిమాల కబుర్లు వస్తే మా కల్పనాదీదీతో రాజ్ కపూర్ ,నర్గీస్ సినిమాలు చాలా
బాగుంటాయని విన్నాను కాని చూడలేదు అన్నాను.అదేమిటీ రాజ్ కపూర్ ,నర్గీస్ సినిమా చూడని జన్మ వేస్ట్ అంది.అయ్యో మరెలా నా జనం వ్యర్ధమైపోయిందే
అని చింతిస్తుంటే చింత వద్దు చెల్లీ, ఇప్పుడు ఓ థియేటర్
(చాలా ఏళ్ళైపోయింది కదా , ఆ థియేటర్ పేరు గుర్తులేదు)లో రాజ్
కపూర్ సినిమాల వారం నడుస్తోంది.ఇప్పటికే మూడు సినిమాలైపోయాయి, నీ అదృష్ఠం మిగితా నాలుగూ చూద్దువు,అందులో రెండు
నర్గీస్ ,రాజ్ కపూర్ ల వి కూడా ఉన్నాయి పదా అని "చోరీ చోరీ,శ్రీ
420,మేరానాం జోకర్, సంగం" రాజ్
కపూర్ సినిమాలను నాలుగు చూపించింది.అందులో మేరా నాం జోకర్ అంతగా నచ్చలేదు.మిగితా
మూడూ చాలా నచ్చేసాయి.అందులో చోరీ చోరీ ఇంకా నచ్చి ఇప్పుడు కూడా అప్పుడప్పుడు
యూట్యూబ్ లో పాటలు చూస్తూ ఉంటాను.
మల్టీ
మిలియనీర్ గిరిధారీలాల్ ఏకైక కూతురు కమ్ము.కమ్మును గిరిధారీలాల్ తల్లిలేని లోటు
తెలియకుండా ముద్దుగా పెంచుకుంటాడు. తన ఐశ్వర్యం చూసి కాకుండా కమ్మూని మనస్పూర్తిగా
ఇష్ఠపడిన అబ్బాయితో వివాహం జరిపించాలనుకుంటాడు.కాని కమ్మూ సుమన్ కుమార్ అనే పైలట్
ను ప్రేమిస్తుంది.గిరిధారీలాల్ అతని గురించి వాకబు చేస్టే వుమనైజర్ అని
తెలుస్తుంది.విషయము కమ్మూకు చెప్పి అతనినికి ఇచ్చి పెళ్ళిచేయటము ఇష్ఠంలేదని
చెపుతాడు.కానీ కమ్మూ వినకుండా షిప్ లో నుంచి పారిపోతుంది. కమ్మూ జాడ తెలిపిన
వారికి 1.25 లక్షరూపాయలు బహుమతి ఇస్తానని ,రేడియోలో, న్యూస్ పేపర్ లో ప్రకటిస్తాడు గిరిధారీలాల్.షిప్ నుంచి తప్పించుకున్న
కమ్ము సుమన్ ను కలుసుకునేందుకు బస్ లో ప్రయాణిస్తుంది.సాగర్ అనే ఫ్రీ లాన్స్
జర్నలిస్ట్. తన కథ పారితోషకము ఎడిటర్ దగ్గర నుంచి
తెచ్చుకునేందుకు అదే బస్ లో బెంగుళూర్ కు వెళుతుంటాడు.సాగర్ కమ్మూ గురించిన వార్త
పేపర్ లో చూస్తాడు.బస్ దారిలో టీ కోసం ఆపినప్పుడు , కమ్మూ
ప్రకృతి చూసి పరవశించిపోతూ బస్ మిస్సవుతుంది.సాగర్ కూడా కమ్మూ కోసం
ఉండిపోతాడు.ఇద్దరూ తరువాతి బస్ లో బయిలుదేరుతారు.కొద్ది దూరం వెళ్ళాక ఆ బస్ బ్రేక్
డౌన్ అవటం తో , సాగర్ , కమ్మూ ఒక హోటల్
లో భార్యాభర్తలమని చెప్పి గది తీసుకుంటారు.వారి ఆ ప్రయాణం లో కమ్మూ కు సుమన్
గురించిన నిజాలు తెలుస్తాయి.అతని మీద మనసు విరిగిపోతుంది.సాగర్,కమ్మూ ఇద్దరూ ప్రేమించుకుంటారు.పెళ్ళి చేసుకుందామనుకుంటారు.హోటల్ డబ్బులు
కట్టేందుకు , పెళ్ళికోసం అనీ డబ్బులు ఎడిటర్ ను అడిగి తెచ్చేందుకు సాగర్ బెంగుళూర్
వెళుతాడు.సాగర్ ఇలా వెళుతున్నానని రాసి పెట్టిన ఉత్తరం ఎగిరిపోయి,సాగర్ తనను వదిలేసి వెళ్ళిపోయాడని భావించిన కమ్మూ , తన
వార్త తెలిసి వెతుక్కుంటూ వచ్చిన తండ్రితో వెళ్ళిపోతుంది.తిరిగి వచ్చిన సాగర్
కమ్మూ తండ్రితో కలిసి కార్ లో వెళుతుండటము చూసి కమ్మూ ను అపార్ధం
చేసుకుంటాడు.దిగులుగా ఉన్న కమ్మూ సుమన్ కోసం దిగులు పడుతోందని భావించి
గిరిధారీలాల్ కమ్మూ పెళ్ళి సుమన్ తో నిశ్చయిస్తాడు.సరే చివరికి అపార్ధాలు తొలిగి
సాగర్,కమ్మూ ఒకటవుతారు
ఇదీ
చోరీ చోరీ సినిమా కథ. ఇందులో సాగర్ గా రాజ్ కపూర్ ,కమ్మూ గా నర్గిస్,సుమన్
గా ప్రాణ్ నటించారు.
రాజ్
కపూర్ నర్గీస్ ల నటన గురించి చెప్పేదేముంది.నాకైతే ఇద్దరూ చాలా నచ్చేసారు.రాజ్
కపూర్ కళ్ళల్లో ప్రేమని ఎంత బాగా చూపించాడో.నర్గీస్ ను ముందు చూడగానే పెద్ద పర్సనాలిటీ అనిపించింది
కాని తరువాత ఆమె నటన ముందు ఆ పర్సనాలిటీ కనిపించలేదు.ఎంతైనా ఆనాటి వారు హావభావాలు
పలికించటంలో సిద్ద హస్తులు. చాలా బాగా అనిపించింది.సినిమా అంతా చాలా నీట్
గాఉంది.ఎక్కడా వెకిలి శృగారంకాని ,
అతి హాస్యం కాని లేదు.అసలు సినిమా చూస్తుంటే బోర్ గా కూడా
అనిపించలేదు.
l.b.లచ్మన్ నిర్మించగా అనంత్
ఠాకూర్ దర్శకత్వం వహించారు.Aghajani Kashmeri కథా రచయిత.ఇది 1956 లో a,v,m, ప్రొడక్షన్ ద్వారా రిలీజ్ అయ్యింది.
ఈ
సినిమా కు సంగీత సమకూర్చిన శంకర్ జై కిషన్ కు బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ గా ఫిలిం
ఫేర్ అవార్డ్ వచ్చింది.పాటలు అన్ని కూడా బాగున్నాయి.ఆల్ లైన్ క్లియర్ పాట లో జానీవాకర్
కుటుంబం తో మార్చ్ చేసుకుంటూ వెళుతుంటే భలే నవ్వొచ్చింది."సవా లాఖ్ కీ
లాటరీ"పాట లో రాజసులోచన,భగవాన్ లను చూసి నవ్వుకోవచ్చు.నర్గీస్ "పంచి బనూ ఉడితి
ఫిరూం"అని పాడుకుంటూ హాయి వెళుతుంటే నిజంగా అలా పక్షిలా ఉంటే ఎంత బాగుంటుంది
అనిపించింది.ఆ పొలాలు , ఆ పరిసరాలూ చాలా బాగా
చూపించారు."యెహ్ రాత్ భీగి భీగి","జహన్ మై
జాతి హూన్","ఆజ సనం మధుర్ ఛాంద్ ని మే"పాటలు
లతా మంగేష్కర్, మన్నాడేలా గళం లో మధురంగా
సాగిపోయాయి."రసిక బలమా","మన్ భావన్ కె ఘర్
జాయే గౌరి"పాటలు మనసును భారం చేసాయి.ఇలా అన్ని పాటలు బాగున్నాయి.అన్నట్లు ఓ
తిల్లానా కూడా ఉంది.
"ఆజా సనం మధుర చాందినీ మే హం తుం "పాట లో చందమామ ఏమి అందాలు
చిందించాడో!
"ఓరే సాజన్ లేచల్ ముఝే తారోంకే పాస్
లగతానహీ
దిలా యహా".
Aaja sanam madhur chandni mein hum
Tum mile to wirane mein bhi aa jayegi bahaar
Jhumne lagega aasman
Jhumne lagega aasman
Tum mile to wirane mein bhi aa jayegi bahaar
Jhumne lagega aasman
Jhumne lagega aasman
Kehta hai dil aur machalta hai dil
More saajan le chal mujhe taaron ke paar
Lagta nahin hai dil yahan
Lagta nahin hai dil yahan
More saajan le chal mujhe taaron ke paar
Lagta nahin hai dil yahan
Lagta nahin hai dil yahan
Bheegi bheegi raat me, dil ka daaman thaam le
Khoyi khoyi zindagi, har dam tera naam le
Chand ki behki nazar, keh rahi hai pyaar kar
Zindagi hai ek safar, kaun jaane kal kidhar
Chand ki behki nazar, keh rahi hai pyaar kar
Zindagi hai ek safar, kaun jaane kal kidhar
Khoyi khoyi zindagi, har dam tera naam le
Chand ki behki nazar, keh rahi hai pyaar kar
Zindagi hai ek safar, kaun jaane kal kidhar
Chand ki behki nazar, keh rahi hai pyaar kar
Zindagi hai ek safar, kaun jaane kal kidhar
Aaja sanam madhur chandni mein hum
Tum mile to wirane mein bhi aa jayegi bahaar
Jhumne lagega aasman
Jhumne lagega aasman
Tum mile to wirane mein bhi aa jayegi bahaar
Jhumne lagega aasman
Jhumne lagega aasman
Kehta hai dil aur machalta hai dil
More saajan le chal mujhe taaron ke paar
Lagta nahin hai dil yahan
Lagta nahin hai dil yahan
More saajan le chal mujhe taaron ke paar
Lagta nahin hai dil yahan
Lagta nahin hai dil yahan
Dil ye…
(పాట పదాలు గూగుల్ సౌజన్యం తో)
ఈ పాట
సంస్క్రుత వర్షన్ లో కూడా ఉందని .డీడీ చానల్ వాళ్ళు కొన్ని పాటలు సంస్క్రుతం లోకి
మార్చమంటున్నారని .ఇది కూడా బాగుంది.కలర్ లోకి కూడా మార్చారు ఈ పాటను.
Sunday, December 29, 2019
నవ్వులనజరానా-1&2
నవ్వుల
నజరానా
రచయతలు
; ఇరవైఆరుగు
నవ్వులు;కడుపుబ్బ
అనగనగా
ఒక ఊళ్ళో ఒకాయన ఉన్నాడు.ఏమిటి ఊళ్ళో
ఒకాయనే ఉన్నాడా ఇంకెవరూ లేరా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగకండి.చెప్పింది
వినండి. పేరు ఏదో ఓ పేరు మీ కిష్టమైంది అనుకోండి.ఆయన రోజంతా పొలంలో పనులు చేసీ
చేసీ కష్టపడి , ఇంటికొచ్చి ,వేడి వేడి నీళ్ళు స్నానంచేసి, పెళ్ళాం పెట్టిన వేడి వేడి బువ్వ తిని ఇలా పడుకున్నాడో లేదో నిద్ర
ముంచుకొచ్చేసేది.అవును పాపం అలిసిపోయాడుకదా అందుకన్నమాట.మాంచి గురకపెట్టి
నిద్రపోతూ ఉంటే ,అర్ధరాత్రి అంకమ్మ శివాలులా "దూకుతా
దూకుతా" అని పెద్ద పెద్ద అరుపులు వినిపించేవి.యేహే ఏందీ గోల అనుకొని
అటుతిరిగి పడుకునే వాడు.కానీ రోజు అర్ధరాత్రి "దూకుతా దుకుతా"అని
అరుపులతో నిద్రాభంగమైపోయేది.ఓ రాత్రి ఇంక విసుగొచ్చి,"రోజూ
ఏందే నీగోల ?దూకుతా దూకుతా అని అరవకపోతే దూకి
చావరాదు"అని గట్టిగా అరిచాడు.అంతే "ధబ్" అనే పెద్ద శభ్ధం తో ఓ
బేద్ద మూట అతని మీద పడింది.అంతే ఉలిక్కి పడిలేచి ,ఆ మూటను
విప్పి చూసాడు.ఆశ్చర్యం. . . అధ్భుతం . . . ఆ మూట నిండా బోలెడంత డబ్బు, నగలూ!ఎంత సంపదో!ఇంక తరువాత ఏముంది ఎంజాయ్!కథం కహానీ!
ఇక
అసలు సంగతేమిటంటే పదిరోజుల నుంచీ మిమ్మలినందరినీ ఊరిస్తున్న మా "నవ్వుల
నజరానా"25-12-2019 , ఓ ఆహ్లాదకరమైన సాయంకాలం పుస్తకాల సంపద మధ్య మీ ముంగిట్లో కి దూకేసింది.ఇక ఒడిసిపట్టుకోవటమే
మీ వంతు.అరే ఏమిటంత తొందర కాస్తాగండి. . .అందులో ఏమేమి నగలూ నాణ్యాలున్నాయో
చెప్పనిస్తారా లేదా!
ఓ
బోడబ్బాయ్ ఆంధ్రాలో పుడితే అమెరికాలో ఎక్సాస్ ప్రెసిడెంట్ కు కుడికన్ను అదిరిందిట
శుభసూచకంగా ఎందుకో వంగూరి చిట్టెన్ రాజుగారు"అమెరికా వాహన యోగం"లో
చెపుతున్నారు ఆలకించండి.
ఎవో
దయ్యాలూ భూతాలూ పట్టి పీడించటం ,
వాటిని పోగొట్టేందుకు భూతాలరాజు వేపమండలతో చితక బాదటం విన్నాను కాని,
ఎవరి చుట్టైనా గిరగిరా ఓ ఆత్మ తిరుగుతూ ఉంటే వాడు సారీ సారీ
అప్పలాకొండగారు ఏమి చేయాలని సెలవిచ్చారంటే ఆయన గారు చచ్చినట్టు పడుకుంటే , చుట్టూ అందరూ ఆయనగారు చచ్చిపోయారని భోరు భోరున ఏడుస్తూ ఉంటే ఆ ఆత్మ తల
తిరుగుగుడు అగి వెళ్ళిపోతుందిట.ఏమొనబ్బా అదేమిటో వడ్లమాని మణిగారి కథ
"అ(అప్పలకొండ)-ఆ(ఆనందరావు)"కథ చదివి తెలుసుకోవలసుకున్నాను.
ప్రతిరోజూ
కొన్ని కోట్ల మంది అమెరికా వెళుతున్నారు కాని వారెవరికీ రాని ప్రాముఖ్యత
"బామ్మగారి బోస్టన్ ప్రయాణం" కు ట్రంపు గారి ఇండియా ప్రయాణం, మోడీ గారి అమెరికా
ప్రయాణం కు వచ్చినదానికన్నా ఓ పిసరు ఎక్కువగానే వచ్చింది.మరి ఎందుకో ఆ కథా కమామీషు
ఉమాదేవి కల్వకోటగారు చెపుతున్నారు, కాస్త కడుపులు జాగ్రత్తగా
పట్టుకొని ,తలలు గట్రా దేనికీ తగిలించుకోకుండా నవ్వుతూ
ఆలకించండి.
భార్య
గారు ప్రేమగా భర్తగారిని "ఈమండీ రాత్రి భోజనంలోకి ఏమి చేయమంటారు?" అని అడుగుతే అహా
ఓహో అని రెచ్చిపోయి మీ కోరికల చిట్టా విప్పారో మీ ఇష్టం అడ్డంగా దొరికి పోతారు.ఎలాగా
అంటే ఇలాగా వెంకట్ అద్దంకి గారి "అతిసంశయ"లో రఘులా మీ ఇష్టం మరి!
అమాయక
పెళ్ళాం పెట్టే అతి ఖర్చుల నుంచి తప్పించుకోవాలని పాపం ఓ ఉత్తమ మొగుడుగారు అతి
తెలివి ప్లాన్ వేస్తే పాపం అది ఎట్లా బెడిసి కొట్టిందో ఆయనగారి మెడకు చుట్టుకుందో
సయ్యద్ నజ్మా షమ్మీ గారి "ఉత్తమమొగుడు"చదివి నవ్వుకొని జాలిపడండి.
వెనకటికెవరో
తనది సౌండ్ స్లీపని గురకపెడుతుంటే సౌండ్ నాకూ-స్లీప్ మీకూ అని మొత్తుకుందిట ఓ
ఇల్లాలు.అలా సిగరెట్ మజా మీకూ-సజా మాకు అని మొత్తుకుంది కనకలత ,ఎమెస్వీ గంగరాజుగారి కథ
"గెలివి"లో!
జగమెరిగిన
జలజమ్మకు పరిచయం నేను చేయలేనండోయ్ బాబూ మీరే గిరిజా రాణి కలవల గారి
"జలజాక్షి-జలజాపతి" లో ఫ్రెష్ గా మరోసారి పరిచయం చేసుకోండబ్బా!
పెళ్ళా
ఏది వండిపెడితే అది నోరుమూసుకొని తినక వంకలా హన్నా అట్లాంటి మొగుడికి ఏమి
శిక్షవేయాలో మనకు జ్ఞానబోధ చేస్తున్నారు తులసి భాను గారు"సుమతీసత్య"లో
.చదివి నేర్చుకోండి.
ఐదు
పెల్లిల్లు చేసుకుంటున్న మనవరాలిపెల్లిల్ల ల్లో హడావిడి చేసి తమ తడాఖా చూపిద్దామని
ఓ సరదా పడిపోయారు ఓ అమ్మమ్మ,
నానమ్మ.పట్టు చీరలు ,కాసులపేరు,వడ్డాణాలు వేసుకుందామని ఆశపడ్డారు.కానీ జిగేల్ మనే గిల్టు నగలూ
తగిలించుకొని,పిచ్చిజరీలతో తళతళా మెరిసిపోతున్న సింతటిక్
చీరలు కట్టుకోవలసి వచ్చిన వైన మెట్టిదనగా . . . నేను చెప్పటం ఎందుకు మీరే
తెలుసుకోండి జి.యస్.లక్ష్మి గారి "తాజాతాజాపెళ్ళిబాజాలు" లో చదివి.
హబ్బ
హబ్బ నవ్వీ నవ్వీ నా బుగ్గలు నొప్పెడుతున్నాయి.ఇంక రాయలేను బాబు మిగితావి సాయంకాలం
.అందాకా సెలవు.
(సశేషం)
నవ్వుల
నజరానా-2
రచయితలు
; ఇరవైఆరుగు
నవ్వులు;కడుపుబ్బ
అబ్బా
ఆగండెహే . . . అందరినీ పరిచయం చేస్తానని చెప్పానా లేదా ? మీ తొందర దొంగల్ తోలా ! ఉరుములమెరుపుల జిగినీ
చీరలు ఈవెంటోళ్ళు చెప్పినట్టు ముస్తాబై ఐదు పెల్లిల్లకు (సరిగ్గానే చెప్పా ఇవి
అమెరికా పెల్లిల్లు పెళ్ళిళ్ళు కాదు) వెల్లి (అమెరికా అమెరికా) పీకలదాకా మెక్కి
బుక్తాయాసం తో పడుకొని ఇప్పుడే లేచానా మరి.ఇహ చెపుతా మీ గురించి కూడా. . .
ఈ
మధ్య ఎక్కడ విన్నా ,పేపర్ లో చదివినా డెంగ్యూ, చికెన్ గున్యా , దోమలు హోరెత్తిస్తున్నాయి.వీటి బాధ నుంచి తప్పించుకోవటానికే
త్రివిక్రమరావు దోమలబ్యాటూ వెంట పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు.ఈ దోమల తస్సాదియ్యా
అవేమైనా తక్కువ తిన్నాయా!బాగా తెలివిమీరిన రెండు దోమలు త్రివిక్రమరావును
ముప్పతిప్పలు పెట్టేసాయి దా.పి.విజయలక్ష్మి పండిట్ గారి"దోమల వేట" లో!
పి.యస్.యం
లక్ష్మిగారికి పాపం తిన్నది అరక్క వళ్ళు పెరిగి ఆయాసం అట.ఆయాసం తగ్గించమని
డాక్టరమ్మ దగ్గరికెళుతే గుండె ఆపరేషన్ చేస్తానంటుందేమిటి చెప్మా!ఆ డాకటరమ్మ కి అంత
తిక్కెందుకు వచ్చిందో "ఆయాసానికి గుండె ఆపరేషన్" లో తెలుసుకుందాం!
"చంటోడిని చంకలో పెట్టుకొని , మీ ఆఫీస్ బాగ్ ఇంట్లో
మర్చిపోయారు. . . "కుశల శర్మ గారి భార్య కుశల శర్మ గారిని చివాట్లు
వేస్తోంది.అదేమిటి ఆఫీస్ కు ఎవరైనా చంటోడిని చంకలో వేసుకొని తీసుకెళుతారా ఆ చోద్యం
ఏమిటో కౌండిన్య (రమేష్ కలవల) గారి "కవిసార్వభౌమ-కవి కుశల శర్మ" లో
చదవండి.
రిటరయ్యాక
ఇద్దరూ కలిసి షాపింగ్ కు వెళితే సరదాగా ఉంటుందని భర్త వివేక్ ను వాల్మార్ట్ కు
నీరజ తీసుకెళితే, అక్కడ వివేక్ చేసిన హంగామా ఇంతా అంతా కాదు సోమ సుధేష్ణ గారి "పదవీ
విరమణ"లో!
అమ్మాయిలంటే
ఆమడ దూరం పరుగెత్తుకెళ్ళే మధుగాడు లవ్ లో పడ్డాడు.పడటమే కాదు ప్రేయసి దగ్గర నుంచి
ఓ ప్రేమలేఖ కూడా అందుకున్నాడు.ఆ ప్రేమలేఖ లో ఏముందో నేను చెపుతానేమిటి ఆశ దోశ
అప్పడం. . . అదేమిటో మీరే చదివి తరించండి
అందరి అభిమాన రచయిత కంభంపాటి రవీంద్ర గారి రచన"ప్రేమలేఖ"లో.
పిల్లనో, పిల్లడినో
కనిచ్చేద్దామని ఇల్లలు పుట్టింటికి వెళితే ,మనసును వీరాంగాలు
వేయిస్తే ఏమి జరుగుతుందో హాస్యరసం లో శృంగారరసాన్ని ఘాటుగా తాలింపు వేసి
వడ్డించారు చంగల్వల కామేశరి గారు "' లేడీ 'పోయి 'లేడీ' వచ్చే డాం డాం
డాం"లో.
నవ్వుల
రాజుగారు సరసి గారు గుళ్ళో మన చెప్పులు పోకుండా ,మహత్తరమైన ఉపాయం చెపుతున్నారు "చెప్పు
తిప్పలు" లో. అదేమిటో నవ్వుల్ పువ్వుల్ మధ్య చదివి తెలుసుకోండి .ఆలశ్యం అమృతం
విషం .త్వరపడండి.
ఫేస్
బుక్ లో మీ పోస్ట్ లకు బోలెడు లైక్ లూ, కామెంట్స్ వస్తున్నాయా ?
నాకూ తెలుసు రావటం లేదు.దిగులెందుకు ? శ్రీ
సత్య గౌతమి జె.గారు రాసిన "వలలో చేపలు" చదవండి. టింగ్. . . టింగ్ . .
టింగ్.
విజయ
సారధి పేరు పొందిన రచయిత.కొత్త విషయాలను తెలుసుకొని తన రచనలల్లో వాడుకునేందుకు
రైల్లో,విమానల్లో,
బస్లల్లో అన్ని చోట్లా అందరినీ ఇంటర్వ్యూ చేస్తుంటాడు.అవే కథలుగా
వచ్చేస్తూ ఉంటాయి.కాని అన్ని వేళలూ మనవి కావు అన్నట్లు విజయ సారధి పరిస్తితి
"అడ్డం తిరిగిన కథ" అయ్యింది,ప్రఖ్యాత సీనియర్
రచయిత్రి మంథా భానుమతి గారి చేతిలో!
కురుక్షేత్రం
లో అర్జనుడు సైంధవుడిని చంపేసాక,అంత పాపాత్ముడికి అంత్యక్రియలు ఎందుకని వదిలేసారు.వాడి శరీరం నుంచి ఎముకలు
బయట పడ్డాక ఆ ఎముకల పొడిని నూరి ఉప్పులో కలిపేసారు.అదే సైంధవలవణం.నిజమండీ
సత్తెపమ్మాణికంగా చెపుతున్నాను.నా మాట నమ్మకపోతే డా.రామలక్ష్మి తాడేపల్లి గారి
"సైంధవ లవణం" చదవండి.మీకే తెలుస్తుంది.
క్యారంస్
లో తను ఓడిపోతే భర్త మోములో విరిసిన దరహాసం ఆవిడకు ఎంతగానో నచ్చేసి . . . ఆ
నవ్వును ఎప్పుడూ చూడాలని కావాలని ఓడిపోతూ ఉంటుంది పరమేశ్వరిగారు ఓరుగంటి శ్రీ
లక్ష్మీనరసింహశర్మగారి "మా ఏమండోపాఖ్యానం "లో.
సుందరమ్మగారికి
భర్త చనిపోయిన షాక్ లో మతి చలించింది.ఆ పిచ్చి లో ఏదో మాట్లాడుతూ ఉంటుంది.ఆ పిచ్చి
కొడుకు కోడలకు ఎలా కలిసివచ్చిందో,విశాలి పేరి గారి "కలిసొచ్చిన పిచ్చి" చదువుకోవచ్చు. అవును కొన్ని సార్లు పిచి కూడా
కలిసొస్తుంది కాదేది కలిసొచ్చేందుకు
అనర్హం!
గుర్నాధం
కున్న డ్రామా పిచ్చి భార్యను ముప్పతిప్పలు పెడుతుంటుంది. ఆ పిచ్చి ఓ సారి
పరకాష్టకు చేరి, ఢాం అని కుదిరిపోతుంది నాగలక్ష్మి కర్రా గారి "పిచ్చి
కుదిరింది"లో.
కామేశ్వరరావుగారికి
బోలెడంత మతిమరుపు.ఏదో చెబుదామని భార్యను పిలుస్తారు మర్చిపోతారు.ఆయన మతి మరుపుతో ఆ
ఇల్లాలూ,
పిల్లలు పడే ఇబ్బందులు చాలా సరదాగా రాసారు నళిని ఎర్రా తన కథ "కళ్ళ
జోడు"లో.
మనకు
ఎన్నో డేలు మదర్స్ డే, ఫాదర్స్ డే,లవర్స్ డే వగైరా.ఆరోగ్యం కోసం టాయిలెట్స్
డే ఎందుకు జరుపుకోకూడదు అనే ఐడియా వచ్చింది మిసెస్.పరంశివం కు.పనిలోపని గా "
భర్త డే" కూడా జరుపుకోవచ్చు అంటున్నారు ముచ్చెర్ల శకుంతల
"భర్త(బ్లాక్)డే" లో!
ఫేస్
బుక్ కాలనీ పేరు ఎప్పుడైనా విన్నారా?అక్కడంతా ఫేస్ బుక్ పద్దతి ట.అక్కడ జరిగే చిత్ర విచిత్రాలకు దిమ్మ
తిరిగిపోయి మూర్చబొయిన పాపం పసివాడు రవి కథా కమామీషు తెలుసుకోవాలంటే భరద్వాజ్
వెలమకన్ని రాసిన “ఫేస్ బుక్ కాలనీ( లఘు నాటిక)”లో తెలుసుకోవాల్సీందే!
సో
ఇవండీ మా నవ్వుల నజరానా లోని కథల కబుర్లు. ఇలా కొంచం కొంచం చెప్పి ఆశపెడితే
ఆశకురుపులొస్తాయంటున్నారా?
ఏంకాదులెండి .పూర్తిగా చదివేద్దామని ఉబలాట పడుతున్నారు నాకు తెలుసు
అందుకే ఎక్కడ చదవాలో చెప్పేస్తున్నాను.పూర్తిగా చదివి పకపకా నవ్వుకోవాలి కదా
మరి.అందుకే ,
బుక్
ఏగ్జీబిషన్: హైదరాబాద్ యన్.టి.ఆర్ స్టేడియంలో
1. సురేష్ VMRG స్టాల్ No. 101
2. అచ్చంగా తెలుగు స్టాల్ల్ no. 176
3. విశాలాంధ్ర స్టాల్ల్స్- 95, 96,97, 281 - 284
4. నవచేతన స్టాల్ల్స్- 34 - 37, 141 -144 సీరియల్
ఆర్డర్ లో
నూ
రచయితల దగ్గరా లభ్యం అవుతాయి.కొనేసుకొని చదివేసుకోండి.
ఏమిటీ
ఏమో అంటున్నారు?ఇరవైఆరుగురు రచయితలు రాసిన ఇరవై ఆరు కథలు అన్నావు, ఇరవై
ఐదు కథలనే పరిచయం చేసావు అంటున్నారా? ఆ ఇరవైఆరో కథ నాదేనండి
బాబూ.అదే "దొంగగారు స్వాగతం" .నా కథ గురించి నేను చెప్పుకుంటే తనకు తాను
మురిసే తాటాకు గుడిసె అని మా ఏమండీ గారు వెక్కిరిస్తారు.ఐనా నా కథ గురించి నేను
చెప్పుకోవటం బాగోదు కదా .రేపు పోస్ట్ చేస్తాను చదివి మీ అభిప్రాయం చెప్పండీ :)
#నవ్వులనజరానా
Wednesday, September 18, 2019
పునీతులు
పునీతులు
రచన ; సుజల గంటి
మత్తుపదార్ధాల
ప్రభావం మీద సుజల గంటి గారు రాసిన నవల "పునీతులు" ఇప్పుడే చదివాను.ఈ నవల
స్వాతి మాసపత్రిక లో ప్రచురించబడింది.
చలపతిరావు
దంపతులకు నలుగురు సంతానం, ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు.ఆ
పిల్లలందరిలోకి మూడోవాడైన వీరు అమాయకుడు మంచివాడు.ఎవరు ఏపని చెప్పినా
చేస్తాడు.రెండో చెల్లెలు మంజరి తప్ప మిగితా కుటుంబసభ్యులందరూ వీరూ మీద పెత్తనం
చెలాయిస్తుంటారు. చదువుబాగా చదువుతాడని , తనకు ఆసరాగా ఉంటడని
పెద్దకొడుకు నాగేంద్రను బాగా చదివిస్తాడు
చలపతిరావు. నాగేంద్ర ఉద్యోగస్తుడు కాగానే తన స్వార్ధం తను చూసుకుంటాడు.
ఎందుకూ పనికిరాడని చిన్నచూపుచూస్తూ, నిర్లక్షం చేసిన వీరు
తను సంపాదన తల్లికే ఇస్తాడు.వీరు ఇష్టపడిన మేనత్తకూతురు రమణి ని గాక పెద్దచెల్లెలు
మాధురి పెళ్ళికి, కుండమార్పిడి పద్దతిలో దుర్గ ను ఇచ్చి
పెళ్ళిచేస్తార్డు చలపతి.భార్య నుంచి కూడా ఆశించిన ఆనందం పొందలేక, కన్న కొడుకులోనైనా సంతోషం చూసుకుందామనుకుంటే దుర్గ తెలివితక్కువ తో ,కొడుకు కూడా దూరమవటము తో , విరక్తితో, చెడు సావాసాలతో మత్తుమందులకు బానిసవుతాడు వీరు.సముద్రపు వడ్డున పడిఉన్న
వీరు ని హృషీకేశ్ లో ప్రకృతివైద్యాశ్రమం నడుపుతున్న గురూజీ చూసి, ఆదరించి , హృషీకేశ్ కు తీసుకెళ్ళి ఆరోగ్యవంతుడిని
చేస్తారు..ఆ ఆశ్రమం లో గురూజి ఇలాంటి డ్రగ్ ఎడిక్ట్స్ కు చికిత్స
చేస్తుంటారు. మారిన వీరు ఇంటికి తిరిగి
వెళ్ళేందుకు ఇష్టపడక ఈశ్వర్ అనే పేరు ఆశ్రమంలోనే స్వామీజికి సహాయపడుతూ ఉండిపోతాడు.
స్వామిజీ ప్రోత్సాహం తో పేంటింగ్స్ వేయటం
నేర్చుకొంటాడు.పెద్ద చిత్రకారుడిగా పేరు పొందుతాడు.చిన్న చెల్లెలు మంజరి
అనుకోకుండా వీరు ను చూడటము తో కుటుంబస్భ్యులను కలుసుకుంటాడు.భార్య, తల్లీ తండ్రి వీరు పట్ల తాము చేసిన నిరాదరణను తెలుసుకొని
పశ్చాత్తాపపడుతారు. ఇంటికి తిరిగి వెళ్ళేందుకు వీరు ఇష్టపడక ఆశ్రమం లోనే
ఉండిపోతాడు.క్లుప్తంగా కథ ఇది.
ఇందులో
పిల్లల సైకాలజీ గురించి, నిర్లక్షం చేస్తే వారు ఎట్ల మారిపోతారో, చెడు సహవాసాలకు
ఎలా లోనవుతారో వీరు పాత్ర ద్వారా చెపుతారు. పిల్ల మనస్తత్వం గురించి, పేరెంట్స్ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెపుతారు.రచయిత్రికి పిల్లల
సైకాలజీ మీద మంచి అవగాహన ఉంది.ఈ నవల ఎదుగుతున్న పిల్లలున్న తల్లితండ్రులకు
ఉపయోగపడుతుంది.
కాకపోతే
తల్లితండ్రులకు పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా ,
అది అందరిమీద ఒకేరకంగా చూపించరా? . మాటవినే,అమాయకులైన పిల్లలను పేరెంట్స్ కూడా అడ్వాంటేజ్ గా తీసుకుంటారా ? అనే అనుమానం వచ్చింది నాకు
ఈ
నవలలో రచయిత్రి చెప్పినటువంటి గురూజీ ఆశ్రమము , "పున్నాగపూలు"నవలలో ఆ నవల
రచయిత్రి జలంధరగారు చెప్పినటువంటి జేకే ఆసుపత్రి నిజంగా ఉంటే ఎంత బాగుంటుందో కదా
అనిపించింది.
ఎక్కడైనా
వేటింగ్ అప్పుడు పుస్తకం చదువుతూ కూర్చోటం నాకు అలవాటు. పుస్తకం కోసమని పెద్ద
పర్స్ తీసుకుపోవాల్సి వచ్చేది. ఈ పుస్తకం చిన్నగా ముచ్చటగా, చిన్న పర్స్ లో
పెట్టుకునేందుకు వీలుగా పాకెట్ సైజ్ లో బాగుంది.
Monday, December 17, 2018
అమ్మే కావాలి
కొన్ని సార్లు కొన్ని కథలు చదువుతుంటే చాలా
విసుగ్గా ఉంటుంది. ఏదో సమస్యల మీద రాయాలని మొదలు పెడతారు.అవి కూడా ఏదో ఒక సామాజిక
వర్గానికే సమస్యలు ఉన్నట్లు, మిగితా వారంతా ఆనందంగా
జీవిస్తూ, వాళ్ళని నానా హింసలపాలు చేస్తున్నట్లుగా ఉంటాయి.పొనీ
మధ్య తరగతి వాళ్ళకు సమస్యలు లేవా అవి రాయవచ్చు కదా అనుకుంటే ఒకప్పుడేమో
అత్తాకోడళ్ళ పొట్లాటలు, వదినా ఆడపడుచుల విరోధాలూ (ఇప్పటికీ
టివీ లల్లో అవే ప్రసిధ్ది అనుకోండి) మొగుళ్ళ పెత్తనాలు పెళ్ళాల కన్నీటిగాధలు
ఉండేవి.అవి తగ్గి ఈ మధ్య కాలం లో పిల్లలు అమెరికా వెళ్ళిపోయి తల్లితండ్రులను
నిర్లక్షం చేయటం, ఆ తల్లితండ్రులు భోరున ఏడుస్తూ చావలేక
బతుకును ఈడ్చటం కొత్త ట్రెండ్ అన్నమాట. పోనీ ఏవో హాస్య కథలు అని పేరు పెట్టి
రాస్తున్నారు చదివి కాసేపు నవ్వుకుందాము అనుకుంటే నవ్వు పెదాలను ఎంత పీకినా రావటం
లేదు.కొన్నేమో మహా ఘంభీరమైన కథలు.అన్ని కథలూ అలా ఉన్నాయని అనటం లేదు కాదు కాని
ఎక్కువగా ఉంటున్నాయి. యద్దనపూడిలా ఆహ్లాదకరమైన కథలూ, పొత్తూరి
లా కడుపుబ్బ నవ్వించే కథలూ ఎల్లవేళలా రావాలని కోరుకోను కాని మాదిరెడ్డి
సులోచనలా సమస్యలు అని కాకుండా సున్నితంగా
సమస్యలను చర్చించే కుటుంబకథలను నాలాంటి సామాన్య పాఠకురాలు కోరుకుంటే తప్పేమీ కాదు
అనుకుంటాను.ఆ కోరిక తీర్చేందుకే అప్పుడప్పుడు ఇలాంటి పుస్తకాలు దొరుకుతుంటాయి.అలా
నా చేతికి వచ్చింది, జి.యస్.లక్ష్మిగారు రాసిన "అమ్మే
కావాలి".
అమ్మ మనసు ను అవిష్కరించిన అమ్మే కావాలి, అమ్మ కథల సమాహారం లో మొత్థం పదమూడు కథలు ఉన్నాయి. ఒకసారి చదవటం మొదలు
పెట్టాక ఒకదాని తరువాత ఒకటిగా మొత్థం కథలు చదవటం పూర్తయ్యే వరకు పుస్తకాన్ని
వదలలేదు. ఒక కథ బాగుంది ఒకటి బాగాలేదు అని లేదు ప్రతి కథలోను అమ్మ కనిపించింది.
"ప్రేమా పిచ్చి ఒకటే" కథ చదువుతుంటే "భద్రకాళి" సినిమా
గుర్తొచ్చింది.అందులో నాయిక జయప్రద భర్తను పసిపిల్లవాడిలా చూసుకుంటుంది.ఆమెకు
ప్రసవం లో పిచ్చి ఎక్కుతుంది.తల్లి ప్రొధ్బలం తో ఆమె కు విడాకులిచ్చి ఇంకో పెళ్ళి
చేసుకుంటాడు భర్త.కొన్ని సంవత్సరాల తరువాత జయప్రద కు పిచ్చి తగ్గి జరిగింది
తెలుసుకొని, ఒకవేళ నా భర్త కే ఇలా జరుగుతే నేను ఆయనకు
విడాకులిచ్చేదాని నా అని తల్లిని అడుగుతుంది.ఆ సినిమా నా మనసులో అట్లా
నిలిచిపోయింది.ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా బాధగా ఉంటుంది.ఆ సినిమా చూసిన
సంవత్సరానికేమో అనుకుంటా నాకు మా అమ్మాయి పుట్టింది.డెలివరీ ముందు నుంచి నాకూ
అట్లా జరుగుతందేమో అని ఎంత భయపడిపోయానో! అసలు అప్పుడు ఎందుకు అట్లా పిచ్చి
ఎక్కుతుంది అని తెగ ఆలోచించేదానిని.ఈ కథ చదువుతుంటే అదంతా గుర్తొచ్చింది.ఇందులో
నాయిక (అనొచ్చా?) వినీత కు డెలివరీ లో ఇలాగే పిచ్చి
ఎక్కుతుంది. తల్లీతండ్రి వినీత ను డాక్టర్ కు చూపించి ట్రీట్మెంట్
ఇప్పిస్తుంటారు.ముందు పిచ్చి కోడలును ఇంటికి తీసుకొచ్చేందుకు అత్తగారు
ఒప్పుకోకపోయినా కొడుకు ,భర్త నచ్చచెప్పటం తో ఒప్పుకుంటుంది.
ఆ జబ్బును "పోస్ట్ పార్టం డిసార్టర్" అంటారని ,కుటుంబసబ్యుల
సహకారం తనకు ఉండాలని డాక్టర్ చెపుతాడు.అది చదవగానే అప్పటి ఆ డైరెక్టర్ కు ఈ సంగతి
తెలీదేమో అట్లా ముగింపు ఇచ్చాడు. ఇప్పుడు లక్ష్మిగారు ఇలా చక్కటి ముగింపు నిచ్చారు
అనుకున్నాను.
ఇలా ప్రతి కథా సున్నితంగా ఉనంది.దేనికదే
ప్రత్యేకం గా ఉంది.చాలా చిన్న చిన్న సమస్యల గురించి నిజమే కదా మనమెప్పుడూ ఇలా
అనుకోలేదే అనుకునేట్లుగా మలిచారు.చదవగానే మంచి ఫీలింగ్ కలిగింది. చివరగా
"ఎప్పుడొస్తున్నావమ్మా ?" కవిత చదవగానే అమ్మ
గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.అమ్మలందరూ తమను తాము ఈ కథలల్లో చూసుకుంటారేమో!
ఈ పుస్తకము నిన్ననే మొదలైన పుస్తక ప్రదర్శన లో
నవోదయ బుక్ షాప్ నంబర్ 232 నుంచి 238 లో దొరుకుతుంది.ధర ఎక్కువేమీ కాదు 100 రూపాయలే.కొని
నేను చెప్పని మిగితా 12 కథలను కూడా చదివండి.
Tuesday, May 22, 2012
డిటెక్టివ్ యుంగంధర్ అమ్మో మహా ఆక్టివ్
కికికి అని స్కూల్ కొచ్చినప్పటి నుంచి తెగ నవ్వేస్తోంది మా ఫ్రెండ్ స్వప్న . లీజర్ దొరికి నప్పుడు " ఎందుకబ్బా అంత నవ్వుతున్నావు ?" అని అడిగా .
" అది కాదబ్బా , ఈ రోజు మా చిన్నాన్నని మా తాత చెవి పట్టుకున్నాడు . మా నాన్నగారేమో , చదువూ సంద్యా లేకుండా ఆ పిచ్చి పుస్తకాలు చదువుతావురా అని తిట్టారు . "
" ఎందుకబ్బా ? ఏమిటా పిచ్చి పుస్తకాలు ?"
" అవేనే , కాలకూట పాన్ షాప్ లో కట్టి వుంటయ్ చూడు . అవి డిటెక్టివ్ పుస్తకాలంట . చదవకూడదట . మా చిన్నాన్న క్లాస్ పుస్తకం లో పెట్టుకొని చదువుతున్నాడు . మా నాన్నగారు చూసారు . "
ఓహో రోజూ ఇంటికి వెళ్ళేటప్పుడు హనమకొండ చౌరస్తాలో కాలకూట పాన్ షాప్ దగ్గర ఆ పుస్తకాలు తాడు కు కట్టి వుంటాయి చిన్న చిన్న పుస్తకాలు అవి చూస్తునే వుంటాను . అవి ఏమిటో అనుకున్నాను "డిటెక్టివ్ " పుస్తకాలన్నమాట . అవి చదవ కూడదన్నమాట . అవి చదువుతే పెద్దవాళ్ళు కొడతారన్నమాట . ఈ సత్యాలన్నీ మాకు నైంత్ క్లాస్ లో మా ఫ్రెండ్ చిన్నాన్న దెబ్బలు తినటం వల్ల తెలిసాయి . అప్పటి నుంచి కాలకూట పాన్ షాప్ (' కాలకూట 'ఏమిటా ? ఆ పాన్ షాప్ వాడు కలకత్తా పాన్ షాప్ కు 'కే ఏ' దగ్గర 'కే యూ అని రాసుకున్నాడు . వాడీ కీ ఇంగ్లీష్ అంతంత మాత్రమే వచ్చో ఏమో :)) ముందు నుంచి వెళుతున్నప్పుడల్లా ఆ పుస్తకాలను ఆసక్తిగా గమనించే వాళ్ళము .
ఆర్కే లైబ్రరీ లో చేరినప్పుడు ఓ పక్కగా డిటెక్టివ్ బుక్స్ అన్నీ పెట్టి వుండేవి . వాటిని దొంగ చూపులు చూసేదానిని కాని తీసుకొని చదివే ధైర్యం ఎప్పుడూ చేయలేదు , ఎందుకంటే అవి చదువుతే పెద్దవాళ్ళు కొడతారని మనసులో భయం వల్ల . కాని అప్పటికి నేనూ పెద్దదానినే అన్న సంగతి గుర్తులేదు :) ఆ మద్య కౌముది లో నంబర్ 888 కొమ్మూరి సాంబశివరావు నవల సీరియల్ గా రావటం చూసి, చదవాలనిపించి ఎందుకైనా మంచిదని మావారి తో , ఏమండీ నేను డిటెక్టివ్ నవల చదువుదామనుకుంటున్నాను చదవనా అని అడిగాను . ఆయన నా వైపు విచిత్రం గా చూసి చదువూ నన్నెందుకడుగుతున్నావు ? నీ ఇష్టం ఏమైనా చదువు అన్నారు :) అంతే ఆ సీరియలైపోయేదాకా మహా ఇంటెరెస్టింగా చదివాను . అంతే ' డిటెక్టివ్ యుగంధర్ ' కు ఫానయ్యాను . వెంటనే ఆర్కే లైబ్రరీ కి వెళ్ళి కొమ్మూరి సాంబశివ రావు డిటెక్టివ్స్ కావాలి అని అడుగుతే రషీద్ ' అయ్యో సారీ మేడం ఈ మద్యనే ఎవరూ చదవటం లేదని అన్నీ తీసేసాను " అని చావు కబురు చల్లాగా చెప్పాడు . ఎవరెవరికిచ్చాడో కూడా గుర్తులేదట . హూం . . . ఆ తరువాత ఎంత వెతికానో ! కోటీ వెళ్ళి సెకండ్ హాండ్ బుక్ షాప్స్ లలో కూడా వెతికాను .ఎవరి దగ్గర పుస్తకాలు వుంటాయని అనుమానం వుందో వారందరినీ అడిగాను . మా జయ ఎక్కువగా బుక్స్ షాప్స్ కు వెళుతూ వుంటుందని తననీ ఆ పని మీదే పెట్టాను . ఇప్పుడు నాకూ ఆ బుక్స్ చదవాలని పిచ్చి ఎక్కించావు . ఎక్కడా అవి దొరకటం లేదు అని అంటూవుంటుంది . చివరకు ఇదో మల్లాది వెంకట కృష్ణమూర్తి , కొమ్మురి సాంబశివరావు నవల " ప్రాక్టికల్ జోకర్ " ఆధారం గా రాసిన నవల కొని తెచ్చింది . జనవరి లో కౌముది లో కొమ్మూరి సాంబశివరావు నవల "చీకటి కి వేయి కళ్ళు " మొదలైంది . ఇది చదువుతున్నాను కాని ఎంతైనా ఆ పసుపు రంగు కాగితాలు , రంగు రంగుల అట్టలు వున్న చిన్ని చిన్ని పుస్తకాలు చదవాలి అన్న కోరిక మాత్రం తీరే దారి కనిపించటం లేదు . ఇట్స్ టూ లేట్ :(
కొమ్మూరి శైలి ఎంతో సరళం గా సులభం గా వుటుంది . పుస్తకం చదవటం మొదలు పెడితే మధ్యలో ఆపటం కష్టం .ముందు ఏమి జరుగు తుందా అనే ఉత్కంట తో సాగుతుంది . అసలు యుగంధర్ హంతకుడి ని పట్టుకునే దాకా చిత్ర , విచిత్ర మైనా మలుపులతోఎ సాగిపోతుంది . ఇక సీరియల్ గా వస్తుంటే చెప్పేదేముంది , నెక్స్ట్ మంత్ ఎప్పుడొస్తుందా , కౌముది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆరాటమే . తరువాతది చదివే దాకా టెన్షనే :)
కొమ్మూరి సృష్టించిన 'యుగంధర్ ' పాత్ర చాలా విశిష్టమైంది.ఆరడుగుల మూడంగుళాల పొడుగు , బలిష్టమైన శరీరం , విశాలమైన నుదురు ,కోలగా వున్న మొహం ,కండలు తిరిగిన చేతులు ,తీక్షణం గా వున్న కళ్ళు , నల్లని దట్టమైన కనుబొమలతో క్లైంట్స్ కు ధైర్యం కలిగించేలా , శత్రువులకు గుండెలదిరేలా , శత్రువులకు సిమ్హ స్వప్నం లా వుంటాడు యుగంధర్ . ఆయన అసిస్టెంట్ రాజు కూడా ఆయన తెలివితేటలకు ఏమీ తీసిపోడు .దేశం కు శత్రు గూఢాచారు లతో ఏదైనా ఆపద వాటిల్లుతుంది అనుకుంటే ప్రైం మినిస్టర్ , హోం మినిష్టర్ లు ప్రత్యేక అధికారాల తో ఆయనకే కేసును అప్పగిస్తారు .ఏదైనా కేసు చేపడితే తన ధైర్యం తో , తెలివితేటలతో దానిని చేదించి కాని వూరుకోడు యుగంధర్ . అంతటి ప్రతిభాశాలి .
భాస్కరరావు కుటుంబ సభ్యుల మీద రకరకాల ప్రాక్టికల్ జోక్స్ వేసి ఎవరో బాధ పెడుతున్నారు . ఆ బాధలు భరించలేక అతడిని పట్టుకోమని డిటెక్టివ్ యుగంధర్ ను కోరాడు భాస్కరరావు . అతని ని ఎలా పట్టుకుంటారు అన్నదే " ప్రాక్టికల్ జోకర్ " నవల . ఆ ప్రాక్టికల్ జోక్స్ ఏమిటి , యుగంధర్ ఆ ప్రాక్టికల్ జోకర్ ను ఎలా పట్టు కున్నాడు అన్నది ఆ నవల . ఆ కథ నేను చెబితే సస్పెన్స్ ఏముంటుంది ? చదివి తెలుసుకోవలసిందే :)
Thursday, April 5, 2012
ప్రజ్ఞాధురీణ ప్రసూన
ఉరకలు వేసే ఉత్సాహానికి వయసు అడ్డు వస్తుందా ? అంటే రాదనే చెపుతున్నారు "సురుచి " బ్లాగర్ 'జ్ఞానప్రసూన ' గారు . ఆవిడ కు ఖాళీ సమయము ,సమయాన్ని వేస్ట్ చేయటము , తోచక పోవటము అంటే తెలియదు . టీచర్ గా ఉద్యోగ బాధ్యల నుంచి విరమించుకున్న తరువాత , రచనలు చేయటము , వివిధ విషయాల పైన రేడియో లో ప్రసంగించటము , కుట్ట్లు , బొమ్మల తయారీ , అబ్బో ఆవిడ చేయని పని లేదేమో !వారిని "సాయి కల్పం" అనే అసోషియేషన్ వారు ' విశిష్ఠ వ్యాకుల ' పురస్కారం తో సత్కరించారు .
ఇలా ప్రసూన గారి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు . అందుకే ఈనాడు ' వసుంధర ' లో ప్రసూన గారి గురించిన వ్యాసం వచ్చింది .
ప్రస్తుతము ప్రసూన గారు "సిరి " లో పేంటింగ్ ( చిత్రకళ ) ను నేర్చుకుంటున్నారు . ఇప్పటి వరకు 30 క్లాసులకు అటెండ్ అయ్యారట. . పెన్సిల్ స్కెచ్ లు ఎంత బ్రహ్మాండం గా వేసారో చూడండి . మొన్న మార్చ్ 31 నుంచి నుంచి నిన్న 3 వ తారీకు వరకు , సిరి వారు ,' హోటల్ మార్రిట్ట్ ' లో నిర్వహించిన పేంటింగ్ ఎక్షిబిషన్ లో జ్ఞానప్రసూన గారివి రెండు పేంటింగ్స్ ప్రదర్షించారు .
ఆ పేంటింగ్స్ ఇవే ;
నిన్న నేనూ , పి. యస్ .యం . లక్ష్మిగారు , శ్రీలలిత గారు ప్రసూనగారి పేంటింగ్స్ చూసి వచ్చాము . ఇంటి కి రండమ్మా ఇంకా చాలా వున్నాయి చూపిస్తాను అన్నారు . మేము వీలుచూసుకొని ఒక రోజు వారి ఇంటి కి వెళ్ళి మిగితా పేంటింగ్స్ కూడా చూసి రావాలనే అనుకుంటున్నాము . ప్రసూన గారు పెట్టిన బిస్కెట్స్ తిని , వారిని అభినందించి వచ్చాము .
జ్ఞానప్రసునగారి నుంచి నేర్చుకోవలసిన వి ఎన్నో వున్నాయి . జ్ఞానప్రసూన కాదు ప్రజ్ఞా ప్రసూన గారు. ఆవిడ ఉత్సాహం చూస్తునే మనమూ వున్నం ఎందుకు అనుకున్నాం మేము ముగ్గురం :)
జ్ఞాప్రసూన గారు మీరు చిరకాలం ఇలాగే ఉత్సాహం గా ఉండి మాలాంటి వారందరికీ మార్గదర్శం కావాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను . మరో సారి మీకు హృదయపూర్వక అభినందనలండి .
Wednesday, March 28, 2012
శ్రీలలితగారికి అభినందనలు
'శ్రీలలిత' బ్లాగర్ శ్రీలలిత గా పరిచయమైన జి. యస్. లక్ష్మి గారు మంచి రచయిత్రి , కవియిత్రి . ఆవిడ కథలు , నవలలు అడపాదడపా వివిధ పత్రికల లో కనిపిస్తూనే వుంటాయి.ఈ మద్యే విడుదలైన నెట్ మాగజీన్ మాలిక లో జి. యస్ లక్ష్మి గారి కథ "అమ్మగారి కీ దండం పెట్టు" ప్రచురించారు . ఏ టాపిక్ ఇచ్చినా కొద్దిసేపట్లోనే చక్కని కవిత అల్లగలరు .ఆవిడ రచయిత్రే కాదు , బాగా ఎంబ్రాయిడరీ చేస్తారు . మంచి మంచి గ్రీటింగ్ కార్డ్స్ చేస్తారు .చక్కగా మట్లాడుతారు .అసలు కోపమన్నదే తెలియదు . ప్రతి విషయాన్ని పాజిటివ్ కోణం లోనే చూస్తారు . ఇన్ని రోజుల నుండి ఆవిడతో స్నేహితమున్నా ఈ మంచి గుణాలను నేను మటుకు నేర్చుకోలేదు .కాకపోతే ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు , ఇదే శ్రీలలితగారైతే ఏమి చేస్తారు అనుకొని కొంచం కంట్రోల్ మటుకు చేసుకుంటున్నాను :)
ముపై సంవత్సరాల క్రితం అప్ప్డప్పుడే ఆడపిల్లలు చదువుకొని , వుద్యోగాలలో ప్రవేశిస్తూ , సొంత వ్యక్తిత్వం ను పెంచుకునే ప్రయత్నం చేసే రోజులు . కాకపోతే వొకరకంగా అటు వ్యక్తిత్వను కాపాడుకోవటానికి , లొంగిపోవటానికి మద్యలో వుండే సంధికాలం అది అనుకోవచ్చు .అదో ఆ కాలం లోనే అతనికి ఆమె కు వివాహమైంది .తనను భద్రం గా చూసుకుంటాడనే నమ్మకం తో అతని చిటికిన వేలు పట్టుకొని అతని జీవితంలోకి వచ్చింది ఆమె . అతను భద్రం గానే చూసుకున్నాడు కాని ఆమె తన మాటవిన్నప్పుడే ! ఆమె అభిప్రాయలకు , ఆశలకు విలువ ఇవ్వలేదు . చివరకు కూతురి కి నామకరణం కూడా అతని ఇష్టప్రకారమే జరిగింది . అప్పుడే ఆమె మనసు చితికిపోయింది . నిర్లిప్తంగా వుండటం అలవాటు చేసుకుంది .వారిద్దరూ ఇలా ప్రతికూల భావనలతో వుండగానే తల్లీ తండ్రి చనిపోయారు . అక్కలు వాళ్ళ వాళ్ళ కుటుంబాల తో బిజీ ఐపోయారు . తమ పిల్లలిద్దరూ పెద్ద చదువులకొచ్చారు . వాటితో తమ తమ ఇష్టాలన్నీ అడుగున పడిపోయాయి .ఈ గడిచిన కాలం లో పిల్లల దృష్ఠి లో తండ్రి దుర్మార్గుడిగా తల్లి పట్ల సానుభూతి ఏర్పడ్డాయి.కొడుకు గోపాలం ఉద్యోగం లో చేరి అమ్మకు కల్పతరువైనాడు .అమ్మ కోరికలన్నీ తీర్చసాగాడు . ఆమెకు కొడుకే సర్వస్వం అయ్యాడు .ఇప్పుడు భార్య ను ఎంత మంచి చేసుకుందా మనుకున్నా , ఆమెను ఎంతబాగా చూసుకున్నా ఆమె లో ఉదాసీనత చోటుచేసుకుంది . ఆ పరిస్తితులలో ఆమెకు స్ట్రోక్ వచ్చింది .తనను అపురూపంగా చూసుకుంటూ సేవలు చేసిన భర్త గురించి ఆమెలో ఆలోచన మొదలైంది . తను భర్తను చేసిన నిర్లక్యం గుర్తుకు వచ్చి పశ్చాతాపం కలిగింది . పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు
పిల్లలు వారి వారి కుటుంబాలు వారికి వుంటాయి . కడదాకా వుండేది తామిద్దరేకదా ! మళ్ళీ ఒక్కసారి ఈ జీవితం వెనకకి వెడితే ఎంత బాగుండును . అలా జరిగితే ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయను కదా అని భాధ పడుతుంది ఆమె. చివరకు ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకుంటారు .
ఈ కథ ఈ రోజు వచ్చిన "నవ్య" వార పత్రిక లో జి.యస్. లక్ష్మి గారు వ్రాసిన "అతను...ఆమె...కాలం" అనే కథ నవ్య వీక్లీ ఉగాది కథల పోటీలో విశేష బహుమతి పొందిన కథ గా ప్రచురితమైంది .
భార్యా భర్తలన్నాకా పొరపొచ్చాలు రాకుండా వుండవు . ఎన్నో అభిప్రాయ బేధాలుంటాయి . అంత మాత్రాన పది మందిలో ఒకరి నొకరు అవమానపరుచుకోకూడదు. ఇరువురి మద్య అవగాహన వుండాలి అని చక్కగా చెప్పారు రచయిత్రి . వీరిద్దరి మద్య వున్న అభిప్రాయ బేధాలు , సంఘర్షణ , చివరికి పశ్చతాపం బాగా వివరించారు .కథ మొత్తం ఇద్దరి స్వగతం లోనే సాగుతుంది . వారి వారి భావాలు , అందుకు గల కారణాలు చదువుతుంటే నిజమే కదా ఈ పరిస్తితులలో ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తారు అన్నంత సహజం గా రాసారు రచయిత్రి . ఇదులో నాకు చాలా నచ్చింది . ఆమెకు ఆమె పెళ్ళిలో అమ్మమ్మ చెప్పిన ;
"పిల్లా...చూడు...ఇప్పుడుమీరిద్దరూ అంటుగట్టిన మొక్కల్లా ఒకటయ్యేరు . రేపొద్దున తల్లి చెట్టు నుంచి ఈ అంటుని వేరు చేసి పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు . మీ చెట్టు మూడు పువ్వులూ ఆరు కాయలవుతుంది . మీ చెట్టు కొమ్మే ఇంకో చెట్టుకు అంటవుతుంది . వాళ్ళ వేళ్ళు కత్తిరించుకొని వాళ్ళూ విడిగా పెరుగుతారు .
పైతరం వెళ్ళిపోయినా , తరువాతి తరం విడిపోయినా మీ బంధం మాత్రం మీ జీవిత కాలం వుంటుంది . మీరిద్దరూ ఒకరికొకరు . అంతే. మంచైనా , చెడైనా , కష్టమైనా సుఖమైనా మీరిద్దరూ కలిసి అనుభవించాలి . అదే కాపురమంటే ."
ఈ మాటలు అక్షరాల సత్యం . దంపతులు ఎవరైనా తెలుసుకోవలసినవి .
ఈ కథ వెనుక కథ కూడా ఆసక్తికరం గా వుంది . ఓసారి లక్ష్మిగారు ఎవరింటికో ఫంక్షన్ కు వెళ్ళారట . అక్కడ భార్యాభర్తలకి బట్టలు పెట్టాలి అంటే ఇద్దరూ చెరోచోట వున్నారట. ఆయనను పిలవమంటే ఆయనరాడు అని ఆవిడ పెడసరం గా అన్నదిట.ఎందుకు ఆవిడ అలా మాట్లాడింది అనుకొని లక్ష్మిగారు చాలా అలోచించారుట. అప్పుడు ఇలా ఐవుండవచ్చు అన్న ఐడియా వచ్చి వెంటనే ఈ కథ రాసేసారుట . ఎంతైనా చేయితిరిగిన రచయిత్రికదా!అందుకే పెద్దలన్నారు " రవి కాంచని చోటు కవి కాంచును " అని .
శ్రీలలితగారూ ( జి.యస్ . లక్ష్మిగారూ ) మీరిలాగే చాలా గమనించి , మాకు మంచి మంచి కథలు అందివ్వాలని , ఇంకా ఇంకా బహుమతులు అందుకొని మాకు పార్టీలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నానండి . అన్నట్లు లక్ష్మి గారికి ఓసారి ఓ 100 గజాల ప్లాటూ , ఇంకోసారి ఓ బంగారం గొలుసూ బహుమతులుగా వచ్చాయండోయ్ !
Subscribe to:
Posts (Atom)





