Tuesday, May 22, 2012

డిటెక్టివ్ యుంగంధర్ అమ్మో మహా ఆక్టివ్కికికి అని స్కూల్ కొచ్చినప్పటి నుంచి తెగ నవ్వేస్తోంది మా ఫ్రెండ్ స్వప్న . లీజర్ దొరికి నప్పుడు " ఎందుకబ్బా అంత నవ్వుతున్నావు ?" అని అడిగా .
" అది కాదబ్బా , ఈ రోజు మా చిన్నాన్నని మా తాత చెవి పట్టుకున్నాడు . మా నాన్నగారేమో , చదువూ సంద్యా లేకుండా ఆ పిచ్చి పుస్తకాలు చదువుతావురా అని తిట్టారు . "

" ఎందుకబ్బా ? ఏమిటా పిచ్చి పుస్తకాలు ?"

" అవేనే , కాలకూట పాన్ షాప్ లో కట్టి వుంటయ్ చూడు . అవి డిటెక్టివ్ పుస్తకాలంట . చదవకూడదట . మా చిన్నాన్న క్లాస్ పుస్తకం లో పెట్టుకొని చదువుతున్నాడు . మా నాన్నగారు చూసారు . "

ఓహో రోజూ ఇంటికి వెళ్ళేటప్పుడు హనమకొండ చౌరస్తాలో కాలకూట పాన్ షాప్ దగ్గర ఆ పుస్తకాలు తాడు కు కట్టి వుంటాయి చిన్న చిన్న పుస్తకాలు అవి చూస్తునే వుంటాను . అవి ఏమిటో అనుకున్నాను "డిటెక్టివ్ " పుస్తకాలన్నమాట . అవి చదవ కూడదన్నమాట . అవి చదువుతే పెద్దవాళ్ళు కొడతారన్నమాట . ఈ సత్యాలన్నీ మాకు నైంత్ క్లాస్ లో మా ఫ్రెండ్ చిన్నాన్న దెబ్బలు తినటం వల్ల తెలిసాయి . అప్పటి నుంచి కాలకూట పాన్ షాప్ (' కాలకూట 'ఏమిటా ? ఆ పాన్ షాప్ వాడు కలకత్తా పాన్ షాప్ కు 'కే ఏ' దగ్గర 'కే యూ అని రాసుకున్నాడు . వాడీ కీ ఇంగ్లీష్ అంతంత మాత్రమే వచ్చో ఏమో :)) ముందు నుంచి వెళుతున్నప్పుడల్లా ఆ పుస్తకాలను ఆసక్తిగా గమనించే వాళ్ళము .

ఆర్కే లైబ్రరీ లో చేరినప్పుడు ఓ పక్కగా డిటెక్టివ్ బుక్స్ అన్నీ పెట్టి వుండేవి . వాటిని దొంగ చూపులు చూసేదానిని కాని తీసుకొని చదివే ధైర్యం ఎప్పుడూ చేయలేదు , ఎందుకంటే అవి చదువుతే పెద్దవాళ్ళు కొడతారని మనసులో భయం వల్ల . కాని అప్పటికి నేనూ పెద్దదానినే అన్న సంగతి గుర్తులేదు :) ఆ మద్య కౌముది లో నంబర్ 888 కొమ్మూరి సాంబశివరావు నవల సీరియల్ గా రావటం చూసి, చదవాలనిపించి ఎందుకైనా మంచిదని మావారి తో , ఏమండీ నేను డిటెక్టివ్ నవల చదువుదామనుకుంటున్నాను చదవనా అని అడిగాను . ఆయన నా వైపు విచిత్రం గా చూసి చదువూ నన్నెందుకడుగుతున్నావు ? నీ ఇష్టం ఏమైనా చదువు అన్నారు :) అంతే ఆ సీరియలైపోయేదాకా మహా ఇంటెరెస్టింగా చదివాను . అంతే ' డిటెక్టివ్ యుగంధర్ ' కు ఫానయ్యాను . వెంటనే ఆర్కే లైబ్రరీ కి వెళ్ళి కొమ్మూరి సాంబశివ రావు డిటెక్టివ్స్ కావాలి అని అడుగుతే రషీద్ ' అయ్యో సారీ మేడం ఈ మద్యనే ఎవరూ చదవటం లేదని అన్నీ తీసేసాను " అని చావు కబురు చల్లాగా చెప్పాడు . ఎవరెవరికిచ్చాడో కూడా గుర్తులేదట . హూం . . . ఆ తరువాత ఎంత వెతికానో ! కోటీ వెళ్ళి సెకండ్ హాండ్ బుక్ షాప్స్ లలో కూడా వెతికాను .ఎవరి దగ్గర పుస్తకాలు వుంటాయని అనుమానం వుందో వారందరినీ అడిగాను . మా జయ ఎక్కువగా బుక్స్ షాప్స్ కు వెళుతూ వుంటుందని తననీ ఆ పని మీదే పెట్టాను . ఇప్పుడు నాకూ ఆ బుక్స్ చదవాలని పిచ్చి ఎక్కించావు . ఎక్కడా అవి దొరకటం లేదు అని అంటూవుంటుంది . చివరకు ఇదో మల్లాది వెంకట కృష్ణమూర్తి , కొమ్మురి సాంబశివరావు నవల " ప్రాక్టికల్ జోకర్ " ఆధారం గా రాసిన నవల కొని తెచ్చింది . జనవరి లో కౌముది లో కొమ్మూరి సాంబశివరావు నవల "చీకటి కి వేయి కళ్ళు " మొదలైంది . ఇది చదువుతున్నాను కాని ఎంతైనా ఆ పసుపు రంగు కాగితాలు , రంగు రంగుల అట్టలు వున్న చిన్ని చిన్ని పుస్తకాలు చదవాలి అన్న కోరిక మాత్రం తీరే దారి కనిపించటం లేదు . ఇట్స్ టూ లేట్ :(

కొమ్మూరి శైలి ఎంతో సరళం గా సులభం గా వుటుంది . పుస్తకం చదవటం మొదలు పెడితే మధ్యలో ఆపటం కష్టం .ముందు ఏమి జరుగు తుందా అనే ఉత్కంట తో సాగుతుంది . అసలు యుగంధర్ హంతకుడి ని పట్టుకునే దాకా చిత్ర , విచిత్ర మైనా మలుపులతోఎ సాగిపోతుంది . ఇక సీరియల్ గా వస్తుంటే చెప్పేదేముంది , నెక్స్ట్ మంత్ ఎప్పుడొస్తుందా , కౌముది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆరాటమే . తరువాతది చదివే దాకా టెన్షనే :)

కొమ్మూరి సృష్టించిన 'యుగంధర్ ' పాత్ర చాలా విశిష్టమైంది.ఆరడుగుల మూడంగుళాల పొడుగు , బలిష్టమైన శరీరం , విశాలమైన నుదురు ,కోలగా వున్న మొహం ,కండలు తిరిగిన చేతులు ,తీక్షణం గా వున్న కళ్ళు , నల్లని దట్టమైన కనుబొమలతో క్లైంట్స్ కు ధైర్యం కలిగించేలా , శత్రువులకు గుండెలదిరేలా , శత్రువులకు సిమ్హ స్వప్నం లా వుంటాడు యుగంధర్ . ఆయన అసిస్టెంట్ రాజు కూడా ఆయన తెలివితేటలకు ఏమీ తీసిపోడు .దేశం కు శత్రు గూఢాచారు లతో ఏదైనా ఆపద వాటిల్లుతుంది అనుకుంటే ప్రైం మినిస్టర్ , హోం మినిష్టర్ లు ప్రత్యేక అధికారాల తో ఆయనకే కేసును అప్పగిస్తారు .ఏదైనా కేసు చేపడితే తన ధైర్యం తో , తెలివితేటలతో దానిని చేదించి కాని వూరుకోడు యుగంధర్ . అంతటి ప్రతిభాశాలి .

భాస్కరరావు కుటుంబ సభ్యుల మీద రకరకాల ప్రాక్టికల్ జోక్స్ వేసి ఎవరో బాధ పెడుతున్నారు . ఆ బాధలు భరించలేక అతడిని పట్టుకోమని డిటెక్టివ్ యుగంధర్ ను కోరాడు భాస్కరరావు . అతని ని ఎలా పట్టుకుంటారు అన్నదే " ప్రాక్టికల్ జోకర్ " నవల . ఆ ప్రాక్టికల్ జోక్స్ ఏమిటి , యుగంధర్ ఆ ప్రాక్టికల్ జోకర్ ను ఎలా పట్టు కున్నాడు అన్నది ఆ నవల . ఆ కథ నేను చెబితే సస్పెన్స్ ఏముంటుంది ? చదివి తెలుసుకోవలసిందే :)

15 comments:

రాజి said...

"కాలకూట పాన్ షాప్","డిటెక్టివ్ " పుస్తకాల
విశేషాలు బాగున్నాయండీ :)

" ప్రాక్టికల్ జోకర్ " మీరు చదవమన్నారు కదా తప్పకుండా చదవాలని నిర్ణయించుకున్నాను :)

karthik said...

మీరు చెప్పిన విశేషాలు బాగున్నాయండీ.. నాకు ఈ డిటెక్టివ్స్ చదవడం అనేది వంశపారంపర్యంగా అబ్బిన జబ్బు. షాడో, బుల్లేట్, యుగంధర్ ఏవైనా వదిలిపెట్టను. మీరు యుగంధర్ ఫ్యాన్ అయ్యారు కాబట్టి అర్జంటుగా "చావు తప్పితే చాలు" చదవండి.
1963లో అలాంటి పుస్తకం వచ్చిందంటే నమ్మలేకపోయానండీ.. It is atleast 30yrs ahead of its time.కౌముది లైబ్రరీలో దొరుకుతుంది.
మల్లాది గారు రాసిన ప్రాక్టికల్ జోకర్ కూడా నేను చదివాను కానీ సాంబశివరావు గారు రాసింది దీనికంటే ఇంకా బాగుంటుంది.

నా దగ్గర ఇంకా కొన్ని డిటెక్టివ్స్ పీడీయెఫ్ లు ఉన్నాయి.. కావాలంటే మీకు పంపిస్తాను.

-కార్తీక్

Srikanth M said...

ఈ డిటెక్టివ్ నవలలంటే నాకు పిచ్చండి. అసలు మా ఇంట్లో నన్ను ఆ పుస్తకాలు చదువుతుండగా ఇప్పుడు చూసిన తిడుతుంది మా అమ్మ. షాడో, బుల్లెట్, కిల్లర్, కిల్ మాష్టర్ లాంటి స్పైలు, యుగంధర్, నర్సన్ లాంటి డిటెక్టివులు .. నాకు తెగ నచ్చేశారు. ఒక వేల ఆ పుస్తకాలు దొరికే ప్లేసు తెలిస్తే మాత్రం.. మాతో కూడా షేర్ చేసుకోవడం మరువకండి.. :-)

Anonymous said...

టీన్..టీన్..ట......టీన్..టీన్..ట...........టీన్..టీన్..ట......టీన్..టీన్..ట...........టడటటోయ్....బాండ్ 007 :))టీన్..టీన్..ట......టీన్..టీన్..ట...........టీన్..టీన్..ట......టీన్..టీన్..ట...........టడటటోయ్....బాండ్ 007 :))

Happy reading -Bond James Bond

C.ఉమాదేవి said...

చక్కగా రాసారు మాలాగారు.

మాలా కుమార్ said...

రాజీ ,
ఫరె చేంజ్ అప్పుడప్పుడూ ఇలాంటి పుస్తకాలు కూడా చదువుతూ వుండాలి :)
థాంక్ యు .

$ కార్తీక్ ,

చాలా గుడ్ బాయ్ వి . కౌముది లో నాకా పుస్తకం కనపడలేదు :) మీ దగ్గరున్న పిడియఫ్ లు మీకు వీలైంత త్వరగా పంపండి నా ఐడి తెలుసుకదా . థాంక్ యు వెరీ మచ్ .

మాలా కుమార్ said...

శ్రీకాంత్ గారు ,
మా అమ్మ కు తెలిస్తే ఈ పిచ్చి పుస్తకాలు చదువుతున్నావా అని తిడుతుంది . అందుకే నేను మా అమ్మను పర్మిషన్ అడగలేదు :)
మీరు చెప్పిన డిటెక్టివ్స్ లలో యుగంధర్ , షాడో తప్ప నాకింకెవరూ తెలీదు . షాడో వి స్వాతి వీక్లీ లో సీరియల్ గా వచ్చినప్పుడు చదివాను కాని నాకంత నచ్చలేదు . మధుబాబు బుక్స్ విశాలాంద్ర వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు . ఇదో ఇప్పుడు కార్తీక్ కొన్ని పిడియఫ్ లు ఇస్తానన్నారు కదా ఎవరివి ఇస్తాడో చూడాలి . థాంక్ యు ఫర్ ద కామెంట్ .

$ అనోనమస్ గారు ,

థాంక్ యు :)

మాలా కుమార్ said...

ఉమాదేవి గారు ,
థాంక్స్ అండి .

SHANKAR.S said...

మాలాకుమార్ గారూ ఈ సైట్ లో చూడండి. బోలెడన్ని పుస్తకాలున్నాయి

http://abhara-telugu.blogspot.in/

karthik said...

>>చాలా గుడ్ బాయ్ వి .

హిహిహి చిన్నప్పటి నుంచీ అలా ఉండటం అలవాటైపోయింది. :P

koumudi link:
http://koumudi.net/books/koumudi_novel_chavutappite_chalu.pdf

dnt miss it!!

మిగిలినవి పంపిస్తాను వీకెండ్ దాకా వెయిట్ చేయండి.

జలతారువెన్నెల said...

మీ టపా చదువుతుంటే నాకు 10th class లో చదువుకునే పుస్తకాలలో చిన్న చిన్న బూక్స్ వచ్చేవి చూడండి (రాకుమారుడు, రాక్షషుడు, రాకుమారి కథలు.. pockets బూక్స్ లా ఉండేవి..) అవి గుర్తుకొచ్చాయి. బాగుందండి మీ టపా.. అంతర్లీనం గా ఇలాంటి పుస్తకాలు చదవకూడదు అని బలం గా మీలో నాటుకుపోవడం, చదవచ్చో లేదో అనుకుంటూ, మీ శ్రీ వారిని అడగటం తలచుకుంటే నవ్వు వచ్చినా.. అలాగే ఫీల్ అవుతాము కదా అనిపించింది...

మాలా కుమార్ said...

జలతారు వెన్నెల గారు ,
ముందు చదవటానికి భయం వేసింది . మావారు తిడతారేమో అనుకున్నానే కాని ఎందుకు తిడతారు అనుకోలేదండి:)గుర్తొస్తే నాకూ నవ్వొస్తుందండి :) మీ వాఖ్యకు థాంక్స్ అండి .

Ravi bobbili said...

కార్తీక్ గారూ నమస్తే...
నా పేరు రవి. మాది పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట.
నాకు డిటెక్టివ్ నవలలంటే చాలా ఇష్టం.
మీకు వీలయితే నా మెయిల్ మరియు వాట్సాప్ నెంబరు ఇస్తాను.
దయచేసి మల్లాది వెంకట కృష్ణమూర్తి, కొమ్మూరి సాంబశివరావు మొదలైన రచయితల నవలలు పంపించగలరు.ధన్యవాదాలు.
ravibobbili9@gmail.com
Cell: 9705 719 719
కుదిరితే మీ ఫోన్ నెంబరు ఇవ్వండి ఫోన్ చేస్తాను.

మాలా కుమార్ said...

రవిగారు, ఇప్పుడు కొమ్మూరి వి , మల్లాది వి అన్ని నవలలు ఎంస్చొ లొ కాని ఏదైనా బుక్ షాప్ లల్లో కాని దొరుకుతాయండి. ఇప్పుడు బుక్ ఎగ్జిబిషన్ లో బుక్ స్టాల్ స్ లల్లో కూడా దొరుకుతాయి.నాకు పంపిచటము కుదరదండి.

koumudi link:
http://koumudi.net/books/koumudi_novel_chavutappite_chalu.pdf

http://abhara-telugu.blogspot.in/Unknown said...

కార్తిక్ గారు..!
నేను కూడా ఈ మధ్యనే కొమ్మూరి గారి యుగంధర్ నవలలు చదవడం ఆరంబించాను.
చాలా నచ్చాయి.
మీకు వీలైతే మీ దగ్గర ఉన్న PDF నవలలు 9441425177 నంబర్ కి వాట్సప్ చెయ్యండి ప్లీజ్