Saturday, June 19, 2010

బ్లాగ్ అంతర్జాలం లో అబ్బాయిల హవా

మహిళా బ్లాగర్ ల గురించి రాసేటప్పుడు టైటిల్ కోసం ఆలోచిస్తుంటే , బ్లాగ్ అంతర్జాలం లో అతివలు అనే టైటిల్ తో పాటు చక్ మని బ్లాగ్ అంతర్ జాలం లో అబ్బాయిల హవా అనే టైటిల్ కూడా మెరుపులా మెరిసింది . హరే ఈ టైటిల్ కూడా బాగుందే , అబ్బాయిల బ్లాగ్స్ గురించికూడా రాస్తే పోలా అనుకున్నాను . ఏదైనా మొదలుపెడితేనే గాని తెలీదు కదా ! అమ్మాయిల బ్లాగులు లింక్స్ వెతుకుతూ రాసుకుంటేనే కాని తెలీలేదు ఎంత కష్టపడాలో . అంత భూతద్దం పెట్టి గాలించినా ఇప్పటికీ అప్పుడప్పుడు నేను లింక్స్ ఇవ్వని బ్లాగ్స్ ఒకటో అరో కనిపిస్తూనే వున్నాయి . ఓ వంద బ్లాగులే కనిపెట్టలేకపోతున్నాను , బోలెడు వున్న అబ్బాయిల బ్లాగులకు ఏమి న్యాయం చేయగలను అని అనుకుంటూ వుండగా , బ్లాగ్ సోదరి గారు ఆ బృహత్కార్యాన్ని భుజాన వేసుకున్నారు . హమ్మయ్య అనుకున్నాను , అక్కడికి నన్నెవరో రాయమని అడిగినట్లు . ఐనా అదేమిటో ఈమద్య , ఏదైనా ఓపనీ చేద్దామని ఉత్సాహ పడటము , ఆ పని తప్పగానే అమ్మయ్య అనుకోవటము ఓ అలవాటుగా మారింది . అమ్మయ్య అనుకుంత సేపు పట్టలేదు , ఈ టైటిల్ ను ఏమిచేయాలా అని మధనపడటానికి ! సరే ఏమైతే అది అయ్యిందనుకొని , ఆ టైటిల్ ను బాధపెట్టకూడదనుకొని , ఇదో ఇలా , ఈ ఫాదర్స్ డే రోజున నేను చదివే బ్లాగుల గురించి రాద్దామని డిసైడ్ ఐపోయాను .

నేను ముందుగా ధన్యవాదాలు తెలుపు కోవలసింది కొత్తపాళి గారికి . ఆయన పోస్ట్ కు నేను ఇంగ్లీష్ లో కామెంట్ రాస్తే , మాలా అని హెడ్మాస్టర్ లా బెత్తం చూపించి , తెలుగు లో ఎలా రాయాలో , లేఖిని ని పరిచయము చేయక పోతే , బహుషా , తప్పుల తడక తెలుగు రాయలేక బ్లాగ్ వ్రాయటము మానుకునేదానిని . హెడ్మాస్టర్ గారూ , మీకు చాలా , చాలా ధన్యవాదాలండి .

నేను నా బ్లాగ్ ను కూడలి లో చేర్చిన కొత్తల్లో , జరిగిన బ్లాగర్స్ మీటింగ్ కు , కృష్ణకాంత్ పార్క్ కు వెళ్ళాను . మీటింగ్ ఎక్కడ జరుగుతోందో తెలీలేదు . అంతా వెతుకుతూ వుండగా , కూడలి అని రాసివున్న షర్ట్ వేసుకున్న ఓ అబ్బాయి కనిపించాడు . బహుషా మీటింగ్ కే వచ్చాడేమోనని వూహిస్తూ , అతని దగ్గరగా వెళ్ళాను . సెల్ లో బిజీ గా మాట్లాడుతున్న అతను , మాట్లాడటము ఆపి , ఏమిటి మేడం అని మర్యాదగా అడిగాడు . అలా కమల్ చక్రవర్తి నాకు మొదటగా పరిచయం ఐన బ్లాగర్ . కనిపించిన ప్రతిసారి , మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తాడు . నేనేమో ఇల్లు వెతుక్కోలేను , మావారికి తీరికైనఫ్ఫుడు వస్తాను , మీరు , స్వాతి మా ఇంటికి రండి అని నేను ఆహ్వానిస్తాను .

ఆ మీటింగ్ లోనే పరిచయం అయ్యారు , సి.బి రావు గారు . వారి దీప్తిధార అంతకు ముందే , దీప్తిధార పేరు బాగుందే అని ఆ బ్లాగ్ చూసాను .

ఈ మీటింగ్ లోనే వీవెన్ గారు పరిచయం అయ్యారు . మీ కూడలి , లేఖిని చాలా బాగున్నాయండి అంటే చాలా మొహమాటపడ్డారు .

అలా అంటే ఎలా మాస్టారూ అని సాహితి లో పలకరించారు నూతక్కి గారు . సర్ మీరేం చేస్తుంటారు అని అడిగారు సురేష్ చాట్ లో ( సురేష్ బ్లాగ్ ఏదో తెలీలేదు ) . అది మీ పొరపాటు కాదండి , ఏం చేయను ? మావారి పేరు లేకుండా నన్ను రానీయలేదు గూగులమ్మ . కొంగుకు ముడేసుకున్నాక తప్పదు కదా !

లీలామోహనం లో చిలమకూరు విజయ మోహన్ గారు వేసే పేంటింగ్స్ ను చూస్తుంటే , నా పేంటింగ్స్ కూడా బ్లాగ్ లో పెట్టుకోవాలని , మళ్ళీ పేంటిగ్స్ వేయటము మొదలు పెట్టాలని అనిపిస్తుంది .

నాకున్న భయాల పోగొట్టుకునేందుకు మంచి సలహాలు ఇచ్చారు , సత్యనారాయణ శర్మగారు ఆలోచనాతరంగాలు లో . కాక పోతే అవి పాటించాలన్నా భయమే !

మా పిల్లలతో ఆడుకోవటానికి వచ్చేఅల్లరి బుడుగు లా అనిపిస్తాడు ఏటిగట్టు శేఖర్ పెదగోపు . మీ పక్కింటికి వస్తామనే మాటకు ఇప్పటికీ ఓకేనే అబ్బాయ్ , కాకపోతే ఓ కండీషన్ , నా లాప్టాప్ గొడవ చేసినప్పుడల్లా కాస్త చూసిపెటాలి , అంతే ! ( ఎక్కడ జిడ్డులా పట్టుకుందిరా బాబూ - శేఖర్ స్వగతం )

శిరాకదంబం లో చాలా విశేషాలున్నా నేను మాత్రం పాత సినిమా విశేషాల ను చాలా ఆసక్తిగా చూస్తాను .

మురళిగారు చెప్పే చిన్ననాటి విశేషాలు మా పిల్లల కబుర్ల లాగే వుంటాయి . పుస్తకాల పరిచయము చదువుతుంటే అప్పటి కప్పుడే ఆ పుస్తకం తెచ్చుకొని చదివేయాలని పిస్తుంది . ఏమైందో ఈమధ్య కనబటము లేదు . బహుషా సెలవల్లో వున్నట్లున్నారు .

అదేమిటో వేణు శ్రీకాంత్ ను , నేస్తం గారి లా నేనూ ఓ వాలుజడ అమ్మాయి పక్కన వూహించుకున్నాను . పాపం ఇంకా పెళ్ళే కాలేదుట . శీఘ్రమేవ వాలుజడ అమ్మాయి ప్రాప్తిరస్తు !

ఇంటావిడ మీద ఇంటాయన , ఇంటాయన మీద ఇంటావిడ బోలెడు పితూరీలు . అయ్యో మధ్యలో మనమేమీ మాట్లాడకూడదండి , పణిబాబు గారి బాతాఖాని వింటూ నవ్వుకోవాలి అంతే ! నన్ను పూణే వచ్చి మా స్మృతులను గుర్తు తెచ్చుకోమని ఆహ్వానించారండోయ్ , అక్కడికీనూ మావారికి తీరినప్పుడే , ఆ రోజెప్పుడో మరి .

కళగా కనిపించే వెకటేశ్వరస్వామి ని చూడగానే , సహజం గానే పూజలు , వ్రతాలు అంటే ఆసక్తి వున్న నేను హరిసేవను దర్షించుకున్నాను . అక్కడ చేసే పూజలంటే చాలా అసక్తి . ముఖ్యంగా గులాబిరంగు తామర పూల తో ఆ జగన్మాతను కొలవటము చాలా నచ్చింది . మావారికి తీరినప్పుడోసారి వెళ్ళి తప్పక ఆపూజ చేసుకొని రావాలనే వున్నది .

సృజన ద్వారా గీతాచార్య పరిచయం అయ్యారు . ఆయన వింబుల్డన్ విలేజ్ మావారు కూడా చదువుతారు . మోటర్ సైకిల్ మీద బుర్ బుర్ మంటూ తిరుగుతూ ఎప్పుడూ సత్యాన్వేషణ నేనా ? మాకు పార్టీ ఇచ్చేదెప్పుడబ్బాయ్ ?

నవ్వులాటకెళుతే హాయిగా కాసిని జోక్స్ విని , నవ్వుకొని రావచ్చు .

చిత్ర విచిత్రమైన కుఠోలు చిత్రం భళారే విచిత్రం లో . ఏమిటో ఈ అబ్బాయి ఊహలు భలే విచిత్రం గా వుంటాయి .

ఎన్ని సార్లు పడతావయ్యా బాబు . త్వరగా లేచి నిలబడు , ఇవి మా గౌరవ్ మాటలు . హాస్యాంజలి లో అబ్బాయి పడి
పోతూ లేవటానీకి చేసే ప్రయత్నం మా వాడికి మహా ఇష్టం .

గుండె లోతుల్లోనుంచి ప్రవహించే - - - అంతర్వాహిని . ఈ టైటిల్ చూడగానే ఈ రవిచంద్ర ఎంత పెద్దవాడో అనుకున్నాను . అబ్బే ఏం కాదు చాలా చిన్నవాడే .

సన్నీ బన్నీ బ్లాగ్ లో అన్ని భలే ఫొటో వుంటాయి .

లేలేత నీలి రంగు ఆకాశంలో విహరించినట్లుగా ఆహ్లాదంగా వుంటుంది క్రియేటివ్ కిరణ్ తేజ బ్లాగ్ .

చాలా చిన్నవాడీ బాబు , మాస్టర్ విజయేంద్ర . కాని , కథావిశ్వం లో చిన్న కథలు ఎంతబాగా రాస్తాడో .

అశోక్ నా పాటల బ్లాగ్ కమ్మటికలలు ద్వారా పరిచయం . మొదటిసారిగా ఈ పాటలు ఎలా పెట్టారండీ అని తెగ ఆశ్చర్య పోయాడు . ఎందుకో బ్లాగ్ పేరు ఎప్పుడూ మార్చేస్తూ వుంటాడు . ప్రస్తుతపు పేరు బుజ్జి బ్రమరం .

గీతల తో తెగ నవ్వించే కార్టూన్ లు రేఖా చిత్రం సొంతం .

పూల కుండీలలో వూగే కుర్రాడు , టి వి లో బుడుగు చూడాలంటే ధరణీ బీట్స్ చూడాల్సిందే .

ఒక్కసారైనా బాలానందం ప్రోగ్రాం కు వెళ్ళాలని , అక్కయ్య , అన్నయ్యలను చూడాలని నా చిన్ననాటి కల . కాని తీరనే లేదు . ఆ బాలానందం ప్రోగ్రాం లో రెగ్యులర్గా పాల్గొన్నారట రవిగారు . ఎంత అదృష్టవంతులో !

నేను కమ్మటికలలు బ్లాగ్ మొదలు పెట్టిన కొత్తలో చాలా పాటల గురించి చెప్పారు వినయ్ చక్రవర్తి గోగినేని . అలలు - కలలు లో నాకు నచ్చిన సినిమా వద్దంటేడబ్బు చూసి ఎంత సంతోష పడ్డానో .

నాజీవితం లో సగ భాగం మావారి సెల్ వెతకటానికే ఐపోతోంది అని వాపోతున్న తరుణం లో ఇది చదివాను . ఆహా వోహో అనుకుంటూ మా వారి సెల్ , ఆయన షూ లో ఇక్కడ చెప్పినవిధంగానే ముడి వేసాను . హుం టీ .వి చూస్తూ , ముడి విప్పి విసిరేసిన చార్జర్ దివాన్ కింద , , , కాలి మీద ఏదో పడిందనుకొని ఓ దులుపు దుపుతే ఫుట్ బాల్ లా ఎగిరి బయట ఎక్కడో చెట్లలో పడిన సెల్ ను వెతితెచ్చి ఇచ్చేసరికి . . . . ఆ పైన ఏమిటీ పిచ్చిపనులు అని మావారు తిట్టిన తిట్లకు . . . మంచుపల్లకి గారూ , , , నా కళ్ళ ముందు * * * * *

నేస్తం అభిమానసంఘం ( అక్కడికి మేము ఆ అభిమాన సంఘం లో లేనట్లు ) అని , మంచు పల్లకి వెనకాల హడావిడీగా టుయ్ టుయ్ అని పరుగులు పెడుతూ వచ్చిన ఈ వీరాభిమాని , త్రీజి ఎవరా అనిచూస్తే అక్కడ ఇద్దరు ఇంజనీర్లు గోదావరిగలగలలు వినిపించేందుకు తలలు బద్దలు కొట్టుకుంటు న్నారు .

నేను విశాఖపట్టణం రైల్వే స్టేషన్ లో 1974 లో కందిపొడి కొన్నాను అంటే తెగ ఆచర్యపోయారు రాజేంద్ర కుమార్ దేవర పల్లి . నిజమేనండి . వైజాగ్ ఇప్పుడు మారిపోయిందని వాపోయారు . మీ వైజాగ్ ఏమిటండి , మా హైదరాబాదూ చెట్టుచేమా లేకుండా ఐపోతోంది . ఏం చేయగలం ?

అనంతం లో చరిత్ర గురించి చదువుతుంటే అరే నాకూ ఎప్పుడూ ఇలానే అనిపిస్తుందే అనుకున్నాను . ఉమాశంకరం గారి స్పెసాలిటీ అదే . ఆయన రాసేవన్నీ మన భావాలేనేమో అన్నంత చక్కగా రాస్తారు .

రామా కనవేమిరా అనే బ్లాగ్ లో రాజశేఖరుని శర్మ గారు సనాతన పద్దతుల గురించి వివరిస్తున్నారు . శర్మ గారు మంచి ఫొటో గ్రాఫర్ కూడా . చక్కటి ఫొటోలను కుడా చూడవచ్చు .

మా అబ్బాయి కన్నా కూడా ఐదారేళ్ళు చిన్నవాడు , కార్తీక్ అక్కా అంటే చాలా గమ్మత్తుగా అనిపించింది . ఇటలిలీ లో చదువు కోసం వెళుతున్నానని చెప్పాడు . బుజ్జి తమ్ముడూ అల్ల్ ద బెస్ట్ .


జాన్ హైడ్ కనుమూరి మహిళా దినోత్సవపు టపా నచ్చేసింది . వారే పరిచయం చేస్తున్న ఇంకో బ్లాగ్ నెల నెలా వెన్నెల .


పరుపు చుట్ట చంకన బెట్టుకొని , పోతూ , నేనో చిరు వుద్యోగిని అనే శివచెరువు ను ఎప్పుడు చూసినా తెగ నవ్వొచ్చేస్తుంది . మంచిమనసులు సినిమాలోని ఏమండోయ్ శ్రీవారు పాట గుర్తొస్తుంది . ఐతే వెనకాల సావిత్రి ఏది చెప్మా ?

సుత్తి నా సొత్తు అనగానే ఏం సుత్తో చూద్దామని వెళ్ళాను . అబ్బే సుత్తి ఏం కాదు , చాలా సరదాగా వున్నది .


ఈ మద్య కొత్తగా చూసాను మంచుకురిసే వేళలో . రామకృష్ణ రెడ్డి అట పేరు బాగానే రాస్తున్నాడే అనుకున్నాను . రామ కృష్ణా , నా బ్లాగ్ కొస్తే మటుకు పంపిచేయనులే !


రోజూ కొన్ని బ్లాగ్ స్ చదివి ఓపికుంటే వాఖ్యలు రాయటము అలవాటే కాని ఏవి చదివాను , ఎవరికి వాఖ్యలు రాసానో గుర్తుండదు . ఇప్పుడా బాధ లేదు ఎందుకంటే హారం లో వాఖ్యలలో నా పేరు దగ్గర క్లిక్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు . ఎక్కువగా చదివిన టపాల లో అప్పుడప్పుడు నా పేరు చూసుకొని మురిసి పోవచ్చు . భాస్కర రామి రెడ్డి గారు మీరు చేసిన హారం చాలా బాగుందండి . థాంక్ యు .


ఇవ్వండీ నేను ఎక్కువగా చదివే అబ్బాయిల బ్లాగులు . ఏదో మా వారిని ఉద్దరించటానికి పొద్దున కాసేపు పేపర్ చదువుతానే కాని రాజకీయాల మీద ఇంటరెస్ట్ లేదు . కవితలు ఎక్కవు . చర్చలంటే భయం . ఇష్టమైన సబ్జెక్ట్ హాస్యం . ఏవో సరదా కబుర్లు , కథలు , కాకరకాయలు . ఇలా వడబోసుకొని కొన్నీ , నాకు వాఖ్యలు రాసేవారివి కొన్ని చదువుతానన్నమాట . అంతేకాని మిగితా బ్లాగులు బాగుండవని కాదు . ఇప్పటికే మా వాళ్ళు నువ్వు బ్లాగ్లలోనే బతుకుతున్నావు , ఏవీ పట్టించుకోవటము లేదు అంటున్నారు . కొన్ని నాకిష్టమైన విషయాలున్న బ్లాగ్స్ మిస్ కుడా అవుతున్నానేమో తెలీదు . .అన్ని చదవలేను కదా ! అమ్మాయిలకే భావుకత ఎక్కువ అనుకునేదానిని . అబ్బాయిలంటే డిష్యుం డీష్యుం లు , క్విజ్ లు , వంగ్య రచనలు , ద్వందర్ధాలవి , హాట్ హాట్ డిష్కషన్స్ మాత్రమే రాస్తారు అనుకునే దానిని . కాని ఇక్కడ చాలామటుకు ఇరవై ఏళ్ళలో వున్నవారు , కొత్తగా వుద్యోగాలలో చేరిన అబ్బాయిలు , చక్కటి తెలుగు భాషలో , భావుకత తో రాస్తుంటే నా అభిప్రాయాన్ని మార్చుకోక తప్పలేదు . అసలు ఒక్కక్కరు టెంప్లెట్స్ కూడా ఎంత బాగా డిజైన్ చేసుకున్నారో ! చాలా ముచ్చటగా వుంది .



అబ్బబ్బ ఏమబ్బాయిలో కాని చాలా అల్లరి వాళ్ళు సుమండీ ! అమ్మాయిలు బుద్దిగా చెప్పిన మాట విని కూర్చో బెట్టిన చోట నేను వచ్చేవరకు కూర్చున్నారు . కాని ఈ అబ్బాయిలున్నారు చూసారూ , అందరినీ ఓ దగ్గర చేర్చి భొజనం చేసి వద్దామని వెళ్ళేసరికి ఎటు వాళ్ళటు పారిపోయారు . ఏంచేయాలో తోచక , ఎవరికీ చెప్పకుండా రహస్యం గా రాసి , పోస్ట్ చేద్దామనుకున్నదానిని , జ్యోతిగారికి , జయకు చెప్పుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను . పోనీ మేము వెతికి ఇయ్యమా అన్నారు వాళ్ళు . కళ్ళ నీళ్ళు తుడుచుకొని , వద్దులెండి నేనే వెతుక్కుంటాను అని వాడ వాడ లా వెతికి తెచ్చుకునేసరికి తల ప్రాణం తోక కొచ్చిందంటే మీరు నమ్మితీరాలి !!!!!


అంటే ఏమీ లేదండి . నేనలా వెళ్ళి వచ్చేసరికి మొత్తం డిలీట్ ఐపోయింది !!!!!!!!!!!!
మా గౌరవ్ లా , ముక్కు తుడుచుకుంటూ , అరచేయి వెనకకి , భుజానికి , కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ మొత్తం రాసానన్నమాట .
అంచేత ఏవైనా తప్పులున్న మన్నించండి .

30 comments:

పరుచూరి వంశీ కృష్ణ . said...

ఎంత మాట ...సుత్తి లేదా ? నా బ్లాగ్ లో.... ఇది సుత్తి గారికి అవమానం :-) ......చాలా చాలా థాంక్స్ అండి నా బ్లాగ్ చదివినందుకు

Padmarpita said...

పోస్ట్ అబ్బాయిలమీదే అయినా వ్యాఖ్య పెట్టింది మాత్రం అమ్మాయేనండి:) బాగు బాగు!!

భాస్కర రామిరెడ్డి said...

మాలా కుమార్ గారు, హారం ను దానితో పాటు నా బ్లాగును పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

Anonymous said...

ప్రవీణ శర్మ/ చెరసాల శర్మ బ్లాగ్ లేని ఈ పోస్ట్ ను మేము బహిష్కరిస్తున్నాము.

Unknown said...

మాలా కుమార్ గారు,
" ఇవండీ నేను ఎక్కువగా చదివే అబ్బాయిల బ్లాగులు "....అంటూ ( వాటిలో నాబ్లాగు గురించీ ) వ్రాసారు.
మీరు ఎక్కువగా చూసే బ్లాగుల్లో నా బ్లాగూ వుందని తెలిసి బోలెడు ఆనందపడిపోయాను...థాంక్సండీ!

Unknown said...

మాలాకుమార్ గారు మీరు చదివే బ్లాగ్ మాలిక లో
నాది కూడా కలిపినందుకు ధన్యవాదాలు .
నేను బాలానందం,యువవాణి, దూరదర్శన్ లో
పాల్గొన్న దానికన్నా బ్లాగ్ లో రాసుకోవడమే అదృష్టం గా భావిస్తా
సో మీరు అదృష్ట వంతులే మీ భావాలూ పంచుకోడానికి ఇంతమంది వున్నాము గా .

పరిమళం said...

అయ్ బాబోయ్ ......మాలాగారు మీ ప్రయత్నానికి మరోసారి సాల్యూట్ ! అంతే :)

మంచు said...

థాంక్స్ అండీ.. అయినా నేను ముందే చేప్పాను.. నాలాంటి (ఇప్పుడు మాలాంటి అనాలి) వాళ్ళు కొంతమంది ఎక్సెప్షనల్ కేసులు అని..

భావన said...

బాగుంది మాల గారు. బలే పరిచయం చేసేరు దాదాపు గా అందరివి రెగ్యులర్ గా చదివేవే ఐనా కొత్తవి కూడా కొన్ని తెలిసేయి. థ్యాంక్స్ అండీ.

గీతాచార్య said...

Hahaha. Anveshana speed gaa jaragaalante naduvalemu Mala garu. Anduke Bike ekki 100k speed tho pothaa... :D ThankQ

ramnarsimha said...

Madam,

Only boys..what about girls?..

(just 4 fun)..

మాలా కుమార్ said...

పరుచూరి వంశీ కృష్ణ గారు ,
సుత్తి గారిని కి అవమానమా ఎంత మాట .
థాంక్ యు.

& పద్మార్పిత గారు ,
అబ్బాయిల పోస్ట్ కదా నేనెందుకు వ్యాఖ్యానీంచాలి అనుకోకుండా , వాఖ్య పెట్టినందుకు థాంక్స్ అండి .

& భాస్కర రామిరెడ్డి గారు ,
థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

అనోనమస్ గారు ,
నా బ్లాగ్ ను బహిష్కరిస్తున్నారాండీ . . . బతికించారు .

& ధరణీరాయ్ చౌదరి గారు ,
స్పందించినందుకు ధన్యవాదాలండి .

& రవి గారు ,
అవునండి , ఈ బ్లాగ్ ల లో మన భావాలను పంచుకునేందుకు ఇంతమంది మితృలు వుండటము , అదృష్టముగానే భావిస్తానండి .
థాంక్ యు .

మాలా కుమార్ said...

పరిమళం గారు ,
అయ్యబాబోయ్ , ఇక అంతే నండి . మీ సల్యూట్ కు నా ధన్యవాదాలు .
&మంచుపల్లకి గారు ,
అవునండి మీరు ముందే చెప్పారు . కాని నేనే ఏమో ప్రయత్నిస్తే తప్పేముంది అనుకొని ప్రయత్నించినందుకు తగిన శాస్తి జరిగిందిలెండి . ఒప్పుకుంటున్నానండి బాబూ ఒప్పుకుంటున్నాను మీలాంటి ఎక్సెప్షనల్ కేసులుంటాయని , ఇంకా ఒప్పుకోక చస్తానా హుం !

మాలా కుమార్ said...

భావన గారు ,
థాంక్ యు అండి .

& గీతాచార్య గారు ,
ఇంతకీ నేనడిగ దానికి జవాబు చెప్పనేలేదు .

& రామనరసిమ్హ గారు ,
నేను , మదర్స్ డే రోజున అమ్మాయిల బ్లాగ్స్ గురించి , బ్లాగ్ అంతర్జాలం లో అతివలు అనే పోస్ట్ రాసానండి . అప్పుడప్పుడు చదువుకోవచ్చని పిడీయఫ్ చేసి పెట్టాను , మీకు టైం వున్నప్పుడు చూడండి .

ramnarsimha said...

I read & congratuled your article

in BHUMIKA..

Many days ago..

Did you see that?

ramnarsimha said...

Madam,

Thanks..for your reply..

I read your article in BHUMIKA..

n also informed my opinion..

మాలా కుమార్ said...

రామనరసిమ్హ గారు ,
ఇప్పుడే భూమిక లో మీ వాఖ్య చూసానండి , థాంక్ యు వెరీ మచ్ .

Anonymous said...

నా బ్లాగ్గులు వ్రాసుకోవడం,మా ఇంటావిడతో దెబ్బలాడడంలో మీ బ్లాగ్గు చూడలేదు.ఇప్పుడే మా ఇంటావిడ బ్లాగ్గులో పెట్టిన వ్యాఖ్య ద్వారా తెలిసింది-నా బ్లాగ్గు గురించి ప్రస్తావించినందుకు ధన్యవాదాలు.

Ram Krish Reddy Kotla said...

మాలాకుమార్ గారు, నా "మంచి కురిసే వేళలో.." బ్లాగుని పరిచయం చేసినందుకు చాలా థాంక్స్.. కానీ ఈ బ్లాగు ఈ మధ్య పెట్టినదే... నేను బ్లాగు లోకంలో అడుగుపెట్టింది నా "ఆకాశవీధిలో..." బ్లాగుతో... "ఆకాశవీధిలో.." చాలా మందికి సుపరిచతమే.. నేను "ఆకాశవీధిలో .." కిషెన్ రెడ్డిగానే చాలా మందికి పరిచయం ..నిన్ననే మొదటి వార్షికోత్సవము జరుపుకున్నాం... "రామ కృష్ణా , నా బ్లాగ్ కొస్తే మటుకు పంపిచేయనులే ! ..." మాలా గారు ఈ వాక్యం నాకు అర్థం కాలేదు... మొత్తానికి నా రెండో బ్లాగుని పరిచయం చేసినందుకు చాలా థాంక్స్ ... :-)

మాలా కుమార్ said...

హరే ఫలే గారు ,
ధన్యవాదాలండి .

& రామకృష్ణ గారు ,
నేను చూసింది మీ , మంచుకురేసేవేళలో నేనండి . మంచుకురిసేవేళలో పాట బాగుంటుంది . పేరుకుడా బాగుంటుంది . అలా అనుకొని మీ ఈ బ్లాగ్ చుసాను . నేను ప్రస్తావించినది , ఈ పోస్ట్ లో మీరు రాసినదాని గురించి . మిమ్మలిని నొప్పించి వుంటే సారీ .

http://indhradhanassu.blogspot.com/2010/06/blog-post_13.html

Ram Krish Reddy Kotla said...

మాల గారు మీరు భలే వారే..సారీ ఎందుకండి...నా రెండో బ్లాగుని పరిచయం చేసినందుకు నేనే మీకు థాంక్స్ చెప్తున్నా... సో మీ బ్లాగుకి వస్తే నన్ను పంపించివేయరనమాట... అలాగయితే నిర్భయంగా వస్తానండి :-)... మీ ఈ ప్రయత్నం చాలా బాగుంది ... చప్పట్లు :-)

మాలా కుమార్ said...

రామకృష్ణ గారు ,
థాంక్ యు .

అశోక్ పాపాయి said...

అవునండి మాలకుమార్ గారు ఈ రోజు నా బ్లాగ్ కి వీడియోలు అప్ లోడు చేస్తున్నానంటే అది మీ సెలవె ఇంక మర్చనండి పేరు నా బ్లాగ్ కి నామకరణం అయినట్టే:-) మీరు నాబ్లాగ్ ని పరిచయం చేశారంటే మీరు చెప్పేవరకు నాకు తెలియదు.మాల గారు మీకు చాల చాల కృతజ్ఞతలు మీ ప్రయత్ననికి నా చప్పట్లు కూడ

మాలా కుమార్ said...

అశోక్ గారు ,
మీరు పాటలు అప్ లోడ్ చేయటము నా దగ్గర నేర్చుకున్నారంటే కుంచం గర్వం గానే వుందండి . ఆ క్రెడిట్ నాకిచ్చినందుకు థాంక్ యు .

శేఖర్ పెద్దగోపు said...

ముందుగా ఇంత ఓపిగ్గా ఒక్కొక్క బ్లాగు గురించి ఓ రెండు మాటలు రాసినందుకు మీకు అభినందనలండీ.....
చాలా చాలా థాంక్స్ మీకు..నేను అప్పుడప్పుడు అమ్మకి చెబుతుంటాను మీ గురించి...ఇప్పుడేం కంప్యూటర్ నేర్చుకుంటాం అని అనుకోకుండా మీరు కంప్యూటర్ నేర్చుకోవటం దగ్గర నుండి ఇష్టంగా బ్లాగు రాయటం వరకు...

అన్నట్టు ఏంటండీ..మీ పిల్లలను నాతో ఆడుకోనివ్వటం లేదు ఈ మధ్య..:-)

మాలా కుమార్ said...

శేఖర్ గారు ,
మీ అమ్మగారికి నా గురించి చెపుతూ మెచ్చుకుంటున్నందుకు చాలా థాంక్స్ అండి .
మరి మీ అమ్మగారికి కూడా కంప్యూటర్ నేర్పించి బ్లాగ్ మొదలు పెట్టించండి .
నేనెక్కడ ఆడుకోనీయటము లేదండి ? మీరే ఈ మద్య మాఇంటికి రావటము మానేశారు :-))

Rajesh T said...

మీరు ఇంకా లేఖిని వాడుతున్నట్లయితే ఇది ట్రై చెయ్యండి.

http://www.google.com/transliterate/ (హిందీ బదులు తెలుగు సెలెక్ట్ చేసుకోండి).

"నేను, సీతా, రామ" అని టైపు చెయ్యడానికి nenu, sita, rama అంటే సరిపోతుంది. దీర్గాలు అదే తెలివిగా పెట్టేసుకుంటుంది. ట, త లు ఎప్పుడు పెట్టాలో కూడా చాలా వరకు అదే చూసుకుంటుంది.

durgeswara said...

అమ్మా!

ఈసారి హనుమత్ రక్షాయాగం పూర్ణాహుతి[మే పదహారు]కు రండి .వేసవిసెలవలు కనుక ఇబ్బందేమీ ఉండదుకదా .

oddula ravisekhar said...

మంచి ప్రయత్నం .