Sunday, December 29, 2019

aapki yaad aati rahi raat bhar chashm-e-nam muskuraati rahi

నవ్వులనజరానా-1&2


నవ్వుల నజరానా
రచయతలు ; ఇరవైఆరుగు
నవ్వులు;కడుపుబ్బ
అనగనగా ఒక ఊళ్ళో ఒకాయన ఉన్నాడు.ఏమిటి  ఊళ్ళో ఒకాయనే ఉన్నాడా ఇంకెవరూ లేరా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగకండి.చెప్పింది వినండి. పేరు ఏదో ఓ పేరు మీ కిష్టమైంది అనుకోండి.ఆయన రోజంతా పొలంలో పనులు చేసీ చేసీ కష్టపడి , ఇంటికొచ్చి ,వేడి వేడి నీళ్ళు స్నానంచేసి, పెళ్ళాం పెట్టిన వేడి వేడి బువ్వ తిని ఇలా పడుకున్నాడో లేదో నిద్ర ముంచుకొచ్చేసేది.అవును పాపం అలిసిపోయాడుకదా అందుకన్నమాట.మాంచి గురకపెట్టి నిద్రపోతూ ఉంటే ,అర్ధరాత్రి అంకమ్మ శివాలులా "దూకుతా దూకుతా" అని పెద్ద పెద్ద అరుపులు వినిపించేవి.యేహే ఏందీ గోల అనుకొని అటుతిరిగి పడుకునే వాడు.కానీ రోజు అర్ధరాత్రి "దూకుతా దుకుతా"అని అరుపులతో నిద్రాభంగమైపోయేది.ఓ రాత్రి ఇంక విసుగొచ్చి,"రోజూ ఏందే నీగోల ?దూకుతా దూకుతా అని అరవకపోతే దూకి చావరాదు"అని గట్టిగా అరిచాడు.అంతే "ధబ్" అనే పెద్ద శభ్ధం తో ఓ బేద్ద మూట అతని మీద పడింది.అంతే ఉలిక్కి పడిలేచి ,ఆ మూటను విప్పి చూసాడు.ఆశ్చర్యం. . . అధ్భుతం . . . ఆ మూట నిండా బోలెడంత డబ్బు, నగలూ!ఎంత సంపదో!ఇంక తరువాత ఏముంది ఎంజాయ్!కథం కహానీ!  
ఇక అసలు సంగతేమిటంటే పదిరోజుల నుంచీ మిమ్మలినందరినీ ఊరిస్తున్న మా "నవ్వుల నజరానా"25-12-2019 , ఓ ఆహ్లాదకరమైన సాయంకాలం పుస్తకాల సంపద మధ్య  మీ ముంగిట్లో కి దూకేసింది.ఇక ఒడిసిపట్టుకోవటమే మీ వంతు.అరే ఏమిటంత తొందర కాస్తాగండి. . .అందులో ఏమేమి నగలూ నాణ్యాలున్నాయో చెప్పనిస్తారా లేదా!
ఓ బోడబ్బాయ్ ఆంధ్రాలో పుడితే అమెరికాలో ఎక్సాస్ ప్రెసిడెంట్ కు కుడికన్ను అదిరిందిట శుభసూచకంగా ఎందుకో వంగూరి చిట్టెన్ రాజుగారు"అమెరికా వాహన యోగం"లో చెపుతున్నారు ఆలకించండి.
ఎవో దయ్యాలూ భూతాలూ పట్టి పీడించటం , వాటిని పోగొట్టేందుకు భూతాలరాజు వేపమండలతో చితక బాదటం విన్నాను కాని, ఎవరి చుట్టైనా గిరగిరా ఓ ఆత్మ తిరుగుతూ ఉంటే వాడు సారీ సారీ అప్పలాకొండగారు ఏమి చేయాలని సెలవిచ్చారంటే ఆయన గారు చచ్చినట్టు పడుకుంటే , చుట్టూ అందరూ ఆయనగారు చచ్చిపోయారని భోరు భోరున ఏడుస్తూ ఉంటే ఆ ఆత్మ తల తిరుగుగుడు అగి వెళ్ళిపోతుందిట.ఏమొనబ్బా అదేమిటో వడ్లమాని మణిగారి కథ "అ(అప్పలకొండ)-ఆ(ఆనందరావు)"కథ చదివి తెలుసుకోవలసుకున్నాను.
ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది అమెరికా వెళుతున్నారు కాని వారెవరికీ రాని ప్రాముఖ్యత "బామ్మగారి బోస్టన్ ప్రయాణం" కు ట్రంపు గారి ఇండియా ప్రయాణం, మోడీ గారి అమెరికా ప్రయాణం కు వచ్చినదానికన్నా ఓ పిసరు ఎక్కువగానే వచ్చింది.మరి ఎందుకో ఆ కథా కమామీషు ఉమాదేవి కల్వకోటగారు చెపుతున్నారు, కాస్త కడుపులు జాగ్రత్తగా పట్టుకొని ,తలలు గట్రా దేనికీ తగిలించుకోకుండా నవ్వుతూ ఆలకించండి.
భార్య గారు ప్రేమగా భర్తగారిని "ఈమండీ రాత్రి భోజనంలోకి ఏమి చేయమంటారు?" అని అడుగుతే అహా ఓహో అని రెచ్చిపోయి మీ కోరికల చిట్టా విప్పారో మీ ఇష్టం అడ్డంగా దొరికి పోతారు.ఎలాగా అంటే ఇలాగా వెంకట్ అద్దంకి గారి "అతిసంశయ"లో రఘులా మీ ఇష్టం మరి!
అమాయక పెళ్ళాం పెట్టే అతి ఖర్చుల నుంచి తప్పించుకోవాలని పాపం ఓ ఉత్తమ మొగుడుగారు అతి తెలివి ప్లాన్ వేస్తే పాపం అది ఎట్లా బెడిసి కొట్టిందో ఆయనగారి మెడకు చుట్టుకుందో సయ్యద్ నజ్మా షమ్మీ గారి "ఉత్తమమొగుడు"చదివి నవ్వుకొని జాలిపడండి.
వెనకటికెవరో తనది సౌండ్ స్లీపని గురకపెడుతుంటే సౌండ్ నాకూ-స్లీప్ మీకూ అని మొత్తుకుందిట ఓ ఇల్లాలు.అలా సిగరెట్ మజా మీకూ-సజా మాకు అని మొత్తుకుంది కనకలత ,ఎమెస్వీ గంగరాజుగారి కథ "గెలివి"లో!
జగమెరిగిన జలజమ్మకు పరిచయం నేను చేయలేనండోయ్ బాబూ మీరే గిరిజా రాణి కలవల గారి "జలజాక్షి-జలజాపతి" లో ఫ్రెష్ గా మరోసారి పరిచయం చేసుకోండబ్బా!
పెళ్ళా ఏది వండిపెడితే అది నోరుమూసుకొని తినక వంకలా హన్నా అట్లాంటి మొగుడికి ఏమి శిక్షవేయాలో మనకు జ్ఞానబోధ చేస్తున్నారు తులసి భాను గారు"సుమతీసత్య"లో .చదివి నేర్చుకోండి.
ఐదు పెల్లిల్లు చేసుకుంటున్న మనవరాలిపెల్లిల్ల ల్లో హడావిడి చేసి తమ తడాఖా చూపిద్దామని ఓ సరదా పడిపోయారు ఓ అమ్మమ్మ, నానమ్మ.పట్టు చీరలు ,కాసులపేరు,వడ్డాణాలు వేసుకుందామని ఆశపడ్డారు.కానీ జిగేల్ మనే గిల్టు నగలూ తగిలించుకొని,పిచ్చిజరీలతో తళతళా మెరిసిపోతున్న సింతటిక్ చీరలు కట్టుకోవలసి వచ్చిన వైన మెట్టిదనగా . . . నేను చెప్పటం ఎందుకు మీరే తెలుసుకోండి జి.యస్.లక్ష్మి గారి "తాజాతాజాపెళ్ళిబాజాలు" లో చదివి.
హబ్బ హబ్బ నవ్వీ నవ్వీ నా బుగ్గలు నొప్పెడుతున్నాయి.ఇంక రాయలేను బాబు మిగితావి సాయంకాలం .అందాకా సెలవు.
(సశేషం)
నవ్వుల నజరానా-2
రచయితలు ; ఇరవైఆరుగు
నవ్వులు;కడుపుబ్బ
అబ్బా ఆగండెహే . . . అందరినీ పరిచయం చేస్తానని చెప్పానా లేదా ? మీ  తొందర దొంగల్ తోలా ! ఉరుములమెరుపుల జిగినీ చీరలు ఈవెంటోళ్ళు చెప్పినట్టు ముస్తాబై ఐదు పెల్లిల్లకు (సరిగ్గానే చెప్పా ఇవి అమెరికా పెల్లిల్లు పెళ్ళిళ్ళు కాదు) వెల్లి (అమెరికా అమెరికా) పీకలదాకా మెక్కి బుక్తాయాసం తో పడుకొని ఇప్పుడే లేచానా మరి.ఇహ చెపుతా మీ గురించి కూడా. . .
ఈ మధ్య ఎక్కడ విన్నా ,పేపర్ లో చదివినా డెంగ్యూ, చికెన్ గున్యా , దోమలు హోరెత్తిస్తున్నాయి.వీటి బాధ నుంచి తప్పించుకోవటానికే త్రివిక్రమరావు దోమలబ్యాటూ వెంట పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు.ఈ దోమల తస్సాదియ్యా అవేమైనా తక్కువ తిన్నాయా!బాగా తెలివిమీరిన రెండు దోమలు త్రివిక్రమరావును ముప్పతిప్పలు పెట్టేసాయి దా.పి.విజయలక్ష్మి పండిట్ గారి"దోమల వేట" లో!
పి.యస్.యం లక్ష్మిగారికి పాపం తిన్నది అరక్క వళ్ళు పెరిగి ఆయాసం అట.ఆయాసం తగ్గించమని డాక్టరమ్మ దగ్గరికెళుతే గుండె ఆపరేషన్ చేస్తానంటుందేమిటి చెప్మా!ఆ డాకటరమ్మ కి అంత తిక్కెందుకు వచ్చిందో "ఆయాసానికి గుండె ఆపరేషన్" లో తెలుసుకుందాం!
"చంటోడిని చంకలో పెట్టుకొని , మీ ఆఫీస్ బాగ్ ఇంట్లో మర్చిపోయారు. . . "కుశల శర్మ గారి భార్య కుశల శర్మ గారిని చివాట్లు వేస్తోంది.అదేమిటి ఆఫీస్ కు ఎవరైనా చంటోడిని చంకలో వేసుకొని తీసుకెళుతారా ఆ చోద్యం ఏమిటో కౌండిన్య (రమేష్ కలవల) గారి "కవిసార్వభౌమ-కవి కుశల శర్మ" లో చదవండి.
రిటరయ్యాక ఇద్దరూ కలిసి షాపింగ్ కు వెళితే సరదాగా ఉంటుందని భర్త వివేక్ ను వాల్మార్ట్ కు నీరజ తీసుకెళితే, అక్కడ వివేక్ చేసిన హంగామా ఇంతా అంతా కాదు సోమ సుధేష్ణ గారి "పదవీ విరమణ"లో!
అమ్మాయిలంటే ఆమడ దూరం పరుగెత్తుకెళ్ళే మధుగాడు లవ్ లో పడ్డాడు.పడటమే కాదు ప్రేయసి దగ్గర నుంచి ఓ ప్రేమలేఖ కూడా అందుకున్నాడు.ఆ ప్రేమలేఖ లో ఏముందో నేను చెపుతానేమిటి ఆశ దోశ అప్పడం. . .  అదేమిటో మీరే చదివి తరించండి అందరి అభిమాన రచయిత కంభంపాటి రవీంద్ర గారి రచన"ప్రేమలేఖ"లో.
పిల్లనో, పిల్లడినో కనిచ్చేద్దామని ఇల్లలు పుట్టింటికి వెళితే ,మనసును వీరాంగాలు వేయిస్తే ఏమి జరుగుతుందో హాస్యరసం లో శృంగారరసాన్ని ఘాటుగా తాలింపు వేసి వడ్డించారు చంగల్వల కామేశరి గారు "' లేడీ 'పోయి 'లేడీ' వచ్చే డాం డాం డాం"లో.
నవ్వుల రాజుగారు సరసి గారు గుళ్ళో మన చెప్పులు పోకుండా ,మహత్తరమైన ఉపాయం చెపుతున్నారు "చెప్పు తిప్పలు" లో. అదేమిటో నవ్వుల్ పువ్వుల్ మధ్య చదివి తెలుసుకోండి .ఆలశ్యం అమృతం విషం .త్వరపడండి.
ఫేస్ బుక్ లో మీ పోస్ట్ లకు  బోలెడు లైక్ లూ, కామెంట్స్ వస్తున్నాయా ? నాకూ తెలుసు రావటం లేదు.దిగులెందుకు ? శ్రీ సత్య గౌతమి జె.గారు రాసిన "వలలో చేపలు" చదవండి. టింగ్. . . టింగ్ . . టింగ్.
విజయ సారధి పేరు పొందిన రచయిత.కొత్త విషయాలను తెలుసుకొని తన రచనలల్లో వాడుకునేందుకు రైల్లో,విమానల్లో, బస్లల్లో అన్ని చోట్లా అందరినీ ఇంటర్వ్యూ చేస్తుంటాడు.అవే కథలుగా వచ్చేస్తూ ఉంటాయి.కాని అన్ని వేళలూ మనవి కావు అన్నట్లు విజయ సారధి పరిస్తితి "అడ్డం తిరిగిన కథ" అయ్యింది,ప్రఖ్యాత సీనియర్ రచయిత్రి మంథా భానుమతి గారి చేతిలో!
కురుక్షేత్రం లో అర్జనుడు సైంధవుడిని చంపేసాక,అంత పాపాత్ముడికి అంత్యక్రియలు ఎందుకని వదిలేసారు.వాడి శరీరం నుంచి ఎముకలు బయట పడ్డాక ఆ ఎముకల పొడిని నూరి ఉప్పులో కలిపేసారు.అదే సైంధవలవణం.నిజమండీ సత్తెపమ్మాణికంగా చెపుతున్నాను.నా మాట నమ్మకపోతే డా.రామలక్ష్మి తాడేపల్లి గారి "సైంధవ లవణం" చదవండి.మీకే తెలుస్తుంది.
క్యారంస్ లో తను ఓడిపోతే భర్త మోములో విరిసిన దరహాసం ఆవిడకు ఎంతగానో నచ్చేసి . . . ఆ నవ్వును ఎప్పుడూ చూడాలని కావాలని ఓడిపోతూ ఉంటుంది పరమేశ్వరిగారు ఓరుగంటి శ్రీ లక్ష్మీనరసింహశర్మగారి "మా ఏమండోపాఖ్యానం "లో.
సుందరమ్మగారికి భర్త చనిపోయిన షాక్ లో మతి చలించింది.ఆ పిచ్చి లో ఏదో మాట్లాడుతూ ఉంటుంది.ఆ పిచ్చి కొడుకు కోడలకు ఎలా కలిసివచ్చిందో,విశాలి పేరి గారి "కలిసొచ్చిన పిచ్చి" చదువుకోవచ్చు.   అవును కొన్ని సార్లు పిచి కూడా కలిసొస్తుంది  కాదేది కలిసొచ్చేందుకు అనర్హం!
గుర్నాధం కున్న డ్రామా పిచ్చి భార్యను ముప్పతిప్పలు పెడుతుంటుంది. ఆ పిచ్చి ఓ సారి పరకాష్టకు చేరి, ఢాం అని కుదిరిపోతుంది నాగలక్ష్మి కర్రా గారి "పిచ్చి కుదిరింది"లో.
కామేశ్వరరావుగారికి బోలెడంత మతిమరుపు.ఏదో చెబుదామని భార్యను పిలుస్తారు మర్చిపోతారు.ఆయన మతి మరుపుతో ఆ ఇల్లాలూ, పిల్లలు పడే ఇబ్బందులు చాలా సరదాగా రాసారు నళిని ఎర్రా తన కథ "కళ్ళ జోడు"లో.
మనకు ఎన్నో డేలు మదర్స్ డే, ఫాదర్స్ డే,లవర్స్ డే వగైరా.ఆరోగ్యం కోసం టాయిలెట్స్ డే ఎందుకు జరుపుకోకూడదు అనే ఐడియా వచ్చింది మిసెస్.పరంశివం కు.పనిలోపని గా " భర్త డే" కూడా జరుపుకోవచ్చు అంటున్నారు ముచ్చెర్ల శకుంతల "భర్త(బ్లాక్)డే" లో!
ఫేస్ బుక్ కాలనీ పేరు ఎప్పుడైనా విన్నారా?అక్కడంతా ఫేస్ బుక్ పద్దతి ట.అక్కడ జరిగే చిత్ర విచిత్రాలకు దిమ్మ తిరిగిపోయి మూర్చబొయిన పాపం పసివాడు రవి కథా కమామీషు తెలుసుకోవాలంటే భరద్వాజ్ వెలమకన్ని రాసిన ఫేస్ బుక్ కాలనీ( లఘు నాటిక)లో తెలుసుకోవాల్సీందే!
సో ఇవండీ మా నవ్వుల నజరానా లోని కథల కబుర్లు. ఇలా కొంచం కొంచం చెప్పి ఆశపెడితే ఆశకురుపులొస్తాయంటున్నారా? ఏంకాదులెండి .పూర్తిగా చదివేద్దామని ఉబలాట పడుతున్నారు నాకు తెలుసు అందుకే ఎక్కడ చదవాలో చెప్పేస్తున్నాను.పూర్తిగా చదివి పకపకా నవ్వుకోవాలి కదా మరి.అందుకే ,
బుక్ ఏగ్జీబిషన్: హైదరాబాద్ యన్.టి.ఆర్ స్టేడియంలో
1. సురేష్ VMRG స్టాల్ No. 101
2. అచ్చంగా తెలుగు స్టాల్ల్ no. 176
3. విశాలాంధ్ర స్టాల్ల్స్- 95, 96,97, 281 - 284
4. నవచేతన స్టాల్ల్స్- 34 - 37, 141 -144 సీరియల్ ఆర్డర్ లో
నూ రచయితల దగ్గరా లభ్యం అవుతాయి.కొనేసుకొని చదివేసుకోండి.

ఏమిటీ ఏమో అంటున్నారు?ఇరవైఆరుగురు రచయితలు రాసిన ఇరవై ఆరు కథలు అన్నావు, ఇరవై ఐదు కథలనే పరిచయం చేసావు అంటున్నారా? ఆ ఇరవైఆరో కథ నాదేనండి బాబూ.అదే "దొంగగారు స్వాగతం" .నా కథ గురించి నేను చెప్పుకుంటే తనకు తాను మురిసే తాటాకు గుడిసె అని మా ఏమండీ గారు వెక్కిరిస్తారు.ఐనా నా కథ గురించి నేను చెప్పుకోవటం బాగోదు కదా .రేపు పోస్ట్ చేస్తాను చదివి మీ అభిప్రాయం చెప్పండీ :)
#నవ్వులనజరానా

Sunday, December 15, 2019

Friday, December 13, 2019

నవ్వుల్ పువ్వుల్


నవ్వుల్ -పువ్వుల్
"నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా " అని ఏదో ఓ సినిమా పాట.ఎన్ని బాధలూ ఎన్ని కష్టాలూ ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ, పళ్ళికిలిస్తూ ఉండాలన్న మాట.చెప్పటానికేమిటి ఎన్ని మాటలైనా చెప్పొచ్చు.ఎప్పుడూ నవ్వుతూ ఉంటే బుగ్గలు నొప్పెట్టవూ!అదెంత కష్టం! కానీ నవ్వుతూ విషం ఇచ్చినా పుచ్చుకుంటారట.కత్తితో పొడిచినా హిహి హోహో అని నవ్వుతూ ఉంటారట.అందుకే మనమూ ఓ ప్రయత్నం చేస్తే పోలే.బాబోయ్ విషం ఇవ్వటమూ,కత్తి తో పొడవటమూ కాదు.నో అపార్ధాల్ ప్లీజ్.ఎల్ల వేళలా పకపకా నవ్వుతూ ఉండటం అన్నమాట.
ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అంటే మా ఏమండీగారి పార్క్ వాకింగ్ ఫ్రెండ్ నవ్వుల్రావ్ (ఆయన అసలు పేరేమిటో నాకు తెలీదు.నేను మటుకు నవ్వుల్రావ్ అని పెట్టుకున్నాను),అందరూ పార్క్ లోకి వచ్చి వాకింగ్ మొదలుపెట్టే ముందు హహా అని నోరు తెరిచి పెద్దగా నవ్వాలి అంటారుట.ఆయన మాట తీసేయలేక పాపం అందరూ వచ్చాక ఒకేసారి హాహా అని పెద్దగా,కాలినీ లో పిల్లాజెల్లా అంతా దడుచుకునేట్టుగా వికటాట్టహాసం చేస్తారు.అంతే కాదు ఆయన ఎక్కడ కనిపించినా నవ్వులతో అభివాదం చేయాలి.పొద్దున్నే మేమిద్దరమూ తీరికగా బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ,కబుర్లు చెప్పుకుంటూ ఉంటామా అల్లంత దూరాన ఆయన కనిపించగానే "ఏమండోయ్ మీ నవ్వుల్రావ్ వస్తున్నారు."అని చెప్పి లోపలికి పారిపోయి గట్టిగా చెవులు మూసుకుంటాను.వాళ్ళిద్దరూ వికటాట్టహాసాలతో హలోలు చెప్పుకున్నాక అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాను.నవ్వులంటే అలా నవ్వాలన్నమాట!
మరీ అంతలా కాకపోయినా కాస్తైనా నవ్వుతూ ఉంటే మన మొహాలు కాస్త చూడబుల్ గా ఉంటాయి.మరి నవ్వు మొహం తో ఉండటం అన్నది అదృష్టమైనా మన ప్రయత్నం మనం చేయాలిగా :) అందుకే హాస్యకథలు, జోక్ లూ , కార్టూన్ లూ చదువుతూ ఉండాలి.అవి గుర్తొచ్చినప్పుడు అప్రయత్నంగా నవ్వు రావాలి.అదో అలాంటి కథలూ ,కార్టూన్ లూ ప్రముఖ కార్టూనిస్ట్ సరసి గారి పుస్తకాలల్లో కోకొల్లలు.సరసిగారి గురించి ప్రత్యేకం గా చెప్పలిసింది ఏముంది అందరికీ తెలిసినవారే.సరసి గారి కార్టూన్ రాని పత్రిక ,పేపర్ లేదంటే అతిశయోక్తి కాదుకదా.ఈ మధ్య ఓ గ్రూప్ లో సరసి గారు కొద్దిగా పరిచయం అయ్యారు.గ్రూప్ లో,ఆయన కార్టూన్ల తో రోజూ నవ్వులు పువ్వులు చల్లుతుంటారు.వెంటనే మొహమాటం లేకుండా నాకు మీ బుక్స్ కావాలండి ఎక్కడ దొరుకుతాయి అని అడిగాను.ఎక్కడో ఎందుకండి మీ అడ్రస్ ఇవ్వండి, నేను పంపిస్తాను అన్నారు.బొలెడు సంతోషం వేసింది.అమ్మయ్య వెతుక్కోకుండా ఇంటికే పోస్ట్ లో పంపుతానన్నారు అని సంబరపడిపోయి, మళ్ళీ ఎక్కడ మనసు మార్చుకుంటారో అని వెంటనే నా అడ్రస్ ఇచ్చాను.తిరుగు టపాలో పుస్తకాలు వచ్చేసాయి.ఇక నవ్వులే నవ్వులు. నేను ఒక్క దాన్నే నవ్వుకుంటే బాగోదని రోజూ అందరికీ గుడ్ మార్నింగ్ కో కార్టూన్, గుడ్ నైట్ కో కార్టూన్ మీ అందరికీ కూడా పంచుదామని సరదా పడిపోయాను."ఎప్పుడో ఏదో ఒకటి తప్ప అన్నీ వడ్డించేస్తాను అంటే కాపీ రైట్ ఉంది తస్మాత్ జాగ్రత్త!" అన్నారు సరసి గారు.ఇకేం చేయను నాలో నేనే చదువుకొని నవ్వుకుంటాను. కానీ,నేను అన్ని కార్టూన్స్ షేర్ చేయలేను కాని ఓ కాంప్లిమెంటరీ మటుకు ఇవ్వగలను :) మరి మీరూ నవ్వుల జల్లులల్లో తడవాలంటే  ఈ పుస్తకాలు కొనుక్కోవాల్సిందే! మేము నవ్వము అని మూతి బిగుంచుకునే దురదృష్టవంతులూ, బంగారం ,డైమండ్ దంతాలు ఉన్నవారు తప్ప మిగితా అందరూ కడుపారా, నోరారా నవ్వుకోండి.
అక్కడో ఇక్కడో వెతుక్కోనవసరం లేదు.ఆయనకే ఫోన్ చేస్తే పోస్ట్ ఖర్చులు ఆయనే పెట్టుకొని , ప్రముఖ ఆరుగురి కార్టూనిస్ట్ ల సంకలనం " కా6టూనిస్టులు"కాంప్లిమెంటరీ కాపీ తో సహా సరసిగారి ఐదు పుస్తకాలు పంపుతారు.ధర ఎక్కువేమీ లేదు.ఐదు పుస్తకాలూ కలిపి 540rs/మాత్రమే .
సరసి గారు అడగగానే మీ అమూలయ్మైన పుస్తకాలు పంపినందుకు ధన్యవాదాలండి.
#నవ్వులనజరానాWednesday, December 11, 2019

పియా కా ఘర్


పియా కా ఘర్ (1972)
డైరెక్టర్;బాసు చటర్జీ
నిర్మాత;తారాచంద్ బర్జాత్య
రచయత;వసంత్ పి.కాలే
సంగీతం;లక్ష్మీకాంత్ ప్యారేలాల్
మాలతి ఒక పల్లెటూరిలో పెరిగిన అమ్మాయి.బొంబాయ్ లో ఉండే రాం అనే యువకునితో వివాహం అవుతుంది.పల్లెటూరిలో పెద్ద ఇంట్లో ఉండే మాలతి, బొంబాయ్ లోని ఒక చిన్న అపార్ట్ మెంట్ లో ఉండే అత్తవారింటికి కాపురానికి వస్తుంది.ఉమ్మడి కుటుంబము.కొత్త దంపతులకు వంటిల్లు పడక గది గా ఇస్తారు.అందులో వారికి ప్రైవసీ ఉండదు.ప్రతి కొత్త పెళ్ళికూతురిలా ప్రియుడి ఇంటికి మహరాణిని కావాలని కలలు కన్న మాలతి అక్కడ ఇమడలేకపోతుంది.మాలతి ని తిరిగి తీసుకెళ్ళటానికి మాలతి పెదనాన్న వస్తాడు.కాని కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలను తెలుసుకున్న మాలతి వెళ్ళదు. అక్కడే ఉండిపోతుంది.
సినిమా అంతా బొంబాయ్ లోని ఒక మధ్య తరగతి కుటుంబం చుట్టూ అల్లుకొని సరదా సరదాగా సాగిపోతుంది.మాలతి గా జయాభాధురి అమాయకం గా ముద్దుముద్దు గా ఉంది.రాం గా అనిల్ ధవన్ స్మార్ట్ గా ఉన్నాడు.రాజశ్రీ ప్రొడక్షన్స్ లో వచ్చే సినిమాలన్నిటిలాగే ఇది కూడా కుటుంబకథా నేపధ్యం లో చాలా సింపుల్గా బాగుంది.పాటలు అన్నీ కూడా వినసొంపుగా ఉన్నాయి.
"పియా కా ఘర్ హై యే, రాణీ హూమ్మై రాణీ హూం" ఈ పాట పిక్చరైజేషన్ బాగుంటుంది.కొత్త దంపతులకు ఏకాంతం కలిపించేందుకు ఇంట్లో ని వారంతా మాలతి ని ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి, రాం ఆఫీస్ నుంచి వచ్చే సమయనికి బయటకు వెళ్ళిపోతారు.మాలతి చక్కగాతయారై, ఇల్లంతా నీట్ గా సద్ది, ముగ్గులేసి ఎదురు చూస్తూ ఉంటుంది.రాం ఆ సంగతి తెలియక ఇంటికెళ్ళి చేసేదేముంది అని ఊరంతా తిరిగి, ఇంట్లో వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వస్తాడు పాపం :)
ఇంకో పాట "సుఖదుఃఖాలు, వెలుగునీడలు,మంచిచెడులతో కలసినదే జీవితం.ఓసారి మనం గెలవచ్చు, ఓసారి ఓడిపోవచ్చు.అంత మాత్రాన అధైర్య పడవద్దు.ప్రతి నిమిషమూ అద్దంలా సున్నితమైనదే.ధనం, ఆస్తి తోనే సంతోషం రాదు.మనకు ప్రియమైన వారి ప్రేమాభిమానాలే మనకు ఊపిరి.వారు ఈ ప్రపంచం వదిలినా, వారి తో మన బంధం వదిలిపోదు.ఇదే జీవితం.ఈ జీవితం మనకు ఇచ్చిన దానిని,అది ఎటువంటిదైనా ఆక్సెప్ట్ చేయాలి."అనే అర్ధం వచ్చే పాట "యే జీవన్ హై" అనే పాట నాకు చాలా నచ్చుతుంది.
ఈ పాట రచయత;ఆనంద్ భక్షి
గాయకుడు;కిషోర్ కుమార్
సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్
Yeh Jeevan Hai
Is Jeevan Ka Yahi Hai - Yahi Hai - Yahi Hai Rungroop
Yeh Jeevan Hai
Is Jeevan Ka Yahi Hai - Yahi Hai - Yahi Hai Rungroop
Thode Ghum Hain, Thodi Khushiyan
Yahi Hai - Yahi Hai - Yahi Hai Chaon Dhoop
Yeh Jeevan Hai

Yeh Na Socho Isme Apni Haar Hai Ke Jeet Hai
Yeh Na Socho Isme Apni Haar Hai Ke Jeet Hai
Ise Apna Lo Jo Bhi Jeevan Ki Reet Hai
Yeh Zid Chodo, Yuh Na Todo
Har Pal Ek Darpan Hai

Yeh Jeevan Hai
Is Jeevan Ka Yahi Hai - Yahi Hai - Yahi Hai Rungroop
Yeh Jeevan Hai

Dhan Se Na Duniya Se, Ghar Se Na Dwar Se
Dhan Se Na Duniya Se, Ghar Se Na Dwar Se
Saason Ki Dor Bandhi Hai, Preetam Ke Pyar Se
Duniya Choote, Par Na Toote, Yeh Aisa Bandhan Hai

Yeh Jeevan Hai
Is Jeevan Ka Yahi Hai - Yahi Hai - Yahi Hai Rungroop
Thode Ghum Hain, Thodi Khushiyan
Yahi Hai - Yahi Hai - Yahi Hai Chaon Dhoop

this the life.
నేను ఇచ్చిన లింక్ ఈ పాటను లతా మంగేష్కర్ ప్రైవేట్ గా పాడారు.


Wednesday, December 4, 2019

O sathi re tere bina bhi kya jeena Female varsion Lyrics #MusicLyrics

వో సాతిరే తేరే బినా అబి క్యా జీనా

ఫూలోన్మే కలియోమే సప్నోఖి గలియోమే

తేరే బినా కుచ్ కహీనా తేరే భినా అభి క్యా జీనా!

Friday, November 22, 2019

Aaja Sanam Madhur Chandni (HD) - Chori Chori (1956) - Nargis - Raj Kapo...

https://youtu.be/arOaGZ839fs

https://www.youtube.com/watch?v=arOaGZ839fs


కహతాహై దిల్ ఔర్ దిల్ ఓరె సాజన్
లేచెల్ ముఝే సాజన్ కె పాస్
లగతా నహీ దిల్ యహా 

Thursday, November 21, 2019

ఇంటింటికొక పూవుఇంటింటికొక పూవు
కథల సంపుటి
రచన; జి.యస్.లక్ష్మి
"జానకి రాం ,సుగుణ లది ఇద్దరు కూతుళ్ళు రమ సుమ ల తో ముచ్చటైన సంసారం. జానకి రాం తండ్రి కట్టించిన రెండు గదులకీ మరో రెండు గదులు కలుపుకొని ఆ పాత ఇంట్లోనే గుట్టుగా బతికేస్తున్న వారికి ఊహించని సంఘటన , ఎనిమిది సంవత్సరాల తరువాత సుగుణ మళ్ళీ తల్లి కాబోతోంది.ఇద్దరాడపిల్లల తరువాత మొగపిల్లవాడు పుడతాడేమో నని ఆశ పడ్డ వారికి , స్కానింగ్ లో ఆడపిల్ల అని తెలుస్తుంది.మూడో ఆడపిల్లను కూడా పెంచగలమా అని మధనపడి అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకుంటారు. అదే సమయం లో పక్కింట్లో ఉన్న పార్వతీశం స్థలము , తమ స్థలము కలిపి అపార్ట్మెంట్స్ కట్టేందుకు గోల్డెన్ హోంస్ వాళ్ళు అడుగుతారు.కొంత డబ్బు,మూడు అపార్ట్మెంట్స్ ఇస్తామంటారు.బిల్డర్ మాట్లాడేందుకు వస్తున్నారని, వారి కోసం ఎదురుచూస్తూ జానకి రాం టి.వి పెడతాడు.అందులో ప్రభుత్వము రైతుల దగ్గర నుంచి భూమి ని ఫ్యాక్టరీల కోసం స్వాధీనపరుచుకొని , రైతులకు వేరే చోట ఇళ్ళు కట్టించి ఇస్తామని, కట్టబోయే ఫ్యాక్టరీ లో ఉద్యోగాలిస్తామని అంటే , రైతులు భూములు ఇవ్వలేమని బాధపడుతుంటారు.వారిని ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేస్తూ ,ఎవరో శాస్త్రజ్ఞుడిని దీని గురించి అడుగుతారు.ఇలా పంట పొలాలను స్వాధీనపరుచుకొని ఫ్యాక్టరీలు కలగటం వలన కలిగే నష్టం ఆయన వివరిస్తాడు.భూమిలేకపోయినా శాస్త్రీయ పద్దతిలో చెట్లు పెంచ వచ్చు కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు , "సహజమైన వృక్షానికి కాసిన పండుకు, బోనసాయి వృక్షానికి కాసిన పండుకు తేడా ఎలాంటిదో ఇదీ అలాంటిదే, విత్తనం ఎంత ముఖ్యమో క్షేత్రం కూడా అంతే ముఖ్యం."అంటాడు.అది జానకి రాం మనసులో నాటుకొని "భూమి సరిగ్గా వినియోగించుకోకపోతే వాతావరణ సమతుల్యత ఎలా పోతుందో అలాగే ఆడపిల్లలని పుట్టకుండా చేస్తే రేపొద్దున సృష్టే ఆగిపోతుంది కదా " అనుకొని ,ఎలాగో అలాగ పిల్లలను పెంచుకుందాము ,కాని అబార్షన్ వద్దు అనుకుంటాడు.తమ ఇంటిని అపార్ట్మెంట్ కు ఇచ్చేందుకు కూడా ఇష్టపడడు." జి.యస్.లక్ష్మి గారి "ఇంటింటికొక పూవు " కథల సంపుటిలోని టైటిల్ కథ "ఇంటింటికొక పూవు ." కథ క్లుప్తంగా . గర్భం లో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే , ఆ గర్భస్థ శిశువును పుట్టకుండా చిదిమేయటం చాలా కాలం నుంచి మన సమాజానికి పట్టిన చీడ.ఈ శిశుహత్యల ను ఆపేందుకు ప్రభుత్వము స్కానింగ్ చేయటమును, ఒక వేళ అత్యవసర పరిస్థితులలో చేయవలసి వచ్చినా పుట్టేది ఆడపిల్లో, మొగపిల్లవాడో తెలపవద్దని చాలా స్ట్రిక్ట్ గా రూల్ పాస్ చేసింది.ఐయినా ఆపటము కష్టంగానే ఉంది.ఈ మధ్య కాలం లో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతోందని , దీని వలన సమాజానికి ముప్పు ఏర్పడుతోందని మేధావులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపధ్యం లో ఈ విషయము మీద చాలా కథలు, కవితలు, సినిమాలు కూడా వచ్చాయి, వస్తున్నాయి.
మరి ఇన్ని వస్తున్నప్పుడు నేను ఈ కథ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటం ఎందుకంటే, రచయిత్రి ఈ కథను నడిపిన విధానము నాకు నచ్చింది.పెద్ద పెద్ద ఉపన్యాసాలు, భారీ డైలాగులు , భీకరమైన సన్నివేశాలూ లేకుండా ఒక చిరుద్యోగి కుటుంబ నేపధ్యంలో కథ సాగుతుంది.భార్యా భర్త ల ఆలోచనలు, వారి ఇబ్బందుల గురించి చాలా సున్నితంగా వివరించారు రచయిత్రి."విత్తనం ఎంత ముఖ్యమో క్షేత్రం అంత ముఖ్యమే .ఇలా ఆడపిల్లల్ని ఇంకా పుట్టకుండా చంపేయడం వల్ల మనం భావితరానికి కావలసిన క్షేత్రన్నే నాశనం చేస్తున్నట్లుంది .భూమి మీద కాని, మనిషి లో కాని అసలు మొలకనేదే రాకుండా సిమెంట్, కాంక్రీట్తో కప్పేస్త్తున్నామేమో అని పిస్తోంది." అని జానకి రాం  తోనూ, "ఆడపిల్ల అమ్మ అవకపోతే ఈ సృష్టే లేదనీ, అంత పవిత్ర కార్యం చేపట్టే గొప్పతనం కేవలం ఆడవారిలోనే ఉందనీ నాకిప్పుడు అర్ధమైందండీ. అందుకే మనం కనీస ఖర్చులు తగ్గించుకొనైనా సరే నేను ఈ అడపిల్లను కనాలనుకుంటున్నానండీ".అని సుగుణ తో చెప్పించిన మాటలు ఎంతో అర్ధవంతంగా ఉన్నాయి.ఈ కథలో ఆడపిల్లకు , క్షేత్రానికీ పోలిక చెప్పి , రెండూ మానవ మనుగడకు  ఎంత అవసరమో చెప్పటం బాగుంది. మంచి సందేశాన్ని , మంచి కథ తో అందించారు రచయిత్రి.
"నిజ జీవితంలో జరిగే సంఘటనలకే కాస్త కల్పన జోడించి, చదివేవారిలో ఉత్సుకతను పెంచేలా రాసేదే కథ.కథ చదివాక పాఠకుడు కాసేపు దాని గురించి ఆలోచించినపుడే అది మంచి కథ అవుతుంది.అటువంటి కథలే పత్రికలలో ప్రచురించబడి లక్షలాది పాఠకుల మన్ననలను పొందుతాయి.సాధారణంగా మనిషి మనసులోనూ,పరిసరాలలోనూ అతనికి అంతుపట్టని సమస్యలు ఎన్నో ఉంటాయి.కొన్ని సమస్యలను వింటున్నా ,చూస్తున్నా మనసు కలత పడుతుంది.కలతపడిన మనసులోచి వచ్చిన కదలికే కథ అవుతుంది. ఆ కదలిక మరో మనసును కదిలించినప్పుడే ఆ కథకు సార్ధకత.అటువంటి కథల సమాహారమే ఈ "ఇంటింటికొక పూవు."" అని తన మాట గా రచయిత్రి చెప్పారు. అందులోని ఒక అందమైన పూవును మీకు పరిచయము చేసాను.ఇటువంటి పూవులు ఇంకో పన్నెండు ఉన్నాయి. మిగితావి మీరు చదివేయండి.
రచయిత్రి తో నేరుగా తమ భావాలను పంచుకోవాలంటే రచయిత్రి జి.యస్.లక్ష్మి గారి సెల్ నంబర్;990 864 8068
e mail; slalita199@gmail.com
ఈ పుస్తకము అన్ని పుస్తకాల షాప్స్ లల్లో దొరుకుతుంది.ధర;130 rs/ , u.s$9.99
(అవిర్భవ పక్షపత్రిక -1-11-2019)


Thursday, October 31, 2019

��Vasanthavallari (173):��Comedy tracks..Mala kumar gari Kaburlu..Alamara ...ప్రఖ్యాత మిమిక్రీ ఆర్టిస్ట్ వసంతలక్ష్మి అయ్యగారి, వారి "వసంత వల్లరి" కామెడీ ట్రాక్ లో ,వారి గళం తో వినిపించిన నా కథ "అలమారా లిఫ్ట్ తో అగచాట్లు.

వసంత లక్ష్మిగారి అభిప్రాయం "రచయిత్రి మాలాకుమార్ గారి రచనలలో హాస్యరసం అలవోకగా జాలువారుతూంటుంది.కబుర్లు చెబుతున్నట్టేవుంటూ మన భుజాలు తడుముకునేలా చేస్తారువారు..తనవ్రాతలతో.

కావాలంటే యీ లింకు తెరచిమీరే వినండి.........ఔనా...కాదా?"

నా సంతోషం " నా కథ మీ గళం లో ఎంత బాగుందో! ఈ కథనే కదా మిమ్మలిని నాకు పరిచయం చేసింది. మన మధ్య స్నేహం కలిపింది.వసంతలక్ష్మి గారు థాంక్స్ అండి."

ఇక వినండి :)

Monday, October 28, 2019

Ek pyar ka nagma hai .. Old is Gold Hindi (Complete Song)

ఏక్ ప్యార్ కా నగ్మా హై

జిందగీ ఔర్ కుచ్ భీ నహీ

తెరేమేరే కహానీ హై

ఆంఖో మే సముందర్ హై

:( :( :( :( :(

Thursday, October 24, 2019

aaj tumse door hokar aise roya

Thursday, October 10, 2019

చెదిరిన గూడు

రెక్కలు తెగిపోయి, చెదిరిపోయిన గూడు
ముందు వంటరిగా నిలబడ్డాను
వానలకు వాలిపోయిన రాధామాధవం
తడిసి ముడుచుకున్న మామిడి
ఆకులు నల్లబడ్డ నాగిని
ముందే ఎండలకు మోడైన తెల్ల సంపెంగి
వచ్చావా అని దీనంగా చూసాయి.
హడావిడిగా కరెంట్ తీగ మీద వంటరిగా
పరుగులు పెడుతున్న ఉడత ఒక్క నిమిషం ఆగి
నువ్వూ నాలాగే తోడు కోల్పోయావా అని విచారంగా అంది.
ఎంతసేపు బయట నిలబడతావు
లోపలికి రా అని జాలిగా స్వాగతించింది
శూన్యమైన నా గూడు  .

Thursday, October 3, 2019

Thursday, September 26, 2019

Tuesday, September 24, 2019

HUMRAAZ (1967) neele gagan ke tale dharti ka pyaar pale Mahendra Ravi Sahir

హమ్రాజ్
వర్మ
మిలిటరీ క్రాంట్రాక్టర్.అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు మీనా ను మిలిటరీ
ఆఫీసర్ కిచ్చి పెళ్ళి చేయటం ఇష్ఠం ఉండదు.కాని మీనా కాప్టెన్ రాజేష్ ను ప్రేమించి
, తండ్రికి ఇష్టం లేదని
తండ్రికి తెలియకుండా పెళ్ళి చేసుకుంటుంది.పెళ్ళైన మరునాడే ఎమర్జెన్సీ డిక్లేర్
అవటం తో కాప్టెన్ రాజేష్ ఫ్రెంట్ కు వెళ్ళాల్సి వస్తుంది.వర్మ మీనా తో నువ్వు
ఇష్టపడితే నేను కాదంటా
,ఆ పెళ్ళి జరగలేదనుకో , మళ్ళీ మీ ఇద్దరికీ గ్రాండ్ గా పెళ్ళి జరిపిస్తాను అంటాడు.యుద్దం లో రాజేష్
చనిపోయినట్లుగా తెలుస్తుంది.మీన గర్భవతి అవుతుంది.పుట్టిన పాప చనిపోయిందని వర్మ
మీనా కు చెపుతాడు.ప్రఖ్యాత స్టేజ్ సింగర్ కుమార్
, తన
పార్ట్నర్ సబ్నం తో మిలిటరీ కాంప్ లో స్టేజ్ షో ఇస్తాడు.అక్కడ మీనాను చూసి
,ఇష్టపడి పెళ్ళి చేసుకుంటాడు. కుమార్ స్టేజ్ షోలల్లో మీనా అక్కడే అతని
ఎదురుగా ఒక కుర్చీలో కూర్చొని అతనిని ఎంకరేజ్ చేస్తుంటుంది.ఓసారి షో కువస్తూ ఏదో
ఫోన్ రావటం తో వంట్లో బాగాలేదని రాలేనని చెప్పి ఇంట్లో ఉండిపోతుంది.కుమార్ ఆతరువాత
కంగారుగా ఎట్లా ఉందో తెలుసుకునేందుకు ఇంటికి ఫోన్ చేస్తే ఇంట్లో లేదని
తెలుస్తుంది.మీనా ఎవరినో హోటల్ లో కలుస్తోందని తెలుసుకొని
, ఊరికి
వెళుతున్నానని మీనాకు చెప్పి
, మారు వేషం తో హోటల్ లో రూం
తీసుకొని ఉండి మీనా ను అనుసరిస్తాడు.లాయర్ ఫ్రెండ్ సలహా తో ఇంట్లో ఏమైనా క్లూ
దొరుకుతుందేమోనని మారువేషం తోనే ఇంటికి వెళ్ళిన కుమార్ కు మీనా హత్య చేయబడి
కనిపిస్తుంది.పొలీస్లు తనను అనుమానిస్తారేమో నని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.అతనికి
దొరికి ఆధారాలతో మీనా వెళ్ళిన హోటల్ కు వెళితే అక్కడ మీనా మొదటి భర్త రాజేష్ కలిసి
మీనా కు అతను మొదటి భర్త అని
, అతను వార్ లో చనిపోయాడని
పొరపాటుగా తెలుసుకొని కుమార్ ను తండ్రి బలవంతం మీద పెళ్ళి చేసుకుందని చెపుతాడు.తను
యుద్దం లో చనిపోలేదని
, శత్రువులకు పట్టుబడ్డాడని,జైల్ నుంచి విడుదలైనా మీనా కు కలిసేందుకు వస్తే మీనా పెళ్ళి సంగతి,
వారిద్దరికీ ఒక పాప ఉందన్న సంగతి తెలిసిందని, పాపను
తీసుకొని పోదామనుకుంటే మీనా ను ఎవరో హత్య చేసారని చెపుతాడు.అన్నట్లు వర్మ చనిపోయే
ముందు మీనాకు కూతురు పుట్టిందని
, అనాధాశ్రమంలో పెరుగుతోందని
చెప్పిపోతాడు.కుమార్
, కాప్టెన్ రాజేష్ ఇద్దరూ కలిసి
హంతకుడిని శోధిస్తారు.తేజ్పాల్ అనే అతను మీనాను హత్య చేసి
, పాప
సారికను కిడ్నాప్ చేసి ఊటీలో దాస్తాడు.వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి
, సారికను కాపాడే ప్రయత్నంలో తేజ్ పాల్ పేల్చిన గన్ షాట్ కు రాజేష్
చనిపోతాడు.సరే పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్ వాళ్ళను వెంబడిస్తూ వస్తాడు. ఆ పోట్లాటలో
అశోక్ పిస్తోల్ షాట్ లో తేజ్ పాల్ కూడా చచ్చిపోతాడు.చివరకు స్తేజ్ షో చేయలేను అని
కుమార్ అంటే
, మీనా కుర్చీలో కూర్చున్న బేబీ సారికను చూపిస్తుంది
షబ్నం.ఇదీ కొంచం క్లుప్తంగా కథ.
1967 లో బి.ఆర్ .చోప్రా డైరెక్షన్ చేసి, నిర్మించి న
సినిమా " హమ్రాజ్ " కథనే నేను చెప్పింది. ఒక ప్రేమ కథగా మొదలై
, సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది.పిల్లల పెళ్ళి మీద తల్లి తండ్రులు,
పిల్లలుకు వాళ్ళ పెళ్ళి గురించిన ఆలోచనలు వ్యతిరేకంగా ఉండటము ,
ఇద్దరికీ భేదాభిప్రాయాలు రావటం పురాణ కాలం నుంచీ ఉన్నట్లుంది.ఈ
సినిమా కథ రొటీనే ఐనా తీయటమూ
, నటీ నటులు బాగున్నారు.రాజ్
కుమార్ కాప్టెన్. రాజేష్ గా
, సునీల్ దత్ కుమార్ గా, విమి మీనా గా,ముంతాజ్ షబ్నం గా నటించారు. నేను హిందీ
సినిమాలు చూడటం మొదలు పెట్టేనాటికి
, రాజ్ కుమార్ చాలా
గంభీరమైన పాత్రలలోకి మారాడు.పెద్ద పెద్ద డైలాగులులు
, చాలా
సీరియస్ గా ఉన్నాయి నేను చూసిన రాజ్ కుమార్ సినిమాలు.అవి అర్ధం కాక చూడటం
మానేసాను.అటువంటిది ఈ సినిమాలో ఒక ప్రేమికుడిగా భారీ డైలాగులు లేకుండా చూడటం
వెరైటీగా ఉంది.సునీల్ దత్ కొంచం లావుగా ఉన్నా బాగున్నాడు. ముంతాజ్ కు ఎక్కువ
పోర్షన్ లేదు.హీరోయిన్ విమి పేరు వినలేదు నేనెప్పుడూ. తెల్ల చీరలలో అందంగా
ఉంది.ముఖ్యంగా డార్జ్ లింగ్ అందాలు బాగా చూపించారు.
రవి
సంగీత సారధ్యం లో మహేంద్ర కపూర్ పాడిన పాటలన్నీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత
బాగున్నాయి.
హృదయమంతా
ప్రేమ నింపుకొని
, చేయి పట్టుకొని ఆకాశపుటంచులదాకా తీసుకెళుతాను అంటే ఏ అమ్మాయైనా రాను
అంటుందా
? దిగాంతాలదాకా నడిచి అడుగులో అడుగు కలిపి
వెళ్ళిపోతుంది .కాని ప్రాణంలోప్రాణమైన తన విభుడిని తాతయ్య రాసిన నుదిటి రాత
,
యమధర్మరాజు, విడదీసి తీసుకెళుతే నిస్సహాయంగా
నిర్జీవగా మిగలటం తప్ప ఏమి చేయకలదు :(
"హే నీలె గగన్ కే తలే
ధర్తీకే
ప్యార్ భలే "
 ఈ పాట నాకు చాలా ఇష్టమైనది, రోజూ నేను వినే
పాటలల్లో ఒకటి. మహేద్ర కపూర్ గళం నుంచి అందం గా హొయలు దిద్దుకుంది ఈ పాట. మహేంద్ర కపూర్
కి బెస్ట్ ప్లే బాక్ సింగర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది .
నేను
యూ ట్యూబ్ లో చూసాను.


Saturday, September 21, 2019

మబ్బుల పల్లకి


ఓ సారి సుందరినాగమణి మన మొదటి విమానప్రయాణం గురించి సరదగా రాసుకుందామా అంది.ఊరికే అనుభవం రాసుకోవటం ఎందుకు ఓ కథలాగానే రాస్తే పోలే అనుకొని నా మొదటిప్రయాణం గురించి రాసుకున్న కథ ఇది.కథా కాలం 1973 అక్టోబర్, హైదరాబాద్ – కలకత్తా

మబ్బుల పల్లకి
"ఏమండీ... ఏమండీ... ప్లీజ్ ప్లీజ్" ముందుకు వెళుతున్నవిజయ్ చేయిపట్టుకొని అన్నాను.
"ఊ... వెళ్ళు ” అన్నారు విజయ్.
"థాంక్యు. ఎంతైనా మా అయన చాలా మంచివారు. బంగారు కొండ" అన్నాను.
"ఎందుకూ కిటికీ సీట్ ఇచ్చినందుకా? ఇవ్వక పోతే బతకనిస్తావా, దారంతా గొణుగుతూనే వుంటావు.” అన్నారు చిన్నగా నవ్వుతూ.
నేనూ నవ్వుతూ లోపలకు వెళ్ళి, కుర్తీ సరిగ్గా సద్దుకొని కూర్చుంటూ కిటికీలో నుంచి బయటకు చూసాను. కొద్ది దూరంలో, అక్కడక్కడ రెక్కలు సాచి, వెండి రంగులో, ఎండకు మిలమిలా మెరుస్తూ రాయంచలా నిలబడి వున్నాయి మబ్బుల పల్లకీలు ( విమానం కు నేను పెట్టుకున్న ముద్దు పేరు ). వాటిని అలా పరవశంగా చూస్తూ వుండి పోయాను. అందులో ఒకటి చిన్నగా స్టార్ట్ అయ్యి ముందుకు, చిన్నగా పరుగు మొదలు పెట్టింది. దానిని అలా చూస్తూ వుండగా మనసు గతంలోకి పరుగెత్తింది.
అది 1972 వ సంవత్సరము. అప్పుడే బంగ్లాదేశ్ యుద్దము ముగిసి శాంతి నెలకొంటున్న రోజులు. సరిహద్దులల్లో ఇంకా పూర్తి ఉద్రిక్తత తగ్గలేదు. ఆ సమయము లో మా వారికి సరిహద్దు ప్రదేశంలో ఒకటైన షిలిగురి నుండి వెళ్ళే ఆర్మీ కాంప్ కు పోస్టింగ్ వచ్చింది.  యుద్దం ముగిసినా ఉద్రిక్తత తగ్గలేదు కాబట్టి ఆంక్షలు ఇంకా పూర్తిగా సడలించ లేదు. దాన్ని ఇంకా పీస్ స్టేషన్ కా మార్చలేదు కాబట్టి కుటుంబాలను, దగ్గరలోనే వున్న డార్జ్ లింగ్ లో సెపరేటెడ్ ఫామిలీ క్వాటర్స్ లో వుండవచ్చు అన్నారు. కానీ అక్కడకూ ఆయన ఏ రెండు మూడు నెలలకో కాని రాలేరు. అప్పుడు చంటి పిల్లతో వక్కతీ అక్కడ ఎలా వుంటుంది వద్దు అని పెద్దవాళ్ళు, ఇక పోతే బి. యే పూర్తి చేయ వలసిన బృహత్కార్యం నా భుజ స్కందాలపైన వుండటం వల్లనూ, నేనూ మా అమ్మాయి హైదరాబాద్ లోనే వుండిపోయాము. ఆయన సంవత్సరానికి రెండు నెలలు సెలవల్లో వచ్చి వెళుతుండేవారు. ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి.. పోయిన సారి వచ్చివెళ్ళిన తరువాత, మా అమ్మాయి డాడీ అని ఏడ్చినప్పుడు మా వారి ఫొటో చూపించి ఏవో కథలూ కాకర కాయలు చెబితే వూరుకుంది కాని ఈ సారి చాలా బెంగ పెట్టుకుంది. ఏమి చేయాలో మాకు తోచటం లేదు. ఆయన వచ్చివెళ్ళి నాలుగు నెలలైనా బెంగ తగ్గ లేదు. పోనీ ఆయనతో మాట్లాడిద్దామంటే ఈరోజుల్లా ఫోన్ల కాలం కాదు. ఉత్తరాలే గతి. అవీ పోస్టల్ వాళ్ళ దయా, మా ప్రాప్తం అన్నట్లూ నిక్కీ నీలిగీ తీరికగా వచ్చేవి! అప్పుడేమైందంటే.....
ఓ రోజు పొద్దున్నే కాలేజీకి వెళుదామని పుస్తకాలు తీసుకొని బయటకు వస్తున్నాను. నా వెనుక మా అత్తగారు ఏదో చెబుతూ వస్తున్నారు. ముందు వరండాలోకి వచ్చాము. అక్కడ మా మామగారు కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు. ఇంతలో...
"టెలిగ్రాం" అంటూ వచ్చాడు... పోస్ట్ మాన్. ఒక్క వుదుటన మా మామగారు లేచి ఎక్కడి నుంచి బాబూ అని అడిగారు.
"కాప్టెన్. విజయ్ దగ్గర నుంచండి.”అన్నాడు పోస్ట్ మాన్
ఆ అని వణుకుతున్న చేతుల తో టెలిగ్రాం అందుకున్నారు మా మామగారు.
గోడను పట్టుకొని నేను, నా భుజం గట్టిగా పట్టుకొని మా అత్తగారు వణుకుతూ నిలబడ్డాము.
ఆ టెలిగ్రాం నన్ను చదవమన్నట్లుగా అమ్మాయ్ అంటూ నావైపు చాచారు మామయ్యగారు. నేను అప్పటికే ఫేంట్ అయ్యే ప్రోగ్రాం లో వున్నాను!
ఇక తప్పక ఆయనే విప్పి చదివారు.”సుమతిని, పూజను కలకత్తా లో రిసీవ్ చేసుకుంటాను.” అని వుంది అందులో. ఇదేమిటి? ఏమి జరిగింది? మమ్మలిని కలకత్తా లో రిసీవ్ చేసుకోవటం ఏమిటి?అంతా అయోమయం లో పడ్డాము. కళ్ళ నీళ్ళ తో అత్తయ్య గారు కుర్చీలో కూలబడ్డారు. మామయ్య గారు ఆ టెలిగ్రాం ను అటు తిప్పి ఇటు తిప్పీ అలోచనలో వున్నారు. నేను పుస్తకాలు పక్కన పడేసి, గోడ కు వంటి కాలి మీద ఆనుకొని నిలబడి గోళ్ళు కొరికేస్తున్నాను.
చిన్నారి వచ్చి కాళ్ళకు చుట్టుకొని అమ్మా ఆకలి అంది. అప్పుడు గమనించాము పొద్దుటి నుంచీ అలాగే వున్నామని, భోజనాలు చేయాలని?” ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కానీయండి భోజనం చేద్దాం" అన్నారు మామయ్య గారు.
మమ్మలిని ఇంకా అయోమయావస్తలో వుంచటం ఇష్టం లేక పోస్టల్ వాళ్ళు మధ్యాహ్నం పోస్ట్ లో వుత్తరం ఇచ్చేసారు పాపం. మళ్ళీ గుండె దడ మొదలు ఎందుకంటే అది మామూలు కవరు కాదు బ్రౌన్ కలర్ పొడవాటి కవర్ మామయ్య గారి పేరు మీద వుంది! చిన్నగా, జాగ్రత్తగా చించారు.
అందులో నుంచి పొడవుగా మడత పెట్టి వున్న రెండు అట్ట ముక్కలు వక ఉత్తరము బయటకు వచ్చాయి., పూజ చాలా మనాది పడ్డది కాబట్టి ఒక వారము రోజులు తన దగ్గరలో ఫామిలీ ని వుంచుకునేందుకు పర్మిషన్ తీసుకున్నాని, (కూతురే మనాది పడిందా నేను కాదా కొంచం కినుకగా అనుకున్నాను. ) విజయవాడలో, కలకత్తా లో రైళ్ళు మారి నాలుగు రోజులు వక్కతే ప్రయాణం చేయటం కష్టం కాబట్టి విమానం టికెట్లు పంపుతున్నాననీ, ఫలానా రోజు అక్కడ వాళ్ళిద్దరినీ విమానం ఎక్కిస్తే, కలకత్తాకు నాలుగు గంటల్లో చేరుకుంటుంది, తనను రిసీవ్ చేసుకోవటానికి నాకు వచ్చేందుకు వీలు కాకపోతే, కలకత్తా ఏర్ పోర్ట్ కు వక సిపాయిని పంపిస్తాననీ, అతను యూనీఫారం లో వుంటాడు, సుమతి పేరు వున్న అట్టను పట్టుకొని వుంటాడు కాబట్టి అతనిని కనుక్కోవటం సులభం, అతను జాగ్రత్తగా ఇక్కడకు తీసుకు వస్తాడు అని ఆ వుత్తరం సారాంశం!
సిపాయి కాకుండా తనే వచ్చి రిసీవ్ చేసుకుంటానని టెలిగ్రాం ఇచ్చారన్నమాట! ఐతే టెలిగ్రాం బులెట్ లా, ఉత్తరం తాపీ గాటెలిగ్రాం ముందు, ఉత్తరం వెనకలా ముందు వెనుకల వచ్చాయన్న మాట. మామయ్య గారి దగ్గర నుంచి ఉత్తరం తీసుకొని, గదిలోకి వెళ్ళి ఉత్తరం మళ్ళీ చదివాను. అంతా నేను ఎలా రావాలో, ఏమేమి తెచ్చుకోవాలో వ్రాసి ఉంది. పూజ గురించి వ్రాసారు కాని నా గురించి కాని, నాకు వేరే ఉత్తరం కాని ఏమీ లేదు! కొంచం నిరాశగా అనిపించి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఉత్తరంలో నుంచి చిలిపిగా నవ్వారు. ఊ అనుకొంటూ తల పక్కకు తిప్పుకున్నాను. నా గడ్డం పట్టుకొని, నా మొహం తన వైపు తిప్పుకుంటూ ” అలిగావా ?" అని అడిగారు.
"కాదా మరి నాకస్సలు ఉత్తరమే వ్రాయ లేదు. అంతా మామయ్య గారికే వ్రాసారు. నేను మీ ఉత్తరం కోసం ఎంత ఎదురు చూస్తానో తెలుసు కదా?” అలుకగా అన్నాను.
"నిజమేననుకో కాని నిన్ను రమ్మని నీకు వ్రాస్తే బాగోదు కదా! నాన్నకు చెప్పాలిగా! అందుకని నాన్నకు రాసాను.” అన్నారు.
"మీరన్నీ అంతే చేస్తారు. సెపరేటెడ్ ఫామిలీ క్వాటర్స్ లలో కూడా బాగుంటుందిట. లేడీస్ అందరూ కార్డ్స్ అనీ, క్లబ్లనీ ఎంజాయ్ చేస్తారుట. అంతా చక్కగా కలిసి మెలిసి వుంటారుట. పిల్లలకూ కంపెనీ వుంటుందిట. మిలిట్రీ కాంప్ కాబట్టి సెక్యూరిటీ బాగా ఉంటుందిట. మొన్న బజార్ లో మిసెస్. చెడ్డా కనిపించించి చెప్పింది. నువ్వెందుకు వెళ్ళలేదు అని అడిగింది. పైగా మీరూ అప్పుడప్పుడూ కనిపిస్తూ వుంటారు. ఇక్కడికైతే సంవత్సరం దాకా రారు. ఇంకా సంవత్సరం గడవాలి. అప్పుడు కాని పోస్టింగ్ రాదు. మీరేమొ నువ్వు గ్రాడ్యుయేట్ కావాలి అని కాలేజ్ లో చేర్పించి వెళ్ళారు. ఇప్పుడు పది రోజులున్నా మళ్ళీ 8 నెలల దాకా కనిపించరు. ఇక నా వల్ల కాదు ఇలా వంటరిగా వుండటం.” విచారంగా చెప్పాను.
"మరి నేను ఉండగలనా? మిమ్మలినందరినీ వదిలి ఈ అడవిలో ఉంటున్నాను. మొన్న బల్ బీర్ చెప్పాడు, ఇంటికి వెళ్ళినప్పుడు ” మమ్మీ ఎవరో అంకుల్ వచ్చా?” అన్నాడుట కొడుకు! ఎంత బాధ! మిలిట్రీ వాళ్ళు ఇంతే వుంటారు. మరి అడ్జెస్ట్ కావాలి. రాత్రి పూట బీర్మగ్ తీసుకొని టెంట్ ముందు కూర్చుంటే, పైన చంద్రుడు వెన్నెలలు కురిపిస్తూ వుంటాడు. అడవి పూల సువాసనలు తేలి వస్తూ ఉంటాయి. వాతావరణం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో తెలుసా! నీన్నెంత మిస్ అవుతానో! ఈ వెన్నెలంతా దండగై పోయింది కదా అనిపిస్తుంది.”నవ్వారు విజయ్.
"అయ్య గారికి కవిత్వం కూడా వస్తోంది.” నవ్వాను నేను.
"సుమతీ" మామయ్య గారి పిలుపు వినిపించింది. ఉలిక్కి పడ్డాను. ఓ ఇదంతా కలా నిరాశగా అనుకున్నాను. చేతిలోని ఉత్తరమూ, టికెట్లూ మసక మసకగా కనిపించాయి. కళ్ళు తుడుచుకున్నాను.”నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరిడి కలయ చూసితిని.” అనుకుంటూ లేచి బాత్రూంలోకి వెళ్ళి మొహమూ కళ్ళూ కడుక్కొని బయటకు వెళ్ళాను.
గాభరా ఏమీ లేదని తెలిసాక మళ్ళీ చర్చ మొదలైంది. అప్పటికే ఐదవ నెల కనుక సీమంతానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము, ఇప్పుడు పంపిస్తే ఎలాగా ? మళ్ళీ అది తిరిగి వచ్చే సరికి ఆరో నెల వచ్చేస్తుంది. మన ఆనవాయితీ ఐదో నెల చేయటమే. ఠాట్ ఇప్పుడు పంపేందుకు వీలు లేదు వాడి కి ఉత్తరం వ్రాసేయండి అన్నారు అత్తయ్య గారు. ఎట్లాగా వాడు టికెట్ పంపాక పంపమని ఎలా చెబుతాము? మీ తల్లీ కొడుకులతో చస్తున్నాను మామయ్యగారి ధుమధుమలు! గొడకానుకొని, అడుగూ బొడుగూ గోళ్ళు కొరుకుతూ నేను. కాకపోతే ఈ సారి సీను బయట వరండాలో కాకుండా లోపలి హాల్ లో! సరే తర్జన భర్జన లు, శిఖరాగ్ర సమావేశాల అనంతరం నన్ను పంపేందుకూ, సీమంతం తొమ్మిదో నెలలో చేసేందుకూ నిర్ణయాలు జరిగి పోయాయి.
ఆకాశం లో కనిపించే విమానం ఎక్కుతున్నానంటే చెప్పలేనంత ఎక్సైట్ మెంట్! ఎంచక్కా కిటికీ లో నుంచి మబ్బులు పట్టుకోవచ్చేమో! మబ్బులు ఎలా వుంటాయి? మబ్బుల్లో తేలి పోయాను. మా అమ్మాయిని బయటకు తీసుకెళ్ళె చుక్కలా దూరం గా కనిపిస్తున్న విమానం చూపించి మనం అందులో డాడీ దగ్గరకు వెళుతున్నాము అని చెప్పాను. మా అమ్మాయి ఎగిరి గంతేసింది. మల్లీశ్వరి లోని మబ్బుల పాటలు గుర్తొచ్చాయి. నేను కాలేజి లో ఫ్రెండ్స్ తో, మా అమ్మాయి ఇంటికొచ్చిన వాళ్ళందరితో మా విమాన ప్రయాణం గురించి డప్పు కొట్టేసాము.
ఎదురు చూస్తున్న శుభ గడియ వచ్చేసింది. సూట్ కేస్ బయటకు తెస్తుంటే మా వారు నాకు ఇవి తేకు అవి తేకు, భోజనం కూడా విమానలో పెడుతారు అంటూ వ్రాసిన బోలెడు జాగ్రత్తలు గుర్తొచ్చాయి. ఆయన పిచ్చి కాకపోతే నేనేమన్నా పార్వతీశాన్నా నల్ల ట్రంక్ పెట్టె, మర చెంబు, గొడుగు గట్రా పట్టుకు పోవటానికి! ఎలా తయారవ్వాలి అన్న మీమాంస లో పడ్డాను. పూజ కైతే మావారు తెచ్చిన గళ్ళ పినోఫాం వేసాను కాని నాకే ఓ పట్టాన తోచటం లేదు. చక్కగా చీర టైట్ గా కట్టు కొని, పెద్ద నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని, తలకు స్కార్ఫ్ కట్టుకొని విమానం మెట్లెక్కి, తలపు దగ్గర నిలబడి చేయి అలవోకగా వూపే హీరోయిన్లు గుర్తొచ్చారు. నేనూ అలా తయారవుదామని సరదా పడ్డాను కాని అమ్మో ఇంకేమైనా వుందా? గంజి పెట్టిన వెంకట గిరి చీరో, బెంగాల్ కాటనో కట్టుకుంటే మరీ ముసలమ్మలా కనిపిస్తానేమొ! చీరలన్నీ అటుతిప్పీ ఇటు తిప్పీ సీమంతానికి మా అమ్మ తెచ్చిన లేత పసుపు రంగు జార్జెట్ చీర తీసాను. జాకెట్ కుట్టించుకోమని అమ్మ ఇచ్చి పోయింది. ఎలాగూ సీమంతం ఇంకా నాలుగు నెలలు వుంది కదా ఇంకోటి కొనుక్కోవచ్చులే అనుకొని అదే కట్టేసాను. మమ్మలిని విమానం ఎక్కించటానికి మామయ్యగారు, పనివాడు వచ్చారు.
విమానం దగ్గరకు వెళ్ళాము.....
మెట్లెక్కాము... లోపలి కివెళుతూ తలుపు దగ్గర నిలబడి తిరిగి చూసాను.. లాంజ్ చాలా దూరంగా వుంది. మామయ్య గారు ఎక్కడున్నారో తెలీలేదు. వాళ్ళు నాకు కనిపించనట్లే నేనూ వాళ్ళకు కనిపించను కదా స్టైల్ గా చేయి ఊపుదామా అని ఓ క్షణం అనుకున్నాను. అమ్మో నా పక్కన బుజ్జి పిల్ల వుంది కదా వాళ్ళు కనిపెట్టేస్తారేమో! తిరిగి వచ్చేటప్పుడు ఆయన వుంటారు గా ఆయనకు చేయి ఊపొచ్చులే అని సరి పెట్టుకొని లోపలకు వెళ్ళాను.
తలుపు దగ్గర ఏర్ హోస్టెస్ నాజూకుగా నమస్కార్ చేసి లోపలకు ఆహ్వానించింది. ఇంకో ఏర్ హోస్టెస్ మమ్మలిని తీసుకెళ్ళి మా సీట్ దగ్గర కూర్చోపెట్టింది. మా వెనుక ఇద్దరు నన్స్ కూర్చొని వున్నారు. వాళ్ళు పూజను పలకరించారు. వాళ్ళు పిలిచి మాట్లాడించారు. ఎవరైనా మాట్లాడాలే కాని దానికేమీ కొత్తా పాతా లేదు అందరి తో మాట్లాడేస్తుంది. వాళ్ళతో కబుర్లు మొదలు పెట్టింది. ఇంతలో విమానం తలుపు మూసేసారు. ఏర్ హోస్టెస్ వచ్చి పూజను ఎత్తుకొచ్చి నా పక్కన కూర్చో బెట్టి, ఇద్దరికీ బెల్టులు కట్టి వెళ్ళింది. నేను చుట్టూ కలియ చూసాను. నేనూ, ఇద్దరు నన్స్ తప్ప ఆడవాళ్ళెవరూ లేరు అంతా మొగవాళ్ళే! వాళ్ళైన అక్కడక్కడ వున్నారు. ఏర్ హోస్టెస్ ఓ ట్రే లో చాక్లెట్ లు, దూది వుండలు తెచ్చి అందరికీ ఇస్తోంది. పూజ రెండు గుప్పిళ్ళ నిండా చాక్లెట్స్ తీసుకొని తన జేబుల్లో పోసుకుంది. అయ్యో బంగారు అన్ని తీసుకోకూడదు అని నేను గాభరా పడి పోయాను. పరవా లేదు అని ఆమె నవ్వుకుంటూ వెళ్ళి పోయింది. మా వారి ఇన్స్ ట్రెక్షన్స్ ప్రకారం దూది నేను రెండు చెవుల్లో పెట్టుకొని పూజ కూ పెట్టాను.
విమానం చిన్నగా కదలటం మొదలైంది. కాస్త పరుగెత్తి ఒక్క జర్క్ తో పైకి లేచింది! గుండె గుభేల్ మంది! పూజ ఒక్కసారే ఉలిక్కి పడి కెవ్ మంది. బెల్ట్ చేత్తో తీసేసేందుకు ప్రయత్నం చేస్తూ గింజుకుంటోంది! నేను దాని చేయి పట్టుకొని ఊరడిస్తున్నాను. విమానం స్టడీ అయ్యాక ఏర్ హోస్టెస్ వచ్చి మా ఇద్దరి బెల్ట్ లూ విప్పేసింది. పూజ ఒక్క ఉదుటన నా వళ్ళోకి దూకి నా మెడ చుట్టూ చేతులు వేసి ఏడవటం మొదలు పెట్టింది. ఎంత ఊరడించినా ఊరుకోదు. నాకేమో ఉక్కిరి బిక్కిరి ఐపోతోంది. ఏర్ హోస్టెస్ వచ్చి ఎత్తుకో బోయింది. ఆమె చేతులు నెట్టేసింది. వెనుక వున్న నన్స్ పిలిచారు ఉమ్... హూ.... వెళ్ళదు. నా వడిలో నుంచి లేవదు. ఒకటే ఏడుపు! ఏర్ హోస్టెస్ ను అడుగుతే పాపం నా హాండ్ బాగ్ లో నుంచి దాని పాల సీసా తీసి ఇచ్చింది. అది నోట్లో పెడితే ఓక్క తోపు తోసేసింది. అలా గంట పైనే అనుకుంటా ప్రయాణం చేసి ఓ ఊరు చేరు కున్నాము. అది ఏ వూరో గుర్తులేదు. అక్కడ ఎక్కువ సేపు ఆగ లేదు. మళ్ళి ప్రయాణం మొదలు! ఇంకాసేపు గడిచాక భువనేశ్వర్ చేరుకున్నాము. అక్కడ కొద్ది సేపు ఆగుతుంది అని, కిందికి దిగి కాసేపు నడుస్తే ఫ్రెష్ గాలి కి ఏడవటం వూరుకుంటుదేమో అని ఏర్ హోస్టెస్ చెప్పింది. చిన్నగా దాని ని ఎత్తుకొని దిగాను. నేల మీదకు దిగగానే నా మీది నుంచి ఒక్క దూకు దూకి రయ్ న ముందుకు పరిగెత్తింది!
అదృష్టవసాత్తు ఎదురుగా వస్తున్న ఏర్ పోర్ట్ ఉద్యోగి దానిని పట్టుకొని నాకు ఇచ్చాడు. విమానం వద్దు అని ఒకటే ఏడుపు!
మరి డాడీ దగ్గరకు వెళ్ళొద్దా అంటే డాడీ కావాలి, విమానం వద్దు అంటుంది.
ఓ నన్ నా దగ్గరకు వచ్చి నా దగ్గర స్లీపింగ్ టాబ్లెట్ వుంది. ఓ హాఫ్ వేయి పడుకుంటుంది అంది.
అమ్మో స్లీపింగ్ టాబ్లెట్ నా. నాకు స్లీపింగ్ టాబ్లెట్ అంటే చాలా భయం. వద్దండి థాంక్ యు అని చెప్పాను.
విమానం ఎక్కనంటుంది. భువనేశ్వర్ లో ఎలా దిగను? ఏమి చేయను ? అంతా అయోమయం. ఏర్ హోస్టెస్ సహాయంతో కష్టం మీద విమానం ఎక్కాను. ఏర్ హోస్టెస్ చాక్లెట్స్ తెచ్చింది. ఏమనుకుందో ఏమో కాని మా అమ్మాయి తన దగ్గర వున్న చాక్లెట్స్ కూడా తీసి ఆ ట్రే లో వేసేసింది. ఏడుపు తగ్గలేదు. నా వడిలో నుంచి దిగదు. ఏడ్చీ ఏడ్చీ తోటకూర కాడ లా వడిలి పోయింది. కళ్ళూ ఎర్రబారి, కళ్ళూ మొహమూ వాచిపోయాయి. ఇంక ఏడ్చే ఓపిక లేదేమో వెక్కిళ్ళు పెడుతోంది. నాకూ ఓపిక ఐపోయింది. ఏర్ హోస్టెస్ అటు వచ్చినప్పుడల్లా ఇంకెంతసేపు అని అడగటమే! పొద్దున్నా ప్రయాణం సరదాలో మా అత్తగారు వట్టి పిల్లవు కూడా కాదు, వాళ్ళు పెడితే ఏం పెడుతారో తినిపో అంటే కష్టం మీద సగం చపాతి తిన్నాను. ఇక్కడ వాళ్ళు పెట్టినవి తను తినలేదు నన్ను తిననీయలేదు నా కూతురు. నీరసం వస్తోంది. కళ్ళు తేలి పోతున్నాయి. అమ్మయ్య ఎట్టకేలకు కలకత్తా చేరుకున్నాము. లేచి నిలబడ లేను. కాళ్ళూ, నడుమూ పట్టేసాయి. పిల్ల చంక దిగదు. చాలా అంటే చాలా కష్టం మీద ఏర్ హోస్టెస్ సహాయము తో దిగి బస్ ఎక్కాను.
అమ్మయ్య అదిగో అక్కడ మా వారు కనిపిస్తున్నారు. అప్పటి వరకూ గొంతులో సుళ్ళు తిరుగుతున్న ఏడుపు బయటకు వచ్చేస్తోంది. ఆయన దగ్గరకు ఎలా వెళ్ళామో తెలీదు! డాడీ అంటు మా అమ్మాయి, ఏమండీ అంటూ నేను ఇద్దరమూ ఆయనను వాటేసుకొని భోర్ మన్నాము!
మబ్బుల పల్లకీ లో నా మొదటి ప్రయాణం అలా బీభత్సం గా మొదలై భీభత్సంగా ముగిసింది!
విమానం ఎక్కిన ప్రతి సారి అది గుర్తొస్తుంది. మేమిద్దరమూ మీద పడి భోర్ మనగానే విజయ్ పడ్డ కంగారు గుర్తొస్తే నవ్వొస్తుంది. చిన్నగా నవ్వుతున్న నన్ను చూసి ” ఏమిటీ నీ మొదటి ప్రయాణం గుర్తొచ్చిందా?" అని అడిగారు విజయ్.
"ఊ! అప్పుడంత గోల గోల చేసిందా, ఇప్పుడేమో పెద్ద డైరక్టరై నెలకు పది రోజులు మబ్బుల పల్లకీ లోనే ఊరేగుతూ వుంటుంది మీ కూతురు.” అన్నాను నవ్వుతూ.
"మరి నా బంగారు తల్లి కదా?” మురిపెంగా అన్నారు విజయ్.

(20-11-2015 - గో తెలుగు. కాం వెబ్ మాగ్జిన్)

ఇది గో తెలుగు లో వచ్చినప్పుడు ఇక్కడ లింక్ ఇచ్చాను.

https://sahiti-mala.blogspot.com/2015/11/blog-post.htmlThursday, September 19, 2019

Wednesday, September 18, 2019

పునీతులు

పునీతులు
రచన ; సుజల గంటి
మత్తుపదార్ధాల ప్రభావం మీద సుజల గంటి గారు రాసిన నవల "పునీతులు" ఇప్పుడే చదివాను.ఈ నవల స్వాతి మాసపత్రిక లో ప్రచురించబడింది.
చలపతిరావు దంపతులకు నలుగురు సంతానం, ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు.ఆ పిల్లలందరిలోకి మూడోవాడైన వీరు అమాయకుడు మంచివాడు.ఎవరు ఏపని చెప్పినా చేస్తాడు.రెండో చెల్లెలు మంజరి తప్ప మిగితా కుటుంబసభ్యులందరూ వీరూ మీద పెత్తనం చెలాయిస్తుంటారు. చదువుబాగా చదువుతాడని , తనకు ఆసరాగా ఉంటడని పెద్దకొడుకు నాగేంద్రను బాగా చదివిస్తాడు  చలపతిరావు. నాగేంద్ర ఉద్యోగస్తుడు కాగానే తన స్వార్ధం తను చూసుకుంటాడు. ఎందుకూ పనికిరాడని చిన్నచూపుచూస్తూ, నిర్లక్షం చేసిన వీరు తను సంపాదన తల్లికే ఇస్తాడు.వీరు ఇష్టపడిన మేనత్తకూతురు రమణి ని గాక పెద్దచెల్లెలు మాధురి పెళ్ళికి, కుండమార్పిడి పద్దతిలో దుర్గ ను ఇచ్చి పెళ్ళిచేస్తార్డు చలపతి.భార్య నుంచి కూడా ఆశించిన ఆనందం పొందలేక, కన్న కొడుకులోనైనా సంతోషం చూసుకుందామనుకుంటే దుర్గ తెలివితక్కువ తో ,కొడుకు కూడా దూరమవటము తో , విరక్తితో, చెడు సావాసాలతో మత్తుమందులకు బానిసవుతాడు వీరు.సముద్రపు వడ్డున పడిఉన్న వీరు ని హృషీకేశ్ లో ప్రకృతివైద్యాశ్రమం నడుపుతున్న గురూజీ చూసి, ఆదరించి , హృషీకేశ్ కు తీసుకెళ్ళి ఆరోగ్యవంతుడిని చేస్తారు..ఆ ఆశ్రమం లో గురూజి ఇలాంటి డ్రగ్ ఎడిక్ట్స్ కు చికిత్స చేస్తుంటారు.  మారిన వీరు ఇంటికి తిరిగి వెళ్ళేందుకు ఇష్టపడక ఈశ్వర్ అనే పేరు ఆశ్రమంలోనే స్వామీజికి సహాయపడుతూ ఉండిపోతాడు. స్వామిజీ ప్రోత్సాహం తో పేంటింగ్స్ వేయటం  నేర్చుకొంటాడు.పెద్ద చిత్రకారుడిగా పేరు పొందుతాడు.చిన్న చెల్లెలు మంజరి అనుకోకుండా వీరు ను చూడటము తో కుటుంబస్భ్యులను కలుసుకుంటాడు.భార్య, తల్లీ తండ్రి వీరు పట్ల తాము చేసిన నిరాదరణను తెలుసుకొని పశ్చాత్తాపపడుతారు. ఇంటికి తిరిగి వెళ్ళేందుకు వీరు ఇష్టపడక ఆశ్రమం లోనే ఉండిపోతాడు.క్లుప్తంగా కథ ఇది.
ఇందులో పిల్లల సైకాలజీ గురించి, నిర్లక్షం చేస్తే వారు ఎట్ల మారిపోతారో, చెడు సహవాసాలకు ఎలా లోనవుతారో వీరు పాత్ర ద్వారా చెపుతారు. పిల్ల మనస్తత్వం గురించి, పేరెంట్స్ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెపుతారు.రచయిత్రికి పిల్లల సైకాలజీ మీద మంచి అవగాహన ఉంది.ఈ నవల ఎదుగుతున్న పిల్లలున్న తల్లితండ్రులకు ఉపయోగపడుతుంది.
కాకపోతే తల్లితండ్రులకు పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా , అది అందరిమీద ఒకేరకంగా చూపించరా? . మాటవినే,అమాయకులైన పిల్లలను పేరెంట్స్ కూడా అడ్వాంటేజ్ గా తీసుకుంటారా ? అనే అనుమానం వచ్చింది నాకు
ఈ నవలలో రచయిత్రి చెప్పినటువంటి గురూజీ ఆశ్రమము , "పున్నాగపూలు"నవలలో ఆ నవల రచయిత్రి జలంధరగారు చెప్పినటువంటి జేకే ఆసుపత్రి నిజంగా ఉంటే ఎంత బాగుంటుందో కదా అనిపించింది.
ఎక్కడైనా వేటింగ్ అప్పుడు పుస్తకం చదువుతూ కూర్చోటం నాకు అలవాటు. పుస్తకం కోసమని పెద్ద పర్స్ తీసుకుపోవాల్సి వచ్చేది. ఈ పుస్తకం చిన్నగా ముచ్చటగా, చిన్న పర్స్ లో పెట్టుకునేందుకు వీలుగా పాకెట్ సైజ్ లో బాగుంది.

Tuesday, September 17, 2019

Monday, September 16, 2019

Aaj Jaane Ki Zid Na Karo - Farida Khannum - Top Ghazal Songs

Aaj Jaane Ki Zid Na Karo - Farida Khannum - Top Ghazal Songs
నా కరో అంటే ఏమి చేయాలి :( 

Friday, September 13, 2019

వీడు వెరుపెరగడుసూడవే !!!!!

పది సంవత్సరాల క్రితం మా అబ్బాయి నాకు బ్లాగ్ స్టార్ట్ చేసి , బ్లాగ్ అంటే ఓపెన్ డైరీ అనుకో. అందరు చదువుతారు కాబట్టి కాస్త జాగ్రత్తగా రాయి అన్నాడు.అది విని మా ఏమండీ రాజకీయాలు, కులాలు,ఎవరెవరి గురించో ముఖ్యంగా నెగిటివ్ గా , ఏవివిధమైన వివాదాలకుపోయేవి ఏవీ రాయకు .ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు మానేజ్ చేయలేవు అని హెచ్చరించారు. ఐతే నేనిక దేనిగురించి రాయాలి ? నాకు నా మొక్కలు , మీరు తప్ప ఏ సబ్జెక్ట్ లూ మిగలలేదు .మీమీద రాయనా అన్నాను.గడ్డం కింద చేత్తో రాసుకుంటూ కాసేపు పైకీ కిందికి చూసి, ఇంకాసేపు దీర్ఘంగా ఆలోచించి సరే రాసుకో అన్నారు.అదో అలా కట్టుదిట్టాల మధ్య నా రచనా ప్రస్థానం బ్లాగ్ పోస్ట్ లై, కథల వరకూ సాగింది. కథలల్లో సంఘటనలు మావే ఐనా పాత్రల పేర్లు వేరేగా పెట్టాను.కొన్ని కథలయ్యాక పాత్రల పేర్ల విషయం లో ఇద్దరికీ భేదాభిప్రాయాలు వస్తుంటే ,పేర్ల జోలికి పోక నేనూ , మా ఏమండీ గానే రాయటం మొదలు పెట్టాను.నా కథలైనా, బ్లాగ్ పోస్ట్ లైనా మావీ , కొన్నేమో ఏమండీగారు చెప్పిన సంఘటనల అధారంగా రాసినవి.ఏది రాసినా ఏమండీగారు చదివి ఆమోద ముద్ర వేసాకనే పబ్లిష్ చేసాను.
ఈ కథ 20-3-2014 లో ఆంధ్రభూమి వారపత్రికలో వచ్చింది.
ఈ కథ చదివి మా అమ్మాయి "అమ్మా అచ్చం డాడీ ని చూసినట్లుగా ఉంది." అంది!

వీడు వెరపెరుగడు సూడవే ! ! ! !

సీట్ బెల్ట్ తీసి, నిలబడి"ఇంకా కూర్చున్నావేం లే. అందరూ దిగారు.”అన్నాడు అభిమన్యు, శశిరేఖ తో.

"ఇదేమి వూరండి నేను సరిగ్గా వినలేదు.”అని అడిగింది శశిరేఖ.
"థాఫే.”బదులిచ్చాడు అభిమన్యు.
"ఏ దేశం?"
"చైనా, ఇహ ప్రశ్నలాపి లేస్తావా?"
"అమ్మో చైనా నే! ఇదేమిటి ఇంకే దేశమూ లేనట్లు తెచ్చి తెచ్చి ఇక్కడ ఆపాడు.”భయం భయం గా అడిగింది.
"చైనా ఐతే ఏమైందిట? ఇక్కడ నిన్నెవరైనా జైల్ లో వేస్తున్నారా?నువ్వలాగే కూర్చో నేను దిగుతున్నాను.”
అమ్మో నేనొక్కదాన్ని ఇక్కడ వుండటమే అనుకుంటూ భర్త వెనకాల నడుస్తూ,ఏమండీ"అని పిలిచింది.
"మళ్ళీ ఏమిటి?"
"ఏమీలేదు, మీరు కాస్త జాగ్రత్తగా వుండండి.”
వెనకకు తిరిగి కొంచం సీరియస్ గా చూసాడు అభిమన్యు శశిరేఖ వైపు.
శశిరేఖ తడబడిపోతూ,అహా ఏమీ లేదు, పోయినసారి మీరు రెస్ట్ రూం లోకి వెళ్ళినప్పుడు, బయట ఏదో గొడవలౌతున్నాయని, పాస్పోర్ట్ లు వున్న బాగ్ లోపలే మర్చిపోయి హడావిడిగా బయటకు వచ్చారు. మీ వెనకాలే వెళ్ళిన స్వీపర్ చూసి, మంచి ఆవిడ కాబట్టి, మిమ్మలిని పిలిచి ఆ బాగ్ ఇచ్చింది. ఆవిడ ఇచ్చేదాకా మీకు ఆ బాగ్ లోపల మర్చిపోయానని గుర్తు కూడా లేదు. లేకపోతే మనం ఎంతఇబ్బంది పడేవాళ్ళము. అందుకే ఈ సారి బయిలుదేరే ముందు పిల్లలు, ఎవరితో ఎక్కువ తక్కువ మాట్లాడవద్దు, ఏ గొడవలైతున్నా తలదూర్చవద్దు. ఎవరినీ పట్టించుకోవద్దు ఇలా ఎన్ని జాగ్రత్తలు చెప్పారు. ప్లీజ్ ఎందులోనూ.....”కోపం గా చూస్తున్న అభిమన్యునుచూసి ఆపేసింది.
"చూడూ ఏదీ పట్టనట్లు, నన్నంటుకోకు నామాల కాకి అన్నట్లు వుండటం నావలన కాదు. కావాలంటే ఇదిగో ఈ బాగ్ నీ దగ్గరవుంచుకో"అంటూ నడుముకు వున్న చిన్న బాగ్ తీయబోయాడు.
"ఆ వద్దు వద్దు మీదగ్గరే వుండనీయండి.”అనేసింది శశిరేఖ. స్వామీ వెంకటేశ్వరుడా మమ్మలిని ఈ చైనా నుంచి క్షేమంగాబయటపడేయి తండ్రీ"అని వెంకటేశ్వరుని వేడుకుంటూ అభిమన్యు వెంట లాంజ్ లోకి నడిచింది.
విమానం తలుపు దగ్గర, ఆరెంజ్ రంగులో ఏదో బుక్ మార్క్ లాంటి అట్టముక్క ఇచ్చారు. ఇదెందుకిచ్చారా అనుకుంటూ, వాళ్ళను ఏమడుగుతే ఏమి తంటానో అనుకొని, తీసుకొని పర్స్ లో వేసుకుంది. కొద్దిసేపు లాంజ్ లో వేసి వున్న కుర్చీలలో కూర్చున్నారు.
"విమానం ఓ గంట ఆగుతుందిట, అలా ఏర్పోర్ట్ లోకి వెళ్ళి చూసొద్దామా?"అడిగాడు అభిమన్యు. సరే పదండి అని లేచింది.
లాంజ్ లో నుంచి ఏర్పోర్ట్ లోకి వెళ్ళటానికి మెట్లు ఎక్కి పక్కన వున్న చిన్న గట్టును పట్టుకొని ఓ నిమిషం నిలబడింది. ఆ గట్టుమీదఆరెంజ్ రంగులోని అట్ట ముక్క కనిపించింది కాని అప్పుడు దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఎక్కడి నుంచో కమ్మని కాఫీ సువాసనలుతేలి వస్తున్నాయి. విమానం లో వాళ్ళిచ్చిన కాఫీ కాని కాఫీ లాంటి ద్రవ పదార్ధం గుర్తొచ్చి ” ఏమండీ, ఇక్కడెక్కడో కాపీ షాప్ వునట్లుందికాఫీ తాగుదామా?"అని అడుగుతుండగానే   కాఫీ తాగుదాము పదా"అని ముందుకు నడిచాడు అభిమన్యు.
ఓ పెద్ద కాగితం గ్లాస్ లో నురగలు తేలుతూ, సువాసనలు వెదజల్లుతున్న కాఫీ ని ఇద్దరూ చెరిసగం చేసుకొని, దాని రుచిని ఆస్వాదిస్తూతాగారు.
విమానం కదలటాని కి ఇంకా చాలా సమయం వుంది.
అద్దాల తలుపులలో నుంచి, దీపాల వెలుతురులో తళతళ లాడుతున్న షాపులోకి వెళ్ళారు.
"ఏమండీ చైనా గుర్తుగా ఏమైనా కొనుక్కుందామా?"అంటూ షాప్ అంతా తిరుగుతూ, అక్కడ పెట్టివున్న బొమ్మలను చూసింది. అమ్మోఎంత చిన్నది చూసినా 100 డాలర్ల పైనే వుంది. ఏముంది బాబూ ఇందులో అని ఆశ్చర్యపోతూ సమయం గడిపేసింది.
"ఏమిటీ ఏవీ నచ్చలేదా? ఐతే ఈ షాప్ లో చూద్దాం రా"అంటు పక్కన వున్న బట్టల దుకాణం లోకి దారి తీసాడు అభిమన్యు.
అటుచూసీ, ఇటు చూసీ ఓ తెల్ల కోటు తీసి బేరమాడసాగాడు.
హుం బేరాలు మొదలెట్టారూ? ఏమిటో ఏ షాప్ లోనైనా బేరం ఆడకుండా ఏదీ కొనరుకదా! ఇహ ఐనట్టే, ఆ విమానం వుంటుందోపోతుందో!
కాస్త తొందర పెట్టాల్సిందే. లేకపోతే ఇంతే సంగతులు అనుకుంటూ "ఏమండీ చాలా సేపైంది, విమానం వెళ్ళిపోతుందేమో! మనమీ చైనా లో చిక్కుబడిపోతాము” అని హడావిడి పెట్టేసింది.
"అబ్బ నీకంతా భయం”  అని విసుక్కుంటూ బేరం పూర్తి చేసి 120 డాలర్ ది 60 డాలర్స్ కు ఆ కోట్ కొన్నాడు. అబ్బో అనుకుంటూ భర్త వైపు మెచ్చుకోలుగా చూసింది ! ఇద్దరూ, లాంజ్ లోకి వెళ్ళారు. అప్పుడే విమానం బయిలుదేరుతుందని ప్రకటన వస్తోంది. అందరూహడావిడిగా లేచారు. శశిరేఖ కూడా లేచింది.
"ఇక్కడే వున్నాము కదా అంత హడావిడి దేనికి అందరినీ ఎక్కనీ” అన్నాడు అభిమన్యు.
కూర్చున్న అభిమన్యు వైపు విమానంలొ ఎక్కుతున్నవారి వైపు చూస్తూ టెన్షన్ గా నిలబడింది.
అంతా ఎక్కేసారు. ఓ అమ్మాయి మటుకు తలుపు దగ్గర నిలబడి, సెక్యూరిటీ వాళ్ళ తో ఏదో మాట్లాడుతోంది. ఆ అమ్మాయికి దాదాపు 25-26 ఏళ్ళు వుండవచ్చు. జీన్స్ పాంట్, గులాబీ రంగు టీషర్ట్ వేసుకొని, బుజాల వరకు కత్తిరించిన జుట్టుతో వుంది. చేతిలో ని కాగితాలుఏవో ఆ సెక్యూరిటీ అతనికి చూపిస్తూ ఏదో చెపుతోంది. ఇంత దూరానికి కూడా ఆ అమ్మాయి మొహంలో గాభరా కనిపిస్తోంది.
"ఇహ లేవండి బాబూ అందరూ ఎక్కేసారు. ఈ కూర్చునేదేదో విమానంలోనే కూర్చోవచ్చుకదా?” అని గాభరా పడుతున్నశశిరేఖ నుపట్టించుకోకుండా, గబగబా వెళ్ళి, సెక్యూరిటీ వాళ్ళ తో మాట్లాడుతున్న అమ్మాయి తో ” ఏమ్మా ఏనీ ప్రాబ్లం" అని అడిగాడు.
బాబోయ్ ఆపద్భాందవా ఏమి కనిపించింది? ఇహ మన పనైపోయింది ! తనూ వెనక పరుగెత్తింది.
"అవునంకుల్, వీళ్ళు ఇచ్చిన ఎంట్రీ పాస్ కార్డ్ ఎక్కడో పడిపోయింది. అది ఇవ్వకపోతే విమానం ఎక్కనివ్వమంటున్నారు. నా పాస్పోర్ట్, టికెట్ చూపించినా వదలటం లేదు.” ఏడుపు గొంతు తో చెప్పింది.
 ఓహో ఐతే ఈ అట్టముక్క గేట్ పాస్ అన్నమాట! ఇంకా నయం పర్స్ లో వేసుకున్నాను, ఇంకెక్కడోవేసాను కాదు అనుకొంటూ అరేదాన్ని ఇందాక ఎక్కడో చూసాను అనుకొని, మెట్ల దగ్గర చూసింది గుర్తొచ్చి అదే ఆ అమ్మాయికి చెప్పింది శశిరేఖ.
ఆ అమ్మాయి అటువైపు పరిగెత్తింది. సెక్యూరిటీ ఆఫీసర్ వీళ్ళను లోపలి కి వెళ్ళమన్నాడు. చిన్నగా తలపంకించి అక్కడే నిలబడ్డాడు అభిమన్యు. ఆ అమ్మాయి బిక్క మొహం తో అక్కడ ఆ అట్టముక్క లేదంటూ వచ్చింది!
"నీ తోపాటు ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు వుండాలి. ఓ పెద్దావిడని వీల్ చేర్ లో తీసుకొచ్చావు, వాళ్ళంతా లోపలికివెళ్ళిపోయారా?"అడిగింది శశిరేఖ.
"వాళ్ళు కో పాసెంజర్స్ ఆంటీ, మొదటిసారిగా వస్తున్నారని, అంతా కొత్త అంటే నేను చూపిస్తున్నాను. ఆ పెద్దావిడ మాకు తెలిసినావిడ. ఆవిడకు సాయం చేయమంటే చేస్తున్నాను.”అంది.
ఇదంతా మాకు పట్టదనట్లు ఆ అమ్మాయిని ఆగిపొమ్మని, వీళ్ళిద్దరినీ లోపలికి వెళ్ళమనీ తొందరచేస్తున్నాడు సెక్యూరిటీ ఆఫీసర్.
"ఈ అమ్మాయి కోలాలంపూర్ లో, ఈ ఫైట్ లో ఎక్కింది. ఈ ఫ్లైట్ లో నుంచే దిగింది. నేను చూసాను. ఐనా పాస్ పోర్ట్, టికెట్ వున్నయికదా ?" అన్నాడు అభిమన్యు.
" పాస్ పోర్ట్, టికెట్ వున్నా ఈ విమానం లో నుంచే దిగింది అన్న నమ్మకం మాకేమిటి ? మేమిచ్చిన పాస్ చూపిస్తేనే లోపలి కిపంపుతాము. సారీ సర్, మా రూల్స్ వొప్పుకోవు. మేము లోపలికి వెళ్ళనీయము. మీరు వెళ్ళండి.”అని ఖరాఖండిగా చెప్పేసాడుఅతను.
"నువ్వెళ్ళు లోపలికి. నేను ఈ అమ్మాయి సంగతి చూసి వస్తాను.” శశిరేఖ తో అన్నాడు.
"అమ్మో నేనసలు మీరు లేకుండా లోపలికి వెళ్ళను.”అని గట్టిగా అభిమన్యు చేయి పట్టుకొని నిలుచుండిపోయింది శశిరేఖ. బిక్కమొహం తో నిలుచున్న ఆ అమ్మాయిని చూస్తుంటే జాలివేస్తోంది కాని, దేశం కాని దేశం లో భర్త అనవసరమైన వివాదం లోకివెళుతున్నాడేమోనని ఓ పక్క భయం వేస్తోంది!  చిన్నవాళ్ళు కూడా మాకెందుకని వెళ్ళిపోతుంటే ఈ పెద్దమనిషి కెందుకో ఈ అఖ్ఖర్లేని జంజాటం…అని ఇంకోపక్క గాభరా! `
సెక్యూరిటీ ఆఫీసర్ కూ అభిమన్యు కూ వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఆ అమ్మాయి, పాస్ పోర్ట్, టికెట్ చూపిస్తూ, వెళ్ళనీయమనిభయం భయం గా, కంగారుగా అడుగుతోంది. సెక్యూరిటీ ఆఫీసర్ ససేమిరా ఆ అమ్మాయిని మాత్రం వదలనంటున్నాడు. మధ్య మధ్య వీళ్ళను లోపలకు వెళ్ళమని హెచ్చరిస్తున్నాడు. శశిరేఖను లోపలికి వెళ్ళమని అంటున్నాడు అభిమన్యు. ఉమ్హూ అంటూ అభిమన్యుచేయి గట్టిగా పట్టుకొని, భయం భయం గా అందరినీ చూస్తూ నిలుచుంది శశిరేఖ.
దేవుడా దేవుడా రక్షించు. నీకు రెండుకొబ్బరికాయలు కొడతాను అర్జెంట్ గా వెంకటేశ్వరస్వామి కి మొక్కేసుకుంది శశిరేఖ.
హుం... ఆ కొబ్బరికాయలకు వెంకటేశ్వరస్వామి పడిపోలేదు! ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ఏర్పోర్ట్ పోలీసులను పిలిచాడు. వాళ్ళను చూసి, ఆఅమ్మాయి ఏడుపు లంకించుకుంది. శశిరేఖ, వణికిపోతూ అభిమన్యు చేయి ఇంకా గట్టిగా పట్టుకొని, అభిమన్యు కు అతుక్కొనినిలబడింది.
"సారీ సర్ మీరు మా మాట పట్టించుకోవటంలేదు, మిమ్మలిని అరెస్ట్ చేయక తప్పదు "అన్నాడు.
పోలీసులు ఆ అమ్మాయిని, అభిమన్యు ను అరెస్ట్ చేస్తూ శశిరేఖను విమానం లోపలికి వెళ్ళిపొమన్నారు.
"నో...  నో... నేను వెళ్ళను. నన్ను కూడా ఆయనతోపాటు తీసుకెళ్ళండి.”అంటూ పరిగెడుతూ ముందుకు తూలింది. కింద పడబోతూ  అభిమన్యు ని గట్టిగా పట్టుకుంది. ఏమైంది అట్లా అరుస్తున్నావు అంటూ అభిమన్యు అనగానే గబుక్కున స్పృహ లోకి వచ్చి చుట్టూచూసింది. ఇంకా అభిమన్యు కు, ఆ సెక్యూరిటీ ఆఫీసర్ కు వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఆ అమ్మాయేమో టెన్షన్ గా ఇద్దరినీ చూస్తోంది. ”ఓ పోలీసులు అభిమన్యు ను పట్టుకుపోవటం నిజం కాదన్నమాట. నా ఉహా” అనుకుంటూ ఇంక ఆపమనట్లు అభిమన్యుచేయి చిన్నగా గుంజింది. కాని అభిమన్యు పట్టించుకోలేదు. ఇంకా ఆ ఊహ లో నుంచి బయటకు రాలేకపోయింది. కాళ్ళు  గజ గజా  వణుకుతున్నాయి. అలాగే అభిమన్యు చేతిని ఆసరాగా చేసుకొని నిష్త్రాణం గా నిలుచుండిపోయింది!
కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న నీళ్ళతో వణికి పోతూవున్న ఆ అమ్మాయి వైపు ఏమి పరవాలేదు అని ధైర్యం చెపుతునట్లుగా చూసి, నడుముకు వున్న సంచీని తీసి, అందులో నుంచి ఐడెంటిటీ కార్డ్ తీసి,” నేను ఆర్మీ ఆఫీసర్ ను.”అని ఆ కార్డ్ ఆ సెక్యూరిటీ ఆఫీసర్ కు ఇచ్చాడు అభిమన్యు. ఆ కార్డ్ ను, అభిమన్యునూ కొన్ని క్షణాలు మార్చి మార్చి చూసి సెల్యూట్ చేసి లోపలికి వెళ్ళమన్నట్లు చేయిచూపించాడు.
ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయవద్దని ఆ అమ్మాయిని హెచ్చరించి లోపలకు వదిలాడు. అంతే ఆ అమ్మాయి వింటిని వదిలిన బాణంలా రయ్ న లోపలకు పరిగెత్తింది! ఆ సెక్యూరిటీ ఆఫీసర్ కు థాంక్స్ చెప్పి లోపలి కి నడిచిన అభిమన్యు ను బ్రతుకు జీవుడా  అనుకుంటూ అనుసరిస్తూ,ఇంత సాయం చేస్తే ఆ అమ్మాయి కనీసం థాంక్స్ ఐనా చెప్పకుండా వెళ్ళింది.”అని గొణిగింది శశిరేఖ.
"ఆ అమ్మాయి థాంక్స్ చెప్పాలని సాయం చేసామా? ఐనా పాపం ఆ అమ్మాయి ఎంత టెన్షన్ పడిందో.”అన్నాడు అభిమన్యు.
"అది కాదండి, ఆ అమ్మాయి థాంక్స్ ఎవరికి కావాలి కాని, మీరు గబుక్కున ఇలా దూరిపోయారు, దేశం కాని దేశం లో అందునాచైనాలో. ఏమైనా ఐతే”
అంటున్న శశిరేఖ మాట పూర్తి కాకుండా?” మాటి మాటి కి చైనా అని భయపడతావు, వాడేమైనా మన తల నరుకుతాడా ? ఆ అమ్మాయి స్థానం లో మన అమ్మాయి వుంటే కూడా ఇలాగే ఆలోచిస్తావా?"
"అది కాదండీ, మనం బయిలు దేరేటప్పుడు పిల్లలు ఎన్ని జాగ్రత్తలు చెప్పారు. ఆ అమ్మాయిని మనం కోలాలంపూర్ లో కూడాచూసామనుకోండి. అంతమాత్రాన ఆ పిల్ల ఎలాంటిదో మనకు తెలుసా? వకవేళ ఏదైనా మూఠాకు చెందిన పిల్లైవుంటే ? ఇవాళ రేపుఎవరినీ నమ్మలేము. మనమొక్కళ్ళమే కాదు  కదా ఇంకా విమానం లో వున్నవాళ్ళు చాలా మంది ఆ అమ్మాయినిచూసేవుంటారు. ఒక్కళ్ళూ పట్టించుకోలేదు. అంతెందుకు, ఆ అమ్మాయితో వున్నవాళ్ళే లోపలకు వెళ్ళిపోయారు. వాళ్ళంతా కలిసి ఈ అమ్మాయి మా అమ్మాయే అని గట్టిగా చెపితే వినకపోయేవాడా ?  ఏదో అతను పట్టించుకున్నాడు కాబట్టి సరిపోయింది. అంతేకాని అన్ని చోట్లా మీ ఆర్మీ ఐడెంటిటీ కార్డ్ పని చేస్తుందా? పైగా రిటైర్ అయ్యి కూడా పదేళ్ళవుతోంది. అతనికేదో డిఫెన్స్ వాళ్ళంటే గౌరవంవున్నట్లుంది. వదిలేసాడు. కొద్దిలో జైల్ నుంచి తప్పించుకున్నాము.”బాధగా, ఉక్రోషంగా మాట్లాడుతూ శశిరేఖ తన సీట్ వైపు వెడుతూ ఓరగా ఆ అమ్మాయిని చూసింది. ఆ అమ్మాయి తను ముందుగా కలిసి దిగినవారితో అభిమన్యుడు ఛేదించలేని పద్మవ్యూహం తను ఛేదించుకు వచ్చినట్టు గొప్పగా పోజులిచ్చేస్తూ వర్ణించేస్తోంది. కనీసం తిరిగి కూడా చూడలేదు! ఇంకా వళ్ళు మండిపోయింది.
"చూసేరా.. చూసేరా.. కనీసం థాంక్స్ అయినా చెప్పలేదు సరికదా అసలు మనవైపే చూడకుండా మొహం ఎలా తిప్పేసుకుంటోందో..”
"ఆ అమ్మాయి థాంక్స్ చెప్పలేదని అంతగా గింజుకోకు. బహుశా  వాళ్ళందరి దగ్గరా ఇప్పటి వరకు తన గురించి గొప్పలు చెప్పుకొనివుంటుంది. ఇప్పుడు ఇలా కాగానే అవమానంగా భావిస్తోందేమో ! ఇప్పుడు కూడా తనే ఏదో మానేజ్ చేసుకొని వచ్చేసానని చెపుతూవుండవచ్చు. ఇంక మన దగ్గర కు వచ్చి థాంక్స్ ఏమి చెపుతుంది? లేదా ఆ కంగారులో తోచకపోయివుండవచ్చు. ఏదైనా కారణంకావచ్చు. మనకు మంచి అనుకున్నది మనం చేసాము. ఇంకా విషయం మర్చిపో. చిన్నపిల్ల అని నవ్వుకో.” అని చెప్పి హాయిగా సీట్ వెనకకి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు అభిమన్యు.
 ఏ దేశమైనా కాని, ఏ వూరైనా కాని, జాతీయ విమానాశ్రయం కాని, అంతర్ జాతీయ విమానాశ్రయం కాని, నాకు మంచిది అనుకున్నదినేను చేస్తాను. నాకే భయమూ లేదు, ఎవరి మెప్పూ అక్కరలేదు అన్నట్లు నిశ్చింతగా కూర్చున్న అభిమన్యు ను చూడగానే
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు వెరుపెరగడు సూడవే సిన్నెక్కా”.
అన్నమాచార్య కీర్తన  గుర్తొచ్చి నిట్టూర్చింది * * * **
(20-3-2014 ఆంధ్రభూమి వారపత్రిక)