Saturday, February 28, 2009

అనురాగ ధార

జీవన జ్యోతి ని వెలిగించే చమురు
అనురాగ ధార కాని డబ్బు కాదు.
ఎంత గొప్ప మాట.ఇది గోవిందరాజు సీతాదేవి అనురాగధార నావెల్ లో చెప్పినది.తల్లి తండ్రులు పిల్లల మద్య ,భార్యా భర్త ల మద్య వుండ వలసిన ప్రేమ,అనురాగం,బందం గురించి గొప్పగా చెప్పారు రచయిత్రి.ఇవి చాలా సున్నితమైన బంధాలు.దశరథరామయ్య,సుందరమ్మ లది బార్య భర్త లంటే శరీరాలు వేరు కాని మనసులు వక్కటే నలభయ్ ఏండ్ల సహచర్యం.మధురమైన సహచర్యం మనసులు కలసిన సహచర్యం.పరువు మర్యాదకి ప్రాధాన్యత నిచ్చేవారు.కోడలి నిరాదరణ కి గురిఅయి చేయని నేరం మోసుకొని,అర్దరాత్రి కొడుకు ఇంటినించి వెళ్ళిపోయి ఏన్నిఇబ్బందులు పడ్డా ,మోసపోయిన మనవరాలు వస్త్తే ఆదరించారు.పాత తరం వాళ్లు అనుకునే తాత గారు,నాయనమ్మల మనసులు ఇంత సున్నితమా వారి భావాలు ఇంత చక్కటివా అని అర్ధము చేసుకున్న మనవరాలి కి తాతగారు నీరు కావి పంచ ,చిరుగుల చొక్కా వేసుకున్నా తేలికగా కనిపించ లేదు.మానవ సంబంధాల గురించి చాలా ఉదాత్తం గా వివరించారు.అందు కే ఈ నవల ని డి.డి లో సీరియల్ వేసారు.నంది అవార్డు వచ్చింది.అందరు నటి నటులు బాగా చేశారట.తాతగారి పాత్రా దారి కి కుడా నంది అవార్డు వచ్చిందట.నాకు తెలియక నేను ఈ సీరియల్ మిస్ అయ్యాను.
ఈ విడదే తాతయ్య గర్ల్ ఫ్రెండ్ నవల కుడా చాలా బావుంటుంది.అందులో నూ తాతగారు మనవడి కోసం పాటు పడతారు.నాయనమ్మ రక రాకా ల పిండి వంటలు చేసుకెలు తుంది.బొంబాయి లో వా రి అనుభవాలు,అత్త కోడళ్ళ అంబంధం చాలా బాగా రాసారు.నవలంతా చాలా సరదా గా సాగి పోతుంది.
లక్ష్మి తో కలిసి ఆవిడ ఇంటికి వెళ్ళాను.బాగా ఆదరించారు.చాలా aఆక్టివ్ గా వున్నారు.ఆ విడ నే ఈ నావల్ ఇచ్చారు.త్రీ ఇఅర్స్ నుంచి గోవిందరాజు సీతాదేవి పురస్కారం పేరిట ఆవిడ అవార్డ్స్ ఇస్త్తున్నారట.ఈ సంవత్సరము కోతి-కొమ్మచ్చి రాసిన ముళ్ళపూడి వెంకట రమణ ,బాపుల కు ఇచ్చారట.వారు ఇక్కడి కి రాలేక పోయినందువలన ఈ విడ నే అక్కడి కి వెళ్లి ఇచ్చారట.ఆ ఫోటో ఆల్బం చూపించారు.వారి ఇంట్లో నే చేసారు.మాలతి చందూర్ కూడా వున్నారు.చివరి పేజి లో బాపు ,రమణ ల దంపతుల ఫొటోస్ వున్నాయి.ఎంత బాగున్నాయో.నా సెల్ నుంచి ఫోటో తేసుకోవచ్చని నాకు తోచలేదు.నేను బాపు, ముళ్ళపూడి ల ఫాన్ అని లక్ష్మి చెప్పింది.అవునా నా కు ముందు తెలిస్తే మిమ్మలి నిద్దరి ని కుడా తేసుకేల్లెదాన్ని అన్నారు.అప్పటి కి ఆవిడా నాకు పరిచయం లేరుకదా.దేని కైనా ప్రాప్తం వుండాలి.

Friday, February 27, 2009

అభిమాన రచయిత్రి ని కలసిన వేళ

బుడుగు ,చందమామ ,టామ్ సాయర్,హకల్ బెరిఫెన్ ,గణపతి,బారిష్టర్ పార్వతీశం మొదలైనవి చదివాను.పెళ్లి తరువాత బుక్స్ చదవటము తగ్గింది.స్వర్ణ బలవంతము మీద ఆర్.కే లైబ్రరీ కి వెళ్ళాను .తను అన్నీ సస్పెన్స్ నవల్స్ చదివేది.నేను అవి చదవలేను అంటే,కొత్తగా యద్దనపూడి నావలలు వస్తున్నాయి,సెక్రటరీ చాలా హిట్ అయ్యింది చదివి చూడు అంది.అప్పుడు మొదలు పెట్టాను నవలలుచదవటముఇ ప్పటికి మానలేదు.చాల లైట్ గా వుండేవి,మామూలు వి మాత్రమే చదవగలను.యద్దనపూడి,ఆనందారామం,మల్లాది,యండమూరి,పొత్తూరి విజయలక్ష్మి ,పోల్కంపల్లి శాంత దేవి,కోడూరి కౌసల్య,మాదిరెడ్డి సులోచన,చిట్టారెడ్డి,గోవిందరాజు సీతాదేవి మొదలయినవారి నవలలు చదివాను.
నేను చదవటము మొదలు పెట్టేసరికే యద్దనపూడి సులోచనారాణి వి రెండు ,మూడు నవలలు వచ్చాయి.అప్పట్లో సెక్రటరీ చాల పెద్ద హిట్.అమ్మాయిలు పెళ్ళికొడుకు నచ్చలేదు అంటే రాజశేఖర్ లాంటి ఆరడుగుల అందగాడు,పడవ అంత కారు వున్నవాడు ఎక్కడ దొరుకు తాడు అనేవారు.రాజశేఖర్ ఎవర్గ్రీన్ హీరో. అందగాడు,సమర్దుడు ,అందరికి ఇష్టుడైన హీరో. సన్నగా ,అందంగా ,పుష్కలం గా ఆత్మాభిమానం వున్న హీరోయిన్ యద్దనపూడి కే సొంతం.కోతి-కొమ్మచ్చి లో ముళ్ళపూడి అన్నట్లు నవల మద్యలో నుంచి చదవటము మొదలు పెట్టినా ,ముందు ఏమి మిస్ అయ్యామో అని టెన్షన్ వుండదు.ఎక్కడ నుంచి చదివినా చివరి వరకు విడవకుండా చదవగలము.చదువుతున్నంత సేపు ఆహ్లాదం గా ,అందమైన పూ తోట లో వున్నట్లు గా వుంటుంది.మూడ్ సరిగా లేన్నప్పుడు చదివితే నాకైతే మూడ్ బాగవుతుంది.ఏవో సందేశాలు,డాన్లు,రక్తపాతాలు వుండవు.అదే సమయము లో సమకాలిన సమస్యలు కొద్దిగా టచ్ అవుతాయి.కుటుంబంలో బామ్మలు,అమ్మమ్మల అవసరము ,ప్రేమాభి మానాలు తెలుపుతాయి.మీనా మా ఫ్రెండ్స్ సర్కిల్ లో చర్చనీయాంసం అయ్యింది.పెద్ద వాళ్లు ఏమి చేసిన పిల్లల బాగు కొరకే చేస్తారు కదా నచ్చక పోతే చెప్పాలి కాని చివరి వరకు అంత పిరికి గా వుండి తల్లి ని,ఎదిరించి నవ్వుల పాలు చేయటము చాలా మంది పెద్దలకు నచ్చలేదు.
ఆ నావలల ని సినిమాలు గా కుడా తీసారు.కాని నావలలు లో వున్నా సున్నితము ,అందము సినిమాలలో కనిపించలేదు.విచిత్ర బందం ,సెక్రటరీ నాకు నచ్చలేదు.జీవనతరంగాలు,మీనా పరవాలేదు అన్పించాయి.ఇంకా చాలానే సినిమాలు తీసారు కాని,నవల మీది ప్రేమ పోగొట్టుకో లేక నేను ఇంకేవి చూడలేదు.
తరువాత టి.వి లో సీరియల్స్ గా కూడా తీసారు.అందులో రాధ-మధు మాత్రమే చూసాను. నవలల లోని పాత్ర లకు సరి అయిన న్యాయము ఎవ్వరు చేయలేక పోతున్నారు అనిపిస్తోంది.జీవన తరంగాలు లో వేణుగోపాల రావు తప్ప మిగితా ఎవ్వరు ఆ పాత్రల కి సరి పోలేదని పించింది.లక్ష్మి తీసిన మూడు సీరియల్స్ ,రుతురాగాలు ,అప్పుడు నేను బిజీ గా వుండటము మూలంగా చూడలేదు.మొగలి రేకులు సౌగంది ఆదారంగా తీస్తున్నారట.అబ్బో,వాళ్ల సీరియల్స్ చాల ఏళ్ళు నడుస్తాయి.అన్ని ఏళ్ళు చూసే ఓపిక లేదు.
యద్దనపూడి సులోచనా రాణి ని మొదటి సారిగా రాణి పెళ్ళిలో చూసాను.బుజ్జమ్మ ఆమ్మ రాయచూరు బాబు కూతురు అని పరిచయం చేసారు.ఆ తరువాత ఆవిడని కలిసే సందర్భము రాలేదు.జ్యోతి కొడుకు పెళ్లి కి నేను వెళ్ళేసరికి కి ఆవిడ వెళ్లి పోయారు.ఇప్పుడే వెళ్లారు అని పార్వతి అంది.అయ్యో మిస్ అయ్యానే అని అనుకున్నాను.మనము ఇంటి కి పోదాములే అని లక్ష్మి అంది.అనుకోకుండా మొన్న వెళ్ళటాని కి వీలయింది.బిపు,అయన ఆవిడ నవల్స్ గురించి అడిగి ఏమేమి మాట్లాడాలో బ్రీఫ్ చేసారు.నేను, లక్ష్మి వాళ్ల ఇంటికి వెళ్ళాము.లక్ష్మి నన్ను ఆవిడకి,మామయ్యగారి కి పరిచయం చేసింది.నేను ఆవిడ కి బోకే ఇచ్చాను.ఆవిడ నవ్వుతు అది తేసుకొని నన్ను హాగ్ చేసారు.దాదాపు రెండు గంటలు కూర్చున్నాము.అంత సేపు ఎక్కడా వక పెద్ద రచయిత్రి ని అని ఆవిడ చూపలేదు.చాలా ఆత్మీయంగా మాట్లాడారు.ఫ్రెండ్లీ వాతావరణము వుండింది.మీరు ఎక్కడ వుంటారు,పిల్లలు ఏమి చేస్తున్నారు అని అడిగారు.మీకు టైం పాస్ ఎట్లా అని అడిగారు.ప్రస్తుతము బ్లాగ్ రాస్తున్నాను అని చెప్పాను.ఎం రాసారు అని అడిగారు.నా పెళ్లి రోజు తో మొదలు పెట్టాను.ప్రస్తుతము నా జీవితము లోని మధురక్షణాల గురించి రాస్తున్నాను అన్నాను.చాల మంచి ఆలోచన అని మెచ్చుకున్నారు.నా పెళ్లి రోజు గురించి అనగానే లక్ష్మి అంది లడ్డుల గురించి రాసావా అని అదేంటి నాకు తెలీదే అన్నాను.మా పెళ్లి అప్పుడు మేము చలకుర్తి నుంచి వచ్చి లక్ష్మి వాళ్ల ఇంట్లో నే వున్నాము.పెళ్లి కోసం అని చాలా లడ్డులు చేసి వరండాలో చాపల మీద ఆరపెట్టారు.లక్ష్మి తమ్ముళ్ళు ముగ్గురు,వాళ్ల ఫ్రెండ్స్ ఎవరు ఎన్ని ఎక్కువ లడ్డు లు తినగలరు అని పందెం వేసుకొనే తిన్నారు.అందరి లో కి చిన్నవాడు మనోజ్ ఆరు ఏండ్ల వాడు ముప్పయి లడ్డులు తిన్నాడు.పైగా తీసినట్లు తెలీకుండ అక్కడక్కడ నుండి తీసారు.ఆ సంగతి లక్ష్మి చెప్పగానే అందరమూ చాలా నవ్వాము.ఈ రోజు బ్లాగ్ లో మీ గురించి రాస్తాను అన్నాను .ఆ విడ నవ్వారు.అది పర్మిషన్ అనే అనుకుంటున్నాను.తరువాత మనవళ్ళు,మనవరాళ్ళు గురించి చెప్పుకున్నాము.ప్రస్తుతము ఏమి రాయటము లేదట.సోషల్ సర్విస్ చేద్దామని వక ట్రస్ట్ పెట్టారట.అందు లోనే బిజీ గా వుంటాను అన్నారు.మా చెల్లెలు జయ మీ నవల్స్ గిఫ్ట్ గా ఇచ్చింది.అన్నాను.మీరు రాయటము మనేయవద్దు.,అంటే మానేయ వద్దా అని నవ్వారు.టీ ,స్నాక్స్ తీసుకొని ,సంతృప్తి నిండిన మనసు తో వచ్చాను.

Thursday, February 26, 2009

జ్ఞ్యాపకం

నాన్నగారు జ్ఞ్యాపకం గా మిగిలి పోయి ఈ రోజు కి పది సంవత్సరాలు అయ్యింది.అయినా ఇంకా నాకు మాథ్స్చెపుతున్నట్లు,బజారు కి తేసి కేలు తున్నట్లు చిన్నప్పటి జ్ఞ్యపకా లే .ఖమ్మం వెళ్ళ gఆనే లూనా మీద వెళ్లి,పిల్లల కోసం స్వీట్స్ ,బిస్కెట్స్ పళ్ళు అన్ని తెచ్చేవారు.ఎండలో ఎందు కు తరువాత వెళ్ళండి అన్నా వినేవారు కాదు.వకసారి బిపు ని వెళ్ళ gఆనే లెటర్ రాయరా అన్నారు.అప్పుడు వాడు నీకు ఇంగ్లీష్ రాదు కదా తాతయ్యా అన్నాడు.పోనిలేర ఎవరి తో నయనా చదివించు కుంటాను అన్నారు.ఆ సంగతి ఎప్పుడు గురుతు చేసుకునే వారు.సంజు ఎన్ని సార్లు అడిగినా విసుగు కోకుండా దాని జాతకం చెప్పేవారు.హాబీ గా జాతకం చెప్పటము నేర్చుకున్న అందరి కి కరెక్ట్ గా చెప్పేవారు.ఎవరి దగ్గరా వక్క పైస కూడా తేసుకోలేదు.
నిన్న అనుకోకుండా యద్దనపూడి సులోచనా రాణి ఇంటికి వెళ్ళాము నేను ,లక్ష్మి.లక్ష్మి కృష్ణ మూర్తి పెదనాన్న కూతురు అని ఆవిడ కి ఆవిడ భర్త స్వామి రా వు గారికి పరిచయం చేసింది.ములుగు బాబు కుతురివా అని నన్ను చూసి సంతోషించారు.ఆయన నాన్నగారికి మేనత్త కొడుకు.కాని నాకు తెలిసి వాళ్లు ఎప్పుడు కలుసు కో లేదు.వై.ఎం .సి దగ్గర వున్నప్పుడు దూరము నుండే ములుగు బాబు రావటము చూసే వాళ్ళము.వాడు వచ్చి నప్పుడు అందరమూ ఎంజాయ్ చేసే వాళ్ళము.వాడు, నేను,రాముడు బావ అంటు ఇంకా కొంతమంది పేర్లు చెప్పారు అందరమూ చాలా ఫ్రెండ్స్ మీ .అందరు వెళ్లి పోయారు నేను వక్క డి నే మిగిలాను అని బాధ పడ్డారు.అనుకోకుండా నాన్నగారి తిది ముందే అక్కడి కి వెళ్ళటము,నాన్నగారి చిన్ననాటి ముచ్చట్లు వినటము మంచిగా అని పించింది.
నాన్నగారు అందరి తో బాగానే వుండేవారు.ఆయన మీద ఎవ్వరు చెడు గా చెప్పటము వినలేదు.ఎప్పుడు తామరాకు మీద నీటి బొట్టు లాగా వుండాలి అని చెప్పేవారు.అనవసరము అయిన మాటలు ఏవి మాట్లాడే వారు కాదు.అల్లుళ్ళ తో కుడా ఫ్రెండ్స్ లాగా వుండేవారు.ఈయన తో సినిమాలకు కూడా వెళ్లేవారు.మా వారు నన్ను నాన్న కుచి అంటుంటే ముసిముసి గా నవ్వు కునే వారు.ఆయన మరణించిన తరువాత అప్పుడప్పుడు జయ కి కలలో కనిపిస్తున్నారు.వకసారి ,కమలని వినాయకు డి పూజ చేయమ న్నను.నువ్వు గుర్తు చేయి అన్నారట.ఆయన చెప్పింది నేను ఎవరికీ చెప్పలేదు,మరచిపోయాను.చివరికి మరణము తరువాత కూడా నా గురించిఆలోచిం చారన్న మాట.నేను ఆయనకి తిరిగి అంత ప్రేమ అందిచ గలిగానా.ఆయనకు నేను ఏమి చేయలేక పోయాను.అయన జబ్బు పడ్డప్పుడు కూడా నేను ఇక్కడ లేను అమెరికా లో వున్నాను.ఆయన మరణించే ముందు పనమ్మాయి తో నన్ను రమ్మని కబురు చేసారు.వేలుదామని బయిలు తెరాను కింది కి వెళ్ళే సరి కి చుతి కి కోసం ఆగవలసి వచ్చింది.ఇంత లో ఎవరో మాటలు పెట్టారు.సరే లేట్ అయ్యింది కదా వంట చేసు కొని పోదామని తిరిగి వెళ్లి వంట చేస్తుండగా ఆయన మాట్లాడటము లేదని పక్కిన్ టి వాళ్ళు ఫోన్ చేసారు మేము వెళ్ళే సరికి అయన పోయారు .నేను తిరిగి వేల్లకుడా అప్పుడే అక్కడి కి వెళ్లి వుంటే ఆకరి చూపు దక్కేది కదా అయన రమ్మని పిలిచినా వెల్ల లేదే అని ఎప్పుడు బాధ పడతాను.కాని ,వకటే తృప్తి ఆయన కర్మ కాండలు మా వారు చేసారు.దాని కి నేను ఎప్పుడు మా వారికీ క్రుతగ్యు రాలీని.
నేను ట్టు తౌసండ్ ఇయర్ చూడను అని వక సారి నాతో అన్నారు కాని అప్పుడు ఆయన అన్నది నాకు అర్దము కాలేదు.ఆయన న్యంటి నయన్ ఫిబ్రవరి లో పరమపదిన్ చినప్పుడు అర్దము అయ్యిది.ఆయన మరణము గురించి ఆయన కే తెలిసిన యోగి ఆయన.

Thursday, February 19, 2009

జీవిత మే మధుర మో

వక రోజు గౌరవ కంప్యూటర్ గురించి ఏదో అడిగాడు.నాకు కంప్యూటర్ రాదు.అన్నాను నువ్వు నేర్చుకోలేదా అని అడిగాడు.లేదురా అంటే నేరుచుకో బామ్మ అన్నాడు.నాకు రాదురా అంటే కాదు బామ్మా నువ్వు చేయగలవు నేకు వస్తుంది నేర్చుకో అన్నాడు.యు.యస్.వెళ్ళినప్పుడు అను మొదటిసారిగా సంజు తో చాట్ చేయించింది.సో నా మొదటి గురువు నా కోడలన్నమాట .తరువాత బిపు కంప్యూటర్ మీద అన్ని సెట్ చేసి ఇస్తే,ఎట్లా క్లిక్ చేయాలో చూపిస్తే చాట్ చేయటము నేర్చు కున్నాను.పేపర్ ,నొవెల్స్ చదివేదానిని.అయన బ్రిడ్జి ఆడేవారు.అంతే.గౌరవ అన్నాక నాకూ నేర్చు కోవాలని అనిపించింది.మేఘ ట్యూషన్ టీచర్ అనిత కి ఫోన్ చేసి అడిగాను.మా అఫ్ఫీస్ లో నే కోర్సెస్ స్టార్ట్ చేసాము అంది. ఐ.ఫై.యస్ వెళ్ళాక వల్ల బాస్ కి నన్ను పరిచయము చేసింది. నేను కంప్యూటర్ నేర్చు కోవలను కుంటున్నాను అని నా రిక్విర్మేంట్ చెప్పాను.అయన చాల హ్యాపీ అయ్యారు. నరేష్ బాబు ను పరిచయము చేసి శ్రద్దగా నేర్పమన్నారు.నా కు వక్కదాని కే క్లాసు తేసుకునే వాడు.ఎన్ని ప్రశ్నలు అడిగినా విసుగు లేకుండా వోపిక గా స్టెప్ బై స్టెప్ నేర్పాడు .చాల థాంక్స్ టు నరేష్.ఇంకా ఫోటో షాప్ అవి నేర్పుతమన్నాడు. నేర్చుకున్దమనే అన్కుంటున్నాను.సర్ కి,అనురాధ కి థాంక్స్.ఉష ఇంట్లో పార్టీ లో కంప్యూటర్ నేర్చు కున్నావు కదా ఇప్పుడు ఏమి చేస్తున్నావు అని రవి అడిగాడు.ఏముంది చేయటానికి అన్నాను.తెలుగు బ్లాగ్ ఓపెన్ చేయి కొద్దిగా కస్ట పడితే తెలుగు లో రాయవచ్చు.అని లింక్ పంపాడు.బిపు సహాయము తో బ్లాగ్ ఓపెన్ చేశాను.ఏమి రాయాలి?సంజు ఎదయన రాయి.అంది.అప్పుడే మా నలబయవ పెళ్లి రోజు వచ్చింది.ఆ రోజు అదితి కి పరిక్షలు వుండటము వలన, అను ఊర్లో లేక పోవటము వలన ఏమి ఫంక్షన్ చేయలేదు.సంజు,సతీష్,విక్కీ వచ్చి విష్ చేసి వెళ్లారు.అప్పుడు సంజు అడిగి న ప్రశ్న నీ స్వీట్ మే మో రేస్ ఏమిటి అన్నదాని కి జవాబు రాయవచ్చు కదా అనుకున్నాను.రాసానా? మొత్తం ఇంతేనా.ఇంకా వున్నాయి.కొన్ని మర్చి పోయాను.కొన్ని కొన్ని పదాలు రాయలేక పోయాను.ప్రయత్నం అయితే చేశాను. నా మధుర స్మృతు లను బయటి కి తీసు కు రావటాని కి సహాయము చేసిన రవి ,సంజు,బిపుల కు,చదివి ప్రోత్సా హించిన జయ,శ్రీదేవి,లకు,వారి భావాలూ పంచుకున్న అమ్మ, సత్య, లకు థాంక్స్. నాకు అన్నిటా ప్రోత్సాహము ,నాకు కూల్ ఫ్యామిలీ లో రవి లెటర్ కి జవాబు రాసి ఇచ్చేంత గా సహాయ ,సహకారము లు అందించే శ్రీవారి కి వందనాలు..మధురాను భూతి కి అంతం ఏముంది.ప్రతిది మధురమే.జీవితమే మధురమో ,రాగ సుధా భరిత మో,ప్రేమ కథా మధుర మో అన్కుంటూ వుండటమే.

Wednesday, February 18, 2009

భూతల స్వర్గం !

aమెరికా అంటే అందరి కి భూతల స్వర్గం.ప్రతి వాళ్ళు వెళ్ళాలి అని కలలు కనే ప్రదేశం.ప్లేన్ న్యూ యార్క్ లో ల్యాండ్ అవుతుండా gఆ అందరు చప్పట్లు కొట్టారు.వాళ్ళంతా స్టూడెంట్స్ అని అను కున్నాము.అట్లాంటా లో మొదటి నెల ఎక్కడి కి వెళ్ళలేదు.సతీష్ తో ఫార్మర్స్ మార్కెట్ కి వెళ్ళాను.మీకేమైనా కావాలంటే తీసు కొండి అని ప్రతి సారి aనే వాడు.నాకే మీ వుంటాయి అనుకునే దాన్ని. వాళ్ళ బాస్ చెప్పాడట మీ మదర్ ఇన్ లా కి షాప్పింగ్ చేయిస్తే సంతోశ పడ్తుంది అని.నా కేమి షాప్పింగ్ పని లేదు అని చెపితే ఆశ్చర్య పోయాడు.అదితి పాస్ పోర్ట్ కోసం సంజు నన్ను ,అదితి ని తీసు కెళ్ళింది.వచ్చే టప్పుడు దారి మరచి పోయింది.చక్కగా వురంత తిరిగాము.రోడ్స్ అన్ని నీట్ గ వున్నాయి.ఎక్కడ మనుషు లే లేరు.అంత కాళినే .అసలు వుల్లోనే వున్నామా అని పించింది.తరువాత ట్రిప్స్ లో కల్ల వూరు మారిపొయింది.అప్పుడు ఇంటి దగ్గర కూడా వక్క పిట్ట కూడా కనిపించలేదు.నేను కొంచం వాకింగ్ చేస్తానంటే ఇంటి ముందే,వంటి మీద బంగారం తీసేసి,తలుపు దగ్గర సంజు నిలబడి వుంటే అక్కడ అక్కడే తిరిగే దాన్ని.ఎందు కొచ్చిన గొడవ అని తరువాత మానేసాను. సంజు అప్పుడే మాల్ చూపించింది. రోన్డోసారి అంత ప్రాబ్లెం కాలేదు.అప్పుడు ఇంటెదురుగా సుబ్బారావు గారి ఫ్యామిలీ వుండింది.ఇంకొంత మంది తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు.సంజు,నేను,అదితి బర్మింగ్హాం వెళ్ళాము.డా.నాథ్ వెంకట్ ఫ్రెండ్ అప్పుడు బాబి అని చనువు గా పిలి చే దానిని ఇన్ని ఏండ్ల తరువాత బాబి అనాలంటే మొహమాటం అని పించింది.నాథ్,lakhmi ని చూస్తే చాల మంచి గా అని పిన్ చింది.ఇద్దరు కలిసి మెలిసి పనులు చేసుకుంటూ ,కబురులు చెప్పుకు నటు వుంటుంటే ఫ్రెండ్స్ లా అనిపించారు.స్వాతి పెళ్లి కి ముందునుంచే అన్ని ప్లాన్లు వేసి దాని ప్రకారమే చేసారు.ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళ దగ్గర వుండి ట్రైనింగ్ kaవాలి .
రవి,సబితా వచినప్పుడు రాకీ ఫాల్స్ కి వెళ్ళాము.ఆ ఫాల్స్ భూమి అడుగున వున్నాయి.లిఫ్ట్ లో కిది కి వెళ్ళాక చాల భయం వేసి,అందులోనే అదితి ని తీసు కొని బయట కి వచ్చేసాను.అట్లాంటా లో అంతకు ముందే ఒలంపిక్ గేంలు అయ్యాయి.ఆ గ్రౌండ్,సి.యాన్.యన్.స్టేషన్ చూసాను.
లోన్గ్మొంట్ లో జూలై ౪థ్ న అమెరికన్ పెరేడ్ ,సెలబ్రేషన్స్ బాగున్నాయి.అట్లాంటి చోతులకు వెళ్ళినప్పుడు ఎవరి కుర్చీలు ,ఎవరి స్నాక్స్ వాళ్ళు తీసు కేల్లతము గమ్మత్తు గ అనిపించింది.బోల్దేర్ స్ట్రీట్ కి ఇద్దరమే బస్ లో వెళ్లి వచ్చాము.పోర్ట్ ల్యాండ్ లో దీప,వి న య ,సాన్ ఫ్రాన్ స్కో లో గౌ తం ,బాల,హుస్తాన్ లో రమేష్ ,సుభాషిని ,వాషింగ్తన్న లో రవి,సబితా,హరిణి,ఇతాకా లో దీప్తి ,విశ్వనాథ్,ద్యుతి బాగా చూసు కున్నారు.అన్ని తిప్పి చూపించారు.న్యూ యార్క్ లో బస్ మీద కూర్చొని వాన లో రైన్ కట్స్ వేసు కొని వెళుతుంటే పూనా గుర్తుకు వచ్చింది.నయాగరా వాటర్ ఫాల్స్ చూస్తే నిజంగానే భూతల స్వర్గం అని పించింది.ఎక్కడో అంటిక్ స వున్నాయి అంటు వెళ్లి చూస్తే అక్కడ అన్ని,రోలు ,బండి,పాత కార్ వగిరా చూపి వంద ఏండ్ల క్రితం వి అంటుంటే నవ్వు వచ్చింది.మా తాతగారి ఇల్లు నూట యాబీ ఏండ్ల క్రితంది అనుకున్నాను.నాలుగు సార్లు అమెరిక వెళ్ళిన మంచు కురవటము చూడలేదు అనుకున్నాను.కాని,లోన్గ్మొంట్ నుండి బయిసీ కి వెళ్ళేటప్పుడు దారి అంత ముంచు కుర్స్తునే వుండింది.అను,నేను,మేఘ,గౌరవ వక కార్ లో అను డ్రైవింగ్ లో వెళ్ళాము.ఆ జర్నీ చాల ఎంజాయ్ చేశాను. వక అమెరికన్ పెళ్లి .సంజు బాస్ పెళ్లి చూసాను .లోస్వేగాస్ మిస్ అయ్యాము.

Sunday, February 8, 2009

పిడుగు

బిపు ,మేఘ ఎయిర్ పోర్ట్ కి వచ్చారు.అందరమూ ఇంటి కి వచ్చే సరి కి అను గౌరవ్ ని ఎత్తు కొని బయట నిలబడి వుంది. nఅనను చూడ గానే ఎంతో పరిచయం వున్నా వాడి లా నవ్వి తల వుపాడు.వాడి ని చూడ గానే సంజు చిన్నప్పుడు చూసి నట్లు గా అన్పించింది.చేతు లు చాపగానే వచ్చేసాడు.అప్పటి నుండి ఇప్పటి వరకు నాదగ్గరే వున్నాడు.న్నిన్ను వల్లేసి నేను పోను,నన్ను వల్లేసి నువ్వు పోకు ఆంటాడు. nఉవ్వంటే చాల ఇష్టం బామ్మ అంటాడు.ఇంట్లో అందరు ,పిల్ల లందరి మీద కంటే వాడి మీద నేను ప్రేమ ఎక్కువ చూపిస్తూ న్నా నని అంటారు.వాడు చిన్నవాడు కదా అందు కే ఎక్కువ ముద్దు చేస్తున్నాను అంతే కాని నాకు అందరు సమానమే అంటే అదితి,మేఘ వొప్పుకోరు.విక్కీ మాట్లాడడు.గౌరవ్ కి నాదగ్గరే పడు కోవటము అలవాటు అయ్యింది.మా ఇద్దరి మద్య లో పడుకుంటాడు.చిన్న పి.పి అంటాము .మాటలు రానప్పుడు అయన లోపలి కి వస్తున్ టే అయన పిల్లో కింద పడేసే వాడు .అయన విస్సుక్కుంటూ పిల్లో తీసుకోని పడు కొనే వారు.తరు వాత అయన ప్లేస్ లో పడు కో వ టము మొదలు పెట్టాడు.అయన లోపలి కి రాకుండా తలుపు వేసేవాడు.అప్పటి కి వస్తే గోల గోల గా ఏడ్చే వాడు. ఇదంతా భరించ లేక వాడు పడుకునే దాక టి.వి.చూసి పడు కో వట ము అలవాటు చేసుకున్నారు.ఇద్దరు చాల పోట్లాడుకు నేవారు .నిద్ర పోయాక మాత్రం తాత దగ్గర గా జరిగి పడు కునే వాడు.ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ .తాత బయటి నుంచి రాగానే శారద తో తాత కి టీ ఇవ్వు అంటాడు.సెల్ రింగ్ కాగానే ఎక్కడ వున్నా తీసు కెళ్ళి ఇస్తాడు.అయన భోజనం చేసే టప్పుడు గౌరవ సాల్ట్ అనగానే పరిగె త్తు కుంటూ వచ్చి ఇస్తాడు.ఇవన్ని వాడి డుటీస్ అనుకుంటాడు.పక్కన ఎవరు రా జరుగు అనగానే నేను గౌరు అంటాడు .ఓ ఐతే పడుకో అంటారు తాత .అంటే మీ గౌరు అంటే అన్నిటి కి ఓ కే అన్నమాట .ఎమైన చేయవచ్చు.రోజు కనీసం వక సారి ఇన బామ్మ నువ్వంటే నా కిష్టం అంటుంటాడువాడి ని వాడి రూమ్ లో పడు కో పెట్టా లని బిపు ప్రయత్నలు చేస్తున్నాడు.కాని ఉఉహు.నువ్వు బామ్మ ని nidra lepaddu lepithe nఇన్నుతీసు కేలుతను అన్నాడట.అందుకని నన్ను చిన్నగా మాట్లాడు అంటు చీకటి లో నే (లైట్ వేస్తే డాడీ లేస్తాడు అని లైట్ వేయ నియ్య లేదు.)వంట ఇంట్లో కి తీసు కెళ్ళి బి బూస్ట్ కలిపించు కో ని తాగి చీకట్లో నే రూమ్ లో కి వచ్చి పడుకున్నాము.నేను చీకట్లో పద కుండ పట్టు కొని తీసు కొచ్చాడు.వాడి చిన్న ప్పుడు వాడి ని వేతు కుతు వెళ్లి వాడి సుసు లో జారి పది cheయి విరగ కొట్టు కున్నాను.అది ఇప్పటి కి వాడి కి గుర్తే.అప్పు దు ఎవరయన ఏమయింది అని నన్ను అడిగితే గౌరు సుసు బామ్మ డం .అనేవాడు.బయటి కి వెళ్ళటము అంటే అదితి ఇంటి కే.అక్కడి కి వెళ్ళటము చాల ఇష్టం మై బ్రఅదర్ విక్కీ అంటుంటాడు.బ్రదర్స్ సిస్టర్స్ అందరు వక్క చోటే వుండాలి గదా అంటాడు.ఎప్పుడు వల్ల ఇంట్లో వుందామా న్న ఇష్టమే .మాటలు రావటము చాల ఆలస్యము అయిన్ డి కాని మాటలు వచ్చి నప్పటి నుండి వకటే వాగుడు.లోడ లోడ మాట్లఆడు తు నే వుంటాడు.అంత టి.వి.తెలుగు మాట్లాడు తాడు.ఏమైనా చేయటము ఇష్టము లేక పోతే నన్ను క్షమించు బామ్మ అంటాడు.ఎంత ప్రేమ చూపించిన నేను మేఘ ని ఏమైనా అంటే చాలు దాన్ని వేన కేసు కొని నాతో పోట్లడుతడు.వల్ల మమ్మీ బయిటి కి తీసు కేలు తుంటే నా వయిపు చూడను కుడా చూడదు(ఎ gauti chiluka aa guti palu ke palu kuhtun di gadaa) ఏను మాత్రము బయిటికి వెళ్ళా ద్దు .వాడు మటుకు వెళ్లి వస్తాడట.
నా చిన్నప్పుడుమానుకోట లో కృష్ణుడి లెస్సన్ చెపుతూ టీచర్ విన్న వటే యశోద డాన్స్ చేయి స్తు నన్ను యశోద గా చేయించింది. యశోద కృష్ణు ల పాటలంటే చాల ఇష్టం.విక్కీ ని కన్నయ్య అని పిలి చేదాన్ని .ఎవరైన కన్నయ్య అంటే నేను అమ్మమ్మ కన్నాయని అనేవాడు.గౌరవ ని రామయ్య ,రాంబాబు అని అప్పు da ప్పుడు పిలుస్తున్ తను.చిన్నప్పుడు అలాగే మెత్తగా వుండేవాడు .ఈమి మాటల ఆడకుండా నవ్వు తు వుండే వాడు.. ఇప్పుడు చాల అల్లరి మాటలు నేర్చు కున్నాడు.ఎన్ని మాటలో స్కూల్ లో టీచర్ వీడి ని కంట్రోల్ చేయలేక చెప్పిన మాట వినటము లేదని శారద ముందు కళ్ళ నీళ్లు పెట్టు కుందట.టీచర్ ని నేనేమి అనలేదు ఊరి కే ఏడుస్తుందిఅంటాడు..అందు కే అత్తా వాడి ని పిడుగు అంటుంది. ఈస్ట్ ఆర్ వెస్ట్ అని మేఘ అనగానే మేఘ ఇస్ బెస్ట్ అంటాడు.మేఘ లేనప్పుడు వాడు ఈస్ట్ ఆర్ వెస్ట్ అంటే నేను కాని శారద కాని గౌరవ ఇస్ బెస్ట్ అనాలి.
అయన రాకతో మొదలు అయ్యి గౌరవ రాక తో నా నవరత్నా ల మాల పూర్తి అయ్యింది.

Thursday, February 5, 2009

రాణియమ్మ

ఆ రోజు బిపు వాళ్ళు మద్రాస్ వస్తున్నారు.వీసా పని అయ్యి రావటాని కి త్రీ డేస్ అవుతుంది అన్నారు.అందు కానీ వాళ్ళు రాగా నే కలవాలి ,మేఘ ని చూడాలి అని మేము మెడ్రాస్ వెళ్ళాము.వాళ్ళు భరత్ అత్తగారింట్లో దిగారు.మేము హోటల్ లో దిగి,వాళ్ళ ని కాలవాల ని వెళ్ళాము .అక్కడి కి వెళ్ళాక తెలిసింది అంతకు ముందే న్యూయార్క్ లో టవర్స్ మీద బాంబ్స్ వేసారని చాల గొడవగా వుందని.లక్కీ గా వీళ్ళు వచ్చేసారు అన్కున్నాము.నేను ఏమి మాట్లాడ కుండ వుంటే మేఘ ని చూడవా?అని బిపు అన్నాడు.ఓ అవును కదా నేనింకా మీ ఇద్దరే అనుకుంటున్నాను అనగానే నవ్వుతూ లోపలి కి తీసుకెళ్ళాడు.పింక్ బుగ్గలు ,నల్లటి గుండ్రటి కళ్లు,వత్తు జుట్టు తో చాల ముద్దు గా వుంది.కళ్లు తిప్పుతూ చూస్తోంది,నేను ఎత్తు కుందామని ముందుకు వంగాను ఇంతలో భరత్ అత్తగారు వచ్చి చటుక్కున దాన్ని ఎత్తుకొని వెళ్లి పోయింది.ఆమెకు చిన్న పిల్ల లంటే ఇష్టమట.క్యూట్ బేబీ అంటు వచ్చి నప్పటి నుండి ఎత్తుకుంతోందట.ఐతే మాత్రం,నేను అంత దూరమ్ నుండి ,మేఘ ఇంకా దూరమ్ నుడి వచ్చాము.అది పుట్టి ఇదు నెలలు ఇన నేను ఇప్పుడే చూస్తున్నాను అట్లా తీసుకు పోవతమేనా.నాకు చాల కోపం వచ్చిందో.వెళ్లి వరండా లో కూర్చున్నాను.చాల సేపటి తరువాత అను మేఘ ని తీసుకొచ్చి ఇచ్చింది.సొ, మా మొదటి మీటింగ్ అలా అయ్యింది.
హైదరాబాద్ వచ్చాక అదితి,విక్కీ మేఘ ను వదలలేదు. విక్కీ గవ్రావ్ దగ్గరి కి రాలేదు కాని,ముందునుంచీ మేఘ తో బాగా నే ఆడాడు.అదితి క్య్తే మేఘ thega nachchesindi.enthyna దాని kistam అయిన బిపు మామ ,అను aththa kuthuru కదా.ముగ్గురు aadukun tu వుంటే muchchataga వుంది.padihenu రోజు లు వుంది వెళ్లి poyaru.మేఘ తో gadipinatle anipinchaledu.
మేము may లో langmaant వెళ్ళాక మేఘ తో full టైం gadipanu.rojanthaa nathote వుండేది.bayita kuda iddaramu thiruguthu వుండే vallamu.ekkadikyna vellalante మేము mugguram ready అయ్యి బయట nilabade vallamu.vakasari car లో velluthunte taata మీ bamma namaata vintam లేదు,emcheddamu అంటే mountain లో paresey అంది.zoo లో మేము chusinappudu zbra pufi chestindi.అది దాని all టైం hit joke.nee wife anatamu రాక thatha nee knife అనేది.
ఇప్పుడు మా ఇద్దరి కి vakate విషయం లో potlata.దాని కి snanam assalu istam లేదు.prathi saari edovakati చెప్పి bujjaginchi cheyinchalisi వస్తుంది.sarada కి దాని కి ఇదే potlata.tution teecher anitha raaga నే గొడవ చేసింది.వాళ్ళ mummy కి ఫోన్ చేసింది.marunaadu anitha friend ని వెంట theesu kochchindi.ఎందుకంటే మేఘ అంటే భయం ata thodu thechchukundi.నేను sarada chinnaga iddarini friends chesamu. కొద్దిగా కాలిక aమస వుందేమో అప్పుడప్పుడు తెగ కోపం వచ్చేస్తూ వుంటుంది.
చదువు లో churuke.power project లో presentetion చాల బాగా చేసింది.writing kuda chala neet గ వుంటుంది.కాని చాల baddakam.redu నెలల kritham వరకు bojanam దగ్గర గొడవ lekundane చేసేది.ఏది pettiina wow అనేది.subbalaxmi story అవసరము రాలేదు.కాని ఇప్పుడు గొడవ లేదు కాని t.vi choostho chinnaga thintondi.పాట లు dance లు thondaraga pattesthundi.yoga ఎంత బాగా chesthundo.edina chinnaga చెప్పాలి vintundi.leader ship ఎక్కువ.వాళ్ళ daddy danni pitta అని pilusthadu.వాళ్ళ thaatha stamp లో sign chesesi ఆ campany సొంతం chesesukundi.చిన్నప్పుడే తన రూమ్ లో సొంత కంప్యూటర్ వుండేది. ఎప్పుడు దాని మీదే ఆడుకుంటూ వుండేది.నిన్న దాని కి బార్బీ బొమ్మ వున్నా పింక్ కలర్ మిల్క్ కప్ తెస్తే బామ్మ ఇప్పుడు నాకు బార్బీ అన్నా పింక్ కలర్ అన్నా ఇష్టం లేదు ఇప్పుడు ఓ.కే ఇంకోసారి తేకు అని చెప్పింది.దట్ఇస్ మై మనvaraalu .

Monday, February 2, 2009

బుడుగు

ఎయిర్ పోర్ట్ లోవిక్కీ ని ని చూడ గానే అబ్బ ఎంత ముద్దుగా వున్నడూ aనుకున్నాను.పింకిష్ తెల్ల గా బొద్దుగా వున్నాడు.నేను ఎత్తు కుంటే రాలేదు.అలాగే సంజు వచ్చే వరకు ఎత్తుకో ని తిప్పాను.
తరు వాత నాకు చాల అలవాటు అయ్యాడు .నాతోటే తిరిగే వాడు.వంట ఇంట్లో పని చేసు కుంటూ వుంటే అక్కడే గిన్నల తో ఆడుకుంటూ వుండే వాడు .chiన్నప్పుడు నేను చదివిన బుడుగు బుక్ కోసం చాల వెతికాను కాని దొరక లేదు.ఎన్నో ఇయర్స్ కిందవి ఇప్పుడు పబ్లిష్ కావటము లేదు అన్నారు విశాలాంద్ర వాళ్ళు.వకసారి అమ్మ తో బుక్ ఎక్శిబిషన్ కి వెళితే అక్కడ విశాలాంద్ర స్టాల్ లో నే కనిపించింది.వెంటనే కొన్నాను. బుడుగు స్టొరీ అదితి ,విక్కీ ఇద్దరి కి చాల నచ్చింది..విక్కీ కవర్ పేజి మీద వున్నా పోజులన్ని పెట్టేవాడు.నేను బుడుగు ని అనేవాడు.బుడుగు నిక్కర్ లాంటి నిక్కర్ కావాలి అని అడిగాడు కాని అలాంటివి దొరకలేదు.పోనీ సస్పెదర్స్ కొందామని లాంగ్మంట్ లో వేతి కాను.వాడి సైజ్ దొరకలేదు కాని వాడి తాతా sఇజ్ వుంటే అయన కొనేసు కున్నారు. అంతా బుడుగు నే ఇమిటేట్ చేసే వాడు.జుజు జుజు జుఓ అని పాట మొదలు పెట్టగానే వకటే నవ్వేవాడు.వకరోజు పొద్దున్నే నేను లేచేసరి కి వాడు చిన్నగా సోఫా మీది కి ఎక్కు తున్నాడు.అప్పటికి వాడి కి ఇదు నెలలు కూడా లేవు.
వాడి కి అదితి కి మాటలు నడక అన్ని తొందర గానే వచ్చాయి.అదితి మేజర్ తాత నక్షత్రం మఖ లో పుడితే వీడు మాగల్ తాత ఉత్తర లో పుట్టాడు.మాగల్ తాత వాడి ని మహారాజా అని పిలుస్తారు.ఎప్పుడు ఏదో వక దెబ్బ తగులించుకుంటాడు.తల కి బొడిపలు రాకుండా గబ గబా నెయ్యి రాసే దాన్ని.సంజు రాగా నే వీడి దగ్గర నెయ్యి వాసనా వస్తోందేమిటి అన్కుంటూ వుంటే నేను బుజ్జి మాట్లాడే వాళ్ళము కాదు.ఎప్పుడు వాడి చిన్న తనము తలు చుకున్న మరచి పోలేనిది వాడి తల కు తగిలిన పెద్ద దెబ్బ.చాల బయ్యం వేసింది ఎట్లా హాస్పెటల్ కి తీసుకెళ్ళానో తెలిదు. గాబరా ఇప్పటి కి వేస్తుంది.
అదితి అనటము రాక అత్తి అనేవాడు పడు కునేతప్పుడు వాడి కి కూడా వాడి బిపు మామ లాగా జుట్టు కావాలి. నాదో .,సంజు దో ,అదితి దో పట్టుకోకుండా నిద్ర పోలేడు. .బిపు కూడా అంతే వుండేవాడు నేను పార్టీ కి వెల్ల లంటే నిద్ర పుచ్చాక చిన్నగా జయ జుట్టు ఇచ్చి వెళ్ళేదాన్ని.విక్కీ కి ఇంక a అలవాటు పోలేదట. ఇంక నా జుట్టు లాగుతూనే వుంటాడు అంటోంది అదితి.క్లాసు లో ఫ్యామిలీ గురించి చెప్పేటప్పుడు మీ కేవరంటే ఇష్టం అని టీచర్ అడిగితే అందరూ మమ్మీ అనో డాడీ అనో అంటే వీడు అమ్మమ్మ అని చెప్పాడట.నాకు జ్వరం వచ్చి హాస్పటల్ లో చేరితే నేను ఇంటి కి వచ్చే వరకు దిగులు పడ్డాడు.
చాల తెలివి గా వుంటాడు.ఎదైనా తొందరగా అర్దము చేసుకుంటాడు.నొప్పింపక తా నొవ్వక అనట్లు గా వుంటాడు.వాడి కి ఎవ్వరి తో గొడవ లేదు కాని , గౌరవ్. వచ్చిన కొత్తలో అమ్మమ్మ ని షేర్ చేసు కోవతము కష్టం గానే వుండేది.చిన్న గా వాడి ని పక్క కు జరుపుతూ వుండేవాడు.ఇప్పుడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.అయినా అప్పుడప్పుడు అమ్మమ్మ దగ్గర వక్కడే వుండటము వాడి కి ఇష్టం.
కార్ డ్రైవర్ శ్రీనివాస్ పేరు తో సికార్ అనేవాడు. కార్ కీ ని కా కి అనేవాడు.అందరి కి కాకి నే అలవాటు అయ్యింది.అందరి ని వాడు అంటుంటే ,వాడు వీడు అనకూడదు,ఆయన అనాలి అని లక్ష్మి చెబుతే ఇప్పుడు అందరు ఆయనలే .గౌరవ్ కూడా ఆయనే.ఆయన చూడు అమ్మమ్మ అని అంటుంటే గమ్మత్ గా వుంటుంది.మీ ఇంటి కి రావచ్చా?అని అడుగు తుంటాడు.అడగటము ఎందుకురా అంటే మమ్మీ అడగ మంది అంటాడు.వకసారి తలుపు చప్పుడితే ఎవరా అని చూస్తే చిన్న బుట్ట చేతు లో పట్టుకొని నిలబడి వున్నాడు.అప్పుడు వాడికి త్రీ యేఅర్స్ కూడా లేవు.ఇంత చిన్న వాడు ఎట్లా వచ్చాడా అనకుంటే సతీష్ లిఫ్ట్ లో నుండి చూస్తున్నాడు.మీ కోసం అడుగు తున్నాడు అందుకని తీసుకొచ్చాను.అన్నాడు.అట్లా తలుపు దగ్గర వాడి ని చూస్తే ఎంత ముద్దు వచ్చాడో.కిటి కి లో నిలబడి అన్ని కింది కి వేసేవాడు.వాచ్ మాన్ తెచ్చి ఇచ్చేవాడు. అందరు మీ వాడి సేవ చేయలేక వాచ్మన్ మానేస్తాడు అనేవారు.మోడరన్ టవర్స్ లో అదితి ,అదితి తమ్ముడు చాల ఫేమస్ .ఇప్పటి కి అందరు వాళ్ళని అడుగుతారు.పక్కింటి స్వప్న చాల ముద్దు చేసేది..
ఎంత సేపూ వాడి కి ఆటలు .హోం వర్క్ కూడా స్కూల్ లోనే చేసి వస్తాడు.క్లాసు అమ్మాయి లకి కూడా వాడంటే ఇష్టం.వాళ్ళ బర్త్డే డే పార్టీ కి అబ్బాయిలెవరిని పిలవరు కాని విక్కీ ని పిలుస్తారు.స్కూల్ లో లంచ్ చేయ కుండ ఆడుతున్నాడని ప్రిన్సిపాల్ రూమ్ లో కూర్చో పెట్టి తిని పిస్తుందట.తెలుగు రాయటము మహా బద్ధకం.ఎన్ని సార్లు చెప్పిన ఏదో రాసేస్తాడు.నెల కో సరి స్కూల్ కి వెళ్లి ప్రిన్సిపాల్ తో చివాట్లు తి ని రావటము సంజు కు తప్పని సరి.మరి బుడుగ్గాడు కదా.