Wednesday, February 18, 2009

భూతల స్వర్గం !

aమెరికా అంటే అందరి కి భూతల స్వర్గం.ప్రతి వాళ్ళు వెళ్ళాలి అని కలలు కనే ప్రదేశం.ప్లేన్ న్యూ యార్క్ లో ల్యాండ్ అవుతుండా gఆ అందరు చప్పట్లు కొట్టారు.వాళ్ళంతా స్టూడెంట్స్ అని అను కున్నాము.అట్లాంటా లో మొదటి నెల ఎక్కడి కి వెళ్ళలేదు.సతీష్ తో ఫార్మర్స్ మార్కెట్ కి వెళ్ళాను.మీకేమైనా కావాలంటే తీసు కొండి అని ప్రతి సారి aనే వాడు.నాకే మీ వుంటాయి అనుకునే దాన్ని. వాళ్ళ బాస్ చెప్పాడట మీ మదర్ ఇన్ లా కి షాప్పింగ్ చేయిస్తే సంతోశ పడ్తుంది అని.నా కేమి షాప్పింగ్ పని లేదు అని చెపితే ఆశ్చర్య పోయాడు.అదితి పాస్ పోర్ట్ కోసం సంజు నన్ను ,అదితి ని తీసు కెళ్ళింది.వచ్చే టప్పుడు దారి మరచి పోయింది.చక్కగా వురంత తిరిగాము.రోడ్స్ అన్ని నీట్ గ వున్నాయి.ఎక్కడ మనుషు లే లేరు.అంత కాళినే .అసలు వుల్లోనే వున్నామా అని పించింది.తరువాత ట్రిప్స్ లో కల్ల వూరు మారిపొయింది.అప్పుడు ఇంటి దగ్గర కూడా వక్క పిట్ట కూడా కనిపించలేదు.నేను కొంచం వాకింగ్ చేస్తానంటే ఇంటి ముందే,వంటి మీద బంగారం తీసేసి,తలుపు దగ్గర సంజు నిలబడి వుంటే అక్కడ అక్కడే తిరిగే దాన్ని.ఎందు కొచ్చిన గొడవ అని తరువాత మానేసాను. సంజు అప్పుడే మాల్ చూపించింది. రోన్డోసారి అంత ప్రాబ్లెం కాలేదు.అప్పుడు ఇంటెదురుగా సుబ్బారావు గారి ఫ్యామిలీ వుండింది.ఇంకొంత మంది తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు.సంజు,నేను,అదితి బర్మింగ్హాం వెళ్ళాము.డా.నాథ్ వెంకట్ ఫ్రెండ్ అప్పుడు బాబి అని చనువు గా పిలి చే దానిని ఇన్ని ఏండ్ల తరువాత బాబి అనాలంటే మొహమాటం అని పించింది.నాథ్,lakhmi ని చూస్తే చాల మంచి గా అని పిన్ చింది.ఇద్దరు కలిసి మెలిసి పనులు చేసుకుంటూ ,కబురులు చెప్పుకు నటు వుంటుంటే ఫ్రెండ్స్ లా అనిపించారు.స్వాతి పెళ్లి కి ముందునుంచే అన్ని ప్లాన్లు వేసి దాని ప్రకారమే చేసారు.ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళ దగ్గర వుండి ట్రైనింగ్ kaవాలి .
రవి,సబితా వచినప్పుడు రాకీ ఫాల్స్ కి వెళ్ళాము.ఆ ఫాల్స్ భూమి అడుగున వున్నాయి.లిఫ్ట్ లో కిది కి వెళ్ళాక చాల భయం వేసి,అందులోనే అదితి ని తీసు కొని బయట కి వచ్చేసాను.అట్లాంటా లో అంతకు ముందే ఒలంపిక్ గేంలు అయ్యాయి.ఆ గ్రౌండ్,సి.యాన్.యన్.స్టేషన్ చూసాను.
లోన్గ్మొంట్ లో జూలై ౪థ్ న అమెరికన్ పెరేడ్ ,సెలబ్రేషన్స్ బాగున్నాయి.అట్లాంటి చోతులకు వెళ్ళినప్పుడు ఎవరి కుర్చీలు ,ఎవరి స్నాక్స్ వాళ్ళు తీసు కేల్లతము గమ్మత్తు గ అనిపించింది.బోల్దేర్ స్ట్రీట్ కి ఇద్దరమే బస్ లో వెళ్లి వచ్చాము.పోర్ట్ ల్యాండ్ లో దీప,వి న య ,సాన్ ఫ్రాన్ స్కో లో గౌ తం ,బాల,హుస్తాన్ లో రమేష్ ,సుభాషిని ,వాషింగ్తన్న లో రవి,సబితా,హరిణి,ఇతాకా లో దీప్తి ,విశ్వనాథ్,ద్యుతి బాగా చూసు కున్నారు.అన్ని తిప్పి చూపించారు.న్యూ యార్క్ లో బస్ మీద కూర్చొని వాన లో రైన్ కట్స్ వేసు కొని వెళుతుంటే పూనా గుర్తుకు వచ్చింది.నయాగరా వాటర్ ఫాల్స్ చూస్తే నిజంగానే భూతల స్వర్గం అని పించింది.ఎక్కడో అంటిక్ స వున్నాయి అంటు వెళ్లి చూస్తే అక్కడ అన్ని,రోలు ,బండి,పాత కార్ వగిరా చూపి వంద ఏండ్ల క్రితం వి అంటుంటే నవ్వు వచ్చింది.మా తాతగారి ఇల్లు నూట యాబీ ఏండ్ల క్రితంది అనుకున్నాను.నాలుగు సార్లు అమెరిక వెళ్ళిన మంచు కురవటము చూడలేదు అనుకున్నాను.కాని,లోన్గ్మొంట్ నుండి బయిసీ కి వెళ్ళేటప్పుడు దారి అంత ముంచు కుర్స్తునే వుండింది.అను,నేను,మేఘ,గౌరవ వక కార్ లో అను డ్రైవింగ్ లో వెళ్ళాము.ఆ జర్నీ చాల ఎంజాయ్ చేశాను. వక అమెరికన్ పెళ్లి .సంజు బాస్ పెళ్లి చూసాను .లోస్వేగాస్ మిస్ అయ్యాము.

1 comment:

cbrao said...

"కాని,లోన్గ్మొంట్ నుండి బయిసీ కి వెళ్ళేటప్పుడు దారి అంత ముంచు కుర్స్తునే వుండింది." -అసలు ఈ వూళ్లు ఎక్కడున్నయో అంతుపట్టడం లేదు. Travelogues లో ఛాయాచిత్రాలు లేకపోతే, ఉప్పు తక్కువైన కూరలలా ఉంటాయి.