Friday, February 27, 2009

అభిమాన రచయిత్రి ని కలసిన వేళ

బుడుగు ,చందమామ ,టామ్ సాయర్,హకల్ బెరిఫెన్ ,గణపతి,బారిష్టర్ పార్వతీశం మొదలైనవి చదివాను.పెళ్లి తరువాత బుక్స్ చదవటము తగ్గింది.స్వర్ణ బలవంతము మీద ఆర్.కే లైబ్రరీ కి వెళ్ళాను .తను అన్నీ సస్పెన్స్ నవల్స్ చదివేది.నేను అవి చదవలేను అంటే,కొత్తగా యద్దనపూడి నావలలు వస్తున్నాయి,సెక్రటరీ చాలా హిట్ అయ్యింది చదివి చూడు అంది.అప్పుడు మొదలు పెట్టాను నవలలుచదవటముఇ ప్పటికి మానలేదు.చాల లైట్ గా వుండేవి,మామూలు వి మాత్రమే చదవగలను.యద్దనపూడి,ఆనందారామం,మల్లాది,యండమూరి,పొత్తూరి విజయలక్ష్మి ,పోల్కంపల్లి శాంత దేవి,కోడూరి కౌసల్య,మాదిరెడ్డి సులోచన,చిట్టారెడ్డి,గోవిందరాజు సీతాదేవి మొదలయినవారి నవలలు చదివాను.
నేను చదవటము మొదలు పెట్టేసరికే యద్దనపూడి సులోచనారాణి వి రెండు ,మూడు నవలలు వచ్చాయి.అప్పట్లో సెక్రటరీ చాల పెద్ద హిట్.అమ్మాయిలు పెళ్ళికొడుకు నచ్చలేదు అంటే రాజశేఖర్ లాంటి ఆరడుగుల అందగాడు,పడవ అంత కారు వున్నవాడు ఎక్కడ దొరుకు తాడు అనేవారు.రాజశేఖర్ ఎవర్గ్రీన్ హీరో. అందగాడు,సమర్దుడు ,అందరికి ఇష్టుడైన హీరో. సన్నగా ,అందంగా ,పుష్కలం గా ఆత్మాభిమానం వున్న హీరోయిన్ యద్దనపూడి కే సొంతం.కోతి-కొమ్మచ్చి లో ముళ్ళపూడి అన్నట్లు నవల మద్యలో నుంచి చదవటము మొదలు పెట్టినా ,ముందు ఏమి మిస్ అయ్యామో అని టెన్షన్ వుండదు.ఎక్కడ నుంచి చదివినా చివరి వరకు విడవకుండా చదవగలము.చదువుతున్నంత సేపు ఆహ్లాదం గా ,అందమైన పూ తోట లో వున్నట్లు గా వుంటుంది.మూడ్ సరిగా లేన్నప్పుడు చదివితే నాకైతే మూడ్ బాగవుతుంది.ఏవో సందేశాలు,డాన్లు,రక్తపాతాలు వుండవు.అదే సమయము లో సమకాలిన సమస్యలు కొద్దిగా టచ్ అవుతాయి.కుటుంబంలో బామ్మలు,అమ్మమ్మల అవసరము ,ప్రేమాభి మానాలు తెలుపుతాయి.మీనా మా ఫ్రెండ్స్ సర్కిల్ లో చర్చనీయాంసం అయ్యింది.పెద్ద వాళ్లు ఏమి చేసిన పిల్లల బాగు కొరకే చేస్తారు కదా నచ్చక పోతే చెప్పాలి కాని చివరి వరకు అంత పిరికి గా వుండి తల్లి ని,ఎదిరించి నవ్వుల పాలు చేయటము చాలా మంది పెద్దలకు నచ్చలేదు.
ఆ నావలల ని సినిమాలు గా కుడా తీసారు.కాని నావలలు లో వున్నా సున్నితము ,అందము సినిమాలలో కనిపించలేదు.విచిత్ర బందం ,సెక్రటరీ నాకు నచ్చలేదు.జీవనతరంగాలు,మీనా పరవాలేదు అన్పించాయి.ఇంకా చాలానే సినిమాలు తీసారు కాని,నవల మీది ప్రేమ పోగొట్టుకో లేక నేను ఇంకేవి చూడలేదు.
తరువాత టి.వి లో సీరియల్స్ గా కూడా తీసారు.అందులో రాధ-మధు మాత్రమే చూసాను. నవలల లోని పాత్ర లకు సరి అయిన న్యాయము ఎవ్వరు చేయలేక పోతున్నారు అనిపిస్తోంది.జీవన తరంగాలు లో వేణుగోపాల రావు తప్ప మిగితా ఎవ్వరు ఆ పాత్రల కి సరి పోలేదని పించింది.లక్ష్మి తీసిన మూడు సీరియల్స్ ,రుతురాగాలు ,అప్పుడు నేను బిజీ గా వుండటము మూలంగా చూడలేదు.మొగలి రేకులు సౌగంది ఆదారంగా తీస్తున్నారట.అబ్బో,వాళ్ల సీరియల్స్ చాల ఏళ్ళు నడుస్తాయి.అన్ని ఏళ్ళు చూసే ఓపిక లేదు.
యద్దనపూడి సులోచనా రాణి ని మొదటి సారిగా రాణి పెళ్ళిలో చూసాను.బుజ్జమ్మ ఆమ్మ రాయచూరు బాబు కూతురు అని పరిచయం చేసారు.ఆ తరువాత ఆవిడని కలిసే సందర్భము రాలేదు.జ్యోతి కొడుకు పెళ్లి కి నేను వెళ్ళేసరికి కి ఆవిడ వెళ్లి పోయారు.ఇప్పుడే వెళ్లారు అని పార్వతి అంది.అయ్యో మిస్ అయ్యానే అని అనుకున్నాను.మనము ఇంటి కి పోదాములే అని లక్ష్మి అంది.అనుకోకుండా మొన్న వెళ్ళటాని కి వీలయింది.బిపు,అయన ఆవిడ నవల్స్ గురించి అడిగి ఏమేమి మాట్లాడాలో బ్రీఫ్ చేసారు.నేను, లక్ష్మి వాళ్ల ఇంటికి వెళ్ళాము.లక్ష్మి నన్ను ఆవిడకి,మామయ్యగారి కి పరిచయం చేసింది.నేను ఆవిడ కి బోకే ఇచ్చాను.ఆవిడ నవ్వుతు అది తేసుకొని నన్ను హాగ్ చేసారు.దాదాపు రెండు గంటలు కూర్చున్నాము.అంత సేపు ఎక్కడా వక పెద్ద రచయిత్రి ని అని ఆవిడ చూపలేదు.చాలా ఆత్మీయంగా మాట్లాడారు.ఫ్రెండ్లీ వాతావరణము వుండింది.మీరు ఎక్కడ వుంటారు,పిల్లలు ఏమి చేస్తున్నారు అని అడిగారు.మీకు టైం పాస్ ఎట్లా అని అడిగారు.ప్రస్తుతము బ్లాగ్ రాస్తున్నాను అని చెప్పాను.ఎం రాసారు అని అడిగారు.నా పెళ్లి రోజు తో మొదలు పెట్టాను.ప్రస్తుతము నా జీవితము లోని మధురక్షణాల గురించి రాస్తున్నాను అన్నాను.చాల మంచి ఆలోచన అని మెచ్చుకున్నారు.నా పెళ్లి రోజు గురించి అనగానే లక్ష్మి అంది లడ్డుల గురించి రాసావా అని అదేంటి నాకు తెలీదే అన్నాను.మా పెళ్లి అప్పుడు మేము చలకుర్తి నుంచి వచ్చి లక్ష్మి వాళ్ల ఇంట్లో నే వున్నాము.పెళ్లి కోసం అని చాలా లడ్డులు చేసి వరండాలో చాపల మీద ఆరపెట్టారు.లక్ష్మి తమ్ముళ్ళు ముగ్గురు,వాళ్ల ఫ్రెండ్స్ ఎవరు ఎన్ని ఎక్కువ లడ్డు లు తినగలరు అని పందెం వేసుకొనే తిన్నారు.అందరి లో కి చిన్నవాడు మనోజ్ ఆరు ఏండ్ల వాడు ముప్పయి లడ్డులు తిన్నాడు.పైగా తీసినట్లు తెలీకుండ అక్కడక్కడ నుండి తీసారు.ఆ సంగతి లక్ష్మి చెప్పగానే అందరమూ చాలా నవ్వాము.ఈ రోజు బ్లాగ్ లో మీ గురించి రాస్తాను అన్నాను .ఆ విడ నవ్వారు.అది పర్మిషన్ అనే అనుకుంటున్నాను.తరువాత మనవళ్ళు,మనవరాళ్ళు గురించి చెప్పుకున్నాము.ప్రస్తుతము ఏమి రాయటము లేదట.సోషల్ సర్విస్ చేద్దామని వక ట్రస్ట్ పెట్టారట.అందు లోనే బిజీ గా వుంటాను అన్నారు.మా చెల్లెలు జయ మీ నవల్స్ గిఫ్ట్ గా ఇచ్చింది.అన్నాను.మీరు రాయటము మనేయవద్దు.,అంటే మానేయ వద్దా అని నవ్వారు.టీ ,స్నాక్స్ తీసుకొని ,సంతృప్తి నిండిన మనసు తో వచ్చాను.

No comments: