Monday, February 2, 2009

బుడుగు

ఎయిర్ పోర్ట్ లోవిక్కీ ని ని చూడ గానే అబ్బ ఎంత ముద్దుగా వున్నడూ aనుకున్నాను.పింకిష్ తెల్ల గా బొద్దుగా వున్నాడు.నేను ఎత్తు కుంటే రాలేదు.అలాగే సంజు వచ్చే వరకు ఎత్తుకో ని తిప్పాను.
తరు వాత నాకు చాల అలవాటు అయ్యాడు .నాతోటే తిరిగే వాడు.వంట ఇంట్లో పని చేసు కుంటూ వుంటే అక్కడే గిన్నల తో ఆడుకుంటూ వుండే వాడు .chiన్నప్పుడు నేను చదివిన బుడుగు బుక్ కోసం చాల వెతికాను కాని దొరక లేదు.ఎన్నో ఇయర్స్ కిందవి ఇప్పుడు పబ్లిష్ కావటము లేదు అన్నారు విశాలాంద్ర వాళ్ళు.వకసారి అమ్మ తో బుక్ ఎక్శిబిషన్ కి వెళితే అక్కడ విశాలాంద్ర స్టాల్ లో నే కనిపించింది.వెంటనే కొన్నాను. బుడుగు స్టొరీ అదితి ,విక్కీ ఇద్దరి కి చాల నచ్చింది..విక్కీ కవర్ పేజి మీద వున్నా పోజులన్ని పెట్టేవాడు.నేను బుడుగు ని అనేవాడు.బుడుగు నిక్కర్ లాంటి నిక్కర్ కావాలి అని అడిగాడు కాని అలాంటివి దొరకలేదు.పోనీ సస్పెదర్స్ కొందామని లాంగ్మంట్ లో వేతి కాను.వాడి సైజ్ దొరకలేదు కాని వాడి తాతా sఇజ్ వుంటే అయన కొనేసు కున్నారు. అంతా బుడుగు నే ఇమిటేట్ చేసే వాడు.జుజు జుజు జుఓ అని పాట మొదలు పెట్టగానే వకటే నవ్వేవాడు.వకరోజు పొద్దున్నే నేను లేచేసరి కి వాడు చిన్నగా సోఫా మీది కి ఎక్కు తున్నాడు.అప్పటికి వాడి కి ఇదు నెలలు కూడా లేవు.
వాడి కి అదితి కి మాటలు నడక అన్ని తొందర గానే వచ్చాయి.అదితి మేజర్ తాత నక్షత్రం మఖ లో పుడితే వీడు మాగల్ తాత ఉత్తర లో పుట్టాడు.మాగల్ తాత వాడి ని మహారాజా అని పిలుస్తారు.ఎప్పుడు ఏదో వక దెబ్బ తగులించుకుంటాడు.తల కి బొడిపలు రాకుండా గబ గబా నెయ్యి రాసే దాన్ని.సంజు రాగా నే వీడి దగ్గర నెయ్యి వాసనా వస్తోందేమిటి అన్కుంటూ వుంటే నేను బుజ్జి మాట్లాడే వాళ్ళము కాదు.ఎప్పుడు వాడి చిన్న తనము తలు చుకున్న మరచి పోలేనిది వాడి తల కు తగిలిన పెద్ద దెబ్బ.చాల బయ్యం వేసింది ఎట్లా హాస్పెటల్ కి తీసుకెళ్ళానో తెలిదు. గాబరా ఇప్పటి కి వేస్తుంది.
అదితి అనటము రాక అత్తి అనేవాడు పడు కునేతప్పుడు వాడి కి కూడా వాడి బిపు మామ లాగా జుట్టు కావాలి. నాదో .,సంజు దో ,అదితి దో పట్టుకోకుండా నిద్ర పోలేడు. .బిపు కూడా అంతే వుండేవాడు నేను పార్టీ కి వెల్ల లంటే నిద్ర పుచ్చాక చిన్నగా జయ జుట్టు ఇచ్చి వెళ్ళేదాన్ని.విక్కీ కి ఇంక a అలవాటు పోలేదట. ఇంక నా జుట్టు లాగుతూనే వుంటాడు అంటోంది అదితి.క్లాసు లో ఫ్యామిలీ గురించి చెప్పేటప్పుడు మీ కేవరంటే ఇష్టం అని టీచర్ అడిగితే అందరూ మమ్మీ అనో డాడీ అనో అంటే వీడు అమ్మమ్మ అని చెప్పాడట.నాకు జ్వరం వచ్చి హాస్పటల్ లో చేరితే నేను ఇంటి కి వచ్చే వరకు దిగులు పడ్డాడు.
చాల తెలివి గా వుంటాడు.ఎదైనా తొందరగా అర్దము చేసుకుంటాడు.నొప్పింపక తా నొవ్వక అనట్లు గా వుంటాడు.వాడి కి ఎవ్వరి తో గొడవ లేదు కాని , గౌరవ్. వచ్చిన కొత్తలో అమ్మమ్మ ని షేర్ చేసు కోవతము కష్టం గానే వుండేది.చిన్న గా వాడి ని పక్క కు జరుపుతూ వుండేవాడు.ఇప్పుడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.అయినా అప్పుడప్పుడు అమ్మమ్మ దగ్గర వక్కడే వుండటము వాడి కి ఇష్టం.
కార్ డ్రైవర్ శ్రీనివాస్ పేరు తో సికార్ అనేవాడు. కార్ కీ ని కా కి అనేవాడు.అందరి కి కాకి నే అలవాటు అయ్యింది.అందరి ని వాడు అంటుంటే ,వాడు వీడు అనకూడదు,ఆయన అనాలి అని లక్ష్మి చెబుతే ఇప్పుడు అందరు ఆయనలే .గౌరవ్ కూడా ఆయనే.ఆయన చూడు అమ్మమ్మ అని అంటుంటే గమ్మత్ గా వుంటుంది.మీ ఇంటి కి రావచ్చా?అని అడుగు తుంటాడు.అడగటము ఎందుకురా అంటే మమ్మీ అడగ మంది అంటాడు.వకసారి తలుపు చప్పుడితే ఎవరా అని చూస్తే చిన్న బుట్ట చేతు లో పట్టుకొని నిలబడి వున్నాడు.అప్పుడు వాడికి త్రీ యేఅర్స్ కూడా లేవు.ఇంత చిన్న వాడు ఎట్లా వచ్చాడా అనకుంటే సతీష్ లిఫ్ట్ లో నుండి చూస్తున్నాడు.మీ కోసం అడుగు తున్నాడు అందుకని తీసుకొచ్చాను.అన్నాడు.అట్లా తలుపు దగ్గర వాడి ని చూస్తే ఎంత ముద్దు వచ్చాడో.కిటి కి లో నిలబడి అన్ని కింది కి వేసేవాడు.వాచ్ మాన్ తెచ్చి ఇచ్చేవాడు. అందరు మీ వాడి సేవ చేయలేక వాచ్మన్ మానేస్తాడు అనేవారు.మోడరన్ టవర్స్ లో అదితి ,అదితి తమ్ముడు చాల ఫేమస్ .ఇప్పటి కి అందరు వాళ్ళని అడుగుతారు.పక్కింటి స్వప్న చాల ముద్దు చేసేది..
ఎంత సేపూ వాడి కి ఆటలు .హోం వర్క్ కూడా స్కూల్ లోనే చేసి వస్తాడు.క్లాసు అమ్మాయి లకి కూడా వాడంటే ఇష్టం.వాళ్ళ బర్త్డే డే పార్టీ కి అబ్బాయిలెవరిని పిలవరు కాని విక్కీ ని పిలుస్తారు.స్కూల్ లో లంచ్ చేయ కుండ ఆడుతున్నాడని ప్రిన్సిపాల్ రూమ్ లో కూర్చో పెట్టి తిని పిస్తుందట.తెలుగు రాయటము మహా బద్ధకం.ఎన్ని సార్లు చెప్పిన ఏదో రాసేస్తాడు.నెల కో సరి స్కూల్ కి వెళ్లి ప్రిన్సిపాల్ తో చివాట్లు తి ని రావటము సంజు కు తప్పని సరి.మరి బుడుగ్గాడు కదా.

No comments: