కొత్త మురిపెం అనుకుంటూ ఎంత భయం ,ఆదుర్దా ,ఆందోళన ,మొదలైన రకరక్లాల భావాలతో కొత్త్త బంగారు లోకం లోకి వెళ్ళానో అంతే భావాలతో అమెరికా కి ప్రయాణం అయ్యాను. 84 లో హైదరాబాద్ తిరిగి రావటము పిల్లల చదువులు , పార్లర్ పెట్టుకోవటము ,సంజు పెళ్లి అన్ని చకచకా జరిగి పోయాయి.ఆర్మీ నుంచి రావటము బాద లేదు కాని అయన యునిఫారం ని ఊర్లు తిరగాటని చాల మిస్ అయ్యాను. 12 సంవత్సరాల తరువాత ప్రయాణము.మల్లాది పిల్లల బుక్ ,కొన్ని కథల బుక్స్ కొన్నాను.అలక ఫ్రెండ్ దగ్గర కొన్ని ఫ్రాక్స్ కుట్టించాను.పూనా లో నేను ఫ్రాక్స్ కుట్టినప్పుడు అందరు అమ్మాయి పుడుతుంది అన్నారు.ఇప్పుడు కూడా ఫ్రాక్సే కుట్టించాను .ఇప్పుడు కూడా అందరు అమ్మాయే పుడుతుంది అన్నారు.అయితే ఏమవుతుంది.అమ్మాయిలు వుంటేనే ఇంట్లో సందడి అన్నాను.ప్లేన్ నుంచి దిగే సరికి సతీష్ వచ్చి వున్నాడు.ఆ రోజంతా నిద్ర పోతూనే వున్నాను.ముడో రోజు రాత్రి సంజు కు నొప్పులు మొదలయినాయి.వెంటనే హాస్పెటల్ కి వెళ్ళాము.సంజు ఫ్రెండ్ శాంతి వచ్చింది.ఇక్కడ సంజు తో పాటు మేము కూడా వుండటము తప్పనిసరి అట.నేనేమో చూడ లేను.కొంచము సేపు వుండటము బయట కి వచ్చి కూర్చోవటము ,.బయట కూర్చో ని హనుమాన్ చాలీసా లలిత చదువు కుంటూ వున్నాను.అప్పుడే ఒక కపుల్ అక్కడే ఏవో వ్యాయామాలు చేస్తున్నారు.వాళ్ళు చేసేవి చూస్తుంటే చాల నవ్వు వచ్చింది.అలా నవ్వ కూడదని తరువాత సంజు చెప్పింది.
కొద్ది గ కళ్లు మూతలు పడ్డాయి.సోఫా లో వెన్నకి వాలి కళ్లు మూసు కున్నాను.ఏదో అమ్మవారి గుడి కి వెళ్ళాను.అందరు అమ్మవారిని చూసి వెళ్లి పోతున్నారు.నేను కూడా వెళ్ళు తుంటే పూజారి,వెళ్లి పోతావేమిటి దండం పెట్టు కో అన్నాడు.నేను దండం పెట్టుకుంటూ పెట్టు కుంటూ వుంటే శాంతి వచ్చి లేపి ఆంటీ పాపా పుట్టింది అని చెప్పింది.వక్క నిమిషం నేను ఎక్కడ వున్నానో తెలిలేదు.తరువాత చాల సంతోషం వేసింది.అమ్మవారే వచ్చింది అనుకున్నాను.(తరువాత అను వాళ్ళ అమ్మ తో కట్టే మైసమ్మ గుడి కి వెళితే నాకు కల్లో వచ్చిన గుడి అదే అని ఆశ్చర్య పోయి చూస్తూ వుంటే అప్పుడు కూడా పూజారి దండం పెట్టుకొమ్మ అని కలలో అనినట్లే అన్నాడు.) వెంటనే వెళ్లి చూసాను.ఎంత ముద్దుగా వుందో.పుట్టిన వెంటనే నేను చూసిన మొదటి పాపా అదితి నే.ను నా పిల్లల ని పుట్టిన చాల సేపు తరువాత చూసాను.ఇంక స్నానం చేయించ నే లేదు అప్పుడే కళ్లు తెరిచి చూస్తోంది.అదితి కి స్నానం చేయించటము కూడా భయం భయం గా చేయించాను.అక్కడ నేనే పెద్ద దిక్కు.ఆ పెద్దరికము కూడా బాగానే వుంది .
రోజు స్నానం చేయించటము, నా కొచ్చిన పాటలని పాడటము.ఎన్ని పాట లో పాపం పిచ్చ్చి పిల్ల నాపాటలన్నీ వింది.నా ప్రావిణ్యం అంత దాని మీదే.నేను ఎటు వెళితే అటు కను రెప్ప వేయకుండా చూసేది.ఎనమిది నెలలు చాల ఎంజాయ్ చేశాను.చాల గుడ్ గర్ల్.హైదరాబాద్ వచ్చే టప్పుడు ప్రయాణం లో కూడా ఏడవ లేదు.
తిరుపతి లో గుండు చేయించి నామాలు పెట్టి,పింక్ కలర్ డ్రెస్ వేస్తే ఎంత బాగుందో.వాళ్ళు తిరిగి వెళ్లి పోయాక నేను అదితి ని చాల మిస్ చేశాను.తిరిగి రెడేళ్ళ తరువాత నేను మళ్ళి అట్లాంటా వెళ్లి నప్పుడు చూసాను.అప్పటి కి కొంచము పెద్దది అయ్యింది.ఈసారి అన్ని కథల బుక్స్ తీసుకెళ్ళాను..చాల మాటలు,పద్యాలూ చెప్పేది.ఎంతసేపు మాల్ ఆటలు ఆడేది.బయిటికి వెళ్ళితే ఇంటికి రావటము ఇష్టము వుండేది కాదు.వేరే మాల్ కు వెలుదాము ఇంకులోకి వద్దు అనేది. హంట్స్ విల్ల్ లో ఇద్దరమూ కాలనీ అంత తిరిగే వాళ్ళము.బిపు ఇంటి ముందు ఒక పూల చెట్టు వుంది. .దాన్ని నిండా పింక్ కాలర్ పూలు వుండేవి.అ చెట్టును వూపుతే జల జలా పూలు రాలేవి.అప్పుడు మల్లె పూల వాన అని పాడేది.కొన్నిసార్లు అను కాలేజీ కి వెళుతూ మమ్మలి ని మాల్ లో దింపి వెళ్ళేది.తిరిగి వెళ్ళేటప్పుడు తీసు కేల్లేది.వకసారి అదితి చేతు లో నించి పాప్కార్న్ పడిపోయాయి.అను గబగబా ఎత్తుతుంటే అదితేమో ఎవ్రి బడీ క్లీన్ అప్ అని పాడటము మొదలు పెట్టింది.అందరూ నవ్వటమే.ఎ పని చేసిన క్లీన్ గ చేసేది .బయట నుంచి రాగానే ఫ్రాక్ విప్పి హాంగర్ కి తగిలించేది..నేను పని చేస్తుంటే హెల్ప్ చేయటాని కి వచ్చేది.కొత్తిమీర ఒకొక్క ఆకు ఎంత బాగా తుంపేదో .పక్క వేస్తుంటే చక్కగా ముడతలు లేకుండా వేస్తుంది.ఇప్పటి కి ఆ జాగ్రత్త అలాగే వుంది.అందరి తో కలిసి పోతుంది. .పెద్ద అమ్ముమ్మ కి అదితి పాటలంటే చాల ఇష్టము.ఎప్పుడు పాడమని అడుగుతూ వుంటుంది.తాత మా అదితి చిన్న బంగారు తల్లి అంటారు.గౌరవ్ అయితే ఎప్పుడు అదితి ఇంటికి వెళ్ళాలి అంటుంటాడు. నా ఇష్టాలు కొన్ని అదితి కి వచ్చాయి అనుకుంటాను.నా కుట్లు అల్లికలు బుక్ దాని కే ఇచ్చాను.నా బర్త్డే కి చిన్న గుండ్రాయి మీద పెంట్ చేసి ఇచ్చింది.చాల బాగుంది.ఇంట్లో అందరి కి లవ్లు బేబీ. అన్నం పెట్టి మింగావా అంటే మింగాను అనటము రాక మింగు అనేది.అన్నం తిన్నప్పుడల్లా సుబ్బలక్ష్మి స్టొరీ చెప్పుకు నే వాళ్ళము.మా పిల్ల లందరికి మింగావా మింగు,సుబ్బలక్ష్మి స్టొరీ అలవాటు అయ్యింది.ఇప్పుడు అందరు సుబ్బలక్ష్మి స్టొరీ వద్దు అన్నం తింటాం అంటారు.అదితి కైతే సుబ్బలక్ష్మి స్టొరీ బోర్ అయ్యిందట.మొదలు పెట్టగానే వద్దు వద్దు అంటారు.అదీ సంగతి. ఇక ఇదు రోజుల లో టీన్స్ లో కి వేలుతానని ఎదురు చూస్తోంది.ఇప్పుడు నాకే అన్ని నేర్పిస్తూ ఉంది .నీ మెయిల్ ఐ.డి ఇమ్మంటే నువ్వే కాలం లో వున్నావు.మేము పేస్ బుక్ వాడుతాము అంది .ఫ్రెండ్స్ అంతా పేస్ బుక్ చూస్తారట.అందు లో నే చాట్ చేస్తారట.నొవెల్స్ చదువు తోంది.చూస్తూ వుండగానే ఎంత పెద్దది అయిపోయిందో. కాని నాకు మాత్రం చిన్నప్పుడు తనకిష్టమైన బార్నీ షో లోని పాట ఐ లవ్ యు ,యు లవ్ మీ పాడు కుంటూ ,టెల్లీ టబ్బీస్ చూస్తూ గెంతుతూ వుండే ,చిన్న చిన్న ఫ్రాక్స్ వేసుకొని ముద్దు ముద్దు గా ఉన్న అదితి లాగానే కనిపిస్తుంది..మా చిన్ని అదితి మాకు ముద్దు.
Friday, January 30, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment