Wednesday, January 14, 2009

సంక్రాంతి

ముచ్చటగా మూడు రోజుల పండుగ సంక్రాంతి.వాటిని భోగి,సంక్రాంతి,కనుమ అంటారు.వుత్సాహంగా జరుపుకునే సంక్రాంతి లో ఎన్నో విశేషాలు వున్నాయి.హేమంత రుతువు లో గడగడా లాడించే చలి లో మంచు లో పంట పొలాల మీదు గా శుభాలు వెంట తీసుకొని వస్తుంది ధాన్య లక్ష్మి,అందరి ఇండ్ల లో కి ఆ రోజున.సుఖ సంపద ఇచ్చే ఆ దేవి కి శుభ్ర మైన వాతావరణం లో ఆహ్వానం పలకాలి.అందు కే అందరు ఇంటి కి రంగు లు వేసి,గుమ్మా ని కి పసుపు,కుంకుమ పెట్టి,తోరణాలు కట్టి ధాన్య లక్ష్మి కి పూజ లు చేస్తారు.
అదే రోజు సూర్య భగవానుడు మకర రాశి లో ప్రవేశించటము వలన ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది.అది చాల శుభ ప్రదం గా భావిస్త్రు, నదీ స్నానం చేసి దాన ధర్మాలు చేస్తారు.
ఆ రోజు సూర్యోదయా ని కి ముందే స్నానం చేసి,కొత్త బట్టలు కట్టుకోని పొంగలి తినటము సాంప్రదాయము .
మొగ పిల్లలు డాబా ల మీద గాలి పటాలు ఎగుర వేస్తారు.
ఆడపిల్లలు ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేస్తారు.
కొత్త అల్లుళ్ళు అత్తవారి ఇంటి కి వస్త్తారు.కొత్త బట్టల తో,పిండి వంటల తో అత్తవారు వారిని సంతోష పెడుతారు.
ఇల్లు కొత్త పంటల తో కళకళ లాడుతాయి.జంగమ దేవరులు,హరిదాసులు,గంగిరెద్దులవారు కను విందు చేస్తారు.
భోగి రోజు చిన్న పిల్లలకి భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు .బొమ్మల కొలువు పెడతారు.
తరవాతి రోజు కనుమ.ఈ విధము గా మూడు రోజు లు పండుగ సంబరాలు జరుపు కుంటారు.

No comments: