Thursday, January 8, 2009

ఆ పాత మధురాలు

త్రిపురారం వెళ్లి కొన్ని రోజులు వుందామని బయిలు దేరాను.మళ్లీ eక్కువ రోజు లైతే ప్రయాణము చేయలేను.డెలివరీ కి హైదరాబాద్ లో నే బాగుంటుందని అనుకోని అమ్మని నాన్నగారిని ఒప్పించారు.ఈ లో వెళ్లి రావాలని అనుకున్నాను.యెవీనిగ్ బస్ లో బయిలుదేరము.నార్కెట్పల్లి లో బస్ ఆగి పోయింది.బయిలు దేరటానికి ఎదురు చూస్తూ కూర్చోన్నాము.నా చిన్నతనం అంతా గుర్తుకు వచ్చింది. నాన్నగారు రాయచూర్ లో పని చేస్తుండగా నిన్తీన్ ఫిఫ్టీ వన్ జూలై ట్వంటీ ఫిఫ్త్ న పుట్టాను. అప్పటి సంగతులు వైదేహీ అత్తయా చెపుతూ వుంటుంది.అందరూ నన్ను చాల ముద్దు చేసే వారట.చారి మామయ్యగారు ఎప్పుడూ ఎత్తుకునేవారట. అత్తయ్య చెపుతుంది నన్ను ఎత్తుకొని బంగారు పాపాయి బహుమత్లు పొందాలి పాట పాదేదట అనుడుకేనేమో నాకు ఆ పాట అన్నా అది పాడిన రావు బాల సరస్వ్వతి అన్నా ఇష్టం.ములుగు కొద్ది కొద్ది గా గురుతు.నాన్నగారి ఆఫీసు .లో పున్నాగ చెట్టు కింద పూలు ఎరుకోవతము బద్రవతి అత్తయ్య పెద్ద పెద్ద రొండు జడలు మాత్రమే గుర్తున్నాయి.తరువాత మానుకోట వెళ్ళాము.అక్కడ స్కూల్ లో చేర్చటని కి నాన్నగారు తిసుకేల్లారు హెడ్మాస్టర్ ఒక సర్ ని పిలిచి నాకు టెస్ట్ పెట్టమన్నారు.నేను రాసిన పేపర్ చూసి నాన్నగారి తో మాథ్స్ బాగా చేసింది.థర్డ్ క్లాసు లో కాదు ఫిఫ్త్ క్లాసు లో చేరచ్చు కుంటాము అన్నారు. అలా ఫిఫ్త్ క్లాసు లో చేరాను.అప్పటి నుండి మాథ్స్ అంటే చాల ఇస్టం.మా యింటి పక్కన బామ్మగారు మాకు పేపర్ లు మెంతులు కలిపి రుబ్బి చిన్న చిన్న గిన్నెలు చేసి అందు లో పప్పులు వేసి ఇచ్చే వారు.వారి మనవరాలు భాను ,నేను ఆడు కునే వాళ్ళము.సెలవల్లో అత్తయ్య పార్వతి,శ్యామల వచ్చేవారు.జయ,శ్యామల ఆడుకుంటూ వుంటే నేను,పార్వతి స్కూల్ లో నేర్చు కున్న పాటలు,డాన్సు లు ఒకరి కి ఒకరం చూపించు కునే వాళ్ళం.భలే తాత బాపూజీ బాలల తాత బాపూజీ,ఆటలు ఆది పాట లు పాడి అలసిపోయమే ,లాటి పాటలు చిన్న చిన్న నాటకాలు చేసు కొనేవాళ్ళం .చదమామ లో భేతాళ ఖాతా లో పజిల్ చేసే వాళ్ళము.ఇద్దరి కి చిన్న కుండ లో డబ్బులు దాచుకునే అలవాటు వుండేది.అదేమిటో ఎప్పుడూ పార్వతి కుండ దొంగలు ఎత్తుకేల్లెవారు.నా మని తో ప్రతి సంక్రాంతి కి బొమ్మ కొనుకునే దాన్ని.దీపావళి కి నాన్నగారు బుట్ట నిండా టపాకాయలు తెచ్చే వారు.మేము కూడా వల్ల ఊరి కి వెల్లేవాల్లము.కారీమ్నగర్ ఆసిఫాబాద్,బూర్గుమ్పాద్ వెళ్ళిన గురుతు.బూర్గంపాడ్ లో ఒక సవత్సరము కలిసి వున్నాము.ప్రతి శని ,ఆది వారాలు బాలానందం,బాలవినోదం తప్పక వినేవాళ్ళము.మానుకోట లో స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు రైల్ పట్టాలు దాటి వెళ్ళటము,ఇంటి పక్కన మామిడి తోట లో ఆడుకోవతము కొద్దిగా గురుతే.అక్కడి నుంచి వరంగల్ వెళ్ళాము.అక్కడే ఉష పుట్టింది.ఉదయ అని పెట్టాలా,ఉష అని పెట్టాలా అని అందరమూ చర్చించి ఉష అని సెటిల్ చేసాము.అప్పుడే శాంతి నివాసం సినిమా చూసి అత్తయ్య అందు లో వున్నా చిట్టి అనే పేరు నచ్చి చిట్టి అని పిలవతము మొదలు పెట్టింది. కాని ఉష కి అలా పిలి స్తే ఎంత కోపమో.నేను,జయ,భాస్కేర్ ,సీత రోజు వేయిస్థంబాల గుడి లో ఆడుకునే వారము.స్కూల్ లో పంకజ టీచర్ కి నేనంటే అభిమానం వుండేది.ఎప్పుడూ మాథ్స్ లో ఫాస్ట్.మార్క్ వచ్చేది.స్కిప్పింగ్ లో కూడా ఫస్టే .మా హెడ్ మిస్త్రెస్స్ సుజాత రెడ్డి చాల బాగుండేది.అద్దాల జాకెట్ ,గద్వాల్ చీర కట్టేది.(ఈ మద్య బర్మింగ్హాం లో నాథ్ ఇంట్లో కలిసాను.చాల మారి పోయింది.హెల్త్ కూడా బాగా లేదట.చాల బాధ అన్పించింది.మీ స్టూడెంట్ ని అని చాలమంది వస్తారు.చాలా సంతోసన్ గా వుంతుడి అన్నారు.)నాకు ఎప్పుడు టెన్త్ లోపలే రాంక్ వచ్చేది.అక్కడనుంచి నాగార్జున సాగర్ వెళ్ళాము.మరి ఎట్లా తప్పు రాసాడో క్లార్క్ కమల రాణి బదులు కమల దేవి అనిమారి పోయింది.టెన్త్ కాబట్టి ఆప్షనల్ తిసుకోవలత.జనరల్ న కామ్పోసిత అని అడిగాడు.నాకు తేలి లేదు.అమ్మాయిలంతా జెనరల్ లో వున్నారు నువ్వు అదే తీస్కో అన్నాడు.సరే అన్నాను.మాథ్స్ సర్ రాజూ మాస్టర్ నా పేపర్ అందరి కి చూపి నన్ను మెచ్చుకునే వారు.మాడపాటి అని పిలిచే వారు.ఏజ్ తక్కువ మూలంగాయస్.యస్.సి. రిజల్ట్స్ ఆపారు.ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయ్యి రేసల్త్స్ వచ్చేసరికి లేట్ అయ్యింది.గుంటూర్ వుమెన్స్ కాలేజ్ లో పే .యు.సి.లో చేరతని కి వెళ్ళాను. మాథ్స్ కావాలని అడిగాను.కాని నాది జెనరల్ ఒప్తిఒన్ కాబట్టి రాదు అన్నారు.కపోసిట్ వుండలత.అప్పుడు ఏమి చేయగలను.నాకు కావలసి న ఇష్టమైన మాథ్స్ ని వదులు కో వలసి వచ్చింది.నా జీవితం లో పెద్ద అశాబంగం.హాస్టల్ లో చేరాను.ఎదుగురము ఒక రూమ్ లో వుండే వాళ్ళము.మని చాల క్లోజ్ ఫ్రెండ్ అయ్యింది.హాస్టల్ లైఫ్ చాల ఎంజాయ్ చేశాను.మని తో వల్ల ఊరు ఒంగోలు కూడా వెళ్ళాను.తను కూడా పోట్టిచలమ వచ్చింది.ఆ రోజు ల లో నాగార్జున సాగర్ లో సినిమా శూటింగ్స్ అవుతుండేవి.మేము వెళ్ళినప్పుడు ఏదో జానపద సినిమా షూటింగ్ అవుతోంది.నాన్నగారు తీసు కెళ్ళారు.కాంత రావు రాజనాల పోత్తోపోట్టి ఫ్రాక్స్ వేసుకొని వున్నారు.రాజశ్రీ పక్కన కూర చోని వుండి.కాసేపు చూసి నవ్వుకొని వచ్చేసాము.మా ఇంటి తోట మని కి చాల నచ్చింది.మా తోట చాల బాగుండేది.నాకు కూడా మనీ వల్లఊరి బీచ్ సముద్ర స్నానం చాల నచ్చాయి.నేను గుంటూర్ నుండి ఎప్పుడు వచ్చిన జయ అన్ని సంగతులూ అడిగి తెలుసుకుంటూ వుండేది.అప్పటికి ఇప్పటికి జయ నాకు పెద్ద శ్రోత.పీ.యు.సి ఇంగ్లిష్ లో ఫెయిల్ అయ్యాను.సేప్తంబెర్ లో రాసి పాస్ అయ్యాను. డిసెంబెర్ లో పెళ్లి అయ్యింది.అప్పుడు పాస్ అయ్యి వుంటే గుంటూర్ లోనే బి.ఏ చే సే దనినేమో.రాగిణి,మనోరం ,సూర్యలత ,అందరూ హైదరాబాద్ లో కూడా కలి సారు.అప్పుడు సూర్యలత ఇంటికి శ్రీనగర్ కాలనీ వచ్చినప్పుడు బిపు ఇక్కడ ఇల్లు కొంతదని కాని మేము ఇక్కడవుంతమని కాని అనుకోలేదు.ఇంతలో ఈయన పిలవతము తో నా ఆలోచనల లో నుండి బయటకి వచ్చాను.మా బస్ బగావలేదు.హైదరాబాద్ వెళ్ళే బస్ రావటము తో వెనక కి వచ్చేసాము.

1 comment:

jaya said...

Hi Akka, Bus lo modalaina flash back chaala bagundi. Mulugu, Manukota lo aadukovatamu bagunnadi. Akkada maamidi thota, venaka bandala meeda aatalu, menthula buttalu, okasari naa birth day, bogi pallu poyatamu gurthunnayi. Amma 'puttina roju panduga' paata nerpinchindi. Warangal school, chaala open place aa school oka sari choodali. balla lathoti stage katti headmistress daughter 'uyyala jampala loogaravaya' ane dance chesindi. okasaari teachers day ki nuvvu teacher ga maa class ki vochavu. peda pillalaki iche paalu okasaari nenu thagi thitlu thinnanu. Abbo chaala unnayi. Inka chaal vrayi. All the best. jaya