Monday, January 12, 2009

సంజు -బిపు

సంజు డాడి మీద చాల బెంగ పెట్టుకుంది.అయన ఇంట్లో వునంత సేపూ అయన తోటే వుండేది.పెద్ద గ అయ్యాక కూడాఏ అవసరం అయినా డాడీ అనటమే అలవాటు. ముందు మాట కూడా డాడీ అనీ అంది.నిద్ర లో డాడీ అన్గానే ఈ రూమ్ నుంచి వస్తున్న తల్లి అనేవారు.కాని ,ఆ డాడి కాని,ఈ కూతురు కాని లేచే వారు కాదు అంతా నిద్ర లోనే .లేచి నిద్ర పాడు చేసు కునేది నేను, బిపు. నిద్ర లో కలవరించే అలవాటు అదీ దొంగ,దొంగ అని మమయ్యగారి కి ఈయనకి వుంది.. దొంగ లేరు ఎవరు లేరు పడుకో అనేవారు అత్తయ్యగారు.ఇప్పుడు మా అయన కైతే ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ వస్తారు.వాడి కి ఇంగ్లిష్ లో స్పీచ్ ఇస్తూవుంటారు.వుంటారు.మీ స్పీచ్ కి మహా మహా వల్లే తట్టుకోలేరు పిచ్చి వెధవ ఎపుడో పారిపోయి వుంటాడు వుంటాడు అంటాను.ఇప్పు ఐతే పరవాలేదు.కల్నల్ దత్త చెప్పారు,వార్ లో వున్నప్పుడు చోర్ చోర్ అని గట్టి గా అరిచారట.అందరూ గన్స్ తీసుకొని వచ్చారట. అర్దేర్లీ సర్ నిద్ర లో కలవరిచారు అని చెప్పాడట.ఇప్పుడు గౌరవ్ కి అదే అలవాటు గట్టి గట్టి గా ఏదో అరుస్తూ కాళ్ళ తో తో తంతు,తల తో కుమ్ముతు వుంటాడు.రాత్రంతా ఇద్దరి ని సవరించట మే సరిపోతుంది.పైగా ఎందు కు లేస్తావ్ పడుకో అంటారు.

సిలిగురి కి రమ్మని నాకు,సంజు కు ప్లేన్ టికెట్స్ పంపారు.సిలిగురి లో దిగేవరకు ఏడుస్తూ నే వుండి.అయన ను చూసి ఆపింది.కలకత్తా లో వక ఫ్రెండ్ ఇంట్లో (వాళ్ళు లీవ్ లో వెళ్లారు).వున్నాము.శాంతినికేతన్ చూడాలని చాల వుండింది.కాని చూడ లేక పోయాము.డార్జ్లింగ్ వెళ్ళాము.వక వారము అంత తిరిగి ఎంజాయ్ చేసి వచ్చాము.

ఖమ్మం వెళ్ళుదామని బస్ ఎక్కాను. టు ఇయర్స్ అని సంజు కు టికెట్ థీసు కొ లేదు.దీని వగుడు చూసి కండక్టర్ టు ఇయర్స్ అంటే నమ్మలేదు.పైగా సంజు కూడా నాకు థ్రీ ఇయర్స్ అంది.అనటంతో ఎందుకమ్మ చదువుకున్న వాల్లు అభదం చెపుతారు అన్నాడు సిగ్గని పించి టికెట్ తీసుకున్నాను.

ఇంట్లో అందరూ సంజును ముద్దు చేసే వారు.. శేషు చాలా ముద్దు చేసేది.సంజునే కాదు బిపు గౌతం అందరి ని తేసుకొని బయటకు వెళ్ళేది.గల్లి లో అందరు మమ్మీ మమ్మీ మోడరన్ బ్రెడ్ అని ఏడిపించేవారు.నాతో పాటు కాలేజీ లైబ్రరీ కి తీసు కెళ్తే అక్కడ నా పని అయ్యే వరకు ఆయా తో ఆడు కుంటూ వుండేది.అప్పుడప్పుడు స్నెహ దగ్గరి కి వెళ్లి హావ్ మోర్ లో ఐస్ -క్రీం తినే వాల్లము.స్నేహ ని ఐస్క్రీం ఆంటీ అనేది.

సెకండ్ టైం ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుదు అబ్బాయి కావలి అని చాల అంపించింది.ప్రథి మంగళ వారం అంజనేయ స్వామి గుడి కి వెళ్ళేదాన్ని.వకవెల కొడుకు కాకపోతే-అయినా నా పిల్లలని నేను ప్రేమించనా ? అయిన అదొ కోరిక.బాబు పుట్టగానే లక్ష్మి బాబు పుట్టాడు అంగానే చాల సంతోషం అని పించింది.వెంకట్ కూడా లొపలి కి వచ్చి చూసారు. మొత్తాని కి ఆంజనేయ స్వామి నా కోరిక తీర్చాడు. అప్పుడే అమ్మ ఇంట్లో సుందరాకాండ పారాయణ చేయిస్తోందట. ఏడోరోజు పుట్టాడు ఆంజనేయ వరప్రసాదం అని పారాయణ చేస్తున్న బ్రాహ్మడు అన్నడట !. అందుకే ఆంజనేయ స్వామి పేరు పెడదామని వుండింది .కాని పెట్టుకో లేదు.కాని, నక్షత్ర నామం నాకిష్టమైన సుభాష్ చంద్ర బోస్ పేరు నేతాజీ వచ్చింది.చిన్నప్పుడు అమ్మ చెప్పిన కథల లో నేతాజీ ,కర్ణుడు ,బుడుగు చాల ఇష్టం ఐనవి. .బిపు నేతాజీ ,ఐతే విక్కీ, గౌరవ్ బుడుగులయ్యారు.

మా బిపు పుట్టట మే మధురానుభూతి ఐతే , మరునాడే బి. ఏ ఫైనల్ ఎక్షాం రాసి పాస్ కావటము నా జీవితము లో ఇంకో మరచి పోలేని మధురానుభూతి.

అప్పుడే సిలిగురి ని ఫామిలీ స్టేషన్ చేసి మాకు ఇల్లు ఎలాట్ చేసారు.ఏప్రిల్ లో వచ్చి మమ్మలిని తీసు కెల్లారు.ఈస్ట్-కేస్ట్ ఎక్స్ ప్రేస్ లో బయలు దేరాము.చాల ఎండలు. పిల్లల కి ఎండ తగల కుండ కూపె లో నా కాటన్ చీరలు తదిపి కట్టి థీసు కెల్లాము.కల్ కతా స్టేషన్ లో జల్పాయిగురి కి టికెట్స్ కంఫర్మ్ చెసుకొవతాని కి ఈయన వెళ్లారు.తిరిగి వస్తుంటే సంజు ఎవరో ముసలాయన చేయి పట్టుకొని వెల్తోందట.ఈయన వెంటనే ఆపి సంజు ను తీసుకొని వచ్చరు.నేను ఈయన తో వెళ్ళింది అంకున్నాను .ఎందుకెళ్ళావు అంటే తతయ్య తొ వెల్లను అంది. ఎంత లక్కీ ! ఈయన చూడక పోతే తలచు కుంటే గుండె ఝల్లు మంటుంది.

1 comment:

srilalita said...

మాలాగారూ,

మాణిక్యాల గురించి మాణిక్యాలలాంటి మాటలు చెప్పారు. చాలా బాగుంది.