Monday, March 16, 2009

అత్తా -కోడలు

ఎండాకాలం అనగానే వచ్చేవి మల్లెలు ,మామిడికాయలు,వేపగాలే కాదు ఇంకోటి వుంది. aదే మాఘం నుంచి వైశాఖము దాకా జరిగే పెళ్ళిళ్ళ సందడి.అబ్బో ఎన్ని పెళ్లి పిలుపులో.ఎంత హడావిడో.
కొత్త కోడళ్ళు ,కాబోయే కొత్త కోడళ్ళు మీ పెళ్లి సందడి నుంచి బయటకి వచ్చి నాదో cహిన్న మాట వింటారా .ఈ హడావిడి లో ఈమె సుత్తి ఏమిటి బాబు అన్కుంటూ వున్నారా ?అయినా చెబుదామను కున్నాను చెపుతున్నాను.
పెళ్లి అయిపోగానే తుర్రుమని పారిపోకుండా వక నెలరోజులు మీ అత్తగారి కి కేటాయించండి.అమ్మ ,ఆయన లేకుండా పూర్తిగా అత్తగారి తో గడపండి.మేమసలె టెన్షన్ లో వున్నాము,అత్తగారితో గడిపి ఇంకా టెన్షన్ పెంచు కోవాలా అనుకోకండి.ఏమి పెరగదు,దానికి నాది పూచి. కొత్తగా పెళ్లి ఇయింది.అప్పుడే ఆయనకు దూరంగా వుండాలా అంటే ,రాత్రి టేబుల్ లైట్ వెలుతురు లో కిటికీ లోంచి చందమామను చూస్తూ శ్రీవారి కి రాసే విరహ లేఖ ఆనందాన్ని జీవితమంతా గురుతు కు వుంచుకునే మధుర స్మృతి ని కోల్పోతారు.మరి వుద్యోగామో. వుద్యోగము ఎంత ముఖ్యమో అత్తగారి తో అనుబన్ధమూ అంతే ముఖ్యం.అత్త గారి దగ్గర వుండి eమీ చేయాలి ,
పొద్దున్నే లేచి తలకు టవల్ కట్టి హారతి పల్లెము తో అత్తగారి ని నిద్ర లేపాలా?ముత్యాల ముగ్గు ,దేవత స్టైల్లో వుండాలా అని చిటచిట లాదకండి.అలా చేస్తే అత్తగారు దడుపు జ్వరం తెచ్చు కోవతము కాయం.అవేవి వద్దు.చక్కగా అత్తయ్యా అని పిలుస్తూ వెనక వెనక తిరుగుతూ కబురులు చెప్పండి.మీ వారి చిన నాటి ముచ్చట్లు అడిగి వినండి.అయన కు ఇష్టమైన వంటలు అత్తగారి పద్దతి తో నేర్చు కొండి.ఆవిడ తో శాప్పింగ్లు,సినమాల కు ,ఆవిడా ఫ్రెండ్స్ ఇంటికి చుట్టాల ఇండ్లకు వెళ్ళండి.పెళ్లి చేసు కొని వెళ్లి పోయిన కూతురి ని మరిపిస్త్తు వెంట వున్నా కోడలంటే ye అత్త కి ఇష్టము వుండదు.?ఇవన్ని చేయతని కి ఇప్పుడే వుండాలా తరువాత లీవ్ లో వచ్చిన్నప్పుడు చేయవచ్చుగా అని వాడిన్చకండి. .నా కు తెలిసినంతవరకు కోడలు తీసుకొచ్చే కట్న కానుకలకన్న కోడలు చూపించే అభిమానాని కే ఈ కాలం అత్తలు పదిపోతున్నారు. మా కోడలు మాతో కలిసి పోయింది,ఎంత కలివిడిగా వుందో అని మురిసి పోతారు.ఆయింట్లో మీరు అతిధి కాదు ,ఆ కుటుంబ సభ్యులే అనుకోవాలంటే మొదట్లోనే వీలవుతుంది.మీకు కొత్త పోతుంది.మీ కో సంగతి తెలుసా ?మీ శ్రీవారి హృదయాని కి దారి మీ అత్తగారి హృదయమే ఆవిడ దగ్గర స్థానం ఏర్పరుచు కుంటే గారాల కొడుకు భార్య గారాల కోడలే అవుతారు.హాయిగా మీ అయన మీద పితురిలు ఆవిడ కే చెప్పవచ్చు.
అత్తా -కోడళ్ళ బంధాని కి కొత్త అర్ధము చెప్పండి.మీ అందమైన కొత్త కాపుర భవంతి కి చక్కని సోఫ్ఫా నాలను వేసుకోండి.
అల్ ది బెస్ట్.

6 comments:

Anonymous said...

Fantastic. I wish this will go to all the kodals and athaas.

In fact every guy would give not just a month, but two. If the Kodal is really trying to understand the new life she is getting into.

At the same time, I'd say, if the girl really does not have time to spend a month with her mother-in-law, atha can try to call her or talk to her often. This is not just to know how she is trying to treat her son, but to understand whether the new girl on board is really adjusted in with her son and his lifestyle.

all in all this is a good one.

Anonymous said...

meeku naa idea nachchinaduku santhosam gaa vundi.vakkarynaa naa abiprayam tho ekibhavinchaarani

K Phani said...

attagariki kodaliki madya sannihitam perutundi ilaa ippati kodallu sahakariste.inkaa atta side paddatulu kuda alavaatavutundi epaatikayinaa andaru kalisi vuntene mundutaram pillalaki kudaa andarito kalisi vunte vunna saradaalu santoshaalu telusukuntaaru.

మాలా కుమార్ said...

avunu

మధురవాణి said...

మాల గారూ..
మీ సలహా చాలా బావుంది.

మాలా కుమార్ said...

madhuravani gaaru,
thanks andi.