Sunday, March 15, 2009

ఆవకాయ

పొద్దున్న ఆరు అయింది.మీరింకా తేమ్లేదా మామయ్యగారు పిలుస్తున్నారు అని అత్తయ్యగారు తొందర చేసారు.నేను ,లక్ష్మి మమయ్యగారి వెంట బయిలు దేరాము.ముందు మామయ్యగారు,వెనుక రామయ్య సంచులతో ,ఆ వెనుక నేను లక్ష్మి.ముందు చిక్కడపల్లి వెళ్ళాము.ఎంతకీ బేరము కుదరదు.ఈ పిట్టలోల్లు పడనియారు . cహేసేది ఏముంది పదండి నల్లకుంట .ఇది ఎప్పుడు వుండేదే ముందే నల్లకుంట వెళ్ళితే పోయేది.అమ్మో ఇది పైకి అనే ధైర్యం ఏది.అక్కడ ఇంకా బస్త్తాలు ఇప్పరు.అయిన సరే వెల్ల వలిసిందే .మొత్తాని కి బేరం కుదుర్చుకొని మామిడికాయలు కొని తొమ్మిదింటికి ఇల్లు చేరాము.మమయ్యగారి బంటు రామయ్య వెదురు వల్ల దగ్గరి కి వెళ్లి ముక్కలు కొట్టేవాడిని తీసుకొచ్చాడు.మళ్ళి బేరం కుదిరి కొట్టటము మొదలయ్యేలోపు మేము గబ గబ పిల్లల స్నానాలు,టిఫిన్లు కానిచ్చేసాము.వాడు ముక్కలు అన్ని వకెలా వచ్చేట్లు,ముక్క చితక కుండా వాడి ని అదిలిస్తూ అత్తయ్య గారు అన్ని కొట్టించారు.అప్పటికల్ల పెంటమ్మ ఆవాలు కొట్టటానికి వచ్చేసింది.వారం క్రితమే వదినగారు ఖమ్మమం నుండి ఆవాలు పంపటము వాటిని కడిగి అరబోయతము అయిపొయింది.రామయ్య ,మామయ్యగారు నునే కోసం కామాక్షి గానుగ కి వెళ్లారు.విజయ,ఉష,శేషు పిల్లల తో వచ్చేసారు.పిల్లలను బతిమిలాడి,గోల్డ్ పాస్ లంచం చూపించి ముక్కలు తుదిపించాము.ముక్కలు మద్యలో చుట్టూ పిల్లలు ,పెద్దలు మద్య వరండా లో .మద్య తలుపు బంద్. ముందు వరండాలో పేపర్ తో మామయ్యగారు కాపలా.అయినా ఎవరైన బయట వాళ్ళు తప్పించు కొని వచ్చారో అత్తయ్య గారి చూపులకు మటాష్.ముక్కలు తుడిచి బోజనాలు కానిచ్చి,వకోక్కరే లోపలి కి వెళ్లి వాళ్ల వల్ల ఆవకాయ కలుపుకోవాలి.ఉష మటుకు ఉఉహు నా ఆవకాయ మీరే కలపాలి నేను పిల్లలని చుసుకునటువుంతాను అని తప్పిచ్చుకునది.అత్తయ్యగారు స్టూలు మీద కూర్చొని చెపుతుంటే ఆవకాయ కలిపాము.ఆవకాయ కి మాకు దిష్టి తీసి జాది లు లోపల పెట్టించారు.అప్పటికల్ల అన్నము వందేసాము.ఆవకాయ కలిపిన బేసన్ లో వేడి అన్నము ముద్దా పప్పు నెయ్యి వేసి కలిపేసారు అత్తయ్యగారు.పిల్లలంతా చుట్టూ చేరిపోయారు వాళ్ళతో పాటే మేమును.అమ్మయ్య ఆవకాయ పని అయ్యింది అని నడుములు సవరించుకున్నాము.అప్పుడేనా ముడో రోజు తిరగ కలపాలి, వుప్పు ,నునే చూడాలి,అందరికి రుచి కి పంపాలి.
ఇదంతా ఇప్పుడే జరిగి నట్లుగా వుంటుంది.అందరి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు.ఎవరి కుటుంబం వారిది అయ్యింది.ఇప్పుడు అంత ఆవకాయ అవసరము లేదు నేను పది కాయలే పెడుతున్నాను అని వకరంటే నేను పదిహేను అని ఇంకొకరు ఎవరికీ వీలు అయినప్పుడు వాళ్ళు కలిపెసుకుంటున్నారు.ఉష ఆవకాయ కలపటము నేర్చుకుంది.
మాకుమటుకు మా పిల్లలు నాలుగు ఏండ్ల క్రితము అమెరిక నుండి వచ్చేయతము తో మా ఆవకాయ సేస్సన్ మొదలయింది.సంజు ,అను ఇద్దరి కి కలపటము సరదా.కాకపోతే మా అత్తయ్య గారి లా నాకు గోల్డ్ పాస్ తో సరిపోవతము లేదు.ప్రసాద్ లో సినమా చూపించాలి.అదితి,మేఘ కి కథలు చెప్పాలి.
ఉప్పు వున్నా వురగాయ కి అత్త చేతి కింది కోడలి కి తిరుగు లేదు.

2 comments:

Anonymous said...

ippude kottaavakaaya tinaalannatha vupochesindi maakukudaa inkaa aa anubhavaalu chaduvutunte appati joint famililu enta bhagundevi ani pistunndi

malapkumar said...

memu intlo intha mandimi vundevaramu ante maa manaanu.navalaki vichitram gaa vuntundi.adigi mari cheppichukuntaaru.nenu aa lie chaala miss avut