Sunday, March 8, 2009

అగ్రహారం

నాటి చాణిక్యుడు,తిమ్మరుసు,అక్కన్న ,మాదన్న ల నుండి నేటి పి.వి నరసింహ రావు వరకు హిందూ సామ్రాజ్య స్థాపనలో కాని ,రాజు (పాలకుల )కు ల కు సలహాలు ఇవ్వటము లో కాని బ్రాహ్మణు ల మేదస్సు మరువ లేనిది.ఆ పాండిత్యము ను గుర్తించారు కనుకనే పూర్వము రాజు లు పండితుల కు వక ఊరి నే కానుక గా ఇచ్చేవారు.అక్కడ వారు వాడల ను ఏర్పరుచుకొని బ్రాహ్మణా సత్ కార్యములను నిర్వహించే వారు.ఆ వూరు ల నే అగ్రహారాలు అనే వారు.కాల క్రమేణా బ్రాహ్మణు ల కు ఆదరణ తగ్గి,వారు కూడా వేరే వుద్యోగాలు చూసుకొని వివిధ ప్రదేశాలకు వెళ్లి పోయారు.అగ్రహారాలు రూపు మార్చు కొన్నాయి.కొన్ని వూళ్ళ లో అయితే బ్రాహ్మలే లేరు.అగ్రహారాలు,బ్రాహ్మణా వీధు లు కనుమరుగు అవుతున్నాయి( అయ్యాయా?)అగ్రహారము అంటే ఏమిటి అని ఎవరి ని అడిగినా ఇంతకంటే ఎక్కువ ఎవ్వరు చెప్పలేక పోయారు.నాకు తెలిసింది కూడా ఇంతే.మాకు కనీసము అగ్రహారము అనే పేరైన తెల్సు.మా పిల్లల కు అదీ తెలియదు.

నేను ,సత్య ఏడాది క్రితం మెల్కోటే వెళ్ళాము.అది చిన్న హిల్ స్టేషన్ .అక్కడ నారాయణ మూర్తి దేవాలయము చాల ప్రసిద్ది.చాల పురాతన దేవాలయము.సత్య ఫ్రెండ్ కుముద వల్లి కుమార్తె అరుణ అత్తవారిల్లు ఆ వూరు.వారి ఇంట్లో నే బస చేసాము.ఆ వీధి దేవాలయము ముందు వున్నది .అ వీధి లో అందరు బ్రాహ్మణు లే.అందరు కన్నడ కట్టు లో గోచి ప్పోసి చీరలు కట్టారు.వీధి అంతా చిన్న చిన్నవి పాత ఇల్లు లు.ఇంట్లోనే బావి.మా కు కింద అరిటాకులు వేసి భోజనము పెట్టారు .అతిధి ల కు ఆకులో నే పెడతారట.వాళ్ల మామ గారి కి కూడా ఆకులో నే పెట్టారు.చాలా ఆప్యాయము గా అడిగి అడిగి మరీ వడ్డించారు.అంతా మది ఆచారము.ఎప్పుడో నా చిన్నప్పుడు పాటించి నవి మరచి పోయాను.ఎక్కడ తప్పు చేస్తానో అని భయం వేసింది.ఆ వూరు వకప్పుడు అగ్రహారం అట.పక్క నే చిన్న రాతి మండపము.అక్కడ సత్ సంగం చేస్తారు .సాయంకాలము కాగానే కొంతమంది ఆడవాళ్లు భజన చేసారు.అంతా సాంప్రదాయ పద్దతి.చివరకు పిల్లలు కూడా హరివేనం ,ఉద్దరిన దేవుడి బొమ్మ ల తో ఆడుతున్నారు.అక్కడ వునంత సేపు వేరే ప్రపంచము లో వున్నట్టు గా వుండి.

ఈ ఉపోద్ఘాత ని కి కారణము ,

ఈ మద్య కామా రెడ్డి సబ్ స్టేషన్ ఇనాగు రేషన్ లో పవర్ మినిస్టర్ షబ్బీర్ అలీ ఆ వర్క్ చేసిన కంట్రాక్టర్ ల ని,ఇంజనీర్ ల ని షాలువాతో సత్కరించారు.ఆ తరువాత కొంత మంది బీద బ్రాహ్మణు ల కు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు.ఎ హిందూ మిన్స్టర్ చేయని పని వక ముస్లిం లీడర్ చేసారు అని మా వారు ఆయనకు శాలువా కప్పి సత్కరించి దాని కన్నా ఎక్కువ గా సంతోషించారు.వోట్ల కోసమే అయినా బ్రాహ్మణు లను గుర్తించారు కదా అనుకున్నారు.దీనితో మరి కొంతమంది లీడర్ లు షబ్బీర్ అలీ బాట పట్టవచ్చు.నూతన అగ్రహారాలు వచ్చే అవకాశాలు వున్నాయా?

No comments: