పొద్దున్నే శ్రీవారు ఆఫీస్ కి వెళుతూ అమ్మ నాన్న తో వెళ్ళి వొట్ వేసిరా,అని బాల్లెట్ పేపర్ ఎలా వుంతుందో ,బి.జె.పి గుర్తు ఎలా
వుంటుందో ,దాని మీద స్టాంప్ ఎలా వేయాలొ వివరంగా చెప్పారు.ఆయన వాజ్పాయ్ కి వీరాభిమాని.వకసారి ఏర్ పొర్ట్ లో అయనతో మట్లాడారట కుడా .
కొద్దిసేపు అయ్యాక మామయ్య గారు వొట్ వెయటానికి వెళ్దా మని పిలిచారు.వెళ్ళెటప్పుడు కాంగ్రెస్స్ గుర్తు ఎలా వుంటుందొ దానిమీద స్టాంప్ ఎలా వేయాలొ నాకు అత్తయ్య గారి కి వివరించి కాంగ్రెస్స్ కే వొట్ వేయమని చెప్పారు.ఆయన కాంగ్రెస్స్ వాది మరి.
వచ్చాక కాంగ్రెస్ కె వేసావా అని అడిగారు.బుర్ర ఊపాను.
మావారు బి.జె .పి కే వేసావా అని అడిగారు.అక్కడా బుర్ర ఊపాను.
కాని నాకే అనుమానము,కాంగ్రెస్స్ కి వేసానా- బి.జె.పి కి వేసానా
రెంటి కీ వేసానా - అసలు ఇంకొదేనికైనా వెసానా ఏమో మరి.
ఆ తరువాత మమయ్య గారి తొ వెళ్ళినప్పుడు కాంగ్రెస్ కి ,శ్రీ వారి తొ వెళ్ళినప్పుడు బి.జె.పి కి వేస్తూ వచ్చాను.
అలా అలా రెండో ఐదొ ,ప్పదొ సార్లు కాలం గడిపేసాను.
ఈ సారి నలుగురమూ కలిసి వెళ్ళాల్సి వచ్చింది.షరా మామూలే,నాకు మా అత్తగారి కి పాఠా లు.
వేసి బయటకు వచ్చాము .అక్కడా షరా మామూలే,మామయ్యగారు అడిగారు ఎవరికి వొట్ వేసావు అని కాని షరా మామూలు కాక
మాట్లాడకుండా వూరుకున్నాను.ఎవరికి సినిమా వాళ్ళకి వేసావా అని నాజవాబు వినకుండా నే చివాట్లు వేసేసారు.
ఇంట్లొకి వెళ్ళాక మా వారి కి ఎవరి కి వేసానొ చెప్పపొతుంటే ఎవరి కి వేసినా నీ సొంతముగా నిర్ణయము తీసుకున్నావు గుడ్.అన్నారు.
మరి పెపర్ చదివించి అన్నిటి గురించి చర్చింటము అలవాటు చేసింది ఆయనేగా .
పోయినసారి ,లోకసత్తా గుర్తు విజిల్ అనిచెప్పి వూరుకున్నారు.
లోకసత్తా కాండిడేట్ అన్ని వోట్లు వస్త్తాయని అనుకోలేదట మీరే వేసివుంటారు అని అందరూ అంటుంటే అవును మా ఖైరతాబాద్
వాళ్ళు విద్యావంతులు అని చెప్పాను.
మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి.లొకసత్తా వాళ్ళు వచ్చి వొట్ అడిగితే ,పొయినసారి మీరు అడగకుండానే మీకే వొట్ వేసాము .
అనిచెప్పాను.అయినా అడగటము మా భాద్యత కదండి అని చెప్పివెళ్ళారు.
సరే అయితే ఇప్పుడు ఏందుకు ఈ సొద అంటున్నారా?
మరి విజయరామారావు తెలుగుదెశం తరుపున బరి లొకి దిగారే!ఆయన ఎప్పుడూ తెలుగుదెశమే.కాని,
ఇంతకు ముందులా ఇప్పుడు తెలుగుదెశం నచ్చటము లేదే !
సంకట పరిస్తితి ,
విజయరామారావా ? లోకసత్తానా?
లోకసత్తానా??? విజయరామారావా????
విజయ--------- లోక ???????
Sunday, April 12, 2009
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
సమర్ధుడు, నీతిపరుడుకు వోటు వేస్తే సరి.
సిబిరావు గారు,
మీ సలహాకి దన్యవాదములండి.
నేను ట్రావలాగ్ లాగా రాయలేదండి.అలా రాయాలి అంటే చాలా వివరముగా రాయాలికదా.
నేను చూసిన ప్రదేసములలో నా అంభూతులు మటుకే రాస్త్తున్నాను.
అలాగే నా ఇంకో బ్లాగ్ పదనిసలు లో కుడా నేను చూసిన ప్రదేశములలొ నా అనుభవాలు మటుకే రాద్దాము అని ప్రయత్నము.
కాకపోతె అదె పేరు తొ ఇంకో బ్లాగ్ వున్నట్లు వున్నది.అందుకని పేరు మార్చి రాద్దామని పేరు కొసము వెతుకుతున్నాను.
ధన్యవాదములు.
madam me blogs bagunayai
naresh,
maa sir ki nachchindane aa credit maa sir ke gaa
hi,mam me blog design and me thought naaku chaala bhaaga nachindhi
hai,
నా గురువు లిద్దరు ఇలా మేచ్చేసుకుంటే నాకు కొమ్ములు వచ్చేస్తాయేమో!
గురువులకే పగనామాలు పెట్టేస్తానేమో
జాగ్రత్త!
Post a Comment