Tuesday, April 28, 2009

వెంటాడే దొంగ గారు

" దొంగ దొంగ " గట్టి గట్టిగా అరుపులు వినిపించాయి.ఉలిక్కిపడి లేచాను.మంచము దిగటాని కి భయం వేసింది. మళ్ళీ దొంగ దొంగా అని అరుపులు. చిన్నగా తిరిగి పక్కకి చూసాను. విజయ, ఉష నిశ్చింతగా నిద్ర పోతున్నారు. ఒకపక్క భయం,ఇంకో పక్క ఏం చేయాలొ తెలీటములేదు. మళ్ళీ దొంగ దొంగా అరుపులు. హాల్లో లైట్ వెలిగింది.ఏమయ్యా లే అత్తయ్యగారి మాట వినిపించింది.అమ్మయ్య అనుకుంటూ చిన్నగా హాల్ లోకి వెళ్ళాను. అప్పటీకే అత్తయ్యగారు దొంగ లేడు ఎవ్వరూ లేరు పడుకో అంటున్నారు.నన్ను చూసి ఏంలేదులే మీ మామ గారు కలవరిస్తున్నారు,పడుకొ అన్నారు.

కాలం కొంచం ముందుకు జరిగింది.

చోర్ చోర్ పకడో పకడో అనే అరుపులు వెంటనే నా వీపు మీద పెద్ద దెబ్బ పడ్డాయి.ఏమి జరిగిందో అర్దముకాలేదు.పక్కకి తిరిగి చూసే సరికి మావారు ఇంకా గట్టి గట్టిగా చోర్ చోర్ అని అరుస్తూ గాల్లో చేతులు ఆడిస్తున్నారు.నేను వణికి పోతూ ఒ పక్కన ముడుచుకొని కూర్చున్నాను. ఇంతలో మామయ్యగారు, అత్తయ్యగారు, మరిదిగారు అంతా వచ్చారు. మరిదిగారు ఆయన నుంచి దెబ్బలు తగలకుండా తప్పించుకుంటూ ఆయనని లేపారు. అత్తయ్యగారు నా పక్కన కూర్చొని వీపు మీద రాస్తూ భయపడ్డావా ఈ అయ్యా కొడుకులు ఏదో ముల్లె దాచినట్టు దొంగ దొంగా అని అరుస్తుంటారు భయపడకు,ఆదమరచి నిద్ర పోకు అని చెప్పారు.

చిన్నగా ఆ అరుపులకు అలవాటు పడ్డాను.


పార్టీ లో ఆ రొజు కల్నల్ .దత్తా కొత్తగా వచ్చారు. మావారు నన్ను పరిచయం చేయగానే , ప్రభాత్ ఇంకా కలవరిస్త్తున్నాడా అని అడిగారు. ఈయనకూ మా అయన కలవరింతల సంగతి తెలుసా అనుకొని మొహమాటముగా నవ్వి వూరుకున్నాను.ఏమిటి అని పక్క వాళ్ళు అడిగితే ఇలా చెప్పారు, అప్పుడే చైనా యుద్దము అయిపోయి,శాంతి నెలకొన్న రోజులు.సరిహద్దుల్లో టెంట్స్ వేసుకొని వున్నాము.ఒకొక్క బెటాలియన్ తిరిగి వెళుతున్నాయి ఇంకా మా టర్న్ రాలేదు.అంతా ప్రశాంతముగా వుంది కాబట్టి మేము కూడా విశ్రాంతిగా వున్నాము. ఒకరాత్రి ఆ నిశబ్దం లో చోర్ చోర్ షూట్ హిం అని అరుపులు వినిపించగానే అంతా హడావిడిగా గన్స్ తీసుకొని బయటకి పరిగెత్తుకుంటూ వచ్చాము.కాని, ప్రభాత్ టెంట్ లో నుంచి ప్రభాత్ బయటకి రాలేదు. మా హడావిడి చూసి ప్రభాత్ ఆర్డర్లి చెప్పాడు సాబ్ కి ఇలా కలవరించటము అలవాటు అని.ఆ రోజు వాళ్ళు ఎంత కంగారుపడ్డారో చెప్పి వకటే నవ్వు. యుద్ద రంగములో కూడా మావారి కలవరింతల భాదితులున్నారన్న మాట.


యుద్దరంగము,ఇల్లు మాత్రమే నా అనుకున్నారో ఏమో, పది రోజుల క్రితం తిరుపతి వెళ్ళేటప్పుడు,రైల్ లో అందరూ పడుకున్నారు,నేను ,మా అమ్మాయి చిన్నగా మాట్లా డుకుంటున్నాము. హుమ్మ్ దొంగ గారు రానే వచ్చారు.మామూలే, చోర్ చోర్ పకడో పకడో. వెంటనే మా అమ్మాయి డాడీ డాడీ లే అని లేపుతునే వుంది పక్కనుంచి ఇద్దరు ముగ్గురు ప్రయాణికులు ఎక్కడా అంటూ రానే వచ్చారు. సారీ అండి మాడాడి కలవరిస్తున్నారు అని మా అమ్మాయి చెప్పే సరికి వాళ్ళు మా వైపు వింతగా చూస్తూ వెళ్ళిపోయారు.

ఈ విధముగా ఇందుకలడు అందు లేడు అనుకోకుండా దొంగగారు మాకు హలో చెప్పి పోతుంటారు.

ఇలా ఇలా కాలము గడిచిపోతూ వుంది.


నిన్ను భందించగలను
వొరేయ్ నా నుంచి తప్పించుకు పోలేవు,
నిన్ను వళ్ళేయను -తెలుగు కార్టూన్ నెట్ వర్క్ భాష
అరుపులు ఆ పై పక్కకి తిరిగి పడుకున్న(దెబ్బలనుంచి కాచుకోవటానికి మంచము చివరికి ఒక పక్క కి తిరిగి పడుకోవటము అలవాటు అయ్యింది)నా వీపు మీద కాళ్ళ తో తన్నులు,పిడికిళ్ళ తో గుద్దులు.ఇది నా మనవడి విన్యాసము.వాడు నాదగ్గరే పడుకుంటాడు .నాన్నా గౌరవ్ లే ఎందుకు కొడుతున్నావు? నేను కొట్టటము లేదు లేదురా నన్నే కొడుతున్నావు. నన్ను క్షమించు బామ్మా నేను నిన్ను కొట్టటము లేదు .మరి ఎవరినిరా ?
బాడ్ గైని.


ఏ ముహూర్తాన చెప్పారో మా అత్తగారు,ఆదమరచి నిద్ర పొకే కమలమ్మా !

6 comments:

పరిమళం said...

Ha...hha..hhaaa....

మాలా కుమార్ said...

పరిమళ గారు,
నవ్వండి నవ్వండి,మీకూ మనవడు రాకపొతాడా అప్పుడు నేను నవ్వుతాను.

Srujana Ramanujan said...

Really hahaha. anthenandee. bhale raashaaru.

మాలా కుమార్ said...

ఇంకా ఏముండాలి?ఇప్పటికే వీపు వాచి పోతోంది.
థాంక్ యు.srujana,

Maruti said...

హహ్హహ్హ:-) బాగుందడి, బాధపడకండి నిజంగా ఏ అర్ధరాత్రో అపరాత్రో దొంగ వచ్చినా వెంటనే పారిపోతాడు లెండి.

మాలా కుమార్ said...

మారుతి గారు,
మావారికి నేనూ అదేచెబుతాను వాడెప్పుడో పారిపోయే వుంటాడులెండి అని.