Sunday, April 5, 2009

అనాబ్ షాహి

లేత ఆకుపచ్చ రంగులో ,పలచటి చర్మం తో ,లోపల ముట్టుకుంటె జారిపొయె
గుజ్జు తో,పొట్ట నిండా రసము,గింజల తో ,బొటన వేలు ప్రమాణము తో,
సొగసు చూడతరమా అన్నట్టు గా వుండే హైదరాబాదీ అనాబ్ షాహి ఏది?
చలకుర్తి నుంచి వచ్చెటప్పుడు ఇబ్రహిం పట్టణం దాటగానే చెరువు పక్కనుంచి
చల్లటి గాలి ని అనుభవిస్తూ ,కొంచము ముందుకు వెళ్ళగానే ,గుత్తులుగుత్తులు
గా వేళ్ళడుతూ సన్నటి పరిమళాలు వేదజల్లుతున్న అందమైన అంగూర్ భాగ్ లు.
రోడ్ మీద తడికల షాప్ లు.వాటినిడా అనాబ్ షాహి లు.అసలు వూర్లోకి ఎప్పుడు
చేరుతామొ తెలీదు. ఫిబ్రవరి చివరి కల్లా రావటము మొదలైయేవి .ఏక్ రుప్యా కిలొ
బేరమాడిన వారి కి బారాణా కే. సైనిక్ పురి లొ మా ఇంటి వెనుకనే చెరువు.
అక్కడ అన్నీ భాగ్ లె.అక్కడ ఐతె అటాణా కె కిలొ.అక్కడ సీడ్ లెస్ వి కూడా
దొరికేవి. అవి దొ రూప్యా కిలొ.
బర్కత్ పురా లో మా ఇంట్లొ కూడా వెనకా ముందూ తీగెలు వుండేవి రావటము
మొదలు ఐయినప్పుడు బుజ్జి బుజ్జి గుత్తులు ఎంత ముద్దుగా వుండేవొ .
వేరే వూరు లో వున్నప్పుడు,లీవ్ లో వచ్చి వెళ్ళే టప్పుడు,ఆవకాయ తో పాటు
వక బుట్టెడు అనాబ్ షాహి తెసుకెళ్ళా లిసిందె.అయినా సరిపోయేవి కావు.
ఇప్పుడు ఏప్రిల్ వచ్చినా ఇంకా అవేవీ కనపడటము లేదు.అసలు అనాబ్ షాహిలే
కనపడటములేదు. అన్ని సీడ్ లెస్ లే.రిలయన్స్ లాంటి మాల్స్ లొ పెద్దవి ఏమైనా
వున్నయేమొ.
ఇప్పుడు విజయవాడ వైపు నుంచి వస్తుంటే అంతా యల్ .బి నగర్ ,వనస్తలి పురం
వగైరా లే.ఆ చెరువులూ లేవు,ఆ భాగ్ లూ లేవు.
ఈ రోజు ఉదయము మా అబ్బాయి ని బాబా నీకు అనాబ్ షాహి ఏమిటొ తెలుసా అని
అడిగాను .ఆ అన్నడు ,ఏమిటి అది అన్నా ,పేరు విన్నాను కాని ఏమిటో మరిచిపొయాను.
అవి ద్రాక్ష పండులలో వక రకము.హైదరాబాద్ లో ఎక్కువగా పండించే వారు.
వకప్పుడు హైదరాబాద్ అనగానే ద్రాక్ష తోటలు ,అందులో నూ అనాబ్ షాహి ఫేమస్.
అంతా గత చరిత్ర అయిపొయింది.
మా అమ్మాయి అన్నట్లు రింగులు తిప్పుకోవటము ఆపి సర్దుకు పోవాలి.

2 comments:

Srujana Ramanujan said...

Very nice. మా అమ్మాయి అన్నట్లు రింగులు తిప్పుకోవటము ఆపి సర్దుకు పోవాలి.

సత్యం పలికారు. Try to write in paragraphs. That will give readability.

మాలా కుమార్ said...

థాంక్ యు స్రుజనా