Tuesday, December 29, 2009

వా ( ( ( ( ( * * * - - -

VS

" ఖతం కహానీ :) :) :) ఐపోయిందా ? ? ? ఓవర్ ! ! !

జ్యోతీ ( ఇది ఆర్తనాదం , లింక్ కాదు ) తగునా ఇదిమీకు ? బ్లాగ్ మితృలు నా వారు కాదా ? ఎంత మాట అనేసారు జ్యోతీ ఎంత మాట అనేసారు !!!! సృజనా నా లిటిల్ ఫ్రెండ్ వి అని ముద్దు ముద్దు గా చూసుకుంటుంటే నన్ను బాడ్ గర్ల్ అనేస్తావా ? హుం !!! ఏమిటీ జయమ్మ తల్లి , నా మీద ఏకం గా కవితే రాసేసావా !!! ఆపరాదు ఆపరాదు నీపయనం , మణి దీపమై వెలగాలి , వహవా ఎంత బాగా చెప్పావు .( మనలో మన మాట కవిత బాగుంది , కాస్త గర్వ పడ్డా ననుకో ) శ్రీలలితా , మీరు కూడా నన్ను అపార్ధము చేసుకున్నారాండి ?మిమ్మలిని నేనెలా నిరాశ పరుస్తానండి ? బాడ్ గర్ల్ ని , రౌడీ పిల్లని అంటూ రోజూ కలలో , ఇలలో భయపెడుతునే వుంటావు , నువ్వు సరిపోవా ప్రియా , ఇంకా నెల్లూర్ పెద్దా రెడ్డి తో స్పీకుతావా ? ఎవడాడు ? పరిమళం గారూ , మీరు . . . మీరు . . కూడా అపార్ధమేనా ? ఇక నేనెవరి తో చెప్పుకోనండి ? అయ్యో భావనా ? ఇదేమిటి ? ( మీరింత చప్పగా మేమొప్పుకోం , అంటే బాలేదు సుమీ ! ఏమిటి ? కాస్త నెమ్మదిగా వుందామని ప్రయత్నం చేస్తున్నారా ? ) అహా సంజూ , మీ పిన్ని తెలుగు లో కొడితే నువ్వు ఇంగిలిపీసు లో కొట్టా వన్నమాట !!! బాగుంది . ( నేను ఇహపై రూట్ మార్చి రాస్తే నాకు తగిలే మొట్టికాయలకు పంచకర్మ మసాజ్ కూడా సరి పోదు , ఇహ హిమాలాయాలే గతి )

మా గురూజీ ,మొట్టికాయలకు , నా వంటింటి చిట్కా సరి పోవటము లేదు , తలంతా బొడిపలే , కాస్త కేరళ వెళ్ళి పంచకర్మ మసాజ్ చేయించుకొని వద్దామను కున్నాను . ఏదో మా పిల్లలకు కథ చెప్పటము ఐపోగానే , ఖతం కహానీ , బాత్ ఖతం బర్కాస్ బిర్యాని అనటము అలవాటు , అలా , ప్రాసకలిసింది కదా అని అనేసాను . ఇంత మాత్రాని కే నన్ను బలవంతాన , నిరాహార దీక్ష లో ఇరికించేసారు బాబోయ్ . అయినా నిన్న వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశుని , తలుచుకున్నానా ? అన్నమయ్య కీర్తనలు ఆలకించానా ? అమ్మ పుట్టిన రోజని అమ్మ అశీర్వాదము తీసుకున్నానా ? ( ఇవి లింక్ లు , ఆర్తనాదాలు కావు ) ఇంకా బోలెడు టపాలు వున్నాయి . వాటిని టపా కట్టించకండి బాబో ))))

బాబ్బాబు మీకు పుణ్యముంటుంది , సెలైన్ ఎక్కించేయండి . ఓ గ్లాసెడు నిమ్మ రసము ఇచ్చేయండి .( అదే చేత్తో ఓ స్వీట్ బాక్స్ కూడా తెండి , అది కూడా ఎమరాల్డ్ స్వీట్ షాప్ నుండి తెచ్చేయండి . హలో హలో అదెక్కడుందో మాకు తెలీదు అని తప్పించుకోకండి . ఇందిరా పార్క్ దగ్గర వుంది . గులాబ్ జాం అయితే బెస్ట్ ) కావాలంటే ఓ నినాదం కూడా చేసేస్తా .

సరిలేరు తెలుగు బ్లాగర్ ల కెవ్వరూ
ఇలలో సాటి లేదు తెలుగు బ్లాగ్ కు
బ్లాగ్ అంటే తెలుగు బ్లాగేనయా
జై తెలుగు బ్లాగు , జై జై తెలుగు బ్లాగు .

11 comments:

Rakhee said...

ప్రియనేస్తం! నా పేరు రాఖీ నేనొక తెలుగు కవి,పాటల రచయిత స్వరకర్తను మీకు సాహిత్యం/పాటలు/కవితలు /నానీలు పట్ల మక్కువ ఉన్నట్లైతే నా బ్లాగులు సందర్శించండి.. మీ నిస్పాక్షిక సమీక్షలు/అభిప్రాయాలు/విమర్శలు నాకు శిరోధార్యం.నా ఉన్నతికి అవి సోపానాలు ! దయచేసి బ్లాగుల లోని కామెంట్స్ లో గాని లేదా నా మెయిల్ ఐడి కి గాని పోష్ట్ చేయగలరు.
http://www.raki9-4u.blogspot.com
http://www.rakigita9-4u.blogspot.com
http://www.raki9dash4u.wordpress.com

rakigita9@yahoo.com
rakigita9@gmail.com
సదా
మీ స్నేహాభిలాషి, రాఖీ

'Padmarpita' said...

అహ)))))***---

పరిమళం said...

జై తెలుగు బ్లాగు , జై జై తెలుగు బ్లాగు:) గులాబ్ జాం
నాక్కూడా :)

Srujana Ramanujan said...

Mimmalni miss avuthaamane thappa meeru bad gal elaa avuthaaru?

శ్రీలలిత said...

మాలాగారూ,
మిమ్మల్ని అందరం కలిసి ఎంత అపార్ధం చేసుకున్నాం? ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తోందో చెప్పనా.. మనకి పాత తెలుగు సినిమా వాసనలు ఇంకా పోలేదని. ఉట్టుట్టినే ఏదో అనుకుని అపార్ధాలు చేసేసుకోడం. నాకు మిమ్మల్ని చూస్తే పాత తెలుగు సినిమా లో ఎ ఎన్నాఆర్ డైలాగ్ గుర్తొచ్చింది.. షర్ట్ పై బటన్ నలిపేసుకుంటూ "నన్ను అనవసరంగా అపార్ధం చేసుకున్నావు రాధా.." అని ఫీల్ అయిపోతుంటాడు. చివరికి అపార్ధాలు తొలగిపోయి అందరూ గ్రూప్ ఫొటో ఇచ్చేసినట్టే మనం కూడా గ్రూప్ ఫొటో తీయించేసుకుందాం..ఏమంటారు?

భాస్కర రామి రెడ్డి said...

సరిలేరు తెలుగు మాలకెవ్వరూ
ఇలలో సాటి లేదు సాహితీమాలకు
బ్లాగ్ అంటే హాస్య రస వల్లరి
జై తెలుగంణా బ్లాగు , జై జై తెలుగు బ్లాగు.
:)

Anonymous said...

great attayya... congratulations. wish you a happy writing.
- Ravi Komarraju

మాలా కుమార్ said...

రాఖీ గారు ,
మీ బ్లాగ్ తప్పక చూస్తానండి . థాంక్ యు .

* సృజన ,
ఐ టు మిస్ యు . థాంక్ యు .

*పద్మార్పిత గారు ,
ఓహో ))))) *** - - -

మాలా కుమార్ said...

పరిమళం గారు ,
గులాబ్ జాం నాకు ఎవరైనా ఇవ్వాలేగాని తప్పక మీకు కూడా ఇస్తాను . నా మొదటి పొస్ట్ నుండి రెగ్యులర్ గా చదువుతున్నారు . మీకు కాక ఇంకెవరికిస్తా ను ? థాంక్స్ అండి .

*శ్రీలలిత గారు ,
మనలో మన మాట , నాగేశ్వర రావు కాబట్టి అంత సొగసుగా చెప్పేవాడు , ఈ కాలం హీరోలు అలా చెప్పలేస్తారా ,చెప్పండి . ఇక అంతా శుభ మే కాబట్టి , గ్రూప్ ఫొటో కు నేను రెడీ .

మాలా కుమార్ said...

భాస్కర రామి రెడ్డి గారు ,
మొత్తానికి నాకూ ఓ బుజ్జి కవిత చెప్పారన్నమాట ! థాంకు .

*thank you ravi .

Dhanaraj Manmadha said...

:-)