Wednesday, December 9, 2009

అష్టవర్షా భవేత్ బాలకా

" బాబా , గౌరవ్ కి బబుల్ గం కావాలటరా ."
" ఇప్పుడే వద్దు మాతే , వాడి కి ఎయిట్ ఇయర్స్ రానీ "
ఇది నాకూ , మా అబ్బాయికి తరుచు జరిగే సంభాషణ . ఇదొక్కటేనా ? విక్కీ , జేయూ పి. యస్ బి తెగ ఆడేస్తూ వుంటారు . గౌరవ్ మటుకు వాళ్ళ పక్కన చేరి చూడాల్సిందే కాని ఆడేందుకు లేదు . పాపం వాడికి కూడా కొనీయరా బేటా అంటే వాడికి ఏట్ ఇయర్స్ రానీయమ్మా అంటాడు నా బేటా . వాళ్ళేమో చక్కగా బోలెడు గేంస్ కొనుక్కున్నారు . ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటారు . మాకేమో ఇంకా ఎయిట్ ఇయర్స్ రాకపోయే హూం !


మేఘా కి ఎంచక్కా ముందు రెండు పళ్ళూ వూడిపోయాయి . ఆ పళ్ళని దిండు కింద పెడితే పొద్దునకల్లా టూత్ పెయిరీ అవి తీసేసుకొని ఫైవ్ రూపీస్ పెట్టి పోయింది . ఆ రూపీస్ ని మాకు చూపిస్తూ , మేఘ తెగ ఫోజ్ కొట్టేస్తూ వుంటుంది . అనూ , పాపం గౌరవ్ కి కూడా ఓ ఫైవ్ రూపీస్ ఇవ్వచ్చుకదమ్మా , అని నేను సిఫారస్ చేస్తే , అవి నేనివ్వ లేదాంటీ , టూత్ పెయిరీ ఇచ్చింది . , వాడి కి పళ్ళూడినప్పుడు వాడికిస్తుంది , అంటుంది . అదేప్పుడమ్మా అంటే , వాడి కి ఎయిట్ ఇయర్స్ . . . సరె సరే , పళ్ళు రాలటానికి కూడా ఎయిట్ ఇయర్స్ హూం !


" జేయూ , చక్కగా బంధిపోటు వేషం వేసుకొని , ఫొటో తీసుకొని , ఎంచక్కా ఫేస్ బుక్ లో పెట్టుకున్నాడు , బామ్మా చూసావా ? "
" మరి నువ్వూ , నీ ఫేవరేట్ బెన్ టెన్ వేషం వేసుకొని ఫొటో పెట్టుకో ".
" నాకు ఫేస్ బుక్ ఎకౌంట్ లేదుగా బామ్మా ."
" ఎందుకులేదురా ? డాడీని అడుగుతావుండు . బిపూ "
" ఏంటమ్మా ? "
" గౌరవ్ కి ఫేస్ బుక్ ఎకౌంట్ లేదట , చేయొచ్చు కదరా ? వాడూ బెన్ టెన్ ఫొటోలు పెట్టుకుంటాడు. "
" బామ్మా , పెట్ సొసైటీ , ఫాం వెల్ కూడా ఆడుకోవచ్చు. "
"అవునురా మరి చేయొచ్చుకదరా ? "
" ఫేస్ బుక్ ఎకౌంట్ కావాలంటే , జి మెయిల్ ఎకౌంట్ వుండాలి . జి మెయిల్ కావాలంటే ఎయిట్ ఇయర్స్ "
"సరె సరే , ఇక్కడా ఎయిట్ ఇయర్స్ . . . హూం . . . . ."
" నీ ఫేస్ బుక్ ఎకౌంట్ లో ఆడుకోవచ్చా అడుగు బామ్మా "
" ఆడుకోరా "

వాడికి ఎయిట్ ఇయర్స్ వచ్చి , వాడి ఏకౌంట్ వచ్చేదాకా నాకు తిప్పలు తప్పవు. ఆ పెట్స్ పారిపోకుండా చూడాలి . ఫాం ఎండి పోకుండా చూడాలి . బాబ్బాబు , కాస్త అందరూ తలో చేయి వేయరూ ! ఏం లేదు , పెట్ సొసైటీ కి , అప్పుడప్పుడూ వెళ్ళి మా పెట్స్ పారిపోతే వెతికి తెచ్చిపెట్టండి .కాస్త వాటికి తిండి పెట్టండి ప్లీస్ . పెట్ సొసైటీ స్పెల్లింగ్ తెలీదా ? ఐతే " పి " క్లిక్ చేసి , కళ్ళు మూసుకొని " హామ్మ్ హీం " అని కళ్ళు తెరవండి , పి కింద పెట్సొసైటీ స్పెల్లింగ్ వచ్చేస్తుంది . దానిమీద క్లిక్ చేసేయండి .టట్ట టాయ్ పెట్ సొసైటీ ఓపెన్ అవుతుంది అంతే . అదే చేత్తో , మా ఫాం లో ట్రీస్ కి కాస్త ఫెర్టిలైజ్ చేసేయండి . వూరికెనే కాదులే మీకూ పాయింట్స్ వస్తాయి . ఫ్రెండ్స్ అన్నాక కాస్త చేదోడు , వాదోడుగా వుండాలికదా !

ఇంతేనా అంటే ఇంకా చాలా చాలా కష్టాలున్నాయి . ఈ లోపల ఇంకా కొత్తవి రానూ రావొచ్చు . ఎనిమిదేళ్ళు ఎప్పటికి వస్తాయో , కష్టాలు ఎప్పటికి తీరుతాయో !

11 comments:

Srujana Ramanujan said...

Hahaha :-). Bhale raashaaru

Srujana Ramanujan said...

Inthakee ee eight golentandee?

సుభద్ర said...

పాప౦ గౌరవ్ కదా!!!
టుత్ ఫెర్రి కధ మీకు ఉ౦దా!!!మా వాడికి మూడు పళ్ళూ ఉడిపొయాయి..
మావాడు టుత్ ఫెర్ర్ అన్నాడు..నేను కాదురా అది ఇ౦గ్లీష్ వాళ్ళకు మన౦ మౌస్ హొల్ లో వేయాలి..స్రా౦గ్ టీత్ వస్తాయి అని సో దాయిస్తున్నాపళ్ళు అన్ని ఇ౦డియా వెళ్ళి ఎలకఇ౦ట్లో వేయడానికి...

శ్రీలలిత said...

గౌరవ్ ను చూస్తుంటే నాకు చాలా జాలివేస్తోంది. ఇంకా ఎప్పటికి ఏట్ ఇయర్స్ వస్తాయండీ? ఈ పెట్ సొసైటీ అదీ నాకేమీ తెలీదండీ..కాస్త వివరంగా చెపితే నేనూ ఒక చెయ్యి వేస్తా....

జయ said...

ఏంటి, ఎయిట్ ఇయర్స్ వొచ్చేది...అడిగిందేదో కొనిచ్చేయక.

మాలా కుమార్ said...

సృజన
గౌరవ్ ఏమడిగినా నువ్వు చిన్నవాడివి , కనీసము ఏట్ ఇయర్స్ రానీ అంటారు వాడి అమ్మా , నాన్నా . అదీ గోల .

మాలా కుమార్ said...

సుభద్రా ,
అది ఇండియా కథో , ఇంగ్లాండ్ కథో , మనకు కావలిసింది చేసుకోవటమే .

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు ,
ఫేస్ బుక్ లో పెట్ సొసైటీ , ఫాంవెల్ అని గేంస్ అటండీ . అందులొ వాడి పెట్స్ ని , ట్రీస్ ని నేను కాపాడిలిటండి . వాటి సంగతి నాకు తెలీదురా అంటే నీకేమీ తెలీదు బామ్మా అని నామీద అరుస్తాడు . అసలు వాడివి కాదు , నా కష్టాలు రాయాల్సింది !

మాలా కుమార్ said...

జయా ,
ఆ ముక్కేదో , వాడి డాడీకి చెప్పు .

సిరిసిరిమువ్వ said...

పాపం గౌరవ్! పాపం మీరు!
మీకు మాత్రం మంచి కాలక్షేపం మీ గౌరవ్‌తో..చూడండి మీకు ఎన్నెన్ని తెలియని విషయాలు నేర్పిస్తున్నాడో!

మాలా కుమార్ said...

సిరిసిరిమువ్వ గారు ,
అది మటుకు నిజమండి . ఈ పిల్లల మూలం గానే కొత్త కొత్తవి తెలుసుకుంటున్నాను .