Thursday, December 24, 2009

బ్లాగ్ మిత్రులు

కౌంట్ డౌన్ -5


మొదటిసారి నా " లయ " అనే పోస్ట్ కు దుర్వాసుల పద్మనాభం గారి కామెంట్ వచ్చినప్పుడు ( అప్పటికింకా కూడలి లో చేరలేదు ) , ఎవరీయన అని ఎంత ఆలోచినా తెలీలేదు . అప్పుడే తెలిసింది , ఇంట్లోవాళ్ళే కాదు బయటివారు కూడా నా పోస్ట్ లు చదివి కామెంట్ చేయవచ్చు అని . ఆ తరువాత కూడలి లో చేరాక వచ్చిన నా మొదటి పోస్ట్ " మల్లెలు మల్లెలు " కు , భాస్కర రామిరెడ్డి గారు , రమ్య గారు , హర్సోల్లాసం గారు , పరిమళం గారు ,ఎవరో పేరు లేని వారు , కొత్తపాళి గారు కామెంట్స్ ఇచ్చారు . కొత్తపాళి గారు , మీది బర్కత్ పురానా ? మాదీ బర్కత్ పురా నే అని పలకరించారు . ఓహో అనుకొని , ఆయన వ్రాసిన ఒక పోస్ట్ కు కామెంట్ వ్రాసాను . అంతే , మాలా అని ఘర్జించారు . కామెంట్స్ తెలుగు లోనే వ్రాయండి అని బెత్తం చూపించారు . వెంటనే దడుచుకొని , మా అబ్బాయికి చెప్పాను , ఈయన హెడ్మాస్టర్ లా అరుస్తున్నారురా ? కామెంట్స్ తెలుగులో ఎలావ్రాయాలి ? అని అడిగాను . అందుకు మా అబ్బాయి , ఆయననే అడుగు అన్నాడు . ఎలారా . భయం వేస్తోంది , అంటే , భయం ఎందుకు మాతే , ఆయనెక్కడుంటారో నీకు తెలీదు , నువ్వెక్కడుంటావో ఆయనకు తెలీదు చెప్తే చెప్తారు , లేకపోతే లేదు . అంతేకాని వచ్చి దెబ్బలు కొట్టరుగా అని ధైర్యం ఇచ్చాడు ! అప్పుడు చిన్నగా ఆయననే అడిగాను , నాకూ తెలుగు లోనే వ్రాయాని వుందండి , కాని ఎలా వ్రాయాలో తెలీదు అని మరీ నాకేమీ తెలీదు అనుకుంటారేమో నని బ్లాగ్ లోనే వ్రాసి , కాపీ , పేస్ట్ చేయాలా అని అడిగాను . వెంటనే ఆయన లేఖిని లింక్ ఇచ్చి , ఎలా వ్రాయాలో చెప్పారు . అంతకు ముందు లేఖిని ని చూసినా ఎలా ఉపయోగించాలో తెలీలేదు . అంతే బ్లాగ్ లో సరిగ్గా తెలుగు వ్రాయలేక , ఇక రాయటము మానేద్దాము అనుకున్న దానిని చాలా సంతోషించి , వ్రాయటము కంటిన్యూ చేసాను . హెడ్మాస్టర్ గారూ , ధన్యవాదాలండి .

బ్లాగర్స్ మీటింగ్ లో చక్రవర్తి , సి .బి .రావు గారు , అరుణ పప్పు గారు మొదలైన వారు అభిమానము గా మాట్లాడారు . వీవెన్ గారిని చూసి కూడలి ,లేఖిని రూపకర్తగా తెలుసుకొని , అభినందించాను . నాలాటి కొత్తగా వ్రాసేవారికి లేఖిని ఎంతైనా ఉపయోగపడుతోంది .

జ్యొతి గారి ప్రోద్బలముతో ప్రమదావనము లో చేరాను . అక్కడ అందరి తో సరదాగా మాట్లాడుతూ వుంటే కాలమే తెలీదు ! థాంక్ యు జ్యోతి . సహాయ కార్యక్రమములో జ్యోతి గారిని ,వరూధిని గారిని , పరిమళం గారిని , ఇందిర గారిని , లక్ష్మి గారిని కలిసాను . సృజన రామానుజం మొదటిసారిగా , చాట్ లో పలకరించగానే చాలా థ్రిల్ ఐపోయాను . ఇప్పుడైతే బెస్ట్ ఫ్రెండై పోయింది . సృజన తో మాట్లాడటానికే చాలాసార్లు సాయంకాలము నెట్ తీస్తాను . ఒకేసారి సృజన ,ప్రియ , సుభద్ర , అందరి తో చాట్ చేయటము ఎంత బాగుంటుందో ! ప్రియ అల్లరి కబురులు , సుభద్ర ముచ్చట్లు చాలా ఎంజాయ్ చేస్తాను .నేను , సుభద్ర గురుజీ తో మొట్టికాయలు తినకుండా ఒకరికొకరము సాయం చేసుకుంటూ వుంటాము . ప్రమదావనములో శ్రీ అల్లరి ముద్దు ముద్దుగా వుంటుంది . ఈ మధ్య పాపంబిజీ అట , కొన్ని రోజులుండండి వస్తాను అంది . అబ్బో భావన అల్లరైతే చెప్పక్కరలేదు . అందరినీ ఆటపట్టిస్తూ వుంటుంది . మరువము ఉష ,పరిచయము ఐన కొత్తలో , మా చెల్లెలు ఉషకు వివాహవార్షికోత్సవానికి ఇచ్చిన మేయిల్ , పొరపాటున , ఈ ఉష కు సెండ్ కొట్టాను . ఇహ చూసుకోండి , ఇదేమిటండి బాబు , మా రాజా చూసాడంటే నన్ను చంపేస్తాడు అని గగ్గోలు . హి హి హి , సారీ చెప్పాననుకోండి . శ్రీలలిత , పియస్ యం లక్ష్మి ఐతే చాలా ఏళ్ళ నుండి తెలిసిన బాల్య మితృలనిపిస్తారు . మనసులో మాట సుజాత గారు అభిమానముగా వారింటికి ఆహ్వానించి , బ్రహ్మకమలం మొక్క కూడా ఇచ్చారు .వారి ఇంటిలో , కస్తూరి మురళీ కృష్ణ , మాలతి , రమణి , గీతాచార్య , చదువరి , వరూధిని , రాధిక , కత్తిమహేష్ గారు ల తో మాట్లాడాను . నీహారిక , మధురవాణి , జాహ్నవి , లలిత , స్వాతి కమల్ , సృజన ,పద్మకళ ,సృజన , జ్ఞానప్రసూనగారు అబ్బ ఎంతమంది స్నేహితులో ! నేస్తం గారు మెచ్చుకున్నప్పుడు కొండ ఎక్కినంత ఆనందం కలిగింది . కూడలి చాట్ రూం లో నేస్తం గారిని చూసి మాట్లాడుదామనుకునే సరికి వెళ్ళిపోయారు . మళ్ళీ ఎప్పుడు చాన్స్ దొరుకుతుందో ! బంగారుపాపాయి , రావు బాలసరస్వతి పాడిన పాట లింక్ ఇచ్చారు , తృష్ణ .ఎప్పుడైనా పాటల గురించి కావాలంటే అడగమన్నారు .థాంక్ యు తృష్ణ .

కత్తిమహేష్ గారు నాకు ఒకేఒక కామెంట్ ఇచ్చారు , " హాస్యాస్పదము " పోస్ట్ లో . కాని ఆ పోస్ట్ కాస్తా మావారి కత్తెరకి నిర్ధాక్షిణ్యముగా కామెంట్స్ తో సహా బలైపోయింది . ఈ మధ్య మురళి గారు చాలా తన కామెంట్స్ తో , ప్రోత్సహిస్తున్నారు . ఎప్పుడైనా ఆయన కామెంట్ రాకపోతే రాలేదే అనుకుంటాను . సురేష్ లయ టి . వి సీరియల్ యద్దనపూడి నవల అని చెప్పారు . వేణూ శ్రీకాంత్ గారు , రుత్ గారు , కామెంట్స్ ఇవ్వలేక పోతున్నాము , ఫుల్ పేజ్ కి మార్చమని సలహా ఇచ్చారు . " అడుగడుగున గుడివుంది " పాటలో తప్పుదిద్దటానికి వచ్చిన ప్రభాకర్ గారు జర్నలిస్ట్ అని , " డిసెంబర్ " పోస్ట్ లో నవంబర్ 31 అనిరాస్తే సున్నితముగా మందలించిన మాగంటి గారు , సీనియర్ బ్లాగర్ అని , ఈ మధ్య ఎవరికీ కామెంట్స్ వ్రాయటము లేదని , ఇప్పుడు నాకే కామెంట్ ఇచ్చారని తెలిసినప్పుడు మరక కూడా మంచిదే అన్నట్లు , కొన్నిసారు లు తప్పులు వ్రాయటమూ మంచిదే అని పించింది .

అప్పుడప్పుడు పలకరించే కల్పనరెంటాల ,సత్య , అమ్మఒడి , చిలమకూరు విజయ మోహన్ , మారుతి , పద్మార్పిత , శేఖర్ పెదగోపు , రాణి , ధరణీ రాయ్ చౌదరి , రవి , సునీత , భమిడపాటి సూర్య లక్ష్మి , యడవల్లి శర్మ , మైత్రేయి , శిశిర , వీరు బొట్ల గణేష్ , విజయ భారతి , చైతన్య కల్యాణి , రవి చంద్ర , హరెఫల , నరేంద్ర చెన్నుపాటి ,మలక్ పేట్ రౌడి , గీతాచార్య , శివ చెరువు , యోగి , నాగ ప్రసాద్ , హరే కృష్ణ , వినయ చక్రవర్తి గోగినేని , స్వాతి మాధవ్ , ధనరాజ్ , మంజు , సౌమ్య , అక్షర , శ్రీనిక , రాం , ఉమాశంకర్ ,కార్తీక్, రాజశేఖరుని శర్మ , విహారి , శైలు ,సెలయేరు ,పరచూరి వంశీకృష్ణ , చిన్ని , కథాసాగర్ , భోనగిరి , హరీష్ , కెక్యువర్మ , దుర్గేశ్వర , సత్యనారయణ శర్మ గార్లు ఇలా ప్రత్యక్షముగా , పరోక్షముగా బోలెడు మంది స్నేహితులు అయ్యారు . ఇంతమంది స్నేహితులు ఉండటము ఎంత అదృష్టమో కదా ! ఐ యాం సో హాపీ .


ఇప్పటి వరకు నా రాతలు , కోతలు ఎన్నెన్నో చదివారు , అంబరమంటిన నా ఆనందాన్ని కూడా 27/ 12 న చదవి , మీరూ ఆనందిస్తారని భావిస్తాను .

28 comments:

భావన said...

అసలు మాల గారు రెచ్చింగ్స్ అండ్ చింపింగ్స్ మీరు బ్లాగ్ లోకం లో.... ;-) సరి లేరు మీకెవ్వరు ఓ సరదా కబుర్ల మాల గారు సరి లేరు మీకెవ్వరు.నిజమే నండి బాబు సరదా కాదు సూపర్ మీరు.

శరత్ 'కాలమ్' said...

27/12 మీ బ్లాగ్ పుట్టిన రోజా?

'Padmarpita' said...

ఆనందిస్తూ...మున్ముందు మరిన్ని టపాలు అందిస్తారని ఆశిస్తూ!

పానీపూరి123 said...

అయితే చాలామంది మిత్రులు ఉన్నారన్నమాట :-)

మరువం ఉష said...

>> మరువము ఉష ,పరిచయము ఐన కొత్తలో , మా చెల్లెలు ఉషకు వివాహవార్షికోత్సవానికి ఇచ్చిన మేయిల్ , పొరపాటున ,

మరదే చేసింది ఘనకార్యమని నన్నిలా నలుగురిలో అల్లరి చేయటం. ;)

నాకు గుర్తు వుందండి. ఇంకా నవ్వుకుంటాను.

భలే డైరీలా వ్రాస్తున్నారులా ఈ లాగ్ బుక్ లో... కానీండి.

వేణూ శ్రీకాంత్ said...

బాగుందండీ కౌంట్ డౌన్.. భలే గుర్తుపెట్టుకుని రాస్తున్నారు.. 27 గురించి ఆసక్తిని పెంచేస్తున్నారు.

Enaganti Ravi Chandra said...

ఈసారి ఈ తెలుగు సమావేశానికి రండి. అక్కడ మిమ్మల్ని ప్రత్యక్షంగా కలవచ్చు.

శిశిర said...

ఒకే ఒకసారి కామెంట్ రాసాననుకుంటానండి నాకు తెలిసి. నా పేరు కూడా ప్రస్తావించారా? మీకు అంతమంది స్నేహితులెలా ఉన్నారో ఇప్పుడర్ధమయింది నాకు. సీనియర్ బ్లాగర్ల బ్లాగుల్లో కామెంటడానికి నాకు భయం. అందుకే తరచుగా చదువుతాను గాని ఎప్పూడూ వ్యాఖ్యానించను. :)

మురళి said...

మీ బ్లాగు కొంచం ఆలస్యంగా నా కంట పడింది మాలగారూ.. టైము దొరికినప్పుడల్లా పాత టపాలు చూస్తున్నా.. కానివ్వండి..

Anonymous said...

మీరిలా బ్లాగ్ మితృల సన్మాన కార్యక్రం పెడతారని ముందే తెలుసుంటే మీ ప్రతీ పొస్టుకీ ఓ కామెంటేసి "విసిష్ట మిత్ర " సన్మానం పొందేసి వుండేదాన్ని...అరెరె.....!
ప్రమదావనానికి మీ రొచ్చాకా మాంచి కళొచ్చిందండీ మాలగారు. మీ అల్లరి చూసి మీకు మనుమలు వున్న్ అరంటే నమ్మబుద్ధికాదు. బ్లాగుల్ని, ప్రమదావన్నాన్ని మీరిలాగే కళకళలాడిస్తూ వుందాలండీ .

Srujana Ramanujan said...

మీ హుశ్ఃఆరుకీ, పట్టుదలకీ ముచ్చటగా ఉంది.
ఓపిక లేకున్న కామెంటాలనిపించింది

జ్యోతి said...

మీ మల్లెపూల టపా నాకు గుర్తుంది. వామ్మూ ఎన్ని తప్పులు అని పూర్తిగా చదవకుండానే పారిపోయాను. కొత్తపాళీగారి చివాట్లు కూడా చూస్తూనే ఉన్నాను. ఇంత త్వరగా ఎంతమంది స్నేహితులను సంపాదించుకున్నారు. రౌడీగారిని మరచిపోయారా?? మిమ్మల్ని ఏదో అన్నట్టున్నారు..

శ్రీలలిత said...

మాలాగారూ,
ఎంత బాగుందో మీ బ్లాగ్ ప్రయాణం. మీరన్నట్లు ఇంతమంది మంచి స్నేహితులు దొరకడం ఎంత గొప్పో కదా..మీరు అందర్నీ అలా కలిపేసుకుంటారండీ..
నాకు కూడా మీరు ఎప్పటినుంచో తెలిసున్నవారు అనిపిస్తుంది. ముందు ఏం రాస్తారా అని చూస్తున్నాను..

భమిడిపాటి సూర్యలక్ష్మి said...

నేను కూడలి లోకి వస్తే తప్పకుండా సాహితి ని చూస్తాను.అప్పుడప్పడు మాత్రం కామెంటు రాస్తాను. గుర్తుంచున్నందుకు సంతోషం.

sunita said...

ఓ..నన్నూ గుర్తుంచుకున్నారు.ధన్యవాదాలు మాలగారు.

sunita said...

ఓ..నన్నూ గుర్తుంచుకున్నారు.ధన్యవాదాలు మాలగారు.

తృష్ణ said...

సంవత్స్రరాంతంలో అందరూ తమ తమ బ్లాగ్ ప్రయణాల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారే..భలేగా ఉమ్దండీ...నన్ను స్నేహితుల్లో కలుపుకున్నందుకు బోలెడు ధన్యవాదలండీ....

సిరిసిరిమువ్వ said...

అమ్మో ఎన్ని పేర్లు గుర్తు పెట్టుకున్నారో! మీ కౌంటు డౌను టపాలు మాత్రం భలే ఆసక్తికరంగా ఉన్నాయి. 27 కోసం ఎదురు చూస్తూ...

పరిమళం said...

మాలాగారూ,బాగుందండీ మీ పోస్ట్ !మొన్నేమో కుట్రదారులు ! ఇప్పుడేమో బ్లాగ్ మిత్రులూ .....భలే!

Anonymous said...

ఎటొ వెళ్తు ఇటొచ్చాను.. వచ్చాక తెలిసింది.. ఇంతవరకు... నాకెందుకు కంటపడలెదని..
అభినందనలు..

మాలా కుమార్ said...

భావన ,
పద్మార్పిత గారు ,
థాంక్ యు .

మాలా కుమార్ said...

కొత్త మితృలు ,
శరత్ " కాలం" గారు ,
పానీ పూరి గారు ,
నెలబాలుడు గారు ,నమస్కారమండి .

మాలా కుమార్ said...

మరువం ఉష ,
మిమ్మలిని నొప్పిస్తే సారీ అండి .

* వేణు శ్రీకాంత్ గారు , రవిచంద్ర గారు , ధన్యవాదాలండి .

* శిశిర గారు ,
నాకు సీనియర్ బ్లాగర్ గా ప్రమోషన్ ఇచ్చారన్నమాట . థాంక్ యు .

మాలా కుమార్ said...

మురళి గారు ,
ఓపికగా నా పాత పోస్ట్ లన్నీ చూస్తున్నందుకు థాంక్స్ అండి .

*లలిత గారు ,
నన్ను మునగచెట్టెక్కెస్తున్నందుకు , మీకే నండి " విశిష్ట మిత్ర " బిరుదు.

సృజనా ,
కాస్త ఓపిక వచ్చాకనే కామెంటమన్నానుకదా ! టేక్ కేర్ . థాంక్ యు మై డియర్ లిటిల్ ఫ్రెండ్ .

మాలా కుమార్ said...

జ్యోతి గారు ,
కొత్తపాళిగారు లేఖిని గురించి చెప్పేవరకు , బ్లాగ్ లోనే డైరెక్ట్ గా వ్రాసేదానిని . అందుకే అన్ని తప్పులు . ఇప్పుడు లేఖిని అలవాటు అయ్యాక , మీరెన్నిసారు లు చెప్పినా , బరాహాకు మారలేదు . కాపీ , పేస్ట్ కొంచము కష్టమే , టైం కూడా పడుతుంది , కాని బరాహా కు మారితే " రెడ్డొచ్చే మొదలాడు " లా అవుతుందని భయం ! రౌడీ గారిని ఎలా మరిచి పోతానండి ? రౌడీ గారు కదా ఆయన ఎమన్నా పరవాలేదు , నేనేమన్నా ఏమి తంటా నో అని పేరు మాత్రం చెప్పి వూరుకున్నానండి .

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు ,
భమిడపాటి సూర్య లక్ష్మి గారు ,
ధన్యవాదాలండి .

మాలా కుమార్ said...

సునీత గారు ,
ఎందుకు గుర్తు పెట్టుకోనండి , మీరూ నన్ను గుర్తుంచుకున్నారుగా .

* తృష్ణ గారు ,
మరి మీరు స్నేహితులే కదండి .

*సిరిసిరీమువ్వగారు ,
చాలా థాంక్స్ అండి . నా 27 పోస్ట్ మిమ్మలిని నిరాశ పరచదనే అనుకుంటున్నానండి .

* పరిమళం గారు ,
ముందుగా నాకు కామెంట్స్ ఇచ్చిన ఆరుగురి లో మీరొకరు . అప్పటినుండి మీ కామెంట్ కోసం ఎదురు చూడటము అలవాటైంది . మీ కామెంటే కాదు , మీ నవ్వు కూడా నాకు చాలా నచ్చుతుంది .

పరిమళం said...

అప్పుడెప్పుడో చూశారు ...ఇప్పుడు చూడండి హి హి హి హీ .............( థాంక్స్ :) )