" అవాహన " సంపాదించగానే ముందుగా చేసిన పని ఆ రాత్రే చదివేయటము . పుస్తకము ఇచ్చేటప్పుడే , ప్రొఫెసర్ . ముదిగొండ శివప్రసాద్ గారు చెప్పారు , మీ అభిప్రాయం చెప్పండి , తారువాతి ముద్రణలో , పాఠకుల అభిప్రాయం కూడా వేస్తాను అని . ఇంత మంచి నవల నేనొక్కదానినే చదవటమెందుకు ? అందరికీ పరిచయము చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాను . అప్పుడు నాకు గుర్తొచ్చింది పుస్తకం సైట్ . " బ్లాగుల్లో పెట్టే టపాలనే ఇక్కడ పెడితే , ఎక్కువ రోజులు చాలామంది కి చేరే అవకాశము వుంటుంది " అన్న పుస్తకం వారి ఆలోచన , వెంటనే ఈ ఆవాహన పరిచయం పుస్తకం వారికి పంపాను . ఇక అప్పటి నుండి ఒకటే టెన్షన్ ! వారు వేసుకుంటారా లేదా ? నా బ్లాగ్ లోనే రాయాల్సిందే అని . మీ అర్టికల్ ప్రచురిస్తున్నాము అని మేల్ రాగానే వావ్ అనుకున్నాను .
ప్రచురించిన పుస్తకం సైట్ వారికి , నన్ను వ్రాయమని ప్రోత్సహించిన జ్యోతిగారికి ధన్యవాదాలు .
ఆవాహన ప్రతి కాని , ముదిగొండ శివప్రసాద్ గారు రచించిన ఇతర పుస్తకాలు కాని కావాలంటే , రచయత నే నేరుగా సంప్రదించ వచ్చు .
వారి అడ్రస్ ;
ప్రొఫెసర్. ముదిగొండ శివప్రసాద్ ,
2- 2 - 647 / 132 - బి , సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ ,
హైదరాబాద్ - 500013 .
ఫోన్ ; 27425668 .
Tuesday, December 1, 2009
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
చదివానండోయ్ చదివాను ఈ పుస్తకం చిన్నపుడు .భలే గుర్తు చేసారు .పేరు తెలిసిందిగా ఇక వెట మొదలు పెట్టాలి
నేస్తం గారు ,
వేట ఎందుకండి ? మీ పతా చెప్పండి , పోస్ట్ లో పంపుతాను . నాకు కాదు లెండి , రచయితగారికి . ఆయన దగ్గర చాలా వున్నాయి , ఈ మద్యనే ప్రింట్ చేయించారట .
నాక్కూడా శివ ప్రసాద్ గారి పుస్తకాలంటే ఇష్టం. ఈ రచన దేని గురించి అండీ?
Congrats
రవిచంద్రగారు ,
ఆవాహన , వరంగల్ లోని వేయిస్తంబాల గుడి లో , ఒక యువకునికి , గుర్తుకువచ్చిన పునర్జన్మ గురించి అండి .
సృజన ,
థాంక్ యు .
Post a Comment