Sunday, December 20, 2009

ప్రియమైన కుట్ర

కౌంట్ డౌన్ - 4

" నీకేమీ తెలీదు బామ్మా , నువ్వు నేర్చుకో బామ్మా అని గౌరవ్ , చిన్నవాడు చెపుతున్నందుకైనా నేర్చుకోవచ్చుకదా ? వూరికే కూర్చోకపోతే అని మీ మామయ్య , మా నస మాస్టర్ లిద్దరూ నస పెట్టబట్టి కంప్యూటర్ నేర్చుకున్నాను కాని , కంప్యూటర్ తో ఏమి చేస్తాము రా ? " కంప్యూటర్ నేర్చుకున్నావు కదా అత్తయ్యా , ఏమిచేస్తున్నావు ? అన్న మా మేనల్లుడు రవి కి నా సమాధానము ఇది . " ఎందుకు చేయకూడదు ? బ్లాగ్ వ్రాయి " అన్నాడు . బ్లాగా ? అది అమితాబచన్ నే కదురా వ్రాస్తాడు అంటే పడీ పడీ నవ్వి , కాదత్తయ్యా ఎవరైనా వ్రాయొచ్చు అన్నాడు . అప్పటికీ నేను వినలే . ఇంగ్లీష్ లో అంత బాగా వ్రాయలేను లేరా అనేసాను .ఊహూ వింటేనా ? ఎందుకు తెలుగు లో కూడా రాయొచ్చు పదా ఎలా రాయాలో నేను చూపిస్తాను అన్నాడు . ఇప్పుడు వద్దులేరా , పార్టీలొనుంచి వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చుంటే అందరూ నేను గొప్ప చూపించుకుంటున్నాననుకొని నవ్వుతారు తరువాత చూదాము లే అని అప్పటికి తప్పించుకున్నాను . ఐనా పట్టు వదలకుండా నాకు బ్లాగ్ స్పాట్ లింక్ మెయిల్ చేసాడు .


" అమ్మా , నిన్న రవి బావ చెప్పింది ఏం చేసావు ? " మా అమ్మాయి ఫోన్ చేసి షంటటము మొదలుపెట్టింది . ఇహ తప్పక , మా అబ్బాయి పని చేసుకుంటున్నప్పుడు , వరేయ్ బేటా రవిబావ ఏదో బ్లాగ్ లింక్ పంపాడురా , సంజక్క కూడ రోజూ షంటు తోంది అసలు అదేమిటిరా అని అడిగాను . నా బేటా తలెత్తి కూడా చూడలేదు . సరే పనిలో వున్నట్లున్నాడులే అనుకొని , ఆంధ్రభూమి సీరియల్ లోకి తలదూర్చేసాను . నీ బ్లాగ్ కి ఏం పేరు పెడతావు ? అని సడన్ గా వినిపించేసరికి ఉలిక్కి పడి ఏట్రా అన్నా . అదే నీ బ్లాగ్ కి ఏం పేరు పెడతావు ? అని మళ్ళీ అడిగాడు . ఏమిటీ పేరు పెట్టాలా ? అన్నా . మరి లేక పోతే ఎట్లా ? చెప్పు అన్నాడు . ఓహో బ్లాగ్ కు పేరుకూడా పెట్టాలన్నమాట అను కొని అప్పుడు నేను చదువున్న సీరియల్ లోని హీరోయిన్ పేరు సాహితి నచ్చి , అదే " సాహితి " అన్నాను . బాగుంది అన్నాడు . ఇదిగో నీ బ్లాగ్ ఇక రాసుకో అని చూపించాడు . టెంప్లెట్ ఏది పెట్టను అని అడిగాడు . అప్పటికే ఉక్కిరి బిక్కిరి అయిన నేను ఏం వద్దులే సింపుల్ గా వుండనీయి , కానీ బాబా ,అసలు బ్లాగంటే ఏమిటిరా ? అందులో ఏమి రాయాలి ? అన్నాను . బ్లాగ్ అంటే ఓపెన్ డైరీ అనుకో . నీ ఇష్టం , నీకేది కావలంటే అది రాసుకో వచ్చు . చూడు , ఇక్కడ ఇలా టైప్ చేస్తే దానంతట అదే తెలుగు లోకి మారి పోతుంది అని చూపించాడు . ఇహ అప్పటి నుండి రోజూ రాత్రి వాడు పనిచేసుకునేటప్పుడు , పక్కన చేరి నా అనుమానాలను తీర్చుకుంటూ బ్లాగటము మొదలెట్టాను .

ఇదిగిదిగో బ్లాగ్ మొదలు పెట్టేసానహో అంటూ మా అమ్మాయి కి , రవి కి ఫోన్ చేసి చెప్పేసాను . వెంటనే సంజు కామెంట్ పెట్టేసింది . రోజూ కాల్ చేయగానే , ఈ రోజు ఏం రాసావు ? అని అడిగి మరీ చెప్పించుకొని , మా ఫ్రెండ్స్ కి కూడా చెప్పాను , నువ్వు బ్లాగ్ రాస్తున్నావు అని తెగ మెచ్చేసు కోవటము . సలహా లివ్వటమూనూ ! ఆ తరువాత రవి కూడా కామెంట్ పెట్టేసాడు . అప్పటినుండి ఇద్దరూ , నా కామెంటేటర్స్ , ప్రమోటర్స్ కూడాను . డప్పు పట్టుకొని మరీ చాటించేసారు . నా బ్లాగ్ గురించి వాళ్ళకే మహా ఉత్సాహంగా వుంది . ప్రతి పోస్ట్ తప్పకుండా చదువుతారు .

బ్లాగ్ మొదలు పెట్టగానే , సంజు , రవి తో పాటుకు జయకు కూడా చెప్పేసాను . బ్లాగ్ గురించి నా నాలెడ్జ్ అంతా జయకు చూపించేసాను . అంతే తను కూడా నా కామెంటేటర్ గా మారి పోయింది . ఆంధ్ర జ్యోతి లో బ్లాగ్ ల మీద వచ్చిన ఆర్టికల్ తనే చూపించింది . కాక పోతే మా జయ , ఆ ఇద్దరి పిల్లల లాగా మెచ్చేసుకోవటము కాకుండా , ఇదేమిటి ? మద్యలో అపేసావు ? పూర్తిగా వ్రాయొచ్చుకదా ? ఇక్కడ తప్పు వుంది , అచ్చు తప్పులున్నాయి అని విమర్శకురాలు కూడా అయ్యింది . మధ్యలో ఆపానంటావు చేయి నొప్పి పుట్టింది , లేదా ఇక రాయటానికి ఓపికైపోయింది అంటే వింటేనా ? తనకు తోడు మా కజిన్ సత్య , అక్కా చాలా తప్పులు రాస్తున్నావు , చదవలేక పోతున్నాను అని గొడవ . ప్లీజ్ అక్కా కొంచం తప్పులు తగ్గించవా అని ఓ తెగ బతిమిలాడేది . సలాలా నుండి కాల్ చేసి మరీ బతిమిలాడేది మా చిన్న చెల్లెలు ఉష , చదవాలని పిస్తోంది కాని చదవలేక పోతున్నాను అని . లేఖిని లో రాయటము మొదలు పెట్టాక కాస్త వీళ్ళ గోల తగ్గింది ! వీళ్ళ గొడవ మూలంగా తప్పులు లేకుండా చూసుకోక తప్పటము లేదు .

మేనకోడళ్ళు , శ్రీ దేవి , దీప్తి , హరిణి , ఇంకా అప్పుడప్పుడు బాగా రాస్తున్నావు అనే , గౌతం , బాల , సబిత , ఆడపడుచులు విజయ , ఉష ,శేషు నీ బ్లాగ్ చదువుతున్నాము చాలా బాగుంటోంది అని , బాగా రాస్తున్నావు అని మావదినగారు , ఉష ఆడపడుచులు సంధ్య ,ఆదిలక్ష్మి , దమయంతి మెచ్చుకుంటుంటూ వుంటే చాలా సంతోషం గా వుంటుంది . ఇంకో కజిన్ ఫణి కొన్ని టాపిక్స్ చెపుతూవుంటుంది .

మరి ఇంత మంది నా రాతను మెచ్చుకుంటున్నారంటే , దీని వెనుక మా వారి హస్తం వుందండోయ్ ! నా రాతకు మొదటి పాఠకులు ఆయనే . ఎడిటర్ కూడానూ . నిర్ధాక్షిణ్యంగా కత్తిరించేస్తారు . కొద్దో గొప్పో మిగులుతే అప్పుడప్పుడూ మా అమ్మ కత్తిరిస్తుంది . కాకపోతే అంతా కత్తిరించబడి రెండు ముక్కలే నా చేతికి వచ్చే పరిస్తితి రాకుండా చూసుకోవటమే నేను పడాల్సిన జాగ్రత్త !

మరి నేను వ్రాసే రాతలు అందముగా కనిపించాలంటే గీత ఇంకెంత అందం గా వుండాలి ? ఏటెంప్లెట్ నచ్చక మధన పడుతున్న నాకు చేయూత నిచ్చింది మా కోడలు అను . బాపు వేసిన చిత్రము ఎందుకు మనమే తయారు చేసుకుందాము అని నాకు కావలసిన విధముగా , అందులోనూ నా ఫేవరేట్ కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్ లో ఈ టెంప్లెట్ ను తయారు చేసి ఇచ్చింది . దీని కోసము చాలా కష్ట పడింది .ఎన్ని రకాలుగా మారుస్తేనో ఇంత సొగసుగా తయారు కాలేదు . హెడర్ లో వున్న బొమ్మ ఒక ఎత్తైతే , పక్కనున్న పూల తీగెల స్తంభం చూసారా అది ఇంకో ఎత్తు . బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో హీరోయిన్ లు , బాల్కనీ లో ఇలాంటి స్తంభం దగ్గర , ఆకాశము లో చంద్రుని చూస్తూ పాటలు పాడుతూ వుండే సీన్ అంటే నాకు చాలా ఇష్టం . అది చెప్పగానే ఈ స్తంభం తయారు చేసింది . ఈ టెంప్లెట్ తన సృస్ఠినే .


నేను హాయిగా శూన్యము లోకి చూసుకుంటూ చుక్కలు లెక్క పెడుతూ , బేకార్ గా వుంటే , అలా వుండనీయకుండా చూడండి నా మీద ఎంత అహ్లాదకర మైన కుట్ర చేసారో నా ప్రియమైన కుట్రదారులు .


మీకు జిడ్డు మహాసభల ప్రెసిడెంట్ అంటే తెలుసా ? అసలు ఆ పేరు ఎప్పుడైనా విన్నా రా ? అయ్యో తెలీదా ? ఐతే 22/12 కొరకు వేచి చూడండి - - - తెలుసు కోండి కౌంట్ డౌన్ 3 లో .

17 comments:

పరిమళం said...

ఆహా ..ఏమిభాగ్యమూ ...మాలాగారు , మీకింతమంది ప్రియమైన కుట్రదారులున్నారన్నమాట !ఎంత ప్రియమైన వారు కాకపొతే మీకింత సపోర్ట్ ఇస్తారు ...థాంక్స్ చెప్పకుండా కుట్రదారులంటారా ....

cartheek said...

ఒహొ మాలా అక్క ఎంత కుట్ర చెసారు మీ మీద. :) :)
మొత్తనికి మీ బ్లాగింగ్ స్టార్ట్ చెయ్యడానికి ముందు వరల్డ్ బ్యాంక్ ప్రొజెక్ట్ కి కృషి చెసినట్టూ చాలా మందె అస్టకస్టాలు పడి, మిమ్మల్ని అస్ట కస్టాలు పెట్టీ ఇంత చక్కటి టెంప్లెత్ తయారు చెసి అన్ని నెర్పించారన్న మాట మీకు... :) :)
చక్కగా సింపుల్ గా రాస్తున్నారు...

చదువరి said...
This comment has been removed by a blog administrator.
సిరిసిరిమువ్వ said...

మాలా గారు మీ బ్లాగుకి ఇంతమంది వెన్నుదన్నుగా ఉన్నారన్నమాట. వారి కుట్రకి ప్రతిగా వారందరి చేత బ్లాగులు మొదలెట్టించండి.

జయ said...

చాలా బాగుంది. చివ్వరి దాకా ఏకబిగిన చదివించేసావ్. మాంచి టెంపొ మైంటైన్ చేసావ్. ప్రస్తుతం ఉన్న నా గులాబిపువ్వు టెంప్లేట్ అనునే చేసిపెట్టింది నాకు. ఎంతబాగుందో కదా! ఇంక, బ్లాక్ అండ్ వైట్ బాల్కనీ లో కూచోవులే. వరస పెట్టి అన్ని టపాలు వొదిలేసేయ్, మేము చదివి పెట్టేస్తాం. All the best.

durgeswara said...

మీశైలి చాలా బాగుంది .

సుభద్ర said...

మాలగారు మీ కుట్రదారులకి నా దన్యవాదాలు..
ఎ౦టి అలిగారా!!!వాళ్లకి ఎ౦దు థ్యా౦క్స్ లు అ౦టారా!!
మరి వాళ్ళ పుణ్యమే కదా మీరు నాకు దోస్త్ అయ్యారు..
సుపర్ మీ ప్రహసన౦...నేను కౌ౦ట్ డౌన్ చేస్తున్నా మీతో పాటుగా..

మురళి said...

Good narration.. keep going..

శ్రీలలిత said...

మాలాగారూ, మీ ప్రియమైన కుట్రదారు లెంత మంచివాళ్ళండీ. నాలాంటి వాళ్ళు మధ్యలో దూరితే మర్యాదగా ఉండదు. హాయిగా గట్టున కూర్చుని మీ మనసులోని మధురోహలని ఆస్వాదిస్తాను. మీ అను స్వంతంగా చేసిన టెంప్లేట్ అదుర్స్...హహహహహ్..

caర్తీక్ said...
This comment has been removed by a blog administrator.
భావన said...

మీ కుట్ర దారులు బలే మంచోళ్ళు సుమీ, మా అందరికి ప్రియమైన మాల గారి సాహిత్య కుసుమాలు ఇచ్చేందుకు సాయ పడ్డారు కదా, డాబా మీద కూర్చుని ఆమె పువ్వులు విసరటం మేము అందుకుని చదివెయ్యటం. బాగు బాగు.

Anonymous said...

yes, good tempo. Chala bavundi. Good luck

Ravi komarraju

మాలా కుమార్ said...

చిరు నవ్వుల పరిమళం గారికి కోపమొచ్చిందే ! థాంక్ యు .

* కార్తీక్ , థాంక్ యు .

* సిరి సిరి మువ్వ గారు ,
మంచి ఐడియా ఇచ్చారండి . థాంక్ యు.

మాలా కుమార్ said...

థాంక్ యు జయ .
* దుర్గేశ్వర గారు ,
ధన్యవాదాలండి .

* మురళిగారు ,
మీరు మెచ్చుకున్నారంటే చాలా హాపీ గా వుందండి . థాంక్ యు .

మాలా కుమార్ said...

అంతేలే సుభద్ర ,
మీరెప్పుడు నన్నంతే అంటారు , నాకూ మీలాంటి మంచి దోస్త్ దొరికినందుకు సంతోషమే .

*శ్రీలలిత గారు ,
మిమ్మలిని నమ్ముకుంటే మీరూ హాండిచ్చేరన్నమాట .హుం

* thaank you ravi .

కొత్త పాళీ said...

చాలా బావుంది. మీది అచ్చంగా నిజంగా సకుటుంబ బ్లాగన్న మాట. తెలుగు బ్లాగర్లలో ఈ గౌరవం ఇంకవరికీ లేదనే అనుకుంటున్నా

మాలా కుమార్ said...

కొత్తపాళి గారు ,
నాకే ఈ గౌరవం దక్కిందంటారా ? ధన్యవాదాలండి .