Sunday, December 27, 2009

" ఖతం కహానీ :) :) :) ఐపోయిందా ? ? ? ఓవర్ ! ! !

మా అమ్మాయి చిన్నప్పుడు కథ చెప్పటము ఐపోగానే , " కతం కహానీ " అనేది . మా అబ్బాయి " బాత్ ఖతం బర్ కాస్ బిరియానీ " అనేవాడు . ఇప్పుడూ అంటాడనుకోండి .
100 + 1 = 101
2+ 7 = 27

ఏమిటి ఈ లెక్కలు ? అనుకుంటున్నారా ?

9 చాలా మంచి సంఖ్య అంటారు , నవరత్నాలు , నవగ్రహాలు , అష్టాదశ పురాణాలు , అష్టాదశ శక్తి పీఠాలు , ఇలా . . . ఇలా అన్నమాట . ఐతే ఏంటట ? అవన్నీ మాకూ తెలుసు అంటున్నారా ? అదే నేనూ చెప్పేది . ఏమిటంటే నాకూ నవరత్న మాల వుందిగా ! మావారు , మా అమ్మాయి , మా అబ్బాయి , మా అల్లుడు , మా కోడలు , ఇద్దరు మనవరాళ్ళు , ఇద్దరు మనవళ్ళు , నా మాల లోని నవరత్నాలు .

సరే సరే కాని , ఇలా ఒకదానికొకటి పొంతన లేకుండా తిక్క తిక్క గా మాట్ల్లాడుతే మాకెలా అర్ధం అవుతుంది ? అంటున్నారా ? మరి, అంబరాన , ఇంద్ర ధనస్సు ను అందుకున్నంత ఆనందము కలుగుతే , కాస్త ఆ మాత్రం తిక్క రాదేమిటి ? ఓకె ,ఓకె చెప్పేస్తున్నాను , ఈ రోజు అనగా 27 , డిసెంబర్ నా " సాహితి " పుట్టిన రోజు . అదీ తొమ్మిది కలిసి వచ్చేట్టుగా , డిసెంబర్ నాకిచ్చిన ఇంకో కానుక . ఇప్పుడు చెప్పండి , డిసెంబర్ ఇంకా 9 సంఖ్య మంచివా ? కాదా ?

ఇక పుట్టిన రోజు పాపాయికి బహుమానం ఇవ్వాలిగా ! ముందు 100 ఇద్దామనుకున్నాను . కాని 0 చివర వచ్చేట్టుగా ఇవ్వకూడదు కదా ! పిల్లలకైనా , దేవుడి హుండీ లోనైన 11 , 101 , 1001 ఇలా ఇస్తాముకదా అనుకొని 101 టపాలను బహుకరిస్తున్నానన్నమాట ! అదీ సంగతి .

ఈ 101 టపాలు వ్రాసేందుకు సహకరించిన , ప్రోత్సహించిన , చదివిన, మా కుటుంబ సభ్యులకు ,గురువులకు , బ్లాగ్ మితృలకు అందరికీ ధన్యవాదాలు . నా గురించి అంతా ఈ నూటొక్క టపాల లో చెప్పేసాను . ఇక చెప్పేందుకు ఏమీ లేదు .

" " ఖతం కహానీ " * * * " బాత్ ఖతం బర్ కాస్ బిరియానీ " :-)) :-)) :-))

22 comments:

జ్యోతి said...

Congratulations... విజయోస్తు.. దిగ్విజయోస్తు.. ఇలాగే సాగిపోండి. మీ మొదటి టపాలనుండి ఇప్పటిదాకా చాలా నేర్చుకున్నారు. రాతశైలి మెరుగుపడింది. ఇంకా ఇంకా రాయాలని మనసారా కోరుకుంటున్నాను..

చిలమకూరు విజయమోహన్ said...

సాహితికి జన్మదిన శుభాకాంక్షలు

మరువం ఉష said...

All the best for 1001 10001 .... 10000000001 posts ;)

u can do it మాలా కుమార్ గారు.

సిరిసిరిమువ్వ said...

అభినందనలు. అప్పుడే వంద దాటేసారా? మరిన్ని వందలు దాటాలని కోరుకుంటున్నాను.

Srujana Ramanujan said...

bad gal to stop if ever u stop ;-)

Any way congrats

'Padmarpita' said...

కంగ్రాట్స్..సాహితికి జన్మదిన శుభాకాంక్షలు!

జ్యోతి said...

ఏంటి? ఏమీలేదు అంటున్నారు. కొత్తసంవత్సరంలో కొత్త టపాకు తయారవ్వండి..మీ బ్లాగు మిత్రులు నిజంగా మీవాళ్లు అనుకుంటే టపాతో సమాధానమివ్వండి. లేదంటే ఖతం కహానీ, బర్కాస్ బిరియాని..

జయ said...

గౌరవ శుభాభినందనలతో ఇది మా అక్క కి......

ఎందుకమ్మా! ఇంకా ఎన్నో చెప్పాలికదమ్మా!
నాకెన్నో నేర్పావు కదమ్మా!
నా తల్లి లాంటి దానివే కదమ్మా!
నీలో కనిపించు నిదుగో ఆశారోచిస్సు
తటిల్లతలా నీవు మెరిస్తే
విద్యుల్లతలా నీవు విరిస్తే
తొలగిపోదా అంధకారం
కదలి రాదా కాంతిపుంజం
విడిచిపెట్టు అలసత్వం
ఉరకలు వేస్తేనే ఉషస్సు
ఉద్యమిస్తేనే వరించు యశస్సు
తృణకణం కాదు జీవనం
మణిదీపమై వెలగాలి సతతం
ఆటంకమెదురైనా ఆపరాదు పయనం
ప్రగతి వైపే నిత్యం నీ గమనం!

********************

srujana said...

అభినందనలు.

sunita said...

అభినందనలు.

శ్రీలలిత said...

మాలాగారూ,
తీగలా సాగిపోతున్న సాహితీరాగాన్ని ఆపొద్దు. ఇంతింతై వటుడింతయై అన్నట్టు ఎదిగిన మీ సాహితీ సుమ సౌరభం మాకు ఇంకా ఇంకా కావాలనిపిస్తోంది. మమ్మల్ని నిరాశ పరచకుండా మరింత ఆత్మీయంగా మీ అనుభవాలు, ఆలోచనలు పంచుకుంటారని మనసారా కోరుకుంటున్నాను.

K Phani said...

meeku congratulations,sahitiki many many happy returns of the day.tvaralo mee 101 blogski post pampistaa.

ప్రియ said...

ఇది మరీ బాలేదు. ఐ వాంటూ స్పీక్ టూ నెల్లూరు పెద్దా రెడ్డి రైట్ నౌ

పరిమళం said...

ఓ ..సాహితీమాలకు పుట్టిన రోజు జేజేలు ! అలాగే ఏకశత ( కరక్టేనా ) టపోత్సవ శుభాభినందనలు. " ఖతం కహానీ " * * * " బాత్ ఖతం బర్ కాస్ బిరియానీ " కానే కాదు ఇంకా ఐపోలేదు ...ఈ పయనం ఇలాగే కొనసాగాలని నా ఆకాంక్ష మాలాగారూ !

భావన said...

శుభాకాంక్షలు మాల గారు. మీ బ్లాగ్ నుంచి ఇంకా ఎన్నో మంచి పోస్ట్ ల కోసం ఎదురు చూస్తుంటాము. అప్పుడే "బాత్ ఖతం బర్ కాస్ బిరియానీ " అంటే ఎలా. మేమొప్పుకోం అండి.

sanjyoth said...

Amma, Congratulations on your 101st Post. Proud of you to have started and kept at blogging ! Congratulations to all the telugu boggers for their efforts and encouragement.

You have this great opportunity to present your views and save them for eternity. Please do not stop but continue blogging on more topics of social and cultural significance. The pearls of wisdom from your Sahiti-Mala are an invaluable legacy for your children and grand children :)

Jaya Pinni your poem Addurs!

Sanju.

Rani said...

అభినందనలు :)

మాలా కుమార్ said...

చిలమకూరు విజయ మోహన్ గారు ,
సిరిసిరిమువ్వ గారు ,
పద్మార్పిత గారు ,
స్రుజన గారు ,
సునీత గారు ,
రాణి గారు ,
ధన్యవాదాలండి .

మాలా కుమార్ said...

ఉషా నిజంగా అన్ని రాయగలనంటారా ? మీకు నామీద అంత నమ్మకము వున్నందుకు థాన్క్స్ అండి .

* ఫణి , థాన్క్ యు .

మాలా కుమార్ said...

మిగిలిన వారికి వెవ్వేవ్వే . . .

Nutakki Raghavendra Rao said...

వ్వెవ్వెలొద్దు మాస్టారూ ! కొంచెం లేటయ్యాననే కదూ !,మీ 'సాహితి' యాన జన్మదిన శుభాకాంక్షలు.
నిరంతరంగా దిగ్విజయంగా సాగిపోతూ మహాధ్భుత అనుభవ అనుభూతులు మాతో పంచుకోవాలని ఆకాంక్షిస్తూ......మీ శ్రేయోభిలాషి ...నూతక్కి

Nutakki Raghavendra Rao said...

అంతేనా! ఇక మా గతి యింతేనా!.......అని అనకుండా యింకా యింకా మీ భావ జాలంలో కొట్టుకు పోయేందుకు మేమున్నాంగా అని అంటూ..... యింకెన్నెన్నో రాయాలని డిమాండు చేస్తూ,అందిస్తున్నానందుకోండి, మీ బ్లాగ్ జన్మదిన శుభాకాంక్షలు....శ్రేయోభిలాషి...నూతక్కి