Tuesday, November 10, 2009

మొట్టికాయలకు వంటింటి చిట్కా

మా అమ్మాయి అట్లాంటా నుండి వచ్చినప్పుడు , అదితి కి మూడు సంవత్సరాలు , వీక్కీకి మూడునెలలు . తను వచ్చిన కొద్దిరోజులకే , ఇక్కడ జాబ్ దొరికింది . తను జాబ్ కి వెళితే పిల్లలని చూసుకోవటానికి నాకు సహాయముగా , బుజ్జి అని ఓ పనిపిల్లని పెట్టింది . మా అదితి బంగారు తల్లి చెప్పినమాట వినేది . విక్కీ తోనే నా కష్టాలన్ని . మూడునెలల పసి వెధవ అప్పుడే నీ మాట ఏమి వినలేదు అనవద్దు . అప్పుడే వాడికన్ని ,, బుడుగ్గాడి బుద్దులు వచ్చేసాయి . గుండులా వుండే వాడు . నేను ఎత్తుకోలేక పోయేద్దాన్ని .అయినా ఎత్తుకోవటమెందుకని మంచము మీద పడుకోపెట్టేద్దాన్ని . చాప మీద పడుకో పెడదామంటే మా చుటికి ( పప్పీ ) జుట్టు వాడిమీద పడుతుందని భయ్యం ! ఎపుడూ , నేనో , బుజ్జి నో వాడిదగ్గరే వుండే వాళ్ళము . అయినా కొన్నిసార్లు తప్పదు కదా ! ఏదో పని మీద మేమున్న ఆ క్షణమే ,ధఢా మని మంచం మీదినుండి పడిపోయేవాడు . అదేమిటో దిండు అడ్డం పెట్టినా , దాని మీదనుండి కూడ ఢమ్మాల్ ! పడి ఇదో ఇలా చిద్విలాసము గా నవ్వుతుండేవాడు ! అదేమిటో ఇప్పటికీ అంతే ,ధడా , ధడా పడిపోతూవుంటాడు . కాని అస్సలు ఏడవడు . ఏడ్చాడు అంటే చాలా ఇబ్బంది కలిగిందన్నమాట . సరే ఇక అప్పటి ముచ్చటకొస్తే , వాడి నెత్తిన వెంట్రుకలూ తక్కువే . దానితో , వాడు పడగానే , నెత్తిన బుస బుస పొంగుతూ ,బుడిపెలు వచ్చేసేవి . రాత్రి 10 గంటలకు , మా సంజు రాగానే వాడినెత్తుకొని , తల నిమిరేది . పాపం ఆపేక్షగానే . అంతే బొడిపలు చేతికి తగిలేవి ! నన్నేమి అన్లేక కళ్ళనుండి బొట , బొటా కన్నీళ్ళు కార్చేది . అంతే మావారు రంగం లోకి దూకి , నన్నూ , బుజ్జినీ చెడా మడా దులిపేసేవారు ! మరి ఆయన వాళ్ళ అమ్మాయి కన్నీరు చూడలేరుకదా !

ప్రతిరోజూ , అర్ధరాత్రి ఈ మద్దెల దరువేమిటిరా భగవంతుడా అని నేను పెట్టుకున్న , నా మొర భగవంతుడు ఆలకించినట్లున్నాడు , ఓ ఆపత్భాంధవిని , మా చినత్తగారి రూపములో పంపాడు . కిందపడగానే దెబ్బ తగిలినచోట పేరు నెయ్యి రాయి , బొడిపకట్టదు అని ఓ చిట్కా చెప్పారు . అమ్మయ్య ఓ గిన్నెలో పేరు నెయ్యి ఎల్లప్పుడూ సిద్ధంగా వుంచుకొని , వాడు ధడామనగానే , గబ గబా తలంతా నెయ్యి రాసేద్దాని . ఆశ్చర్యం ! ఆ చిట్కా ఎంత బాగా పని చేసిందో ! కాక పోతే ప్రమాదం ఇంకో రూపం లో వచ్చింది . సంజు , రాగానే మామూలుగా ఎత్తుకొని , వాడి తల తడుముతే , ఒక్క టంటే ఒక్క బొడిప తగులుతే ఒట్టు . కాకపోతే " ఇదేమిటమ్మా వీడి దగ్గర నెయ్యి వాసన వొస్తోంది ? " అని హాచర్యపోయింది . నేనూ , బుజ్జీ కిమన్నాస్తి !

ఠపా ఠప్
అబ్బా . . . గురూజీ ఎందుకు మొట్టికాయలేస్తున్నారు ?
ఎంత సేపూ ఈ మనవ డూ , ఆ మనవడూ అంటూ మనవళ్ళ ముచ్చట్లేనా ? నేను చెప్పిందేమిటి ? ఓ లింక్ పంపాను చదివావా ?
మరేమో . . . మరీ . . . గురూజీ , ఇంట్లో పెళ్ళి హడావిడీ ... అదీ . . . . .
ఠఫా .. ఠప్
నేను ఇచ్చి ఎన్ని రోజులైంది . మరీ బద్ధకం ఎక్కువైపోతోంది .
( మా గురూజీ కి జ్ఞాపక శక్తి ఎక్కువే బాబూ , చాలా రోజుల క్రితమే ఇచ్చారు )
గురూజీ , మీరు మొట్టే మొట్టికాయలకు నా కెంత ఖర్చవుతోందా తెలుసా ? నెయ్యి కిలో 300 ల రూపాయలు , ఆ నెయ్యి వాసన పోవటానికి షాంపూ . అది ఓ చిన్న సీసా 300 ల రూపాయలు . నాకు రోజూ 600 ల రూపాయల ఖర్చు ! ఆ ఆ
అయితే చెప్పిన పని చేయి . మొట్టికాయలు తినకు .
సరే గురూజీ . చాలా బుద్దిగా తలూపాను. నా అంత బుద్దిమంతురాలైన శిష్యురాలు ఏ గురూజీకి దొరుకుతుంది ? అయినా మాగురూజీ అర్ధం చేసుకోరూ ! !
ఠపా . . . ఠప్ . . .
అబ్బా . . .మళ్ళీ ఏమిటి ? గురూజీ ?
పుస్తకం కోసం రాయమని చెప్పనా ? ఆ చెత్త టి. వి సీరియల్స్ చూడటం ఆపి , పని చూడు .
ఎంత మాట అన్నారు , గురూజీ . నేను చెత్త సీరియల్స్ చూస్తానా ? ఏదో రాత్రి ఒక్క లయ మాత్రమే చూస్తాను .అదీ ఏదో నా అభిమాన రచయిత్రి యద్దనపూడి నవల కాబట్టి . ఇది చాలా అన్యాయం , దారుణం వా ( ( (

ఏమిటి మాలాగారు , అంత ఏడుస్తున్నారు ? అని మిత్రులడిగారా ? ఏదో కష్టం , సుఖం మిత్రులకు కాక పోతే ఎవరికి చెప్పుకుంటాము ? అందులో ఒకరు కాదు ఇద్దరు కాదు , నలుగురడిగారు . చెప్పుకుంటున్నాను .పాపం మీకెంత బాధ వచ్చిందండి అని పరామర్శిస్తున్నారు . అదీ తప్పేనా ?
అంతే

ఠపా . . . . . ఠప్ . . . . .

20 comments:

sunita said...

హహహ!బాగుందండీ! మీమనవడికోసం ఉపయోగించిన చిట్కానే మీకోసం కూడా వాడుకున్నారన్నమాట.

జయ said...

చాలా బాగుంది. కొంచెం గురూజి మాట కూడా వింటే బాగుంటుంది కదా! మరీ మొట్టికాయలేయించుకుంటే ఎలా! చెప్పిన మాట వెంటనే వినటం నేర్చుకోవాలి...ఏడిస్తే లాభం లేదు. పోనీ మనవడు ఓదారుస్తాడా, అంటే..ఓ పక్క వాడే ఠాప్..ఠాప్ మని పడుతుండే!!!!....

మురళి said...

కొంచం అర్ధమయ్యీ కానట్టుగా...బాగుందండీ...

సుభద్ర said...

అయ్యెపాప౦ మాలగారు.............
మీరు నాతో చెపితే ఏ౦ లాభ౦,డోలు వెళ్ళి మద్దెలు తో మొరపెట్టుకున్న చ౦ద౦ గా ఉ౦టు౦ది.నా తప్పులుకి నాకు పడతాయి సేమ్ సౌ౦డ్ వస్తు౦ది.
నేను వాయ్ వాయ్ వాయ్..

కొత్త పాళీ said...

హ హ హ. అంతేనండీ, ఈ మనవడు బుడుగ్గాళ్లంతే

భావన said...

ఐతే గురువు గారి దగ్గర నుంచి బ్రహ్మాండం గా పడుతున్నట్లు వున్నాయి గా.... ఠాప్... ఇదు గో జ్యోతి.. నేనూరుకోనంతే నన్నెందుకు... ఠాప్ ఠాప్.. వా.. వా... మాలా సుభద్రా.. మిమ్ములను ఓదర్చటానికి వస్తే నాకేంటి రా బాబోయ్.. నా మాట విని ఆమె చెప్పినట్లు రాసెయ్యండీ రా బాబోయ్... నేను పరుగెడుతున్నా నా నెయ్య గిన్నె కోసం... కొంచం వెనక్కి వచ్చా.. మాల గారు మీ మనవడు బలే ముద్దొస్తున్నాడండోయ్.. ఒక ముద్దేసుకోండి నా తరపున..

మాలా కుమార్ said...

అవునండి సునీత గారు . అప్పుడు అనుకోలేదు , ఆ చిట్కా నాకే అవసరం పడుతుందని . హ హ హ .

మాలా కుమార్ said...

ఇదిగో జయా , ఆ సౌండ్లు మార్చావు . ఠపా ఠప్ నా మొట్టికాయ సౌండ్ . ధడా ధడ్ వాడు కింద పడే సౌండ్ .

మాలా కుమార్ said...

అదేనండి మురళి గారు , నా బాధ ఎవ్వరికీ అర్ధం కావటము లేదనే ఈ ఘోష !

మాలా కుమార్ said...

సుభద్రా ,
మన తప్పులను ఓపికగా భరించి ,వివరించి చెప్పే గురూజీ దొరకటం మన అదృష్టం .

మాలా కుమార్ said...

కొత్త పాళి గారు ,
నవ్వండి . ఏంచేస్తాను ? మీ మనవడు వచ్చినప్పుడు నేనూ ఇలాగే నవ్వుతాను .

మాలా కుమార్ said...

భావనా ,
ఏడ్చేవాడి ఎడమ చేతికింద , కుట్టేవాడి కుడిచేతికిందా వుండకూడదని ఇప్పటికైనా అర్ధం అయ్యిందా ?
మా మనవడి కి మీ ముద్దిస్తే తెగ సిగ్గుపడిపోయి , నా మీద గుర్ మన్నాడు , ఎందకంటే ఇప్పుడు వాడికి పదేళ్ళుమరి !

శ్రీలలిత said...

మాలాగారూ,
నేను ఆలస్యంగా చూసా మీ ఠాప్....ఠాప్...ప్చ్.. ఎంత బాధోకదా. కాని ఖర్చు అయితే అయింది కాని బలే చిట్కా కనిపెట్టారు. నాకూ గురూజీ ని తల్చుకుంటే భయంగానే ఉంది. ఎందుకంటే నేను కూడా లయ ఒక్కటే సీరియల్ చూస్తాను. ఇది గురూజీ కి తెలిస్తే ఇంకేదయినా ఉందా. మీరు చిట్కా చెప్పేసారని ఈసారి నన్ను బెంచి ఎక్కమంటారేమో.. కాస్త దీనిక్కూడా ఏదైనా చిట్కా ఉందేమో చెపుదురూ...
మనలో మన మాట.. మీ మనవడు బలే ముద్దొస్తున్నాడు..

satya said...

మరి ఇది భర్తల తలలపైనున్న బొడిపెలకి కూడా పని చేస్తుందా?......:)కి..కి..కి

జ్యోతి said...

Grrrrrrr..

ముందు నేను చెప్పిన పని చేయండి. ఇక్కడ మీటింగ్ పెట్టి సొల్లు కబుర్లేసుకోవడం కాదు.

మాలా కుమార్ said...

శ్రీ లలిత గారు ,
అయ్యో గట్టిగా అనకండి , గురూజీ బెంచ్ ఎక్కిస్తే , మా ఇంటిపక్కనవున్న బడి పిల్లలు , మా మనవలు నన్ను చూసి నవ్వరటండీ . దీనికి చిట్కా మీరే చెప్పాలి , నా బుర్ర బొడిపల తో వాచి పోయి పనిచేయటము లేదు ! .
మా మనవడు ముద్దొస్తున్నాడా ? మరే వాడు నా మనవడు కదా .
గురూజీ వినకుండ గుస గుస లయ బాగుంటుంది కదూ .

మాలా కుమార్ said...

సత్య గారు ,
ఇది ఏ బొడిపెలకైనా పనిచేస్తుందండి .

మాలా కుమార్ said...

అయ్య బాబోయ్ గురూజీ వచ్చేసారు , పరిగెత్తండోయ్ ! నేనైతే పరుగెత్తుతున్నా . అసలే మాఇంట్లో నెయ్యి ఐపోయింది .

శ్రీలలిత said...

నేనూ గప్ చిప్

satya said...

Mala gaaroo,
Ee konda vusirini aaviri paina vudikinchi kobbari pachchadi laaga chesukunte annam tone kaakundaa idleelu, dosalato koodaa baaguntundi.
Lekhini lo telugu type chesinaa mee blog lo copy paste cheyatam kudaratledu.Elaa mari?