Monday, November 2, 2009

వనభోజనము

పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ కోసం ముందు రోజు ఏమీ సిద్దం చేసుకోలేదు .ఈ రోజు వనభోజనం కోసమూ ఏదైనా చేయాలి . అందుకే సేమియా ఉప్మా చేసేద్దాం రెండూ కలిసొస్తాయ్ ! ఓపనైపోతుంది బాబూ అనుకున్నాను .ఇక ఆలస్యం ఎందుకు అని గబ గబా అన్ని కూరగాయల ముక్కలేసి ,సేమియా ఉప్మా చేసేసాను . దానిలోకి టమాటో చట్నీ సూపర్ కాంబినేషన్ .

ఓ కిలో టమాటాలలో కొద్దిగా చింతపడురసమేసి దగ్గరికి వచ్చేదాకా ఉడకపెట్టాను . ఉడికాక స్టవ్ మీదనుండి దింపి , పప్పు గుత్తితో మెత్తగా చేసి, ఓ వెడల్పాటి గిన్నెలో వేసి.చల్లారనిచ్చాను . చల్లారక రెండు స్పూన్ల ఆవపిండి ,ఒక స్పూన్ మెంతి పిండి , రుచికి తగ్గ ఉప్పు , కారం ,కొద్దిగా పసుపు వేసి కలిపి , ఒక మూకుడు లో నాలుగు చెంచాల నువ్వుల నూనె వేసి ,కాగాక , ఇంగువ , రెండు ఎండుమిరపకాయ ముక్కలు , అవాలు కొద్దిగా మెంతులు వేసి వేచి , కరవేపాకు కూడా వేసి పోపేసేసాను .అమ్మయ్య సేమియా ఉప్మా ,టమాటో పచ్చడి సిద్దం .

ఎప్పుడు సేమియా ఉప్మా చేసినా మా చెల్లెలు , జయ ఆడపడుచు , రేణుక గుర్తుకొస్తుంది . రేణుక ,రఘుగారి ,పిన్ని కూతురు . అయినా ఆ అమ్మాయంటే ఈయనకి ప్రాణం , అసలు చెల్లి మీద కన్నా ఎక్కువ ప్రేమ అని పెళ్ళిచూపులనాడే చెప్పారు ! మరి అంతటి వి. ఐ . పి ని ప్రత్యేకముగా చూడాలికదా ! ఏం చేద్దామన్నా టైం లేదు . మావారికేమో , బజారునుండి తెచ్చిపెట్టటము నచ్చదు . పొద్దున చేసిన గులాబ్ జామూన్లు వున్నాయా ? అని చూసాను . అమ్మయ్య అదృష్టం వున్నాయి ! అవి మళ్ళీ ఎవరికంటాపడకుండా దాచేసి , హాట్ సేమియా ఉప్మా చేద్దములే , అందరూ నేను చేసిన సేమియా ఉప్మా బాగుందంటారు అనుకొని , అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను.

అటు రేణుక వదినే ( వాళ్ళు వదినే అనేఅంటారు . ) అంటూ రావటము , ఇటు కరెంట్ పోవటము రెండూ ఒకేసారి జరిగాయి . ఎంతసేపటికి కరెంట్ రాదు . ఆ అమ్మాయి వెల్తానని అనటము , మేము ఇంకాసేపు కూర్చొండి అనటము జరుగుతోంది . నాకు టెన్షన్ గా వుంది . ఇక ఇలా కాదు అనుకొని , కాండిల్ లైట్ వెలుగులో సేమియా ఉప్మా చేసేసి , ఓ ప్లేట్లో ఉప్మా , ఓ బోల్ లో గులాబ్ జామూన్లు తెచ్చి పెట్టాను . తను ఓ స్పూన్ ఉప్మా తిని , ఇక నాకు చాలు వదినె అని . అయినా నేనొదులుతానా ? బలవంతముగా భగవంతునికి పెట్టినంత భక్తి గా ( అథిది దేవోభవ కదా ),ఎదురుగా కూర్చొని మరీ ఇంకొంచం తినిపించాను. మీరూ తినండి వదినే అంది . మేము తరువాత తింటాములెండి అంటే ఇక తెగేసి నాకు చాలు అంది . సరే మొదటిసారి ఆడపడుచు గారు వచ్చారు స్వీట్ తినండి అన్నాను. మరి కొంచం భయపడుతూనే తీసుకుందో ఏమో , నాపోరు భరించలేక కొద్దిగా నోట్లో పెట్టుకుంది , ఆ తరువాత తినేసింది . అమ్మయ్య ఆడపడుచును మర్యాద చేయటము ఐపోయింది ! రేణుక అటు వెళ్ళటము ,ఇటు కరెంట్ రావటము జరిగింది . మేమూ తిందామని చూద్దునుకదా అది సేమియా ఉప్మా లా లేదు . సేమియా పొడిలా వుంది ! హడావిడి , టెన్షన్ , కరెంట్ లేక పోవటము ,( ఏరాయైతేనేమి పళ్ళూడగొట్టుకోవటానికి ) ఉప్మా లో నీళ్ళు పోయటము మర్చిపోయాను ! పాపం పిచ్చిపిల్ల కక్కలేక , మింగలేక ఎంత ఇబ్బంది పడిందో !

వనభోజనం అంటూ సేమియా ఉప్మా తెచ్చావు . పైగా దానికో కహానీ వినిపించావు అనుకుంటూ నావైపు తినాలా వద్దా అని అనుమానముగా చూడకండి . ఈ టమాటో చెట్నీ తో లాగించేయండి . సూపర్ టేస్ట్ .నచ్చకపోతే పక్కనే వున్న మంచినీళ్ళు తాగి ఎలాగో ఈ సారికి సర్దుకొండి . వచ్చేసారికి నాకు కాస్త టైం దొరకగానే ( క్షణం తీరికి లేదు , దమ్మిడీ ఆదాయము లేదు అన్నట్లుంది నా పని ) ఓ మాంచి వంటకము చేసి , సిద్దముగా వుంచుతాను ,సరేనా .

అయినా ఏమిటో పొద్దున లేచినప్పటి నుండి ఈ తిండి గొడవ ! ఏం వండాలా ? ఏం తినాలా ? అనే ! లేవగానే బ్రేక్ ఫాస్టేం చేయాలా తో మొదలయ్యి , రేపొద్దున ఏం బ్రేక్ ఫాస్ట్ చేయాలా తో ముగుస్తోంది రోజు ! ఇంతవంట వండకుండా ఏదైనా ఉపాయముంటే బాగుండును . మరీ ఈ మధ్య రాత్రి కలలో , వంటదినుసులు ,కూరగాయలు ,మొత్తంగా వంటిల్లే కరాళనృత్యం చేస్తోంది . అసలు ఈ వంట కనిపెట్టిన వారెవరోకాని , మంచి నేతితో చేసిన , శెనగపిండి బూందీ లడ్డూలు ఓ వంద ముందు పెట్టి , మింగావా ? మింగు అని మొత్తం ఒకేసారి తినిపించాలనిపిస్తోంది ! ! !

27 comments:

సిరిసిరిమువ్వ said...

ఏంటి మీకు వంట మీద అంత విరక్తి వచ్చేసింది? నాలానే ఈ వంట బాధితులు చాలా మంది ఉన్నారన్నమాట! నాకూ అనిపిస్తుంది చక్కగా టిఫిను టైముకి ఓ బిళ్ల (అదే టాబ్లెట్టు), మధ్యాహ్నం భోజనానికి ఓ బిళ్ల, రాత్రి భోజనానికి ఓ బిళ్ల వేసుకునేట్టు ఉంటే ఎంత బాగుండో అని. ఇలాంటి బిళ్లలు రకరకాల రుచుల్లో ఎవరయినా కనిపెడితే బాగుండు :).

నేస్తం said...

అసలెక్కడ ..ఎక్కడా ..ఎక్కడ చెప్పారు సేమియా ఉప్మా ఎలా చెయ్యాలో ..నేను ఒప్పుకోను మళ్ళి అదెలా చెయ్యాలో పోస్టండి

చిలమకూరు విజయమోహన్ said...

అందరూ ఇలా ఒకేసారి వంటలు చేసేసి తినమంటే ఎలా?
మేము మాత్రం ఇబ్బంది పడంలెండి.

సుభద్ర said...

మాల గారు,
మీ మీద ఉన్న ప్రేమ తో తినే౦దుకు సిద్దపదుతున్నా!!మీరు వ౦డే అప్పుడు కరె౦ట్ ఉ౦దా లేదా?????ర౦గు,వాసన బాగున్నాయి. మేజర్ గారి పోటోగ్రాఫి వల్లన వచ్చినవా లేక -ఏమన్నా నేను మాత్ర౦ తినటానికి రడి అవుతున్నా...
హరా హరా మహా దేవా శ౦భో శ౦ఖరా!!!!!

భావన said...

ఈ సేమియా వుప్మా లైటేసే చేసేరు కద, అహ ఎందుకంటే ఫొటో కొంచం కదిలినట్లు వుంది ;-) ఐనా మీ వంటకేమి వంక పెడతాము లెండి.. పెట్టండి మరి, లైటేసే అమ్మా.... లైటు తీసి తినమంటే తినను మరి.

psmlakshmiblogspotcom said...

అవిడ తింటున్నప్పుడన్నా, ఉప్మాకీ, సేమ్యా వేపుడుకీ తేడా తెలియలేదా మాలాగారూ. మరీ అంత శ్రధ్ధా!!
psmlakshmi

జయ said...

టమాటా చట్నీ చాలా బాగుంది. ఉప్మా కూడా.

మాలా కుమార్ said...

సిరిసిరి మువ్వ గారు ,
వండటమేకాదండి బాబు , ఇంట్లో ఎవరిని పిలిచినా ఇప్పుడే అన్నం తినము అనో , తినేసాము అనో జవాబిస్తారు , అసలు నేనెందుకు పిలిచానో వినకుండానే ! అలా అయ్యింది నా పని !

మాలా కుమార్ said...

నేస్తం గారు ,
ఎలా చేయాలో చెప్పలేదు కదూ , సరె చెప్తా వ్నండి . ఏముంది సింపుల్ నీళ్ళలో సేమియాలు వుడికించటమే !

మాలా కుమార్ said...

చిలమకూరు విజయ మోహన్ గారు ,
అమ్మయ్య తింటానన్నారు కదా ,ఎక్కడ తినంటారోనని టెన్షన్ పడ్డాను . థాంక్ యు .

మాలా కుమార్ said...

సుభద్ర గారు ,
మీరు బేఫికర్ గా తినొచ్చు .మీ ప్ర్రాణానికి నా ప్ర్రాణము అడ్డు .

మాలా కుమార్ said...

భావన గారు ,
లైటేసే వండాను , లైటేసే తినమంటాను .మీరు నిక్షేపంగా తినొచ్చు . ఫొటో సంగతా ఏదో తొందరలో అలా వచ్చింది .

మాలా కుమార్ said...

లక్ష్మిగారు, అదేనండి , అథిదులంటే అంత శ్రద్ధ నాకు హి హి హి .

మాలా కుమార్ said...

jaya ,
thankyou

sunita said...

టమాటో చట్నీ క్విక్ రెసిపీ బాగుంది. సేమియా ఉప్మా ప్రహసనం బాగుంది.

జ్యోతి said...

ఏమి చెప్పను. ఎలా చెప్పను. మీ కష్టాలు, సేమ్యా కష్టాలు.. ప్చ్..

మాలా కుమార్ said...

సునిత గారు ,
పచ్చడికూడా బాగుంటుందండి .

మాలా కుమార్ said...

అవును జ్యొతి ఏం చెప్పనండి నా కష్టాలు. నా కష్టాలకు స్పందించినందుకు థాంక్స్ అండి .

తృష్ణ said...

బాగుంది ఉప్మా..+ మీ స్తైల్ ఆఫ్ నరేషన్...

భమిడిపాటి సూర్యలక్ష్మి said...

నేనూ ఎక్కువగా ఈ ఉప్మా చేస్తూవుంటాను.

మాలా కుమార్ said...

trushna gaaru ,

bhamidipaati suryalakshmi gaaru ,

thanks andi .

శ్రీలలిత said...

అమ్మయ్య. అదృష్టవంతురాలినన్నమాట. నేను ఆ రోజు బ్లాగ్ వనానికి రాలేదు. భగవంతుడు దయామయుడు. ఉట్టినే అన్నాన్లెండి. మీ సేమియా ఉప్మా మా ఇంట్లో కరెంట్ పోకుండా ఉన్నప్పుడు తప్పక ప్రయత్నిస్తాను.

cartheek said...

మాలా కుమార్ గారు వంట చెసెప్పుడు ఇలంటి కస్టలెదురవ్వుతాయా :)

అయినా మీరు చేసిన సేమ్యా ఉప్మా బావుందండి

మాలా కుమార్ said...

శ్రీ లలిత గారు ,
నిజంగానే దేవుడు దయామయుడండి , అందుకే ఉప్మా చేసే విధానము నాతో చెప్పించక , ఎవరిష్టమైనట్లు వారిని చేసుకోమన్నాడు . హహహ

మాలా కుమార్ said...

కార్తీక్ గారు ,
అవునండి వంట చేసేటప్పుడు బోలెడు కష్ట్టాలెదురైతాయండి .
మీకు నా సేమియా ఉప్మా నచ్చినందుకు థాంక్స్ అండి .

నీహారిక said...

సేమ్యా ఉప్మా అంటే నాకిష్టం మావారికిష్టం లేదు. ఫోటో చూస్తే నోరూరిపోతొంది.

వేణూ శ్రీకాంత్ said...

హ హ సేమ్యా ఉప్మా, మీ ఆతిధ్యం రెండూ అదిరాయి :-)