Sunday, November 29, 2009

అబ్బబ్బ పులుపు










ఈ చెట్టేమిటో , దానికి వున్న బంతులాంటి కాయలేమిటో , గిర్రున తిరుగుతూ వూరిస్తున్నాయే , అని ఎవరూ సోచాయింపులో పడివుండరు . ఎందుకంటే చిన్నప్పుడు , ఇంటర్వెల్ బెల్ కొట్టగానే , స్కూల్ గేట్ దగ్గరికి పరుగులు పెట్టి , బండి మీది , వీటిని కొని , తింటూ , స్స్ , హా ఏం పులుపు అని , ఇలా గింగిరాలు కొట్టని వాళ్ళు మాకాలములోనైతే అరుదు . ఆ పులుపును తట్టుకోవటానికి , బండి తాత , కాస్త పంచాదార నో , ఉప్పో చల్లేవాడు కదూ ! గుర్తొచ్చాయా ? అవేనండి బాబు , వెలగకాయలు . చిన్నప్పుడు గుజ్జు అలా అలా తినేసేదానినే కాని , పెద్దయ్యాక , తినలేక , ఆబ్బబ్బ ఏం పులుపు అనుకుంటూ , ఎంచక్కా పచ్చడి చేసుకొని తినేస్తున్నా ! వేడి అన్నములో , నెయ్యేసుకొని కలుపుకొని తింటే అహా ఏమి రుచి అనుకొకుండా వుండ లేరు .

ఈ రోజు పోస్ట్ , ఆ పచ్చడి గురించే . వచ్చిన వాళ్ళకు చెప్పే పని లేదు . రాని వాళ్ళు నేర్చుకోండి . ఇదే కాకుండా , వెలగపండు తో ఇంకేమైనా చేయటము వచ్చినవాళ్ళు , రసిపీలు ఇటు ఇవ్వండి . నాకు చాలా అవసరము . ఎందుకంటే , మా అమ్మాయి వాళ్ళింట్లో బోలెడు కాస్తున్నాయి . ఎప్పుడూ ఒకటే పచ్చడి బోర్ కదా ! మీ పేరు చెప్పుకొని చేసుకొంటాను .

వెలగపండు గుజ్జు ,

పచ్చిమిరపకాయలు ( మీ ఇష్టమైనన్ని ) ,

కొతిమీర , ఒక కట్ట ,

పోపుకు ;

ఎండుమిరాకాయ ముక్కలు ఓ నాలుగు ,

సెనగపప్పు ఒక చెంచాడు .

మినప పప్పు ఒక చెంచాడు ,

ఆవాలు ,

జీలకర్ర ,

ఇంగువ ,

కాసిని మెంతులు ,

పల్లీ నూనె ,

నాలుగైదు చెంచాల పంచదార , కాయ పులుపును బట్టి , లేదా సరిపడా బెల్లమైన పరవాలేదు .

కాచి చల్లార్చిన నీళ్ళు .

ముందుగా వెలగపండుకు గుజ్జుకు సరిపడ నూనె , ( మూడు , నాలుగు చెంచాలు ) వేడి చేసుకోవాలి . అందులో కొన్ని మెంతులు వేసి , ఎరుపు రంగు వచ్చేదాక వేయించాలి . తరువాత ,ఎండు మిరపకాయలు వేయాలి . అవి కొంచం వేగాక , మిగితా పోపుసామునులు వేసి , వేగాక దింపేముందు ఇంగువ వేయాలి . ఆ పోపుకు పచ్చిమిరపకాయలు , కొతిమీర కలిపి , నూరుకోవాలి . ఆ పై వెలగపండు గుజ్జును వేసి , గట్టిగా వుంటే , కాచి చల్లార్చుకున్న నీటిని కొద్దిగా కలిపి నూరుకోవాలి . చివరగా పంచదార కాని , బెల్లము కాని వేసుకొని కలిపేయాలి . అంతే , పచ్చడి సిద్దం !





9 comments:

జయ said...

బాగుంది వెలగపండు పచ్చడి.

భావన said...

ఏమిటో మాల గారు నీకు అల్లరి ఎక్కువయ్యింది అంటారు మీరు, నాకేమో మీ పోస్ట్ చూస్తే ఏదో ఒక కొంటె కామెంట్ వెయ్యలని అనిపిస్తుంది. నేనేం చెయ్యను. :-(
సరే విషయానికొస్తే మీకు వెలక్కాయ తో రెసిపీ లు కావాలి అంతే కద, నేను ఒక నాలుగైదు పంపుతాను. వెలక్కాయ పప్పు, వెలక్కాయ బంగాళదుప కూర, వెలక్కాయ మసాలా కూరి వేపుడు,వెలక్కాయ గుత్తు ల పులుసు. వెలక్కాయ వెల్లుల్లి కారం. హి హి హి
నేను వెలగ కాయ చెట్టు ఎప్పుడూ చూడలేదు కొంచెం క్లోజ్ అప్ లో ఫోటో ఒకటి పెట్టరూ ప్లీజ్.. నాకు తెలుగు లో నచ్చని పదం ’వెలక్కాయ ’.. ఎందుకంటే మా అమ్మ వినాయక చవితి కి మొదలెట్టి మళ్ళీ మాఘ మాసం వచ్చేదాకా ఈ పెరుగు పచ్చడి తో వాయిదాల పద్ధతి లో ప్రాణాలు తీసేది.

satya said...

మాలా గారూ,
ఒక్క దెబ్బకి బోలెడు వెలక్కాయలు చెల్లుబడయ్యే రెసిపీ చెప్తాను
వెలగ గుజ్జు ని వుడికించి బట్ట లో వేసి పిండి గానీ,జల్లెడలో వేసి గానీ గింజలు లేకుండా మెత్తటి గుజ్జుని వడగట్టుకొవాలి.దీనిలో పంచదారా,పులుపు తక్కువైతే కాసింత నిమ్మరసమో, నిమ్మ వుప్పో కలిపి జాం లా దగ్గరపడేదాకా వుడకనివ్వాలి.అంతే,పిల్లలూ, పెద్దలూ అందరూ ఇష్టపడే ,యేడాది పాటు నిలవవుండే వెలగ జెల్లీ రెడీ.

మాలా కుమార్ said...

thank you jaya

మాలా కుమార్ said...

ముందే తెలిసి వుంటే , కరాటే , జూడో , కతాకళి తెలిసిన వాడిని , మొగుడిగా తెచ్చేదానిని . స్చప్ , ఇట్స్ టూ లేట్ !
ఎవరికో పేరెందుకులెండి . ఎలుక తెలీదా అని నవ్వినందుకు నాకిన్ని తిప్పలు .

మాలా కుమార్ said...

ఆ మరే రమ్మన్నారు , తిమ్మన బంతికి , ఈ భావన కోసం వెలక్కాయ క్లోజప్ ఫొటో కూడా ! నేను పెట్టను పో .

మాలా కుమార్ said...

సత్య గారు ,
మీరు చెప్పిన రసిపీ బాగుందండి . చేస్తాను . థాంక్ యు .

భావన said...

అంతే లేమ్మా.. గుర్తు పెట్టుకుంటా ఫొటో పెట్టమంటే పెట్టరు కదు.. ప్రతి కుక్క కు ఒక రోజు వస్తుంది. హు..

మాలా కుమార్ said...

భావన ,
అలగకు , ఫొటొ పెట్టాను . కాకపోతే ఇంతకు ముందు చెట్టునిండా కాయలుండేవి . ఈ మద్య మీ దోస్తులొచ్చి అన్ని తెంపి కింద పడేసి పోయాయి . ఈ మధ్య వాటి గోల ఎక్కువైంది . లీడర్ వి కదా కాస్త అదుపులో పెట్టండి .