Tuesday, December 22, 2009
గురూజీ కి జన్మదిన శుభాకాంక్షలు .
కౌంట్ డౌన్ - 3
ఒకానొక రోజు నేను మహా దీక్ష గా నెట్ లోని కార్డ్స్ ఆడుతున్న సమయాన టింగ్ మని చప్పుడొచ్చింది . ఏమా అది అని చూడగా జ్యోతి గారి దగ్గరనుండి మెయిల్ . బాపురే ఇదేమిటి ? కలయా వైష్ణవ మాయా ? అనుకొని కళ్ళునులుపుకొని మరీ చూసాను . నిజమే జ్యోతి గారిదగ్గరనుండే , మీ టెంప్లెట్ చాలా సింపుల్ గా వుంది మార్చి పెట్టనా అని . అంతకు ముందే ఆంద్రజ్యోతి లో జ్యోతిగారి పరిచయము చదివి , అమితాబచ్చన్ తరువాత ఈ జ్యోతిగారే పెద్ద బ్లాగర్ అని అప్పటికే డిసైడ్ ఐపోయాను . . అందువలన కాసేపు బుర్ర గిర్రున తిరిగి జ్యోతీ అని గావు కేక పెట్టాను . ఆ తరువాత నా టెంప్లెట్ మార్చి ఇచ్చారు . మదిలోని మధురానుభూతులు అలా . . . అలా . . . అన్న టాగ్ లైన్ పెట్టింది కూడా జ్యోతి గారే .
ఆ తరువాత ప్రమదావనములో చేరుతారా అని అడిగారు . సరే నన్నాను . ప్రమదావనము నుండి సహాయ కార్యక్రమాని కి వెళ్ళినప్పుడు , జ్యోతిగారి చూసే దాక నేను , ఆవిడకి ఆరు చేతులు అన్న భ్రమలోనే వున్నాను సుమా !!! ఓరినీ ఇంత సింపుల్ గా వున్న ఈవిడేనా జ్యోతిగారు అనుకొని హాచర్య పోయాను సుమీ !!!
నన్ను వెనకనుండి ఎవరైనా తోస్తే తప్ప ఏ కొత్త పనీ మొదలు పెట్టను . స్టార్టింగ్ ట్రబుల్ అన్నమాట . ఆ తోసే పని మావారో , మా అమ్మ నో చేస్తారు . అలాగే మా రవి తోయటము తో , బ్లాగ్ లోకము లోకి వచ్చిపడ్డ నన్ను , కిందపడకుండా చేయూత నిచ్చారు , మా గురూజీ. బద్దకము గా ఏం రాస్తాను లే అనుకొని కొంచము తో ఆపగానే ఏమిటీ ఆ వాక్యాలు , కామాలు పుల్ స్టాప్ లు లేకుండా గాలిలోకి వదిలేస్తారు ? ఆయ్ అని కోపడతారు . అరే ఎంతసేపని కూర్చొని వుంటారు , కొంచం అలా గాలిలోకి ఎగురుతే అందరికీ వ్యాయామము అవుతుంది కదా గురూజీ అంటే అర్ధం చేసుకోరూ ! పైగా బోలెడు లింకు లు పంపి , ముందు అవి చదవండి . ఎలా వ్రాయాలో ఒక ఐడియా వస్తుంది అని తెగ పోరు . ఇదో మీరిలా అంటే , చిన్నప్పుడు మా అబ్బాయి వాళ్ళ ట్యూషన్ టీచర్ కి జిడ్డు మహాసభల ప్రెసిడెంట్ అని పేరు పెట్టాడు . నేను మీకదే పేరు పెట్టేస్తా నన్నా బెదరలేదు . ఏమిటీ నాకు జిడ్డు మహాసభల ప్రెసిడెంట్ అని పేరు పెడతారా ? ఆ విషయము తరువాత ఆలోచిద్దాము , ముందు నస ఆపి పని సంగతి చూడండి అని హుకుం జారీ చేస్తారు .
మొట్టికాయలకు వంటింటి చిట్కా అని సరదాగా గురూజీ మీద పోస్ట్ వ్రాసినా , జిడ్డు మహాసభల ప్రెసిడెంట్ అని ముద్దుగా పేరు పెట్టినా , గురూజీ అని గౌరవముగా పిలిచినా , అన్నిటినీ స్పొర్టివ్ గా తీసుకొని ఓ చిరునవ్వు నవ్వేస్తారు . నేను బ్లాగను అన్నప్పుడల్లా మొట్టికాయ లేస్తూ వ్రాయిస్తున్నారు . నాకు వ్రాయటానికి ఏమీ లేదు గురూజీ అంటే కాస్త మెదడుకు పని పెట్టండి అదే వచ్చేస్తుంది , అంటారు .పోనీ మీ పాత పోస్ట్ లలోనుండి కొన్ని సంఘటనలు తీసి ఈసారి వేరే విధముగా వ్రాసేయండి అని ఐవిడియా ఇచ్చేసారు . బ్లాగ్ గురు లో ఇప్పుడు చెబుతున్న పాఠాలన్నీ ,చాలావరకు నాకు చాట్ లో కొన్ని , ప్రత్యక్షముగా కొన్ని చెప్పారు . పాపం నాకు పోస్ట్ కు , టైటిల్ తోచటము లేదంటే ఆలోచించి ,టైటిల్ సజెస్ట్ చేస్తారు . అంతేనా కొన్నిసార్లు బొమ్మలు కూడా వెతికి ఇస్త్తారు . అంతేనా ,నాకు కావలసిన పాటలు కూడా ఎక్కడెక్కడినుండో వెతికి పట్టుకొచ్చి ఇస్తారు . అంతేనా అంటే నాకు కొంచము బ్లాగ్ కష్టం కలుగుతే చాలు గురూజీ అనగానే భుజం ఇచ్చేస్తారు . నాకేమిటట అంటూనే , ఏమీ కోరకుండా కోరినంత సహాయము చేసే మా గురూజీ ఎవరో బ్లాగర్స్ అందరికీ అర్ధమై పోయే వుంటుంది .
నామీద ఇంత విదేశీ కుట్ర చేసుతున్న మా గురూజీ , అదేనండి బ్లాగర్ల ప్రియ మిత్రురాలు జ్యోతి ( గారె లాగున్నావు బిడ్డా అంటే గారె చేసి పెట్టమని అన్నదట ఒకావిడ . అలా మళ్ళీ గారు అంటే ,నాకు గారెలు వద్దు బూరెలు తెండి అంటారు . ఇప్పుడు నాకు బూరెలు వండే ఓపిక లేదు అందుకే గారు తీసేస్తాను లెండి ) కి జన్మదిన శుభాకాంక్షలు .
ఆయు ఆరోగ్యాల తో , కలకాలము సుఖము గా వుండాలని కోరుకుంటున్నాను .
Jyoti , happy birth day to you .
అదే చేతో రేపూ ఓసారిటు రండి , కౌంట్ డౌన్ -4 చదువుదురుగాని .
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
ఓహో, మీ గురూజీ అంటే జ్యోతి నా? ఇంకా ఎవరో గురువు గారు అనుకున్నాను? ఈ మధ్య అసలే నకిలీ గురువులు ఎక్కువవుతున్నారు.
జ్యోతీ, పుట్టినరోజు శుభాకాంక్షలు!
కల్పన
Many Happy Returns Jyothi garu
మీగురువుగారికి మాతరపున జన్మదిన శుభాకాంక్షలు.
మీ గురు సమానురాలికి జన్మదిన శుభాకాంక్షలు! ఆ వార్త సంధర్బోచితంగా పంచుకున్నందుకు మీకు అభినందనలు.
జ్యోతిగారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయగలరు. ఈ అవకాశము కల్పించిన మీకు మా అభినందనలు..
yappy Yappy Birthday Jyothi. Mala thanks for the post.
"బ్లాగ్ గురువు" కు జన్మదిన శుభాకాంక్షలు
ధాంక్స్ ఈ టపా ద్వారా మనం పరిచయమయ్యాము కదా. ఇప్పుడు అదే నేను చెప్తున్నాను.:)
కొంచెం ఆలస్యంగా చెబుతున్నందకు మరోలా భావించకండి.
బ్లాగు గరువుకి జన్మ దిన శుభాకాంక్షలు.
కల్పన రెంటాల గారు ,
భరద్వాజ్ గారు ,
చిలమకూరు విజయమోహన్ గారు ,
మరువం ఉష గారు ,
కెక్యూబ్ వర్మగారు ,
భావన గారు ,
లలిత గారు ,
పంతుల జొగారావు గారు ,
అందరికీ ధన్యవాదాలు .
గురూజీ ,
అపచారం , అపచారం మీరు నాకు థాంక్స్ చెప్పటమేమిటి ? ఇట్స్ మై ప్లెజర్ .
Post a Comment