Monday, December 14, 2009

డిసెంబర్ ! ! !




పచ్చని చెట్టునిండా ఎర్ర ఎర్రని పూలు . ఎంత అందముగా వుందో కదా ! అంతే అందం గా డిసెంబర్ నా జీవితము లోకి వచ్చింది . . . ఆ విరబూసిన పూలలా ఎన్నో మధుర స్మృతులను తెచ్చింది . ముఖ్యమైన మలుపులు చాలా వరకు డిసెంబర్ లోనే జరగటము నమ్మలేని నిజము ! ప్రతి మలుపు ఒక్కోపూవైయ్యింది . ఆ పూల ఊసులిదిగో ! ! !


నవంబర్ ముప్పై , ఆ రోజున నా పెళ్ళిచూపులు . చూడటమేమిటో , నచ్చట మేమిటో , వెనువెంటనే ముహూర్తాలు పెట్టుకుంటానికి సిద్దమైపోవటమేమిటో అంతా కలలా జరిగి పోయింది .డిసెంబర్ మొదటి తారీకున , ముఖ్యాతి , ముఖ్యమైన మలుపుకు అంకురార్పణ జరిగి , అదే , నా కళ్యాణానికి ముహూర్త నిర్ణయం జరిగింది .


జీవితాన మరువలేని రోజు , అదే పెళ్ళిరోజు . ఆ రోజు డిసెంబర్ పదకొండు . హైదరాబాద్ లో , కింగ్ కోటీ లోని , ఇడెన్ బాగ్ లో , పెద్దల ఆశీస్సులతో , ఆత్మీయుల అభినందనల తో శ్రీమతిగా ప్రమోషన్ వచ్చిన రోజు . పూల రధములా అలంకరించిన పడవంత కారులో , మేళ తాళాలతో అత్తవారింట గృహప్రవేశం చేసినది డిసెంబర్ పన్నెండున .


అమ్మాయినుండి ఆవిడగా మారటము , ఆ పైన అమ్మగా మారటము అది కూడా డిసెంబర్ లోనే ! అమ్మ లోని మధురిమను తొలిసారిగా రుచి చూసింది డిసెంబర్ ఇరవై మూడున . అదేనండి మా అమ్మాయి పుట్టినరోజు .

మా అమ్మయి పుట్టిన రోజు ఇరవై మూడైతే , మా అమ్మ పుట్టిన రోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది .

సుప్రభాత సమయాన , దివ్యమంగళ స్వరూపుడైన , కోరిన వరములనిచ్చే , మా ఇలవేలుపు , తిరుమలరాయుని , కొంగులు ముడివేసుకొని , పసుపు వస్త్రాలతో తొలిసారిగా దర్షించుకున్నది డిసెంబర్ పద్దెనిమిదిన .

కలలోనైనా అనుకోనిది , ఊహించనిది నేను బ్యూటీ పార్లర్ తెరవటము . కానీ అదీ జరిగింది , ఎప్పుడు ? ఇంకెప్పుడు డిసెంబర్ పదిహేడున !

ఒక చిన్న తికమక కూడా జరిగింది . పూనా లో బి. ఏ మొదటి సంవత్సరము చదివి , హైదరాబాద్ లో రెండో సంవత్సరము లో డిసెంబర్ లో చేరవలసివచ్చింది .అప్పుడు జరిగిన తెలంగాణా ఉద్యమము వలన ఎకడమిక్ ఇయర్ డిసెంబర్ లో మొదలయ్యిందన్నమాట . డిసెంబర్ లో జరిగిన ఫైనల్ పరీక్షలో , ఇంగ్లీష్ పేపర్ ఔటాఫ్ సిలబస్ ఇవ్వటము వలన , అప్పుడు పోస్ట్ పోన్ అయ్యి , ఫిబ్రవరి లో ఆ ఒక్క పేపర్ ,పరీక్ష జరిగింది . అదీను మా అబ్బాయి పుట్టిన మూడో రోజున . సరే రాసి పాస్ అయ్యాను కాని , నా డిగ్రీ ని డిసెంబర్ ఖాతా లో వేయాలా ? ఫిబ్రవరి లో వేయాలా ? అనేదే మకతిక !






ఏయ్ కాలచక్రమా ! ఎందుకంత నవ్వుతున్నావు ? డిసెంబర్ లో ఇంకేమీ జరగవా ? అనా ? ఎలా చెప్పగలను ???
ఏమో ? ఇంకా ఈ డిసెంబర్ నాకేమేమి ఇస్తుందో ??? అది నువ్వే చెప్పాలి - - -

20 comments:

కెక్యూబ్ వర్మ said...

మీకు మరిన్ని సౌభాగ్యాలు ప్రతిరోజూ కలగాలని...

cartheek said...

అయితే ఆలస్యంగా చెప్తున్నా అక్కకు పెళ్లి రోజు శుబాకాంక్షలు :) ....
ఏంటి అక్కా పెళ్లి చూపులైయిన 11 రోజులకే పెళ్లి జరిగిపోయిందా .. అంత సూపర్ ఫాస్ట్ గా.... :) :)
మొత్తానికి డిసెంబర్ నేలంతా మీరు celebrations తో బిజీ అన్నమాట అన్నమాట ..
మీ డిగ్రీ కాతాను ఫిబ్రవరి ,డిసెంబర్ రెండు కలిసివచ్చేలా "డిసెబ్రరి" లో వేసెయ్యండి :) ....

మాగంటి వంశీ మోహన్ said...

మిగిలిన సంగతులన్నీ బాగున్నాయి కానీ - నవంబరు ముప్ఫై ఒకటా ? ఏ సంవత్సరమండోయి ? శాలివాహన శకమా? చోళ రాజుల శకమా? అల్ అరబ్బీ శకమా? :) :)

సుభద్ర said...

మాలగారు,
మీకు,మేజర్ గార్కి పెళ్ళిరోజు శుభాకా౦క్షలు..కాస్తా ఆల్యస౦ గా...
అయ్యె విష్ చేయలేదే అనిపి౦చి౦ది మీ పోస్ట్ చదవట౦ మొదలు పెట్టాక తరువాత ఈ నెల అ౦తా మీకు నెలలో ఎప్పుడైనా విష్ చెయ్యవచ్చు అనిపిస్తు౦ది నాకు పూర్తిగా చదివాక..
మిగిలిన డేట్స్ కూడా మీ ఖాతలో చేరి మరి౦త మ౦చిని మూట కట్టితేవాలని కోరుకు౦టూ..

సుభద్ర said...

hi

సిరిసిరిమువ్వ said...

డిసెంబరు 11 పెళ్ళి రోజయితే ఇవాళ చెప్తున్నారా?

పెళ్ళిరోజు శుభాకాంక్షలు. మీరిలాగే మరిన్ని పెళ్ళిరోజులు జరుపుకోవాలి.

sunita said...

పెళ్ళిరోజు శుభాకాంక్షలు.

Hima bindu said...

ఓహ్! గ్రేట్ .ఆలస్యంగా అందుకోండి శుభాకాంక్షలు .నాకు అంతేనండి నవంబర్ మే నెలల్లో జీవితంలో ముఖ్యమైన మలుపులు జరుగుతుంటాయి చదువు ఉద్యోగంతో సహా -:)

భావన said...

ఫెళ్ళి రోజు శుభాకాంక్షలండీ మాల గారు. అయ్యో మీరు బలే టోళ్ళే ఇంత మంచి రోజు ను ఒక రోజు లేట్ గా చెపుతారా? ఈ సవత్సరపు లేదా అన్ని సవత్సరపు వివాహ వేడుకల కబుర్ల కోసం చూస్తాము మరి. Many many happy returns of the Day to you both.

జ్యోతి said...

అన్నింటికి కలిపి శుభాకాంక్షలు...

మాలా కుమార్ said...

* కెక్యుబ్ గారు ,
ధన్యవాదాలండి .

* కార్తీక్ ,
థాంక్ యు . అవును చాలా ఫాస్ట్ గా ఐపోయింది మా పెళ్ళి .
డిసెబ్రరి బాగానె వుంది .

మాలా కుమార్ said...

*వంశీ .యం . మాగంటి గారు ,
ఏదో డిసెంబర్ లో వుండి గమనించలేదండి . థాంక్స్ అండి .

*సుభద్రా ,
థాంక్ యు వెరీ మచ్ .

*సిరిసిరి మువ్వగారు ,
థాంక్స్ అండీ . ఏదో అలా చెప్పానన్న్మాట.

మాలా కుమార్ said...

* సునీత గారు ,
థాంక్స్ అండి .

* చిన్నిగారు ,
ఐతే మరి నవంబర్ లో చెప్పలేదేమండి ? మరి మీకూ ఆలస్యముగా మా శుభాకాంక్షలు .
థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

* భావనా ,
మీకు చదివే ఓపిక వుందేమో కాని , నాకు రాసే ఓపిక లేదండీ బాబు ! థాంక్స్ అండి .

* జ్యోతిగారు ,
థాంక్స్ అండి .

పరిమళం said...

మాలగారు,పెళ్ళిరోజు శుభాకా౦క్షలు..కాస్తా ఆల్యస౦ గా..డిసెంబర్ మీకు ప్రత్యేకమైన నెలన్నమాట !ఈ నెల మీకు మరిన్ని శుభాలనివ్వాలని నా ఆకాంక్ష

Srujana Ramanujan said...

Happy marriage day wishes.

తెలుగుకళ said...

మాలా గారూ ! డిసెంబర్ శుభాకాంక్షలు

happy married life mam

శ్రీలలిత said...

మాలాగారూ,
మీ కొరకై కట్టిన మాలలో ఏమేమి పూలు పెట్టాలండీ
పెళ్ళిచూపులనాటి కాశీరత్నాలా...
పెళ్ళినాటి బంతి చేమంతులా...
అమ్మాయి అమ్మగా మారిన మధుర మందారాలా..
అమ్మ పుట్టినరోజు గుర్తుంచుకున్న అమ్మాయి చందన మొగ్గలా..
కొంగు బంగారమై వెలసిన ఆ స్వామి ఆశీర్వాద అక్షతలా..
నడుం బిగించి నిలబెట్టిన సౌందర్య సుమ రేకులా..
సరస్వతీ కటాక్ష మనదగ్గ తులసి దళములా..
అవీ, ఇవీ అన్నీ కలిపి కదంబమాలగా చేసి పంపుతున్నా..
ఇంకా ఇలాంటి మధుర సంఘటనలు ముందు ముందు కూడా
మిమ్మల్ని సంతోష పెట్టాలని కోరుకుంటూ..
అందుకోండి ఈ అందాల సుమమాల.

http://img6.travelblog.org/Photos/99414/370305/f/3414074-Flower-garlands-on-the-streets-of-Little-India-0.jpg

మాలా కుమార్ said...

పరిమళం గారు ,
చాలా థంక్స్ అండి .మీరురాక చాలా రోజులైంది .

సృజన , గీతాచార్య గారు ,
మీ ఇద్దరికి మరీ మరీ ధన్యవాదాలు .

తెలుగుకళ గారు ,
చాలా థాంక్స్ అండి .

శ్రీలలిత గారు ,
మీరిచ్చిన కదంబమాల ఎంత బాగుందో ! మీకు ధన్యవాదాలు తెలిపేందుకు నాకు మాటలు కరువైనాయి .

జయ said...

శ్రీ లలిత గారు మీ పూల మాల చాలా బాగుంది.