మా పరోపకారి పాపన్న ( నేను మావారికి పెట్టుకున్న పేర్లలో అదొకటి లెండి ) యు.యస్ వచ్చేటప్పుడు , ఓ పెళ్ళి కి వెళ్ళివచ్చి , హడావిడిగా వచ్చి ఫ్లైట్ ఎక్కి , యు.యస్ వచ్చాక చూసుకుంటే ఆయనగారు , లాస్ట్ మినిట్లో మా ఆడపడుచు ఎందుకైనా మంచిది అని పెట్టిన రెండు , పాంట్లు , రెండు షర్ట్ లు తప్ప ఇంకేమి బట్టలు తెచ్చుకోలేదంటే నమ్ముతారా ? మరి ఈ సూట్కేస్ లు ఇంతబరువున్నాయి ఏమిటా అని మా పిల్లలు తెరిచి చూస్తే వాటినిండా ఆయన పిల్లలకోసము కొన్న గిఫ్ట్లు , అందరూ మా పిల్లల కియ్యండీ అని ఇచ్చిన స్వీట్ బాక్స్ లూనూ ! సరే ఆ స్వీట్ బాక్స్ లు అన్నీ పాక్ చేయటము , పోస్ట్ చేయటము వేరే కథ . వాళ్ళ ఫ్రెండ్ కూతురు పెళ్ళికి వెళ్ళి వచ్చాక , అందరూ వాళ్ళ పిల్లలకియ్యమని ఇచ్చినవి సద్దుకున్నాక ఈయన బట్టలు సద్దుకుందామని ,బట్టలు తీసి మంచము మీద పెట్టారట . చివరి నిమిషము లో రావటము వలన బట్టలు సద్దుకోవటము మరచిపోయారట ! మేము ఇండియా కి తిరిగి వచ్చేవరకూ అలాగే మంచము మీద వున్న బట్టలను చూసి నేను నిట్టూర్చటము తప్ప ఏమి చేయలేక పోయాను !
మీరు రైళ్ళూ , బస్ ల వెంటే పరుగెత్తుతారనుకున్నాను , విమానాల వెంట కూడా అలాగే పరుగెత్తుతారా ? అని మా పిన్ని అడుగుతే , అవును పిన్నీ . కా . . . నీ . . .ఏదైనా పెళ్ళికి మటుకు పెళ్ళికొడుకు ఆలస్యముగా రావచ్చేమో కాని మేము మాత్రము ముహూర్తము సమయానికి ఒక్క నిమిషము కూడా ఆలస్యము గా వెళ్ళము తెలుసా అని గర్వం గా చెప్పాను . అసలు ఆ రోజు ఆయన ఆలస్యానికి కారణము , ఫ్రెండ్ కూతురు పెళ్ళికెళ్ళి రావటమే కదా ? ఇంటికొచ్చి పిలిచాడు , ఫోన్ చేసాడు వెళ్ళక పోతే బాగుంటుందా ? ముహూర్తము కాకుండా వచ్చేస్తే బాగుంటుందా ? ఏమిటో అర్ధం చేసుకోరూ !
ఎవరు పెళ్ళికి పిలిచినా మేము వెళ్ళకుండా వుండము . అదీ ముహూర్తము టైముకల్లా . పది పదిహేను సంవత్సరాల క్రితమైతే పెళ్ళిళ్ళ లో ఏదో వొక గొడవ జరిగేది . అందుకని , పెళ్ళైనాకా , పెళ్ళివారికి భోజన సదుపాయాలు చూసి , ఏవైనా గొడవలైతే సర్దుబాటు చేసి , అప్పగింతలైయ్యేటప్పుడు , వెనకాల కూర్చొని , మా అమ్మాయి పెళ్ళి కాకముందైతే , మా అమ్మాయిని అప్పగించే సీను తలుచుకుంటూ , మా అమ్మాయి పెళ్ళైనాక , మా అమ్మాయిని అప్పగించిన సీను తలుచుకుంటూ ,కాసిని కళ్ళ నీళ్ళు పెట్టుకొని , ఆ తరువాత పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళి , ఆయన , పెళ్ళికొడుకు చేయి పట్టుకొని , అమ్మాయిని జాగ్రత్త గా చూసుకో బాబు అని చెపుతున్నప్పుడు , నేను చేతులు కట్టుకొని , ఆయన పక్కన నిలబడి , ఆయన చెప్పటమైనాక , నేనూ , ఆ పెళ్ళికూతురి చేయి చిన్నగా తట్టి వచ్చేయటము మా కలవాటై పోయింది . విచిత్ర మేమిటంటే మేము అమ్మాయి తరుపున వెళ్ళినా , అబ్బాయి తరుపున వెళ్ళినా అక్కడ ఇదే సీనుండేదన్నమాట . ప్రస్తుతమైతే మరీ దగ్గరవాళ్ళైతే తప్ప అంతవరకూ వుండటము లేదు . కాకపోతే ఈమధ్య పెళ్ళిలలో గొడవలు కూడా కావటము లేదుకదా ! కాని భోజనాల దగ్గర ఏర్పాట్లు చూడటము మానుకోలేదు .
కాకి తో కబురు పెట్టినా వస్తామని మాకు పేరు . అది ఎంతదాకా పోయిందంటే , ఈ మధ్య మాకు బాగా కావసిన వారింట్లో పెళ్ళి జరిగింది . అది మాకు వేరే వారి ద్వారా తెలిసింది . ఐతే , ఓ పది రోజుల తరువాత ఆయన ఫోన్ చేసి మీరు పెళ్ళికి రాలేదేమని నిష్టూరమాడాడు . ఆయనను చెప్పనిచ్చి , అసలు నువ్వు నన్ను పిలిచావా అంటే బిత్తర పోయి , పిలవలేదా అని లక్షా తొంభైసార్లు సారీలు చెప్పాడు . ఇంటికొచ్చి కూడా ఇంకో లక్షా తొంభై సార్లు సారీలు చెప్పి వెళ్ళాడు !
ఈ మధ్య మా పనమ్మాయి శారద పెళ్ళైంది . ఆ పెళ్ళికి మేమిద్దరమూ వెళ్ళాము . మమ్మలిని చూడగానే శారద అమ్మా , మీరూ పెద్దసారూ వచ్చారు అని తెగ సంతోష పడిపోయింది . సరే యధావిధిగా పెళ్ళికొడుకుకు , మా శారద చాలా మంచమ్మాయి , జాగ్రత్తగా చూసుకో అని మావారు చెప్పటము జరిగింది . ఆ అబ్బాయి బిత్తర పోయి తరువాత శారద ని అడిగాడుట , మీ సారు వాళ్ళకు నువ్వంటే చాలా అభిమానమా అని . ఇంటికొచ్చి శారద చెప్పుకొని మురిసి పోయింది . అమ్మా మీరొస్తారను కోలేదు .పెద్దసారు అంత బిజీగా వుండి కూడా రావటము నాకు చాలా సంతోషము కలిగిందమ్మా అంది . పిచ్చిపిల్లా ఎందుకు రామనుకున్నావు ? ఎవరు పిలిచినా ఎలాగో వీలుచేసుకొని తప్పక వెళుతాము . అని శారదకు చెప్పి , స్వగతం ; అవునుమరి , మమ్మలిని పిలవనివాళ్ళు పాపాత్ములు ! ! !

13 comments:
"పరోపకారి పాపన్న" భలే పేరు :) :) మీ వారు కూడా మీకుఎడూ పేరు పెట్టె ఉంటారు అది తేలవాలంటే మీ వారు రాసిన బ్ల్లాగు చదవాలి :) :)
అన్నట్టు మీరు జయ అక్క కి అక్క అంట కద నాకు ఈమద్యే తెలిసింది..అయితే నాకు అక్కే మరి
మానవుడు సంఘజీవి. కార్యాలకు హాజరవడం ద్వారా ఎంతో మందితో పరిచయాలు ఏర్పడతాయి.
అందుకే నేను మా ఊర్లో ఉన్నపుడు మా ఇంటికి ఎవరు పత్రిక తెచ్చిచ్చినా నేను తప్పకుండా వెళ్లేవాడిని. ఇక ఉద్యోగంలో చేరిన తర్వాత శని ఆదివారాలు పెళ్ళిళ్ళు ఉంటే తప్పకుండా హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నాను.
పరోపకారి పాపన్న భలే పేరు :) :) మీ వారు కూడా మీకు ఏదో పేరు పెట్టె ఉంటారు మీకు, అది తెలియాలంటే మీ వారు రాసే బ్లాగ్ చదవాలి మేము :) :)
అన్నట్టు మీరు జయ అక్క కి అక్క అంట కద నాకు ఈమద్యే తెలిసింది..అయితే నాకు అక్కే మరి అంట
మరయితే మా అమ్మాయి పెళ్ళికి రావాల్సిందే(నాది అయిపోయింది కాబట్టి ) ముహూర్తానికి కాదు మూడు రోజులు ముందుగా రావాల్సిందే :) బాగుందండీ .
పెళ్లిళ్లకెళ్లాలంటే విసుగ్గా ఉంటుంది. ఒకేసారి అన్ని ఆహ్వానాలు వస్తే ఇక తిప్పలే తిప్పలు. తప్పనిసరివాటికి హాజరవుతాను. నా శ్రీమతి public relations లో మెరుగ్గా ఉంటుంది. ఎక్కువ వివాహాలకు తనే హాజరవుతుంటుంది. మీ పనమ్మాయి శారద వివాహానికి మీరు మీ వారూ వెళ్లారంటే మీ ఓపికకి జోహార్లు. మీ ఇద్దరికీ బహుమానంగా ఇస్తున్నా రెండు వీర తాళ్లు , అందుకోండి.
బాగుంది...పెళ్ళిళ్ళకే ఏం ఖర్మ, పబ్బాలకి కూడా రెడీయేగా. అయినా, అదే మంచిది కదూ! పదిమందిని కలిసినప్పుడు ఉండే ఆనందం వేరు.
I too..
మాలాగారూ,
మా ఎపిసోడ్ మరోలా ఉంటుంది. మావారు చాలా పంక్ట్యుయల్. చెప్పిన టైమ్ కన్న పదినిమిషాల ముందే ఉంటారు. ఒక్కొక్కసారి మేమే హోస్ట్ లను ఆహ్వానించిన సందర్భాలు కూడా ఉన్నాయ్. ఏం చెస్తాం...ఇదే బాగుంది అనుకోడమే..
అయితే మనకి గొడవలు తప్పవన్నమాట. నాకు ఇల్లు కదలటం ససేమిరా నచ్చదు. ఎవరైనా పిలిస్తే నా దగ్గర సాకులు కోటి. ;)
కార్తీక్ ,
మావారు నాకే పేరు పెట్టారో తెలుసు కోవటానికి ఆయనకు బ్లాగ్ లేదుగా !
రవిచ౦ద్ర గారు ,
మాదీ అదే అభిప్రాయమ౦డి .
చిన్ని గారు ,
మీరు పిలవాలే కాని తప్పక వస్తాన౦డి .
సి .బి రావు గారు ,
ఎవరో వకరికి వున్దికదా !
మీ బహుమానానికి ధన్యవాదాల౦డీ .
మురళి గారు ,
మీరూ మా కేటగిరే నన్నమాట .
జయా ,
తప్పదుకదా ! వెళ్ళాలిసి వస్తున్ది మరి .
శ్రీలలిత గారూ ,
గట్టిగా అనకన్డి , మిమ్మలిని అన్దరినీ ఆహ్వాని౦చె౦దుకు , మమ్మలిని అ౦దరికి వీడ్కోలు పలికే౦దుకు రమ్మనగలరు .
ushaa ,
మాఇ౦ట్లో ఫ౦క్శన్స్ అయిపోయాయి కాబట్టి గొడవలున్డవు లెన్డి .
పాత post కి ఇప్పుడు కామెంటుతున్నానని నవ్వుకోకండేం. ఏమిటో ఈ blog లు నాకు కాస్త కొత్తగా పరిచయం అయ్యాయి. పూర్తిగా follow అయ్యే తీరికి చిక్కక, ఏరోజు కంటపడ్డ బ్లాగు ని ఆ రోజు పట్టుకుని వాళ్ళ పాత పోస్టులన్నీ తిరగేస్తున్నాను. అలా ఇవాళ మీది పట్టుకున్నానన్నమాట.
ఇవాళ మీ కబుర్లు section మొత్తం చదివాను. చాలా బాగా రాస్తునారండి. మీ పట్టుదలకి నా అభినందనలు. మళ్ళీ time దొరికినప్పుడు మిగిలినవి అన్నీ చదవాలి.
Post a Comment