Tuesday, November 24, 2009

ఊర్వశి

-->
లేడీస్ మీటింగ్ లో మిసెస్ . రైనా ఫేషియల్ గురించి చెప్పినప్పుడు తెగ నిద్దరొచ్చేసింది . మహా బోర్ కొట్టినా ఏదో మొహాన కాసిని చిరునవ్వులతికించుకొని , చాలా బాగా చెప్పావు అని మొహమాటం గా విష్ చేసి వచ్చేసానే కాని , ఆ చిరునవ్వులని 20 సంవత్సరాల పాటు అతికించుకోవలసి వస్తుందని , ఆ రోజున ఏమాత్రము ఊహించలేకపోయాను . ఆ తరువాత ఓ నాలుగు సంవత్సరాల కి , ఓ సూర్యోదయాన , మావారు , బేకార్ గా మాజాంగ్ , కార్డ్స్ ఆడుకుంటూ వుండక పోతే , మిసెస్ . బట్నాగర్ బ్యూటీ క్లాసెస్స్ తీసుకుంటోంది కదా చేరొచ్చుగా అని క్లాస్ పీకారు . అదేమిటో మా అమ్మ , మా ఆయన నేను ఎంజాయ్ చేయటము సహించలేరు ! మా అమ్మ , నాకు సెలవలు రాగానే అది నేర్చుకో , ఇది నేర్చుకో అని నెడుతూవుండేది . పెళ్ళైనాక ఆ డ్యూటీ మావారు తీసుకున్నారు . వాళ్ళను ఎదిరంచే సాహసము చేయలేక గొణుకుంటూ , సణుకుంటూ చేరేదానిని . వాళ్ళు దేనిలోనో ఓ దానిలో చేర్చేవరకే , ఆ తరువాత దాని అంతు చూసేదాక నాకు తోచదు . అప్పుడేమో నీకే పిచ్చి పడితే అదే అని తిడుతారు . నేనేం చేయను ? ప్రస్తుతము ,మావారు యానిమేషన్ కోర్స్ పేపర్లు పట్టుకొని కూర్చున్నారు . నేను చిక్కటము లేదు . విషయము పక్కదారి పట్టినట్లుంది ! ఇక అసలు దారికి వస్తే , ఏంచేయగలను ? మా వారి పోరు భరించలేక చేరి , ఆ కోర్స్ లో చివరివరకూ నిలిచినదానిని నేనొక్కదానినే ! అంతేనా ఆతరువాత ప్రతి రెండు సంవత్సరాలకి బాంబే వెళ్ళి కోర్స్ లు చేసాను . . బరోడా లో మా ఫ్రెండ్ ఉష , తన పార్లర్ లో చేరమంది . అప్పుడే యూనివర్సిటీ లో చైల్డ్ డెవలప్మెంట్ లో , పి . జి డిప్లమాలో సీట్ వచ్చింది . నేను , పార్లరా ? చదువా ? అని అటూ ఇటూ ఊగుతుంటే , మా ఇంకో ఫ్రెండ్ కల్పనా దీది , పార్లర్ లో ఎప్పుడైనా చేరవచ్చు . అంతేకాదు బ్యూటీషియన్స్ కి అవకాశాలు వున్నాలేకపోయినా , టీచర్లకి , గైనకాలజిస్ట్ లకి ఎప్పుడూ అవకాశాలు వుంటాయి , ముందు చదువుకో అని నెట్టింది . ముక్కున పెట్టుకొని చదువు పూర్తిచేసి , ఉష వాళ్ళ ఊర్వశి బ్యూటీపార్లర్ లోకి జంప్ చేసేసాను.


అలాగ జంప్ చేసినదానిని దాని మీద మక్కువతో , హైదరాబాద్ వచ్చాక ,అదే పేరు తో ఊర్వశి బ్యూటీ పార్లర్ తెరిచేసాను . మా ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న పోర్షన్ రెంట్ కి తీసుకొని , దానికి కావలసిన హంగులన్నీ సమకూర్చుకొని , ఆ ఇంటి ఓనర్ గారిని , ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి రమ్మని పిలవటానికి , మా వారితో కలిసి వెళ్ళాను . నన్ను మావారు పరిచయము చేయగానే , ఆ ఇంటావిడ సుకన్య నన్ను పైనుంచి , కిందిదాకా ఎగా దిగా చూసి , ఇంత మైల్డ్ గా వుంది , ఈమేమి పార్లర్ నడుపుతుంది అని పెదవి విరిచేసింది ! ఎంత ఉక్రోషం వచ్చేసిందో . ఇంటికి రాగానే , అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకొని , నేను పార్లర్ నడపలేనా ? ఇంత మాట అంటుందా ? అని ఆవేశ పడిపోయాను .ఇంత ఖర్చు పెట్టి , వెనుకకి పోలేను , అంతా దండగ కావలిసిందేనా ? అని తెగ మధన పడ్డాను . కానీయ్ చూద్దాం అనుకొని ముందడుగు వేసాను .


ఆవిడనే , 15 సంవత్సరాల తరువాత పార్లర్ అమ్మేసి , కీస్ ఇద్దామని వెళితే , ఎందుకు మాలా పార్లర్ మూసేస్తున్నారు ? మీరు చాలా హోంలీ గా వుంటారని , బాగా చేస్తారని , మంచి పేరు వచ్చింది . రష్ కూడా బాగా వుంది కదా మూసేయకండి కంటిన్యూ చేయండి అంది !



-->
ముందుకు వేసిన అడుగు అలాగే ఎన్నెన్నో జ్ఞాపకాలను పోగుచేసుకుంటూ ముందు ముందుకు వెళ్ళింది . ఎంతో మంది అభిమానాన్ని సంపాదించి పెట్టింది . ఎందరికో ఉపాధిని కలిపించింది . మావారి పార్ట్నర్ చనిపోతే ఆయన భార్యకోసం , బంజారా హిల్ల్స్ లో ఊర్వశి బ్రాంచ్ ని తెరవటము మరిచిపోలేనిది . పలు కార్యక్రమాలకి ముఖ్య అథిది గా , కొన్నిటికి జడ్జ్ గా వెళ్ళటము మధురమైనవి .పార్లర్ కి వచ్చే పిల్లలతో చేరి నేనూ ఒక టీనేజ్ అమ్మాయినే అయిపోయాను . అంతేనా మౌనం గా వుండేదానిని వాగుడుకాయనయ్యాను ! నాకంటూ ఒక గుర్తింపును ఇచ్చింది నా " ఊర్వశి ".


ఇంతకీ ఈ సోదంతా ఎందుకంటే నిన్న విజయవాడ , కనకదుర్గ గుడి లోంచి బయటకు వస్తుంటే " ఊర్వశీ ఆంటీ " అని పిలుపు వినిపించింది . నన్ననుకోలేదు . పార్లర్ మూసేసిన 12 సంవత్సరాల తరువాత నన్ను ఆపేరు తో పిలుస్తారని ఎలా అనుకుంటాను ? కాని నన్నే ! ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని ఆప్యాయం గా పలకరిస్తే ఎంత సంతోషం వేసిందో చెప్పలేను !


జ్ఞాపకాలే మైమరుపు , జ్ఞాపకాలే మేలుకొలుపు .

జ్ఞాపకాలే నిట్టూర్పు , జ్ఞాపకాలే ఓదార్పు .



25 comments:

Srujana Ramanujan said...

nijame kadaa?

జ్ఞాపకాలే మైమరుపు , జ్ఞాపకాలే మేలుకొలుపు .

జ్ఞాపకాలే నిట్టూర్పు , జ్ఞాపకాలే ఓదార్పు .

శ్రీలలిత said...

ఙ్ఞాపకాలే తరగని నిధి
ఙ్ఞాపకాలే పెరిగే పెన్నిధి
ఙ్ఞాపకాలే ఆరని హారతి
ఆ ఙ్ఞాపకాలే మనకెంతో సంతృప్తి...

సుభద్ర said...

మాలగారు....
ఈ స్టోరి కోస౦ మీరు పార్లర్ నడిపారని తెలిసినప్పటి ను౦చి ఎదురుచూస్తూన్నా!!!...
మీరు నా ము౦దు డెస్క్ ఎక్కి చెప్పుతున్న పీల్ వచ్చి౦ది.మిమ్మల్ని చూస్తూ అ౦తా రెప్పవేయాకు౦డా విన్నాను అనుకో౦డి.మీరు ఉర్వశి ఆ౦టీగా పొ౦గిపోతు౦టే కళ్ళారా చూశాను.గుడ్ కీప్ గోయి౦గ్ మై ప్రె౦డ్..
జ్ఞాపకాలే మైమరుపు , జ్ఞాపకాలే మేలుకొలుపు . ఇది మాత్ర౦ సుపర్ ముగి౦పు..

జయ said...

ఈ తీపి గుర్తులనే పునాదులుగా చేసుకొని, ఎన్నో అనుభవించాలి...ఎన్నో సాధించాలి... I wish you all the best for innovations in your life.

భావన said...

మీరు సూపర్ మాల గారు. నోములు నోచేస్తారు, పచ్చడులు పట్టేస్తారు, వంటలు వండేస్తారు, తెగ చదివేసారు ఇంక ఇవి అన్ని చాల వన్నట్లు బ్యూటీ క్లినిక్ కూడానా.. అయ్యో తెలిస్తే మిమ్ములను కలిసినప్పుడూ హింస పెట్టేదానిని కదా ప్రశ్న లతో.. అయ్యయ్యో :-(

తృష్ణ said...

Great to know you madam...

what you said is really true...
"జ్ఞాపకాలే మైమరుపు , జ్ఞాపకాలే మేలుకొలుపు .
జ్ఞాపకాలే నిట్టూర్పు , జ్ఞాపకాలే ఓదార్పు . "

what's life without memories...memories are energy boosters...!!

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు ,
మీ కవిత చాలా బాగుంది . నా బ్లాగ్ లో రాసారు , కాబట్టి ఇక దానిమీద సర్వ హక్కులు నావే ! నాకు కావలసినప్పుడు వుపయోగించుకుంటాను . మీరు కాదనటానికి లేదు అంతే .

మాలా కుమార్ said...

సుభద్ర గారు ,
ఉన్న వూళ్ళో ఎప్పుడో ఒకప్పుడు పార్లర్ లో తెలిసిన వాళ్ళు కనిపిస్తున్నా , పరాయి ఊళ్ళో అలా పిలుపు వినేసరికి ,వళ్ళుతెలీనంతగా అలా మైమరచిపోయి డెస్క్ ఎక్కి ఉపన్యాసం ఇచ్చేసానన్నమాట ! నేను ఉపన్యాసం ఇస్తుంటే , నాముందు ,మీరు బుద్దిగా చేతులు కట్టుకొని వింటూ , అహా ఓహో ఎంత మంచి దృశ్యం .

మాలా కుమార్ said...

సృజన ,
జయ ,
థాంక్ యు .
భావన గారు ,
హి హి హి .

మాలా కుమార్ said...

తృష్ణ గారు ,
ఈ మేడం ఎందుకులెండి .
చూసారా , ఆ పాట గురించి మిమ్మలిని అడిగితే వెంటనే చెప్పేసేవారు . నాకు గుర్తు రాలేదు . నేనెప్పుడూ అంతే చంకలో పిల్లని పెట్టుకొని వూరంతా వెతుకుతాను !1
థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

మురళి గారు ,
మీరు కామెంట్ పెట్టారని , అది నాదాకా చేరలేదని , ఇందాకనే మీ పొస్ట్ చదివి తెలుసుకున్నాను . చాలా థాంక్స్ అండి .
మీ మంటనక్క ఆరోగ్యమే మా మహా బాగ్యం !

శేఖర్ పెద్దగోపు said...

మాలా గారు...ఏమీ అనుకోకపోతే మీ కామెంట్ బాక్స్ ని వేరే పేజీలో ఓపెన్ అయ్యేటట్టు మార్చుకోరూ....కామేన్టాలంటే ఇబ్బందిగా ఉంది....చాలా రోజులుగా కమేన్తుదాముకున్నా కానీ ఈ ప్రాబ్లం వాళ్ళ కుదరటంలేదు...

sunita said...

బాగుంది!

మాలా కుమార్ said...

శేఖర్ గారు ,
ఇప్పుడే మురళి గారి పొస్ట్ చూసి , జ్యొతిగారిని అడుగుతున్నాను , ఒకవేళ నా కామెంట్ బాక్స్ మార్చాలంటే ఏమి చేయాలి అని , కాని నాకూ మార్చాల్సిన అవసరము వుందని తెలీలేదండి . మార్చటానికి ప్రయత్నము చేస్తాను . థాంక్ యు .

మాలా కుమార్ said...

sunita gaaru ,
thankyou.

నేస్తం said...

మాల గారు ఇలా అందరిలో ఇన్నెన్ని కళలున్నాయని తెలిసిన కొద్దీ నాకు ఏడుపొచ్చేస్తుంది .. మనకసలూ ఏదీ చేతకాదే :( super

మాలా కుమార్ said...

నేస్తం గారు ,
వూరుకోండి . ఎవరైనా చూస్తే నేను మిమ్మలిని ఏడిపించాననుకుంటారు . ఏం చేస్తాం కొన్ని బాధలని ఓర్చుకోవాలి మరి .
హ హ హ హ లేకపోతే ఏమిటండి మీరు మరీనూ.

తృష్ణ said...

చూసారా నన్ను మర్చేపోయారయితే..:(
ఏదన్నా పాట గుర్తు రాకపోతే ఇక్కడ నేనొకదాన్ని ఉన్నానని మరిక గుర్తుంచుకోండి..

ఇంతకీ పాట తెలిసిందా..."ఏదో ఒక రాగం పలికిందీ ఈవేళ..."(రాజా లోది) దాంట్లోవి మీరు రాసిన వాక్యాలు...

శ్రీలలిత said...

కాదనను అంతే..

మాలా కుమార్ said...

తృష్ణ గారు ,
తెలిసిందండి . ఇక్కడ పొస్ట్ చేసాను , చూడండి .

మాలా కుమార్ said...

http://kammatikala.blogspot.com/2009/11/blog-post.html

లింక్ ఇక్కడ వచ్చేసింది .

మాలా కుమార్ said...

శ్రీ లలిత గారు ,
థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

శేఖర్ గారు ,
మార్చానండి . థాంక్ యు .

మధురవాణి said...

ఏ పనైనా చేపట్టాక కృషి చేసి విజయం సాధించాలనే మీ పట్టుదల నిజంగా చాలా స్ఫూర్తి దాయకంగా ఉందండీ మాలా గారూ..!
ఊర్వశీ ఆంటీ..అని పిలవగానే మీ మోహంలో ఎంత సంతోషం వచ్చేసి ఉంటుందో మీ మాటల్లోనే తెలుస్తోంది. ఎంత అందమైన జ్ఞాపకం కదా :)

మరువం ఉష said...

జ్ఞాపకం గా మారే ముందు ప్రతి క్షణం ఒక గుర్తు వదిలిపోతుంది. ఆ గుర్తుల దారపు పోగే గతాన్ని నేట్ని రేపటినీ కలిపివుంచుతుంది. అందుకే ఈ క్షణం లోనూ మరెక్కడిదో జ్ఞాపకాన్ని వెలికి తెచ్చుకోగలం. ఎన్ని పోగుల ముడుల్లో చిక్కుకుపోతే అంత అనుభూతి మయం జీవితం. మీకవి లోటు లేదు కదండి. బాగా వ్రాసుకున్నారు.