మా స్నిగ్ధ కళ్యాణం నవంబర్ 4 న చాలా బాగా జరిగింది . అంత బాగా జరగాలి అంటే మామూలుగా కాదు , మీరంతా తలాఓ చెయ్యి వేయాలి వదినా అంటూ ఉష ఇదో ఇలా నన్ను కూలేసింది . ఇక చూసుకోండి అప్పటి నుండి మాకందరికీ పనులో పనులు . మరి చీరలు కొనాలా ? నాకే గాజులు కొన్నుకోవాలా ? నాకే . బ్లౌసులు కుట్టించుకోవాలా ? అవీ నాకే లేండి . ఏమిటో ఇన్ని పనులు . తలుచుకొని , తలుచుకొని , ఆలోచించి , ఆలోచించి అలిసిపోయి , అసలు ఏమీ కొనకుండా , వున్నవాటి తోనే సరిపెట్టుకున్నాను .
సరె నా సంగతికేమొచ్చెకాని , మా పిల్లల హడావిడి చూడాలి . ముందుగా యు. యస్ వెళ్ళిన మా పిల్ల జనాభా తిరిగొచ్చి , ఇక్కడ ఉద్యోగాలు చూసుకొని , హాయిగా అమ్మా నాన్నల నీడలో సెట్టిల్ అయ్యిన వాళ్ళ హడావిడే హడావిడి . ముందుగా వీళ్ళ కోసం అన్ని సిద్దం చేసుకోవాలి , ఆ తరువాత యు. యస్ లో వుండిపోయినవారికి , వీళ్ళ సందడి చూపించి ఏడిపించాలి . పాపం ఎంత సమయమూ సరిపోలేదు . దీని తో అమ్మాయిలకేమో ఆ టైలర్ ఒక్క బ్లౌజూ ఇవ్వలేదు . అబ్బాయిలకేమో ఏకుర్తా కొనాలో తేలలేదు ! ఏంచేస్తారు పాపం , కాస్త పెళ్ళి చూడటము , ఏ టేలర్ దగ్గరికో పరిగెత్తటము . ఇంకాస్త పెళ్ళి చూడటము షాపింగ్లకెళ్ళటము . అందులో అబ్బాయిలు తెచ్చుకున్నవి అమ్మాయిలకు నచ్చదు .పోనీ వెళ్ళితేవటాని కి వీరికి సమయం సరిపోదు . అమ్మాయి కట్టుకున్న చీర అబ్బాయికి బాగోదు . మళ్ళీ వెళ్ళి మార్చుకొచ్చుకోవాలిగా ? మధ్య లో పిల్లకాయలని తయారు చేయాలి . ఇలా తయారు చేయగానే అలా మాపేసుకుంటారు . సందులో సటాకు కలికి చిలకల కొలికి మాకు మేనత్త అంటూ పాటలు పాడి ఉషత్తను కుష్ చేయాలి .మరి , మెహందీ ఫంక్షన్ , గాజుల ఫంక్షన్ , వాళ్ళ పెదబావగారి షష్టిపూర్తి , వియ్యపురాలికి , మేనకోడలికి , కోడలికి మ్యారెజ్ ఆనివర్సరీ అంటూ బోలెడు కార్యక్రమాలు పెట్టిందికదా ! అత్తగారిని కుష్ చేసి అల్లుడిని ( కొత్త పెళ్ళికొడుకు ) భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ అని ఆటపట్టించగానే మామగారికి బెంగ , ఈ పిల్లల అల్లరికి కాబోయే అల్లుడు పారిపోతాడేమోనని .
పిల్లలూ ,పెద్దలూ అందరూ పెళ్ళిని చాలా ఎంజాయ్ చేసారు . అందరూ పెళ్ళిసంబరములోనే కాదు , పెళ్ళిపనులలో కూడా పాలుపంచుకున్నారు . ఇక్కడ కొంచం ప్రత్యేకముగా చెప్పుకోవలసినది , మా ఉష ఆడపడుచులగురించి . 4 వ తారీకు ఉదయము నాలుగున్నరకి ఎలా వున్నారో , మరునాడు ఉదయము నాలుగుగంటలకు కూడా అలాగే ఫ్రెష్ గా , ఎంత పనిచేసినా అలసట లేకుండా , చిరునవ్వుతో వున్నారు . అలా ఎలా వుండగలిగారో తెలియాలంటే ఇక్కడ చూడాలిసిందే !
7 వ తారీకున మా మరిదిగారి అబ్బాయి , గౌతం వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచి , మా కుటుంబసభ్యులను కొత్తపెళ్ళికొడుకు అభినయ్ కి పరిచయము చేసి ,ఉషత్త , శివాజి మామయ్యలకు కూల్ కపుల్ అని అవార్డ్ ఇచ్చి , గ్రూప్ ఫొటో దిగటము తో పెళ్ళిసందడి ముగించి , పెళ్ళికూతురు , పెళ్ళికొడుకులను వాళ్ళమానాన వాళ్ళను వదిలేసాము .
Wednesday, November 11, 2009
Subscribe to:
Post Comments (Atom)
12 comments:
Cool cool gaa undi atta... refreshing gaa undi.
- Ravi Komarraju
బాగుంది. అందరూ కలిసి పెళ్ళిని బాగా ఎంజాయ్ చేసారు. మరి నేను కూడా వచ్చాగా పెళ్ళికి. నాకు కూడా నచ్చిందిగా పెళ్ళి. ఫొటో అదుర్స్.
మాలాగారు ,ఈమధ్య నాకూ ఇలాగే ముఖ్యమైన రెండు పెళ్ళిళ్ళలో ..అలంకరణ బాధ్యత నేనే తీసుకోవాల్సి వచ్చింది .సక్సస్ ఫుల్ గా కంప్లీట్ చేశాననుకోండి .బాగా జరగాలి అంటే మామూలుగా కాదు అన్నారుగా వెంటనే నా తాపత్రయం ,హడావుడీ గుర్తుకొచ్చేశాయి .నూతన దంపతులకు శుభాకాంక్షలు !
బాగుంది పెళ్ళిసందడి. నేను పెళ్ళి చూసి దాదాపు పన్నెండేళ్ళైపోయింది. ఈ మధ్య ఇక్కడ తర్వాత వ్రతానికి వెళ్ళాను, అయినా సందడి సందడి గా దాదాపు ఎనిమిది వందల మంది మధ్య గడిపాము.
మమ్మల్ని కూడా పెళ్ళికి తీసుకెళ్ళి పోయారు...
Bagga rasavu athhaya but u missed asalu pelli mundhu US lo pellikuthuru valla sisters hadavidi:-) asalu akkada modhalayindhi
అల్లుడూ.
మరి నువ్వు పెట్టిన కూల్ ఫామిలీ అన్న పేరు ను సార్ధకం చేయాలిగా
జయా ,
మరి మీ వారు కూడా పెళ్ళి భారం మోసారు కదా . అందుకే ఇంకా ఎక్కువ నచ్చి వుంటుంది .
పరిమళం గారు ,
మీ డ్యూటిని విజయవంతముగా పూర్తి చేసినందుకు అభినందనలు .
థాంక్స్ అండి .
ఉష గారు ,
మాదగ్గరికంటే మీ దగ్గరే అన్ని ఫంక్షన్స్ బాగా చేస్తున్నారండి . మా పెళ్ళిసందడి కూడా అక్కడే మొదలైంది మరి .
థాంక్ యు .
మురళి గారు ,
అవునండి , మా ఉష , బంధు మిత్ర సహితం గా రమ్మంది . మరి మిత్రులను కూడా తీసుకెళ్ళాలిగదా . వచ్చినందుకు థాంక్స్ అండి .
నిజమే నేను , యు యస్ హడావిడి మిస్ అయ్యాను ఎందుకంటే నన్ను మీరు పిలవలేదుకదా ! . అవునూ ఇంతకీ ఇది రాసింది ఏ కొడలు ?
Post a Comment