బహుషా నేను ఏత్ క్లాస్ చదువుతున్నప్పుడనుకుంటాను , మా అమ్మ ఒక నోట్ బుక్ ఇచ్చి , నువ్వు చదివిన పుస్తకము లోనుండి కాని , నువ్వు విన్నది కాని ఏదైనా ఒక మంచి మాట ఇందులో వ్రాయి . నువ్వు వ్రాసిన రోజు తారీకు వేయి .కనీసము వారానికి ఒక మంచి మాట ఇందులో వ్రాసి నాకు చూపించు , అని చెప్పింది . ఆ బుక్ కు మంచిమాట అని పేరు పెట్టింది . అప్పటినుంచి క్రమము తప్పకుండా ఏదో ఒక మంచి మాట వ్రాసి , ప్రతి వారము మా అమ్మకు చూపించి , అమ్మ సంతకము తీసుకునేదానిని . నాకు పెళ్ళైన తరువాత ఆ అలవాటు ఎప్పుడు పోయిందో గుర్తు లేదు .
ఇన్ని సంవత్సరాల తరువాత , ఈ రోజు 29 అక్టోబర్ ఆంద్రభూమి వీక్లీ లోని , కలిగినీడి దుర్గాదేవి , వ్రాసిన , మంచుశిల అనే కథ లోని ఈ పేరా చదవగానే రాసుకోవాలనిపించింది .
ప్రేమించి , పెద్దలను కాదనుకొని పెళ్ళి చేసుకున్న సౌమ్య , శ్రీకర్ ల మధ్య అసంతృప్తి మొదలవుతుంది . ఆ సంధర్భము లో వారి ఇంటి ఓనర్ , పార్వతమ్మ , సౌమ్య కి చెప్పిన మాట ఇది .
" ఒక చేతి వేళ్ళు కూడా ఒకేలా వుండవు .దాంపత్య మంటేనే ఇద్దరు విభిన్న వ్యక్తుల కలయిక .ఎవరికి ఎవరూ పూర్తిగా నచ్చరు . మనము ఎలా వుండాలనుకుంటామో అలా వుండరు . కొంత మనము సర్దుకు పోవాలి . మరికొంత మారాలి . అంతే కాదు అవతలి వ్యక్తి మారటము లేదూ అని ప్రతిక్షణం బాధ పడకూడదు .మన మనసుకు నచ్చే వ్యాపకాల తో సంతోషం గా గడపాలి . జీవితము చిన్నదమ్మా , దాన్ని బాధ తో తక్కువగా , ఆనందముతో ఎక్కువగా నింపాలి .అలా వుండగలిగితే శతృవుతో కూడా సంతృప్తిగా గడప వచ్చు . భర్తనగా ఎంత ? "
ఇది ఒక దంపతులకే కాదు , అందరికీ వర్తిస్తుంది అనిపించింది .
Sunday, November 8, 2009
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
baagumdi.maa kosam manchi maata loni manchi maatalu eppudu testunnaaru.
బాగుంది 'మంచి మాట'.
సత్యం చెప్పారు
సుభద్ర గారు ,
జయ ,
శ్రీ లలిత గారు ,
థాంక్ యు .
well said.
Very Well Said.
జీవితము చిన్నదమ్మా , దాన్ని బాధ తో తక్కువగా , ఆనందముతో ఎక్కువగా నింపాలి .అలా వుండగలిగితే శతృవుతో కూడా సంతృప్తిగా గడప వచ్చు . భర్తనగా ఎంత ? "
ఎంత మంచి మాట అండీ.
అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
Post a Comment