Saturday, July 31, 2010

సొరకాయ పాల పిండి మిరియం చెప్పకుండా నన్నెవరూ ఆపలేరు - ఇంక్విలాబ్ జిందాబాద్ !!!!!

' మీ ఇంట్లో ఏవైనా విలువైన వస్తువులు , నగలు , డబ్బు వగైరా వుంటే బియ్యం డబ్బాలోనో , దేవుడి పీట కిందో దాచుకోండి . ఎందుకంటే ఈ మద్య దొంగల బెడద ఎక్కువైంది . ' అని పొద్దున్నే కాలనీ సొసైటీ ఆఫీస్ నుండి సర్క్యులర్ వచ్చింది . ' ఆ మనింట్లో ఏమున్నాయి లెండి , బియ్యం డబ్బాలో , దేవుడి పీట కింద దాచుకుందుకు ' అని మా వారి తో అన్నాను . ఏమో నీ లాప్ టాపే ఎత్తుకుపోవచ్చు వాడు అన్నారు మా ఆయన జోక్ గా . నా లాప్ టాపా . పాత డొక్కుది , వాడేం చేసుకుంటాడు . . . . చక్ *** లైట్ వెలిగింది బుర్ర లో ((( . . . అయ్య బాబోయ్ ఇది విదేశీ కుట్ర కాదు కదా అసలికే నేనీ మద్య సొరకాయ వంటకాలు ఎక్కువగా రాస్తున్నానని మానేయమని బెదిరిపు మేయిల్స్ వస్తున్నాయి . .ఎవరైనా స్వదేశీ మిత్రులు నాకు క్లూ ఇస్తున్నారే మో , నీ లాప్ టాప్ పేల్చేసే ప్రయత్నాలు జరుగు తున్నాయి , జాగ్రత్తగా బియ్యం డబ్బాలో నో , దేవుడి పీటకిందో దాచు అని . లేక పోతే మా కాలనీకి దొంగలు రావటమేమిటి ? వాడి మొహం వాడి కేమి , సారీ దొంగ గారు , వారికేమి దొరుకుతాయి , ఇక్కడ ఏ ఓల్డ్ మెడల్సో తప్ప !

ఐనా వాళ్ళ పిచ్చి కాని , బెదిరిం పు మేయిల్స్ , ఇక సొరకాయ గురించి రాయటము ఆపండి బాబొ అనే వేడికోళ్ళు నన్నేమి చేయగలవు ? పిచ్చమ్మాయిలు . సొరకాయ వద్దు , ఆలు ముద్దు ' అని నాతో వంద సార్లు ఇంపోజిషన్ రాయించారు . ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయనే మా కంప్యూటర్ సార్ ముందుగా కాపీ , పేస్ట్ నేర్పించారు . వందసార్లేమి ఖర్మ వెయ్యి సార్లు ' సొరకాయే ముద్దు , ఆలు వద్దు ' అని రాయగలను . ఇలాంటి , అలాంటి వేవీ నన్ను సొరకాయ వంటలు రాయకుండా ఆపలేవు . వెలిగే సూర్యుని కి అర చేయి అడ్డు పెట్టి ఆపలేరు . ఇంక్విలాబ్ జిందాబాద్ . దీనికి ఈ వాక్యం సరిపోక పోయినా ఇలా అంటే బాగుంటుందిట .

ఈ రోజు నేను చెప్పబోయే సొరకాయ వంట ' సొరకాయ పిండి మిరియం ' ఓ చిన్న వివరణ . ఇది నా వంటకము కాదు , మా మేనకోడలు , స్నిగ్ధ , వాళ్ళ అత్తగారి దగ్గర నేర్చుకొని , తన ' స్నిగ్ధాస్ కిచెన్ ' లో రాసుకున్నది . అడుక్కున్న అమ్మకు అరవైఆరు వంటకాలు దొరుకుతాయి . నా సొరకాయ వంటలకున్న ఏకైక అభిమాని అ. సౌమ్య కోసం , ఈ మాల ఏమైనా చేయగలదు . ఈ బెదిరింపులకు భయపడకండి సౌమ్యా . నా నెక్స్ట్ వంటకం ' సొరకాయ కోఫ్తా ' . మావారు ఈ మసాలా వంట నేను తినను చేయకు అని మారాము చేస్తున్నారు కాని , మీకెందుకు , బుజ్జగించో , బెదిరించో . మీ కోసం ' సొరకాయ కోఫ్తా ' చేస్తాగా . ఇదే ఈ మాల శపఢం !! ఇంక్విలాబ్ జిందాబాద్ !!!!

సొరకాయ పాల పిండి మిరియం చేసేవిధానం తెలుసుకుందామా .
కావలసినవి ,
సొరకాయ - 1,
ఉప్పు సరిపడ ,
బెల్లం రెండు చెంచాలు .

పొడి కి కావలసినవి ;
మిరియాల పొడి 1 స్పూన్ ,
బియ్యం 2 స్పూన్లు ,
ధనియాలు 1 స్పూన్ ,
శెనగపప్పు 2 స్పూన్లు ,
ఎండుమిరపకాయలు 2,
ఎండు కొబ్బరి పొడి 1 స్పూన్ ,
మెంతులు 1/4 స్పూన్ .
ముందుగా పొడి కోసం చెప్పిన వన్నీ , నూనె లేకుండా వేయించుకొని , మెత్తగా పొడి చేసుకోవాలి .
సొరకాయముక్కలను ఆవిరి లో వండాలి .
తరువాత ఒక బాణలి లో కొద్దిగా నూనె వేసి వేడి చేసి , ఆవాలు , శెనగ పప్పు , ఇంగువ పోపు చేసి , అందులో కరివేపాకు వేసి , ఉడికించిన సొరకాయ ముక్కలను వేయాలి . బెల్లము ను , ముందుగా పొడిచేసి సిద్ధం గా వుంచుకున్న పొడిని వేసి , కొద్ది సేపు ఉడికించాలి .
ఆ తరువాత కొంచం పాలు పోసి , మరి కొంచము సేపు ఉడికిస్తే " సొరకాయ పాల పిండి మిరియం " సిద్ధం .

వచ్చే వారము ఇదే చోట , ' సొరకాయ కోఫ్తా ' పోస్ట్ లో కలుసు కుందాము . అప్పటి వరకు టా టా .

12 comments:

Manju said...

సొరకాయ అంటెనె సోది కాయ అని మా వారి ఫీలింగ్.ఇలాగా variety లు చేసి పెడితె కాస్త ఇష్తం గా తింటారెమో చూడాలి.

శ్రీలలిత said...

మళ్ళీ వచ్చారా.. మిమ్మల్నసలు బెంచీ ఎక్కించాలి..
మీరు మీ లాప్ టాప్ దాచే విధానం చూస్తే చిన్నప్పుడు విన్న సంగతి గుర్తొచ్చింది. కొబ్బరికాయలు ఎత్తుకుపోతున్న దొంగ నాపడానికి ఒకావిడ కొబ్బరిచెట్ల చుట్టూ మడిబట్ట ఆరబెట్టుకుందట (మడిబట్ట కదా దొంగ ముట్టుకోడని ఆవిడ ఊహ అన్నమాట..). అలాగ మీరు దేవుడి పీట కింద పెట్టుకున్నా సరే విదేశీ కుట్రదారులకు మన దేవుడూ, దెయ్యం భయాలుండవు. సొ..అది లాభంలేదు. మరి బియ్యం డబ్బాలంటారా.. ఈ రోజుల్లో ఇదివరకంతపెద్ద బియ్యం డబ్బాలెక్కడున్నాయి మీ లాప్ టాప్ పట్టడానికి.. అందుకని మరోచోటేదైనా వెతుక్కోండి.
మరింక సొరకాయ వంటలంటారా..ఏదో ఈ సారికి అ.సౌమ్య కోసం వూరుకుంటున్నాం. మరింక మా సహనాన్ని పరీక్షించకండి..

Sravya Vattikuti said...

సొరకాయ పిండి మిరయం సంగతేమో కాని మీ పోస్టు మాత్రం అదుర్స్ !

కౌటిల్య said...

పిండి మిరియం..నాకైతే ఎంత ఇష్టమో....మేం నెల్లూర్లో ఉండేప్పుడు అమ్మ చేసేది...లొట్టలేసుకుంటూ తినేవాణ్ణి...ఇప్పుడు కాళ్ళా,వేళ్ళా పడ్డా,,"నే చెయ్యను పో చిన్నీ! నాకంత ఓపిక లేద"ని నన్ను తీవ్రంగా డిజప్పాయింట్ చేస్తుంటుంది...ఎన్ని రోజులైందో తిని..ః-(...నాకు తెలిసి పిండిమిరియం చేసే ప్రొసీజరు చాలా పెద్దది,కష్టం కూడా...మీరు ఇక్కడ చెప్పినంత సులువుగా అవ్వదనుకుంటా...అమ్మైతే, గోరుచిక్కుడు తో,అరటికాయతో,..అప్పుడప్పుడూ దోసకాయతో చేసేది..

ఆ.సౌమ్య said...

హు మిమ్మల్ని బెదిరించే సాహసం చేసారా...ఎవరు వాళ్లు, మీరేం భయపడకండి ఈ మాయాశశిరేఖ మీ పక్కనుంది.....ఈ తొక్కలో బెదిరింపులు తోలులో దొంగలు ఎవరూ పనికిరారు మన ముందు. అవును ఆలూ వద్దు సొరకాయే ముద్దు...ఇంక్విలాబ్ జిందాబాద్.

అబ్బో సొరకాయ కోఫ్తా వా, నేనొకసారి తిన్నాను, నాకు నచ్చింది. ప్లీజ్ ప్లీజ్ అది తొందరగా రాయరూ!

ఈ పిండిమిరయం వంటేదో విచిత్రంగా ఉంది...కానీ
బానే ఉంది.

హమ్మ శ్రీలలితాగారూ మమ్మల్ని బెంచీ ఎక్కిస్తారా.....ఎంత సాహసం. మీ భూస్వామ్యపు కుట్రలు, దౌర్జన్యాలు ఇక్కడ సాగవు.

Krishnapriya said...

:-)

నీహారిక said...

మాల గారు,
ప్రమదావనం లో కనపడటం లేదెమిటి? ఎంత గోల చేస్తున్నామో తెలుసా? సొరకాయ నాక్కూడా ఇష్టమని చెప్పాగా,మర్చిపోయారా? సొరకాయ కోప్తా చేసి మా ఇంటికి పట్రండి,లేకపోతె మీతో కటిఫ్...

భావన said...

హే భగవాన్ ఈమె కంప్యూటర్ దొంగలు ఎత్తుకు పోయినా ఈమె ఈ సొరకాయ ఆపరు కదా. ఐనా మిమ్ములను సొరకాయ వద్దు ఆలూనే ముద్దు అనమంటే రివర్స్ అన్నది కాక ఇక్కడ ఇలా బ్లాగ్ లో చెప్పి సౌమ్య గారి సింపతీ కొట్టేస్తారా.. హన్నా... ఇక లాఫం లేదు ఈ సొరకాయ ఏదో తినక పోతే ఈమె వూరుకునేట్లు లేరు.. సరే కాస్త కూరెయ్యండి కంచం లో.. కొంచమే నమ్మా.

మాలా కుమార్ said...

మంజు గారు మరింకెందుకు ఆలశ్యం . సొరకాయ సోది కాదు అని నిరూపించేయండి మరి .

@శ్రీలలిత గారు ,
ఇది రాయటము మొదలు పెట్టినప్పటినుండి ఆలోచిస్తున్నానండి , బామా గారి మడి బట్ట సంగతి ఏదో వుండాలి అని . భలె చెప్పేసారే . ఏమైననండి నన్ను బెంచీ ఎక్కిస్తానంటరా , సరే కనీయండి . నేనేం చేయగలను ?

మాలా కుమార్ said...

శ్రావ్య వట్టికుట్టి గారు ,
చాలా థాంక్స్ అండి .

@కౌటిల్య గారు ,
మిమ్మలిని సొరకాయ పిండి మిరియం తీసుకొచ్చిందా థాంక్ యు అండి .
ఇంతకు ముందు వంటలన్నీ చిన్న మంట మీద , ఎక్కువ సమయం తీసుకొని వండే వాళ్ళం . ఇప్పుడు అంత సమయము , ఓపిక వుండటము లేదు . తొందరగా వండేస్తున్నాము కదా . ఐనా మీ అమ్మ గారు చేసే పద్దతి వేరేమో నండి .

మాలా కుమార్ said...

ఆ . సౌమ్య గారూ ,
వచ్చేసారా ? అమ్మయ్య . మీరు ఇప్పటిదాకా రాక పోతే మిమ్మలిని ఏ విదేశీ హస్తం బందించేసిన్ దో నని భయపడుతున్నానండి . మిమ్మలిని చూసుకొనే నా ధైర్యం అంతానూ .

@కృష్ణ ప్రియ గారు ,
థాంక్యు .

మాలా కుమార్ said...

నీహారిక గారు ,
మిమ్మలిని మర్చి పోలేదండి .
ఈ మద్య నా లాప్టాప్ పాడైంది . అందుచేత నేను మా వారి లాప్ టాప్ మీద ఆధార పడాల్సి వచ్చింది . ఏం చేయను చెప్పండి , ఆయన ఇంటికి వచ్చినప్పుడే నేను నెట్ కు రాగలను .
మీ బర్త్ డే కోఫ్తా చేసి పెడుతాను లెండి .

@భావనా ఈరోజు మీ పుట్టిన రోజు కదా , మిమ్మలిని సొరకాయ తినమని ఇబ్బంది పెట్టను లెండి . ఇంకోరోజు తిందురు గాని .