Monday, July 26, 2010

థాంక్ యు ఫ్రెండ్స్
నువ్వు సీనియర్ సిటిజన్ వి కాదు అని మా వారు , నేను జూనియర్ సిటిజన్ ని అని నేనూ అప్పుడప్పుడు ఒకరినొకరిని టీజ్ చేసుకునేందుకు ఇంకొక్క సంవత్సరము మాత్రమే అవకాశం వుంది . లాస్ట్ ఆఫ్ ద ఫిఫ్టీస్ కు వచ్చేసాను . అందుకే ఈసారి పుట్టిన రోజు వెరైటీగా చేసుకుందామా అనుకున్నాను ! ఏలా అని అలోచించగా . . . చించగా . . . ప్రతిసారి , అందరూ నాకు బర్త్ డే విషెస్ చెపుతారు . ఈ సారి అందరికంటే ముందుగా నాకు , నేనే విష్ చేసుకుంటే ఎలావుంటుంది ?? అందరూ నవ్వుతారేమో !!! నవ్వనీ అని ధైర్యం తెచ్చుకున్నాను . అందుకే ' కమల ' పోస్ట్ తయారు చేసుకున్నాను . ' హాపీ బర్త్ డే టు మి ' అని ప్రమదావనం లో పెట్టేందుకు మేయిల్ రెడీ చేసుకున్నాను . రాత్రి 11 .30 అయ్యింది . పొద్దున్నే 6 గంటలకు పబ్లిష్ చేద్దామనుకున్నాను . అమ్మో ఈ జ్యోతి ని నమ్మేందుకు లేదు . అసలే నిన్న సొరకాయ రసిపీ లు అడుగుతాను , మీ నంబర్ కావాలి ఇవ్వండి అని అడిగి తీసుకుంది . హమ్మా జ్యోతీ మీ సంగతి నాకు తెలీదు . . రసిపీల కోసం అవుతే చాటింగ్ లో అడుగుతారు . లేదా మేయిల్ ఇవ్వండి అంటారు కాని ఫోన్ నంబర్ ఎందుకు ? అనుకుంటునే సరే చూద్దాం అని నంబర్ ఇచ్చాను . ఆ సంగతి ఇప్పుడు గుర్తు రావటం ఎంత మంచిదైంది . 12 కల్లా నా పోస్ట్ పబ్లిష్ చేయక పోతే , నా మేయిల్ ప్రమదావనం లో పెట్టకపోతే ఇంకేమైనా వుందా ? ? ? ఇలా ఆలోచించుకుంటూ నా పోస్ట్ కు తుది మెరుగులు దిద్దుతూ . . . వుండగా . . .

ట్రింగ్. . . ట్రింగ్ . . . అని టెలిఫోన్ రింగైంది . మాలా చూడు ఇంత రాత్రి పూట ఎవరు ఫోన్ చేసారో అన్నారు మావారు . ఫోన్ లిఫ్ట్ చేసి , హలో అనగానే మాలా గారున్నారాండి అని ఎవరో ఆడవాళ్ళు అడిగారు . ఒక్క క్షణం భయం వేసి , టెన్షన్ వచ్చింది . ఇంతరాత్రి 11. 30 కు నన్ను అడిగేది ఎవరూ , అని ఆ వన్ సెకన్ లోనే , విద్యానగర్ లోని మా అమ్మ పక్కింటి సరళ , మా అమ్మాయి సంజు తోటి కోడలు లక్ష్మి గుర్తొచ్చి , ఏం వార్త వింటానో అని గుండె దడ దడ లాడుతుండగా మాట్లాడుతున్నాను అన్నాను . హాపీ బర్త్ డే మాలా గారు అని చాలా సంతోషం గా అటు నుండి వినిపించింది . ఒక్క క్షణం ఏం వింటున్నానో అర్ధం కాలేదు . సారీ అండి , మిమ్మలిని నిద్రలేపానా ? అసలు 12 గంటలకు చేద్దామనుకున్నాను . కాని నాకు నిద్ర వస్తోంది అందుకే ఓ అరగంట ముందుగా చేసాను . అన్నారు . అప్పటి కి తేరుకొని , థాంక్స్ అండీ , ఇంకా పడుకోలేదండీ అన్నాను . నేనెవరో చెప్పుకోండి చూద్దాం అని చిలిపిగా అడిగారు . అప్పటికి నా బుర్ర యధా స్తానానికి వచ్చి అమ్మా ఈ ప్లాన్ వేసారా ప్రమదలూ , ఇహ రాత్రంతా ఇలా ఫోన్ లు చేస్తారన్న మాట అని స్వగతం అనుకుంటూ కృష్ణ వేణి గారే నా అన్నా . అంతే ఈసారి అటునుండి అవాక్ !! అమ్మా అమ్మా మాలా గారు ఎలా తెలుసుకున్నారండీ ? అని బోలెడు హాచర్య పోయాక , కాస్త హస్కేసుకొని ఫోన్ పెట్టేసాము .
ఇంకొక పది నిమిషాలు , పది యుగాలుగా ఎదురు చూసి , 12. 05 కు , అటు నా 'కమల ' ను , ఇటు నా మేయిల్ ను పంపేసి ఊపిరి పీల్చుకున్నాను . చూసారా అప్పటికే ఓ ఫోన్ కాల్ వచ్చేసింది . అమ్మయ్యా ఈ లోపల ఇంకెవరూ కాల్ చేయలేదు అనుకుంటూ వుండగా ట్రింగ్ . . . ట్రింగ్ . . ఆ ట్రింగ్ లు ఈ రోజు ఉదయము వరకూ వస్తూనే వున్నాయి . కాదు కాదు ఇప్పుడు ఇది రాస్తుండగా కూడా వచ్చిందోచ్ !
నాకూ డాక్టరేట్ వచ్చేసిందోచ్ టంట టంటా . . . నిజమే * * * సచ్చీ $ $ $ . మహా దానందంగా మా వారికి నా డాక్టరేట్ చూపించాను . ఎవరు ఈ అమ్మాయి ? అన్నారా ఏకధాటిగా చెప్పాను . అదే నండి , చెన్నై లో వుంటుంది . చాలా ఇంటలిజెంట్ . ఫొటో కూడా చూపించాను . తిరుచూర్ణం పెట్టుకుంది . గడ్డం మీద సొట్ట , ఆ అవునవును గుర్తొచ్చింది . చాలా ముచ్చటగా వుంది అన్నాను కదూ , ఆ అమ్మాయా ?? నీకు స్నేహశీలివి అని డాక్టరేట్ ఇచ్చిందా ?? అని తెగ హాచర్య పోయారు . అవును మరి , ' ఎవరి తో మాట్లాడవు . ఎక్కడికెళ్ళినా నోరు బిగించుకొని కూర్చుంటావు . కనీసం చిన్న నవ్వైనా నవ్వవు ' అని 42 ఏళ్ళుగా నాకు క్లాస్ లు తీసుకుంటున్న ఆయన హాచర్య పోయారంటే పోరు మరీ ! మా ఇంట్లో మా వారు , మా అమ్మాయి , మా మనవరాలు మేఘ కు వున్నంత మంది స్నేహితులు ఇంకెవ్వరి కీ లేరు . మా వారి నస భరించలేక , మేఘ ను ఓసారి అడిగాను . అమ్మలూ కొత్తవాళ్ళ తో ఫ్రెండ్షిప్ ఎలా చేసు కోవాలిరా అని . చాలా సింపుల్ బామ్మా , చూడగానే ముందు స్మైల్ ఇవ్వాలి . ఆ తరువాత హాయ్ మై నేం ఈజ్ మేఘ అని చెప్పాలి అని చెపుతుండగా , బంగారూ నేను మైనేమీజ్ మేఘ అంటే నవ్వుతారేమోరా అని అనుమానం వ్యక్తీకరించాను . పో బామ్మా అందుకే నీకెవరూ ఫ్రెండ్స్ లేరు అని తేల్చేసింది . సో మనది అంతటి ఘన చరిత్ర ! నాకు ఆరోజు ఇంకా గుర్తు . కంప్యూటర్ లో సాలిటర్ ఆడుకుంటూ వున్నాను . చిన్నగా , సున్నితంగా పక్కనుండి హాయ్ అని వినిపించింది . ఉలిక్కి పడి ఎవరా అని చూసాను . హాయ్ మాలాగారు నా పేరు సృజనా రామానుజం అండి అంది . నేను మొహమాటం గా హాయ్ అన్నాను . ఆ తరువాత ఏం మాట్లా డాలో తెలీ లేదు . ఆ తరువాత రోజూ సృజన తో మాట్లాడకుండా వుండలేని పరిస్తితి వచ్చింది . తనిచ్చిన ధైర్యం తోనే అందరి తో మాట్లాడాను . ఈ రోజు నా వయసులో సగము కన్న తక్కువ గా వున్న మధురవాణి , సుజ్జి , ప్రియ , సుభద్ర , మంచుపల్లకి , అశోక్ పాపాయ్ లాంటి పిల్లల తో మాట్లాడ గలుగుతున్నాను అంటే అదంతా సృజన మహత్యమే . అయ్యో ఇదేమిటీ సృజనా నాకు రావటము లేదు అనగానే మీరు ఊరికే కంగారు పడకండి అదే వస్తుంది అని ధైర్యం ఇచ్చేదీ సృజననే . నా తొలకరి పోస్ట్ కు రాజ్ కపూర్ , నర్గిస్ ఫొటోలు వెతికి పెట్టింది . చేయి తిరిగిన రచయతలు రాస్తున్నారు , నేనేమి రాయగలు అని భయ పడితే , ప్రోత్సహించి బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ లో తొలి అథిది గౌరవాన్ని తెప్పించిందీ సృజననే . అలాంటి సృజన నాకు స్నేహము లో డాక్టరేట్ ను , నా పుట్టిన రోజున బహుకరించింది . చెప్పలేనంత సంతోషం గా వుంది . కొత్త పెళ్ళికూతురు , నా చిన్నారి స్నేహితురాలు సృజనకు ఆశీస్సులు తప్ప ఇంకేమి ఇవ్వగలను ? ధీర్ఘ సుమంగళీభవ .
ఫోన్ రింగ్ కాగానే లిఫ్ట్ చేస్తే ఎవరో అబ్బాయి ఫోన్ . రాత్రి నుండి ప్రమదావనం ఫ్రెండ్స్ దగ్గర నుండి విషెస్ రిసీవ్ చేసుకుంటున్న నేను , అబ్బాయి గొంతు విన గానే అయోమయం అయ్యాను . పైగా హపీ బర్త్ డే మాలా గారు అన్నడు . ఎవరు చెప్మా ? మొహమాటపడుతూ మీ పేరండి ? అని అడిగాను . కాసేపు పేరు చెప్పకుండా భయపెట్టి , భరద్వాజ నండీ అని నాకు అర్ధం కాలేదని తెలుసు కొని , మలక్పేట్ రౌడీ నండి అన్నాడు . వెంటనే రిసీవర్ చేతి లోనుండి జారి పోయింది . కాళ్ళూ చేతులూ గజ గజ లాడి పోయాయి . ఓ ఎప్పుడో మీరు మలక్ పేట్ రౌడీ ఐతే మాకు యూసుఫ్ గూడా రౌడీ లున్నారు జాగ్రత్త అన్నాను . అప్పుడు అన్నానే కాని చాలా భయపడ్డాను . ఈ రౌడీ కొట్టటానికి వస్తాడే మో నని . ముందు జాగ్రత్త చర్యగా , మా అబ్బాయిని నీకెవరన్నా రౌడీ లు తెలుసారా అని అడుగుతే ఎందుకు మాతే అన్నాడు . చెపితే బ్లాగ్ వొద్దు ఏ వద్దూ మానేయ్ అంటాడని ఊరికే అడిగాను లేరా అన్నాను . మావారిని అడగాలంటే భయం . మా పనమ్మాయ్ శారద , అమ్మా సరస్వతి పనిచేసేది ఒక రౌడీ ఇంట్లో నే నమ్మా అని చెప్పింది . సరస్వతి పనికి రాగానే అడిగాను , నువ్వు పని చేసే ఇంకో ఇల్లు రౌడీ దా అని . అవునమ్మ దేనికి అన్నది . అవసరమొచ్చినప్పుడు చెపుతానులే అని , రోజూ బాల్కనీ లో కూర్చున్నప్పుడు ఎవరైనా రౌడీలు ఇంటి మీదికి గొడవకు వస్తున్నారా అని భయపడుతూ వుండే దాని . రాలేదు . చిన్న చిన్న గా ఆ సంగతి మర్చి పోయాను . ఇప్పుడు ఫోన్ లో మలక్ పేట్ రౌడీని అనగానే అంతా గుర్తొచ్చింది . సంవత్సరం తరువాత , ఇప్పుడు పోట్ల్లాటకు వచ్చాడా ఈరౌడీ . అందులోనూ పుట్టిన రోజున . ఏం చేయనురా దేవుడా అని భయ పడ్డాను . విష్ చేసి ఫోన్ పెట్టేసారు కాని భయపడుతూనే వున్నాను .
ఇంతలో ప్రమదావనం లో మలక్ పేట్ రౌడీ గారు ఓ పొస్ట్ వేసారు అని లింక్ వచ్చింది . అంతే ఈ రౌడీ గారు ఏ రాసారురా దేవుడా అను కుంటూ పడుతూ లేస్తూ అటు పరుగెత్తాను . నా కళ్ళను నేను నమ్మలేక పోయాను . ' మాలకు విరుల స్వర మాలిక ' వావ్ . ఎంత ఆచర్యం ! ఎంత ఉద్వేగం ! ఏమాత్రమూ ఊహించనిది . భరద్వాజ గారు , రౌడీలను వెంటవేసుకొని వచ్చి కొట్టిస్తారనుకున్నాను కాని ఇలా మీ అమ్మగారిని , పాపను వెనకేసుకొచ్చి పాట తో కొడతారనుకోలేదు . సీతా లక్ష్మిగారూ , నేనెవరో తెలీక పోయినా , నా కోసం చాలా అద్భుతమైన పాటరాశారు . మీకు చాలా చాలా ధన్యవాదాలండి . బంగారుతల్లి అనఘ , చాలా బాగా పాడావురా . అలా వింటూనే వుండి పోయానురా అమ్మలూ . నీ పాట కు మా మేఘ , గౌరవ్ డాన్స్ చేసారు . అందరికీ ఎంత నచ్చిందో చెప్పలేను . నిన్న మా ఇంటికి వచ్చిన వారందరికీ నీ పాట వినిపించాము . ఇండియా వచ్చినప్పుడు నీకు పెద్ద ట్రీట్ ఇస్తాను . ప్రామిస్ . ఈ లోపల మీ డాడీని నాతరుపున పెద్ద కాడ్బరీ చాక్లెట్ , ఐస్క్రీం కొనివ్వమని చెప్పు . డబ్బులు మాత్రం నేనివ్వను . థాంక్ యూ బంగారు థాంక్ యూ వెరీమచ్ . రౌడీ గారు , మీకు , మీ వెనకనున్న లేడీ డాన్ కు కూడా థాంక్స్ అండి .( కొంచం దూరం నుండి చెపుతున్నాను . ఎంతైనా రౌడీ గారు కదా భయం )
నా పుట్టినరోజున , వారి మొదటి అతిధి రచయిత్రి గౌరము నిచ్చి , ఈ పోస్ట్ ను ప్రచురించిన బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ టీం కు ధన్యవాదాలు .

రాత్రి కృష్ణ వేణి గారి తో మాట్లాడాక , నా పోస్ట్ , మేయిల్ పెడుదామని సిస్టం ఓపెన్ చేయగానే గా , సత్యవతి గారి విషెస్ కనిపించాయి . సత్యవతి గారు థాంక్ యు అండి .

అసలు కూర్చునేందుకు ఓపిక లేదు అన్నారు తృష్ణ . కాని ఓపిక చేసుకొని నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు మేయిల్ ద్వారా పంపిన తృష్ణ గారూ , మీరు దిగులును మర్చిపోయి , తొందరగా తేరుకొని , మళ్ళీ మాకు మీ బ్లాగ్ ద్వారా రచనలు అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలండి .
కృష్ణ వేణి నైతే వెంటగుర్తుపట్టేసాను కాని తరువాత వచ్చిన ఫోన్ ఎవరిదో తొందరగా గుర్తుపట్టలేక పోయాను . చెపుకోండి చూద్దాం , మీరు అండి అనే దానిని కాదు అన్నది ఎవరబ్బా ? ఐతే సుజ్జి వి కాదు అన్నాను . ఏం సుజ్జి చేసేసిందా ఆరాటం వినిపించింది గొంతులో . అవును మరి 12 కాగానే చేస్తే , తనకన్నా ముందు సుజ్జి చేసేసి వుంటే ? చేయలేదు కాని తన గొంతును గుర్తుపట్టగలను అంటుండగానే గుర్తొచ్చింది , ఆ మధురవాణి వి కదూ ? అవునండి . ఓకే నెక్స్ట్ ఎవరో అనుకుంటూ వుండగా మొహమాటం గా చిన్నగా మాలాగారాండీ , హాపీ బర్త్ డే అండి , నేను దుర్గనండి అన్నారు అమ్మయ్య కాస్త మెదడుకు పని తగ్గింది . ఇంతలో ఫో రింగ్ కాగానే లిఫ్ట్ చేసి థాంక్ యు అన్నాను . అరే నేను విషెస్ చెప్పకుండానే థాంక్ యు చెప్పేస్తున్నారే ,గుర్తుపట్టారా ? మరి ఇప్పుడు మీరంతా కాల్ చేసేది విష్ చేయటానికేకదా అన్నానే కాని ఎవరైవుంటారు అని ఆలోచిస్తూనే వున్నాను . పాపం ఎక్కువ కష్ట పెట్టకుండా నే భావన నండీ అన్నారు . వాళ్ళ అబ్బాయి తో కూడా విషెస్ చెప్పించరు . భావనగారబ్బాయి , నువ్వు సిగ్గు పడుతూ చెప్తుంటే నేనూ , నీ పేరు అడగ లేదు . థాంక్ యూ కన్నా . తెల్ల వారు ఝాము నుండి ప్రయతిన్స్తున్నా , ఇంత బిజీ ఏమిటీ తల్లీ ? ఇంకెవరు జయ నే . సంగతి చెప్పగానే సరే సరే నేను పెట్టేస్తున్నా , ఇంకెంత మంది ఎదురుచూస్తున్నారో అంటూ విష్ చేసి పెట్టేసింది . నెక్స్ట్ ఎవరబ్బా . . మాలాగారండి హాపీ బర్త్డే నేనెవరో చెప్పుకోండి . బాబ్బాబు చెప్పేద్దురూ . నేనండీ శ్రీలలితను . అమ్మో వీరితో జాగ్రత్తగా మాట్లాడాలి . లేక పోతే ఇంకేమైనా వుందా నా మీద , పద్యమో పాటో రాసేస్తారు . ఒహో నెక్స్ట్ ఎవరు చేస్తున్నారా అని క్యూరాసిటీ . . . నేనండీ ఎవరూ ? రాజమండ్రి యాస ',ఆ సుభద్ర కదూ ' ' కాదండీ ' .' ఓ ఐతే లలిత అవునా ' అవునండీ బాబూ కనిపెట్టేసారే .' ' మరి మీ బాష పట్టించింది లెండి . ' గొప్పగా అన్నాను . అటునుంచి నవ్వు . ' కావాలనే అలా మాట్లాడానండి ' . తుస్ . . . ఎంతైనా హాస్యపు జల్లు కదా ! అసలు కథా నాయకి ఏదీ ఇంకా రాదే ?? ఆ వస్తున్నానండి , ఇప్పటి దాకా మీ పని మీదే వున్నానంటూ రానే వచ్చారు , ఫోన్ కాల్ తో జ్యోతి . పొద్దున్నే నేనెవరో చెప్పుకోండీ అంటూ ఫోన్ . మీకు బాగా తెలిసిన దానిని అంటూ కాసేపు ఊరించి ఊరించి , జాజిపూలు పేరు విన్నారా అన్నారు . హేమిటీ , నేస్తం గారా , అయ్య బాబోయ్ భూమి పైకి తేలి పోతున్నానే . . వుండండి వుండండి కుర్చీ తెచ్చుకుంటా . అంతే ఆ తరువాత బోలెడు కబుర్లు . పెట్టేసాక , అయ్యో పేరైనా అడగలేదే , సెల్ నంబరైనా అడగలేదే . ఎంత గడుసుగా పేరు , నంబర్ చెప్పకుండా , అసలు అడగకుండా మాటల్లో పెట్టేసారు ! అందరూ చెప్పేసినట్లే ఇక పోస్ట్ రాద్దామని మొదలు పెట్టాను . అంతే ట్రింగ్ అంటూ పలకరించారు పి.యస్ .యం లక్ష్మి గారు . ఆవిడనూ వెంటనే గుర్తుపట్టేసాను . ఇద్దరమూ చాలా సేపు కబుర్లేసుకున్నాము .
బయట వాన జల్లు - ఇంట్లో శుభాకాంక్షల జల్లు ల తో ఈ పుట్టిన రోజు ను చాలా త్రిల్లింగ్ గా చేసాయి . చాలా చాలా సంతోషాన్ని పంచారు మితృలు .

ఫోన్ ద్వారా , ప్రమదావనం ద్వారా , శుభాకాంక్షలు తెలిపిన కృష్ణ వేణి , భావన , మధురవాణి , శ్రీలలిత , జాహ్నవి ,నీహారిక ,మంజూష , ప్రియ , లలిత , లక్ష్మీ కామకోటి ,మంజు , పరిమళం , పద్మకళ , టీం లీడర్ జ్యోతి గారు ల కు , బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ లో ' మాలకు విరుల స్వర మాలిక ' లో శుభాకాంక్షలు తెలిపిన , రామకృష్ణా రెడ్డి , స్వప్న , బద్రి , గార్లకు , ' భలే డాక్టర్ కమాలా కాయ ' లో పాట రాసిన శ్రీలలితకు , ఇతర మితృలకు , నా ' కమల ' లో శుభాకాంక్షలు తెలిపిన , భావన , శ్రీలలిత , భాస్కర రామిరెడ్డి , జయ ,సునీత , హరే కృష్ణ , సి. ఉమాదేవి , మేయిల్ ద్వారా నూ , బ్లాగ్ లోనూ విష్ చేసిన అశోక్ పాపాయి , రాజి , శిశిర , లలిత , అ. సౌమ్య చాటింగ్ లోనూ , బ్లాగ్ లోనూ విష్ చేసిన సుజ్జి , చక్కటి అన్నమయ్య పాటలో విష్ చేసిన కొత్త పాళి గారు , జ్యోతి , నేస్తం , మధురవాణి , పి. యం .యస్ లక్ష్మి గార్ల కు , మేయిల్ ద్వారా విష్ చేసిన మంచుపల్లకి గారికి ,

కమాలాసని , కమల ప్రియ ,
కమలముల తో పూజించిన సంతృష్టు రాలగు ,
ఆ నారాయణి , మీ కందరికీ శుభాలను ఇవ్వాలని కోరుకుంటూ ,

పద్మాసనే , పద్మకరే , సర్వ లోకేకపూజితే
నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా .

" థాంక్ యు ఫ్రెండ్స్ "

18 comments:

రవిగారు said...

మాలా కుమార్ గారు అందరికన్నా ముందర విష్ చేసిన వాళ్ళని
ఆఖర్న విష్ చేసిన వాళ్ళని తప్పక గుర్తు పెట్టుకుంటారు
.అందుకే అందుకోండి పుట్టిన రోజు శుభాకాంక్షలు .
శత వసంతాల సౌరభాల్ని మీరు ఆస్వాదించాలని
కోరుకుంటూ లాస్ట్ బట్ నాట్ లీస్ట్

ప్రియ said...

Dr. కమాలా కాయ గారు, నిజంగా మీకా డాక్టరేటర్హత ఉందండి

Malakpet Rowdy said...

LOL :))

రాణి said...

పుట్టినరోజు శుభాకాంక్షలు మాలా గారు :)

శేఖర్ పెద్దగోపు said...

మాల గారూ, మీలో ఉన్న ఆనందం,సంతోషం కొట్టొచ్చినట్టు కనపడింది మీ టపాలో...చ.నేను మిస్సయిపోయానే నిన్న..మాలా గారికి విష్ చేయకుండా అని కొంచెం ఫీలయ్యాను..లేట్ గా ఐనా లేటెస్ట్ గా రజనీకాంత్ లా మీకు విషెస్ చెప్పేస్తున్నాను మరి...

మెనీ మెనీ హేపీ రిటర్న్ ఆఫ్ ద డే అండి...

మీరిలానే ఆత్మీయ బ్లాగ్నిత్రులను ఎందరినో సంపాదించుకొని ఆనందంగా, సంతోషంగా ఉండాలని, మరిన్ని ఆనందకర పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను..

ఇంతకూ మరి నాకేమైనా బర్త్ డే స్పెషల్స్ ఉంచారా లేదా? ఆఫీస్లో హాఫ్ డే లీవ్ పెట్టుకుని యూసఫ్ గూడ వచ్చేయనా? :)

పరిమళం said...

అందరినీ పేరుపేరునా గుర్తుపెట్టుకొని థాంక్స్ చెప్పారు మాలాగారు లేటుగా చెప్పినా నన్నూ మర్చిపోలేదు థాంక్స్ :)

జ్యోతి said...

Malagaru...

You deserve this.. just enjoy.......

అశోక్ పాపాయి said...

మీ కృతజ్ఞత అందరిని చాల అబ్బురపరుస్తుందండి ఎందుకంటే మీకు శుభాకాంక్షలు తెలుపటానికి మేము ఆత్రుతపడ్డామో మీరు ప్రత్యేకించి టపా వ్రాసి మమ్మల్ని రెట్టింపు ఆనందంలో ముంచెత్తారు.అయిన మీకు మీరే సాటి

శ్రీలలిత said...

యు ఆర్ వెల్కమ్..

మాలా కుమార్ said...

రవి గారు ,
మీరు లాస్టేమీ కాదండి . థాంక్ యు అండి .

@థాంక్ యు ప్రియ ,

ఁఅల్క్పేట్ రౌడీ గారు ,
థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

రాణీ గారు ,
థాంక్ యు అండి .

@శేఖర్ పెదగోపు గారు ,
రజనీ కాంత లా మీరు చెప్పిన విషెస్ బాగున్నాయండి .
తప్పకుండా రండి . అడుగూ బొడుగూ ఎందుకు , ఫ్రెష్ గానే చేసి పెడుతాను .
థాంక్స్ అండి .

@పరిమళం గారు ,
నాకు తెలుసండి , మీరు ఎంత పనిలోనో వున్నా , ఎప్పటికైనా వచ్చి విష్ చేస్తారని . థాంక్ యు .

మాలా కుమార్ said...

జ్యోతి గారు ,
నా బర్త్ డే గుర్తుంచుకొని చాలా గ్రాండ్ గా చేసారు . థాంక్ యు , థాంక్ యు వెరీ మచ్.

@అశోక్పాపాయి గారు ,
మీరందరూ నన్నితగా అభిమానించి , నన్నే అబ్బురపరుస్తున్నారండి . థాంక్ యు .

@శ్రీలలిత గారు ,
థాంక్ యు అండి .

పరుచూరి వంశీ కృష్ణ . said...

చాలా లేట్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు......లేకపోతే నెక్స్ట్ ఇయర్ కి ముందుగా అనుకోండి.....:-)

మాలా కుమార్ said...

వంశీ కృష్ణ గారు ,
థాంక్ యు .

Anonymous said...

Attyaa inka ninnevaroo aapaleeru...

-Ravi Komarraju

వేణూ శ్రీకాంత్ said...

That's so sweet and so nice... శేఖర్ గారు అన్నట్లు మీ ఆనందం స్పష్టంగా మీ టపాలో కనపడుతుంది :-) నేను మిస్ అయిపోయాను సుమండి. ఆలశ్యంగా అయినా సరే అందుకోండి మీ పుట్టినరోజు శుభాకాంక్షలు :-)

మాలా కుమార్ said...

రవీ ,
అసలు నీ మూలంగానే కదా నేను బ్లాగ్ స్టార్ట్ చేసింది . ఆ బ్లాగ్ మొదలు పెట్టబట్టే కదా ఇంత మంది స్నేహితులను సంపాదించుకుంది . అందుకే నీకు స్పెషల్ థాంక్స్ . థాంక్ యు వెరీ మచ్ .

మాలా కుమార్ said...

వేణూ సృఈకాంత్ గారు ,
చాలా రోజుల తరువాత కనిపించారు . చాలా బిజి గా వున్నట్లున్నారు .
థాంక్ యు వెరీ మచ్ అండి .