Monday, September 6, 2010
అడవి మా లోకం
బిజీ బిజీ రోడ్ మీద నుండి కాస్త పక్క లైను లోకి వస్తే , ఇదో ఇలా బోర్డ్ లు కనిపిస్తాయి . చిన్నగా కొండ ఎక్కుతూ వస్తే మా కాలనీ వస్తుందన్నమాట . కాలనీ లోపలకి రాగానే , మద్యలో ఇంకో కొండ , ఆ కొండ చుట్టూ ఇళ్ళు . ఆ కొండ మీద ఇలా అడవి . కాలనీ కి ఓ పక్క రోడ్ వుంటే మిగితా మూడు పక్కలా అడవే ! ఈ కొండ మీద వుండే అడవినే , మా మేఘ అండ్ హర్ ఫ్రెండ్స్ , డీప్ ఫారెస్ట్ అని పిలుచుకొని , భుజాన బాగులు తగిలించుకొని , పిక్నిక్ కు వెళుతుంటారు . మొన్నటి వరకూ ఎక్కువగా చెట్లు లేవు . పైగా నా కిచెన్ లో నుంచి చూస్తే వాళ్ళు కనిపిస్తూ వుండేవారు కనుక నేనూ అభ్యంతర పెట్టలేదు . ఇప్పుడైతే దట్టంగా గడ్డి మొలిచింది . పైగా మాఇంటికొచ్చిన పాముగారి కుటుంబం , చుట్టాలూ పక్కాలూ అక్కడే వున్నరేమోనని నా అనుమానం . అందుకని పిల్లలు అటెళ్ళకుండా కాపలా కాస్తూ వుంటాను . ఇంతకీ ఈ అడవి , ఈ కాలనీ ఎక్కడో కాదు సికంద్రాబాద్ లోనే ! ఇది ఆర్మీ ఆఫీసర్స్ వెల్ఫేర్ సొసైటీ కాలనీ . ఇక్కడ ఎక్కువగా రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్ వుంటారు . అంటే ఏదో సినిమాలల్లో చూపించినట్లుగా , యన్ .టి .రామారావు , శోభన్ బాబు లాగా ఎప్పుడూ యూనీఫాం వేసుకొని , గన్ పట్టుకొని , బుర్రమీసాలు దువ్వుకుంటూ , భారీ డైలాగులు కొట్టుకుంటూనో , లేకపోతే బాబూ మోహన్ , బ్రహ్మానందం లాగా యూనిఫాం వేసుకొని కామిడీ చేస్తూనో వుండరు . అన్ని కాలనీ లలో వున్నట్లే , అందరూ వున్నట్లే మామూలుగానే వుంటారు .
అసలు ఇక్కడ ఫాన్ ల అవసరమే లేదు . ఎంతగాలంటే ధడాల్ మని తలుపులు తెరుచుకునేంత . వున్న చెట్లు సరిపోనట్లు , ఈ మద్య ఒక వృక్షప్రేమికుడు , మామిడి , నిమ్మ , జామ చెట్లను తెచ్చి పిల్లల తో పాతించాడు . ఉదయాన్నే పక్షుల కిల కిలా రావాలు , సాయంకాలం శీతాకోకచిలుకల్లా పిల్లల ఆటలు , చుట్టూ చెట్టూ చేమా చాలా ఆహ్లాదంగా వుంటుంది . కాలనీ లో లోపల ఓ చుట్టూ తిరుగుతే 1.2 కిలోమీటర్స్ వుంటుంది . రోజూ సాయంకాలము , అన్ని చెట్లూ చూసుకుంటూ , చెట్ల గాలి పీలుస్తూ , సువాసనలను ఆస్వాదిస్తూ కనీసం నాలుగు సార్లైనా తిరుగుతాను . అదే మామూలుగా నాలుగు కిలోమీటర్ లు వాకింగ్ చేయాలంటే అమ్మో అనుకుంటాను . ముఖ్యం గా ఇక్కడ మా స్నేహితులు వున్నారు . పొద్దున్నే తొమ్మిదిన్నరకల్లా , మావారికి బ్రేక్ ఫాస్ట్ పెట్టి , లంచ్ బాక్స్ ఇచ్చి పంపేసి , ఎంచక్కా , మాజాంగ్ ఆడుకుంటూ , లేడీస్ మీటింగ్ ల కు వెళుతూ , ఫ్రెండ్స్ తో షాపింగ్ లు చేస్తూ , ఇలా వాకింగ్ చేస్తూ సుఖంగా కాలం గడుపుతూ . . . గడుపుతూ వుండగా . . . . మరీ ఇంత సోంబేరిగా వున్నావా అని కాలం ఓ జలక్ ఇచ్చింది .
మొన్న పాముగారు విజిట్ చేసేవరకూ , వంటరి భయం లేకుండా బాగానే వున్నాను . కాని ఇప్పుడో , ముందు హాల్ లోనే సెటిల్ అయ్యాను . నా లాప్ టాప్ , బుక్స్ , మందులు , మంచి నీళ్ళు అన్నీ హాల్ లో వున్న దివాన్ మీదే ! కాకపోతే నిన్ననే కాస్త , ఇదేమిటీ మరీ ఏ రోగిష్టిమారి ముసలమ్మో పరుచుకునట్లు అన్ని ఇలా పెట్టుకున్నాను అని కాస్త జ్ఞానోదయం అయి అన్ని తీసేసాను . కాకపోతే ఇంకా , అసలు లోపలి బెడ్ రూంవైపైతే చూడటము కూడా లేదు . కాని అదేమిటో ఏ పుస్తకమో చదువుతుంటే నా భుజాన్ని పాము గారు తట్టి , వుండు పేజీ తిప్పకు నేను చదవటము కాలేదు అని వెనకనుంచి అంటునట్లుగా అని పించి వుల్లిక్కి పడతాను . లేదా నాముందు కూర్చొని నీ బ్లాగ్ లో నా గురించే రాస్తున్నావా , మంచి గారాయి లేదా నిన్ను కాటేస్తాను అంటున్నట్లుగా అనిపిస్తుంది . లేదా లల్లాదేవి నవల లో లాగా ఓ అమ్మాయిగానో , అబ్బాయిగానో మారిపోయినట్లనిపిస్తుంది . అయ్య బాబోయ్ ఎన్ని ఊహించేసుకుంటున్నానో !!! ప్రతి పూట జహీరా తో మూల మూలలా ఊడిపించి , తనువున్నప్పుడే అలమారాలు చెక్ చేసుకొని , అర్జంట్ గా నా స్నానం పూర్తిచేసుకొని హాల్ లోకొచ్చేస్తున్నాను . కాస్త చలిగా వుంది కదా అందుకని ఓ షాల్ కప్పుకొని లాప్టాప్ నో , ఓ పుస్తక మో పట్టుకొని మా వారు వచ్చేదాకా ఎదురుచూసుకుంటూ కూర్చొని వుంటున్నాను . అలా ఎందుకు వున్నానో కాస్తైనా అర్ధం చేసుకోకుండా , పాము , నీకు నా మీద ప్రేమ పెంచినట్లుందే అని జోక్ లేస్తారు . ఇహ జహీరా ఏమో , అమ్మా నీభయం చూస్తుంటే నాకూ భయం వేస్తోంది . ఇట్లా ఐతే నేను పని మానేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది . అమ్మో పనిమనిషి మానేస్తే ఇంకేమైనా వుందా ? హుం * * * ఒక్కళ్ళూ అర్ధంచేసుకోరూ * * * * * *
మీరేమో హైదరాబాద్ లో వుంటున్నానన్నారు . ఇక్కడ మనుషులకే స్తలం లేదు పాములెక్కడ్నుండి వచ్చాయండి ? వుంటే గింటే దొంగల భయం వుండాలి కాని , ఈ పాము ల భయం ఏమిటి అని అందరూ అడుగుతున్నారు . మాకు దొంగల భయం లేదు . ఇక్కడ అందరూ గన్నులు పెట్టుకొని వుంటారు , కాల్చేస్తారు అని భయపడుతారట . అనుకని రారట . పిచ్చి మొహాలు వాళ్ళకేమితెలుసు ఎవరిదగ్గరా గన్నులుండవని .మా ఇంట్లో ఐతే బోలెడు పెన్నులుంటాయి . మావారు తెగ ఉత్తరాలు రాసేస్త్తూవుంటారు . అందుకే ఎన్నో రకాల పెన్నులుంటాయి . వున్నవి సరిపోక పిల్లల స్కెచ్ పెన్నులు కూడా తెచ్చేసుకుంటూవుంటారు . వాళ్ళేమో అవితీసుకుపోవటానికోచ్చి తాత పెన్నులు కుడా తీసుకెళుతారు . తాత మళ్ళీ పెన్నులు కొనుక్కొచ్చుకుంటారు . అలా మా ఇంటి నిండా , అవసరానికి అగుపడకుండా బోలెడు పెన్నులుంటాయి . దొంగ గారూ . . . ఇది చదివి హమ్మయ్య గన్నులు లేవు రావచ్చు అనుకుంటారేమో ! వచ్చినా మెడల్స్ మొమెంటోలూ తప్ప ఇంకేమీ దొరకవు . కాకపోతే ఓ పది పట్టు చీరలు , ఓ పది పాత సూట్లూ దొరుకుతాయేమో ! పాపం అవి మీరేం చేసుకుంటారు లెండి ! మీ కష్టం వృధానే !
ఇదండీ నా అడివింటి కథ . కాదు . . . కాదు మా మేఘా ఇంటి కథ . నా ఇల్లంటే మా మేఘా అండ్ హర్ ఫ్రెండ్స్ కోపం చేస్తారు . అది మాత్రం నిజం , ఏ ట్రాఫిక్ భయమూ , ఇంకే భయమూ లేకుండా పిల్లలు ఇక్కడ ఎంత హాయిగా ఆడుకుంటున్నారో . వాళ్ళను చూస్తుంటే చాలా హాపీగా వుంటుంది . ఇప్పుడు ఈ ఇల్లు మారుతానంటే వాళ్ళు ఒప్పుకోరు . స్చప్ కాని చూద్దాం . . . . .
Subscribe to:
Post Comments (Atom)
27 comments:
మీతో చంప బడిన పాము నాగేశ్వర రావు అయితే
తన పిల్లలు అయిన నాగార్జున నాగ చైతన్య ఇంకా బతికే ఉన్నారు
వీళ్ళంతా పగ పట్టకుండా ఉండాలంటే మీరు నాగేశ్వరరావు కోసం ఆ మాత్రం బాధపడక తప్పదు
చంపిన మూగ ప్రాణి కోసం తలుచుకోవడం లో తప్పులేదు
నాగేశ్వరరావు చనిపోవచ్చు కానీ తన ఆత్మ పరిభ్రమిస్తూనే ఉంటది
jaheera origined from the word jeher
తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
దలతోఁక యనక యుండును
జహీరాకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
తాత్పర్యం: పాముకి విషయం తలలోను, తేలుకు తోకలోనూ, జహీరాకు నిలువెల్లా విషం ఉంటుంది.
హ హ హ మాల గారు మరీ ఇలా ఐతే ఎలా అండి. ఇక మీతో నాగిని పాట డేన్స్ ప్రాక్టీస్ చేయించాల్సిందే మేజర్ గారికి చెపుతాము వుండండీ
No No No
భావన గారు చెప్పింది ఖండ ఖండాలుగా ఖండిస్తున్నాం
jaheera will dance to the tunes
ఒక బురఖా రడీ చేయండి
http://www.youtube.com/watch?v=Ish42wa35B4
అమ్రిషి పూరి సన్నాయి ఇక్కడ
http://compare.ebay.com/like/140445010404
మీ లాప్ టాప్ లేదేంటి, నేనొక దొంగని పంపుతానుండండి!!
బహుశా మీకా పాము భయం పెట్టింది విదేశీ శక్తుల కుట్రేమో...ఆలోచించండి...
ఏమాట కామాటే చెప్పుకోవాలి... మీ అడవి నాకెంత నచ్చేసిందో..
"ఆకులో ఆకునై" పాట గుర్తొచ్చేసింది..
ఓ 13 ఏళ్ళ క్రితం మా ఇంటి పరిసరలు కూడా ఇలాగే ఉండేవి. ఇంతపెద్ద సైజు చెట్లు లేకపోయినా ఎటుచూసినా పచ్చగా గడ్డి.ఖాళి స్థలం ఎక్కువుండడంతో కాలనీలో ఉన్న పదీ పదకొండుమంది పిల్లలం తెగ ఆడేవాళ్లం.హుమ్...ఇప్పుడెక్కడిదీ అంతా పాయె. హైదరాబదులో ఇప్పుడు అడవిలాటి పచ్చదనంలో ఉంటున్నారు...ఏమి భాగ్యము(విజిటింగ్ అథిది పాముగారిని మినహాయిస్తే :) )
:) :)
హహ్హహ్హా. మాల గారూ.. చాలా బాగుంది మీ అడవింటి కథ.. సారీ సారీ.. మీ మేఘా ఇంటి కథ..:) ఇంతకీ పాము గారికి కాఫీలు టిఫినీలు ఇచ్చారా..:))
మాల గారు
అడివి మాలోకం అని ఆ మూగజీవిని తిడుతున్నారా!
పాపం కదా
ఆహా ...ఎంత బావుందండీ మీ కాలనీ ప్రశాంతంగా ....ఒక్క పాముల గోల లేకపోతె ...మీకో విషయం చెప్పనా ...పాములంటే నాకు చచ్చేంత భయం ! పెద్ద పుడింగి లాగా మీకు ధైర్యం చెప్పేద్దామనుకున్నా కాని టీవిలో చూస్తేనే రాత్రి కలలోకి వచ్చేస్తాయి. ఒకప్పుడు బొద్దింకలంటే కూడా బోలెడు భయపడేదాన్ని!హైదరాబాద్ అపార్ట్ మెంట్ల పుణ్యమాని ఆ భయం పోయింది.అన్నట్టు మాలాగారూ ! మా నాన్నగారు ఒక విషయం చెప్పారు తెల్లవీసర అనే మొక్క ఉంటుందట ! అది ఉన్నచోటుకి పాములు రావని అంటారట ! అవి దొరికితే మీ ఇంటి చుట్టూ వేయించి చూడండి ఏమో ఏ పుట్టలో ఎ పాముందో ...( సామెత ) :) :)
భలే భలే....బుస్ బుస్స్స్స్స్స్స్:)
చాలా బాగుందమ్మా! ఇదివరకు టపాకన్నా దీంట్లో యెక్కువ నవ్వు వచ్చింది.
పోనీలే! మీవారికి మాత్రం రహస్యం చెప్పెయ్యకండి.
ఇక, "తెల్లవీసర" కాదు "ఈశ్వర" వేరు అని వుంటుందిట. దాన్ని కూడా నమ్మకండి.
వీలైతే ధ్యానం చెయ్యండి.....మనలోని కుండలినీ శక్తి, చుట్టలు విప్పుకుంటూ నిద్రలేవడానికి యెంత సమయం పడుతుందో చూడండి! ఇంకే పాము భయాలూ వుండవు!
neeharikagaaru,aA laptop naadi ,kaavaalante meeru inkedainaa theskellandi.maalagaaru,pillalu-meeru andaru konchamu jaagrattaga vundandi.memaithe post chadivi navvukunnamu,mari meeru?
మాలాగారూ
పాము భయం కొంచెం తగ్గి, ధైర్యంగా వుండటం అలవాటు చేసుకుంటున్నారా భయంలోంచి ధైర్యం పుడుతుంది చూడండి.
psmlakshmi
ayyababoyeeee meeru ela ite vinaru kaani undandi maa ullo nudi aa pamulu pattevani tisukastanu mee intiki endukante mee intlo paamuni pattinchadaniki maatram kaadu...2,3nalla tracholu unnayanta atani daggara mee intlo vadileyadaniki..endukante antha bayapadutu taapa maatram vadalatam ledu kada..
నలుగురు అనోనమస్ గారులకు ధన్యవాదాలు .
& ఇంకో అనొనమస్ గారు ,
మీరు ఈ నలుగురి లో ఒకరో వేరో నాకు తెలీదు . మీ అనోనమస్ ల పేరు , ఊరు , మీరెందుకు మారు పేరు తో వస్తున్నారో నాకు అనవసరము . అది మీఇష్టం . కాని నాదో విన్నపము . ఎవరు జోకులు వేసినా నవ్వే సెన్సాఫ్ హ్యూమర్ నాకుందనే అనుకుంటున్నాను . కాని భయంకరమైన జోకులను లైట్ తీసుకోలేను . మీరు పంపిన లింక్ అనాలోచితముగా ఓపెన్ చేసి ఎంత భయపడ్డానో చెప్పలేను . నెట్ స్లో గా వస్తోంది అని కంప్లేంట్ చేసే నేను ఇది చూసినప్పుడు మటుకు నెట్ స్లోగా వున్నందుకు సంతోషించాను . సగము చూస్తే అంత భయపడ్డాను , పూర్తిగా చూస్తే నా గుండె ఆగిపోయేది . మీకూ , నాకూ మద్య ఇంత శత్రుత్వము వున్నట్లు నాకు తెలీదు . తెలిసో , తెలియకో ఎప్పుడైనా మిమ్మలిని నొప్పిస్తే క్షమించండి . అంతే కాని దయచేసి ఇలాంటివి మళ్ళీ పంపకండి .
హహ్హహ్హా. మాల గారూ.. చాలా బాగుంది మీ అడవింటి కథ..పాములు (మా ఆఫీస్ దగ్గర చాలా ఉన్నాయి) ..మీ పోస్ట్ చదువుతానని అడిగితే.పాముని నేనే పంపించా...... మీరు అలా చేసారా?
మీ ఉత్సాహానికి, చురుకుదనానికి కారణం ఏంటో నాకు తెలిసిపోయిందోచ్...ఇంత చక్కని పచ్చదనం మధ్యలో ఉంటూ స్వచ్చమైన గాలి పీస్తూ ఉండటమే అని నాకు తెలిసిపోయింది...హైద్‌లో ఉంటూ ఇలాంటి వాతావరణంలో ఉన్న మీ అదృష్టానికి చాలా అసూయగా ఉందండి నాకు....
భావన గారూ ,
ఇప్పుడదొకటా ? బాగుంది .
&నిహారిక గారూ ,
నా లాప్ టాప్ దేవుడి పీట కింద దాచానుగా . మీ దొంగకు తెలీదు లెండి .
& శ్రీలలిత గారూ ,
మొన్నటి వరకూ నేనూ అలాంటివెన్నో పాటలు కూనిరాగాలుతీస్తూ చెట్టూ , చేమా చూసుకుంటూ , హాపీగా తిరిగానండి . ఇప్పుడూ వాకింగ్ చేస్తున్నాను , కాకపోతే కింద రోడ్ చూసుకుంటూ !
నాగార్జున ,
హరే కృష్ణ ,
థాంక్యు .
&మనసు పలికే ,
నిజమేనండి , ఇది మేఘా ఇల్లే . మా మేఘా ఇక్కడ వున్నన్నీ రోజులూ రాత్రి 10 గంటలకు , నేనూ మా గౌరవ్ తనను ఎక్కడుందా అని వెతకటానికి వెళ్ళటమో , లేకపోతే మాకు , మా అమ్మాయుందా అని ఫోన్ లు రావటమో జరుగుతూ వుంటుంది . నిన్ననే నాకో ఆర్డర్ , పోయినసారి తను వచ్చినప్పుడు కారిన్ అని తన ఫ్రెండ్ కలవలేదట , కాల్ చేసినా పలకటము లేదట . వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడు బామ్మా అని . అదన్నమాట సంగతి .
& హరికృష్ణా ,
కృష్ణ కృష్ణా లేదు లేదు . ఆ మూగజీవి ని ఏమీ అనటము లేదు . మా లోకం అడవి అంటున్నాను అంతే .
పరిమళం గారు ,
చూస్తానండి మీరు చెప్పిన మొక్క దొరుకుతుందేమో . ఇంకా చాలా మంది చాలా చిట్కాలు చెప్పారు . అన్ని ప్రయత్నించి చూస్తాను . నిజమే ఏ పుట్టలో ఏ పాముందో !
& పద్మార్పిత గారు ,
అంత భలేగా వుందా ? హుం అంతే లెండి .
కృష్ణ శ్రీ గారు ,
మొదటిసారిగా మా అడవింటికి వచ్చారు . స్వాగతం అండి .
&gajula గారు ,
మీరూ మొదటి సారే వచ్చినట్లున్నారు . వస్తూనే నా లాప్ టాప్ మీదనేసారే .
జాగ్రత్తగానే వున్నామండి . చిన్న చిన్న రంద్రాలు ఇదివరకు మేము పట్టించుకోలేదు . అవన్నీ మూయించేసామండి . ఇక భయం లేదనే అందరూ అంటున్నారండి . థాంక్ యు .
లక్ష్మి గారు ,
థాంక్స్ అండి .
& అషోక్ ,
అవేవో మీరే వుంచేసుకోండి .
శివరంజనీ ,
ఎంత ఘట్టిగా అరిచానో వినిపించిందా ? ఏమిటమ్మాయ్ నీపేరు బాగాలేదన్నావని , నేను కోపం చేసానని ఇంత పని చేస్తావా ?
& శేఖర్ ,
అంత అసూయా ? సరే నాకిచ్చిన (?) కాంప్లిమెంట్ కు థాంక్ యూ .
Post a Comment