Friday, September 10, 2010

గణపతి బాబా కు మోదం మోదకం




నా చిన్నప్పుడు మా నాన్నగారు , ఇంట్లోనే వినాయకుని , మట్టి తోచేసేవారు . ఆయన తో కలిసి వినాయకుని కబుర్లు వింటూ బొమ్మను చేయటము చాలా సరదాగా వుండేది . వినాయకుని నోరేది ? చెవులింత పెద్దగా వున్నయేమిటి ? కళ్ళు అలా చిన్నగా వున్నయేమిటి ? నాన్నగారూ , అని ప్రశ్నలు వేస్తే చాలా ఓపికగా , తక్కువగా మాట్లాడాలి , ఎదుటి వాళ్ళు చెప్పేది శ్రద్దగా వినాలి అని , ప్రతి విషయాన్ని గమనించాలి అని అని వినాయకుడు మనకు భోధిస్తున్నాడమ్మా చెప్పేవారు . స్నేహితుల తో పోటీబడి ఆకులు తెంపుకు రావటము చాలా ఉత్షాహం గా వుండేది . ఎప్పుడైనా పొరపాటున చవితి చంద్రుని చూస్తే అమ్మో అనుకునేదానిని .

రెండు సంవత్సరాలనుండి , మా మనవరాళ్ళు కూడా ఇంట్లోనే , మట్టి వినాయకుని చేస్తున్నారు .

ప్రతి సంవత్సరము , ఉండ్రాళ్ళు , కుడుములు నైవేద్యము గా పెడుతాము , ఈ సారి వెరైటీ గా మహర్రస్ట్రీయులు చేసే , " మోదక్ " చేద్దామనుకున్నాను . అందుకే ముందుగా ఒకసారి చేసి చూసుకుందామని చేసాను .

మోదక్ చేసేందుకు కావలసినవి ;

పై పూతకోసం ,
1 కప్ గోధుమ పిండి ,
1/2 కప్ మైదా ,
కొద్దిగా ఉప్పు ,
పూర్ణాని కి కావలసినవి ,
1 కప్ పచ్చి కొబ్బరి తురుము ,
1/2 కప్ పంచదార ( తీపి ఇష్టమవుతే ఎక్కువ వేసుకోవచ్చు ) ,
1 స్పూన్ ఇలాచీ పొడి ,
డ్రై ఫ్రూట్స్ ఇష్టమైనవి .

రిఫైండ్ నూనె

చేసే విధానము ,
ముందుగా గోధుమ , మైదా పిండి ల లో , కొద్దిగా ఉప్పు వేసి , ఆ పైన కొంచము కొంచము గా నూనె వేస్తూ తడపాలి . పిండి మొత్తము పొడి పొడి గా నూనెతో తడుపుకున్నాక , కొద్ది కొద్ది గా నీరు పోస్తూ గట్టి గా తడుపుకొని , ఓ బట్ట కప్పి పక్కన వుంచుకోవాలి . ఆ పిండి ని ఓ అరగంట నాననివ్వాలి .

పిండి నానే లోపు , కొబ్బరి , పంచదార కలిపి స్టవ్ మీద వుంచి బాగా కలిసేవరకు ఉడక బెట్టాలి . మరీ పొడి గా కాకుండా , నీళ్ళ గా కాకుండా చేసుకోవాలి . అందులో ఇలాచీ పొడి , వేయించి వుంచుకున్న డ్రై ఫ్రూట్స్ ను వేసి కలపాలి .

ఆ తరువాత పై పిండిని , మృదువుగా మర్ధన చేసుకొని , కొద్ది గా తీసుకొని , చిన్న పూరిలా వత్తు కోవాలి . ఆ పూరీ లో పూర్ణమును కొంచము పెట్టి పువ్వులా ముడవాలి . ఆ తరువాత , స్టవ్ మీద బాణలి పెట్టి , నూనె వేసుకొని వేడి చేసుకోవాలి . మంట తక్కువగా వుంచి , ఆ నూనెలో , తయారుగా వుంచుకున్న మోదక్ లను వేయించుకోవాలి . అంతే గణపతి బాబా కు ప్రీతికరమైన మోదక్ తయార్ .

8 comments:

divya vani said...

మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు!

సి.ఉమాదేవి said...

మీ కుటుంబమందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.

భాస్కర రామిరెడ్డి said...

మాలా కుమార్ గారూ...,విఘ్నాధిపతిని భక్తితో పూజిద్దాం

హారం

భావన said...

చేసేరా మోదక్ లు ఐతే. వినాయక చవితి శుభాకాంక్షలు మాల గారు మీ కుటుంబ సభ్యులందరికి.

మాలా కుమార్ said...

దివ్య వాణి గారు ,
సి . ఉమా దేవి గారు ,
భాస్కర రామిరెడ్డిగారు ,
మీకు కూడ వినాయకచవితి శుభాకాంక్షలండి .

మాలా కుమార్ said...

భావన గారు ,
మోదక్ లు చేద్దామనే అనుకున్నానండి .కాని ఊళ్ళో లేక పోవటము వలన చేయలేకపోయాను .
మీకు కూడా వినాయకచవితి శుభాకాంక్షలు .

అశోక్ పాపాయి said...

vinaayaka chaviti subhaconkshalu meeku..

మాలా కుమార్ said...

thank you ashok