Friday, September 24, 2010

మా ఇంట్లో కూడా బ్రహ్మకమలం విచ్చుకుంది .





ఆకాశము లో చంద్రుడు మెల్ల మెల్ల గా పూర్ణ చంద్రుడిగా మారుతున్న సమయాన , మా ఇంటిలోని బ్రహ్మ కమలం చిన్న చిన్న గా రేకులు విప్పు కుంటూ . . . విప్పుకుంటూ చంద్రుని తో పాటు పదహారు , వన్నె చిన్నెలు దిద్దుకుంటూ వుంటే అటు చంద్రుని , ఇటు బ్రహ్మకమాలాన్ని చూసేందుకు రెండు కళ్ళూ చాలటము లేదు . వాహ్ ఎంత అందమైన దృశ్యము . రాత్రంతా అలా చూస్తూ వుండి పోవాలనిపిస్తోంది .
స్చప్ . . . చంద్రుని మబ్బులు కమ్మేసాయి . హుం . . .

బ్రహ్మకమలం హిమాలయలలో పూసేపువ్వు . ఇది ఎక్కువగా కేదారేశుని దగ్గర పూస్తుంది . ఈ మద్య కాలము లో ఇలా ఆసక్తి కలవారి ఇళ్ళలో కనువిందు చేస్తోంది . సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూస్తుంది . అదీనూ రాత్రి వేళలో మాత్రమే . దాని వయసు కూడా చాలా కొద్దిసేపే . వికసించిన గంటలోపే ముడుచుకుంటుంది . కేదారేశుని కి ప్రీతికరమైన పుష్పం . ఒక్కొక్క రేకూ విప్పుకుంటూ , పరిమళాలు వెదజల్లే టప్పుడు చూసి తీరాల్సిందే కాని వర్ణింప తరముకాదు . ఆ అందానికి కళ్ళు తట్టుకోలేవు .

బ్రహ్మకమలం గురించి నాకు తెలిసింది ఇంతే . ఇంకెవరికైనా తెలుస్తే చెప్పగలరు .

ఉదయము నుండీ ఈ బ్రహ్మకమలం కొరకు ఎదురుచూస్తూ వున్నాను . ఉదయము నుండేనా ? కాదు కాదు , సత్యవతి గారి పోస్ట్ లో బ్రహ్మకమలం గురించి చదివినప్పటి నుండీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆరాటపడి పోతున్నాను . అందుకే ఈ రోజు ఉదయం సత్యవతి గారు కాల్ చేయగానే రెక్కలు కట్టుకొని వెళుదామనుకున్నాను . తీరా బయలుదేరే సమయానికి , ముంచుకు పోతున్నట్టుగా వాన !!! ఎప్పుడు వాన కురిపించాలో ఎప్పుడు కురిపించవద్దో , టైం సెన్స్ ఈ వరుణ దేవుడికి అస్సలు లేదుకదా . ఎలాగా అనుకుంటూ వుంటే సత్యవతి గారే , ఈ పువ్వు కోసం వచ్చిన ఒక అబ్బాయి తో పంపించారు . పాపం , చీకటిలో , వానలో సంతోష్ గారు , ఇక్కడి దాకా తెచ్చి ఇచ్చారు . అది చూడగానే ఎంత సంతోషం వేసిందో చెప్పేందుకు మాటలు లేవు .

సత్యవతి గారు చాలా చాలా ధన్యవాదాలు . ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను .

సంతోష్ గారు శ్రమ అనుకోకుండా తెచ్చి ఇచ్చినందుకు చాలా థాంక్స్ అండి .

కనురెప్ప మూస్తే మళ్ళీ జన్మలో చూడగలనా అని రాత్రి రెండింటి వరకు రెప్ప వాల్చకుండా అలా చుస్తూ వుండి పోయాను . ఉదయమే లేవగానే పని చేసుకుంటూ ఓ కన్ను దానిమీదే .మావారి పుజ సమయానికే , అసలు అంతకు ముందే మూతి ముడిచేసింది ! ముడుచుకున్నా ఎంత అందమో ! పొద్దున్నే పని వుందని మావారు బయటకు వెళ్ళిపోయారు అంతే చెంగున కెమేరా తీసుకొని కెమేరా లో బంధించేసాను .

సత్యవతి గారు ,
thank you .

18 comments:

Anonymous said...

send your BRAMHA KAMALAM PHOTOS to www.namastheandhra.com

they will put it in gallery..

and send your home photo aslo

Durga said...

Mala garu,

Brahmakamalam Peru vinadame kaani eppuduu choodaledu. Meeru puvvu vicchukuntunna photos petti maaku koodaa nayanandam kaliginchaaru. Brahmakamalam chettu petti poolu pooyistunna Satyavatigariki, aa puvvu andaanni maato paatu panchukunnanduku dhanyavaadalu. Kaani E internet dwara puvvu vasana choose avakaasam koodaa vunte yentha bagundu kadaa anipistundi aa puvvuni choostunte. Photos choostuntene rendu kallu chalavemo anipistunde pratyakshanga chustunte meeku assalu akkadinundi kadalaalani anipistundaa cheppandi!

భమిడిపాటి సూర్యలక్ష్మి said...

మాల గారు,
బ్రహ్మకమలం చాలా బాగుంటుందండి. దాని సువాసన మొత్తం ఇల్లంతా వస్తుంది. మా ఇంట్లో కూడా తెచ్చిపెట్టాను. ఒకే మొక్కకు ఆరు, ఎనిమిది పువ్వులు వఛ్చేవి. మేము రాజమండ్రి వెళ్ళిన తరువాత నా గార్డెను మొత్తం అంతా ఎండిపోయింది.నీళ్ళు లేక పోషణ లేకా,ఎన్నో సంవత్సరాల శ్రమ ఎండిపోయింది. అన్ని కుండీలలోనేను. ఫ్లాట్సు కదా! ఓ ఇరవై కుండీలు మాత్రం మిగిలాయి.

కృష్ణప్రియ said...

హ్మ్మ్.. నేను మొక్క వేసి ఏడాదయ్యింది. మా మొక్క కి ఇంకా పూలు లేవు. వచ్చే సంవత్సరం ఏమైనా పూస్తుందేమో.. మీ స్లైడ్ షో చాలా బాగుంది.

Srujana Ramanujan said...

Haaaaaaaaaaaa. Good.

Srujana Ramanujan said...

Gaallo telaaraa? Gunde jaarindaa?

పరిమళం said...

wowwwwww!Beautiful!

ramya said...

బ్రహ్మకమలం ఫొటోస్ బావున్నాయండి.
నా బ్లాగులో మీ వ్యాఖ్య ఆలస్యంగా చూశాను. తోట చంద్రగిరిలో ఉంది. మీరు తప్పక రండి.
తిరుపతి వస్తే ఓ మైల్ ఇవ్వండి నేను మీకు మా తోట చూపెడతా :)

Anonymous said...

ब्रह्मा कमल और सर्प साथ साथ में रहते हैं
इसलिए आप इसको संभाला के रखना है

మురళి said...

Beautiful..

మాలా కుమార్ said...

అనొనమస్ గారు ,
మీ సలహాకు ధన్యవాదాలండి .

& దుర్గ గారు ,
మాకు నా ఫొటో లు నచ్చినందుకు థాంక్స్ అండి . నిజమే సువాసనలు కూడా తెలుస్తే ఇంకా బాగుండేది .

భమిడపాటి సూర్యలక్ష్మి గారు ,
కష్టపడి పెంచుకున్న తోట ఎండిపోతే చాలా భాధేనండి . అందుకే ఈ మద్య నేను ఎక్కువగా చెట్లు పెట్టటము లేదు .

మాలా కుమార్ said...

కృష్ణప్రియగారు ,
నేనూ , సత్యవతి గారి దగ్గర నుండి మొక్క తెచ్చుకున్నాను . కాని అది బతికి పూసే వరకు ఆగలేక , పూవు కూడా తెచ్చుకొని ఇలా ఆనందించానన్నమాట .

& సృజన గారు ,
అవునవును గుండె జారి పోయింది , ఎటో వెళ్ళిపోయింది .

& పరిమళం గారు ,
థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

రమ్య గారు ,
ఈ సారి తిరుపతి వచ్చినప్పుడు మీ తోట చూడటానికి తప్పకుండా వస్తానండి .
థాంక్ యు .

& అనోనమస్ గారు ,
షుక్రియా ,
& మురళి గారు ,
థాంక్స్ అండి .

నేస్తం said...

మొత్తానికి సాధించారుగా..నాకు కూడా కావాలి ..బ్రహ్మ కమలం చూడాలని అనిపిస్తుంది ఎప్పటికి తీరేనో?

అశోక్ పాపాయి said...

పువ్వు చాల అందంగా వుందండి.

మాలా కుమార్ said...

నేస్తం గారు ,
ఈ సారి ఇండియా , ఈ టైం లో వచ్చేట్లుగా ప్లాన్ చేసుకోండి . అప్పటి కల్లా నా చెట్టు బతికి , పూలు పూస్తే సరి . లేదంటే ఎలాగూ సత్యవతి గారు వుండనే వున్నారు . వాళ్ళింట్లో గుత్తులు గుత్తులు పూస్తాయిట . ఎంచక్కా అక్కడే చూడొచ్చు . ఏమనరులేండి . ఎంతైనా మనం మనం ఒకటేకదా .

& థాంక్ యు అశోక్ .

ఆ.సౌమ్య said...

సత్యవతిగారి బ్లాగులో బ్రహ్మ కమలం చూసి భలే ముచ్చటపడ్డాను, ఇప్పుడు మీ ఇంట్లో కూడా పూసిందా, చాలా సంతోషం. ఏమి అందమండీ బాబు, దానికదే సాటి.

మాలా కుమార్ said...

సౌమ్య ,
ఈ పువ్వు మాంట్లో విచ్చుకుంది మాత్రమే . మొగ్గేసింది సత్యవతి గారింట్లోనే .