నల్లని , సొరంగము లో నుండి రైలు వేగం గా పోతోంది . అదేమిటి ఇంత చీకటిగా వున్నా నాకు భయము వేయటము లేదు అనుకుంటూ కిటికీ లో నుండి తొంగి చూసాను . దూరం గా పసుపు రంగులో దీపం కనిపిస్తోంది . ఓహో అటు చివర లైట్ కనిపిస్తోంది , అంటే సొరంగము కు ఆచివర కనిపిస్తోందన్నమాట . అందుకే భయం వేయటము లేదన్నమాట అనుకున్నాను . రైలు వేగం గా దూసుకుపోతోంది . నేను ఆ దీపాన్ని చూస్తూ వున్నాను .
మాలా నేను రావటానికి ఇంకో వారము కావచ్చు . ఈ రోజో రేపో ఎప్పుడు దొరికుతే అప్పుడు టికెట్ కొనుక్కొని వచ్చేయి . కాని , ఇప్పుడే చెపుతున్నాను నిన్ను సైట్సీయింగ్ కు తీసు కెళ్ళేందుకు నాకు టైం వుండదు . నీ అంతట నువ్వే వెళ్ళాలి , లేదా రూంలో వుండాలి నీ ఇష్టం అని మా వారు ఔరంగాబాద్ నుండి కాల్ చేశారు . ఆయన వెళ్ళి అప్పటికే రెండు రోజులైంది . ఇంకోవారం ఇక్కడ వుండి నేను చేసేదేముంది . అనుకొని , ఏ ట్రేన్ లో , ఏ సి నో నాన్ ఏసి నో ఏది దోరుకుతే ఆ టికెట్ తెమ్మని డ్రైవర్ మహేష్ ను పంపాను . మేడం తత్కాల్ లో , ఈ రోజు దేవగిరి ఎక్స్ ప్రెస్ లో వున్నాయి . ఏ .సి లో లేవు అన్నాడు పరవాలేదు తీసుకురా అని టైం చూస్తే పదైంది . అమ్మో ఇంకో రెండు గంటలలో బయలు దేరాలి అనుకొని , ముందుగా లాప్ టాప్ ఎందులో సద్దాలా అని అలోచించాను . అవును మరి అది వుంటే ఎంత టైం ఐనా గడిచిపోతుంది .పైగా టాటా ఇండికాం వుండనే వుంది .( కాకపోతే అక్కడికి వెళ్ళాక అది పనిచేయనప్పుడు , తెలిసింది దానికి రోమింగ్ చార్జెస్ వుంటాయని అవి మేము కట్టలేదని ) దాన్ని విడిగా బాగ్ లో తీసుకెళుతే అందరికీ తెలిసి పోతుంది . పోనీ సూట్ కేస్ లో పెడుదామా , కూలీ ఎత్తేస్తే !!! ఎటూ అలోచన తెగలేదు . ఇహ లాభం లేదనుకొని సంజు కు కాల్ చేసి , ఇలా వెళుతున్నాను అని చెప్పి , నా సమస్య చెప్పాను . సూట్కేస్ లో బట్టల మద్య పెట్టమ్మా , విడిగా వద్దు అంది . సరే ఓ ప్రాబ్లం సాల్వూ . . . పది నవలలు , లాప్ టాప్ తో నా పాకింగ్ ఐయింది .
దేవగిరి ఎక్స్ ప్రెస్ ఎక్కాక చూస్తే ఎవ్వరూ లేరు . కంపార్ట్మెంట్ అంతా ఖాళీ . . . రజనీగంధా సినిమా లో విద్యా సిన్ హా ట్రేన్ లో కళ్ళు తెరవగానే ట్రేన్ అంతా ఖాళిగా ప్లాట్ ఫాం అంతా ఖాళీగా , ఎక్కడా మనుష్యులే లేకుండా నిర్మానుష్యం గా కనిపిస్తుంది . ఎప్పుడో చూసిన ఆ సినిమా లో ఆ సీన్ గుర్తొచ్చింది . ఇదేమిటి మహేష్ ఎవ్వరూ లేరు . ఇదే ట్రేనా ? సరిగ్గా చూసావా అని , మహేష్ ను అడిగాను . ఇదే మేడం మనము అరగంట ముందోచ్చాము అన్నాడు . హుం ముందొస్తే ఇలా వుంటుందన్న మాట . అమ్మయ్య మొత్తానికి ఆ అరగంటా గడిచింది . కంపార్ట్ మెంట్ నిండింది . రైలు బయలుదేరింది . అదృష్టవశాతు , సైడ్ విండో సీట్ దొరికింది . బోలెడు కాల్క్షెపం . . . .
అసలు ఇది , నిజామాబాద్ , కామారెడ్డీ ఏరియానేనా ?? ఎండి పోయి బీటలు వారి దిగులుగా వుండే నేల , ఎంత ఆకుపచ్చ గా మెరిసి పోతోంది ! కిటికీ లో నుండి పక్కకు చూస్తే పచ్చ గా పొలాలు , పైకి చూస్తే కమ్ముకు వస్తున్న మేఘాలు .
15 comments:
బాగుందండీ మీ ప్రయాణం
ఔరంగాబాద్ ఫోటోలు ఏవండీ?
ప్రయాణపు అనుభూతిని సరిగమల సరాగమాలగా పేర్చిన మీ అక్షరాల కూర్పు, , తాంబూలంలో సుగంధ వక్కపలుకులా మీ హాస్యపలుకుల చేర్పు,ఆపైన ప్రయాణంలో పాటలపందిరి వేసిన నేర్పు అమోఘం మాలాకుమార్ గారూ.నిజ్జంగా మీతో సహప్రయాణం చేసినట్లే ఉంది.
చాలా బాగున్నాయండి మీ విడియోలు ,వర్ణనలు .
mitho travel cheyyalani baaga anipinchindandi.. abbaa.. ala chudakandi.. mi laptop, camera kotteyyataniki kaadule.
you shd start writing suspense thrillers.
ఇప్పుడు చేస్తున్నది అదేగా, అంటారా?
మీకు కధలు వ్రాసే సమయమొచ్చెనా!
మీకు సొరకాయలు ఇష్టమని ఆ అమ్మాయి కి ఎలా తెలిసందబ్బా? చటుక్కున అవట్టుకొచ్చి మీ పెట్టె లోకి ఎక్కేసినాది :)
నేను దూరతీరంలో వుండి మీ టాపా చదివి మీరు తీసిన ఫోటోలు చూస్తే మా ఊరు గుర్తుకస్తూంది..మీ టాపాతో నేను సంతోషం అయ్యను చాల చాల కృతజ్ఞతలు మాల గారు.
నేను దూరతీరంలో వుండి మీ టాపా చదివి మీరు తీసిన ఫోటోలు చూస్తే మా ఊరు గుర్తుకస్తూంది..మీ టాపాతో నేను సంతోషం అయ్యను చాల చాల కృతజ్ఞతలు మాల గారు.
బాగుందండి మీ ప్రయాణం .. సొరకాయ నిన్ను వదలా బొమ్మాళి అంటుందాండి మిమ్మల్ని
నీహారిక గారు ,
రాధిక గారు ,
థాంకస్ అండి .
& శేఖర్ గారు ,
కొన్ని ఫొటోలు ఇక్కడ వున్నాయండి . ఇంక్కొన్ని ఇంకోస్ పోస్ట్ లో .
http://prayanamlopadanisalu.blogspot.com/2010/09/blog-post.html
ఉమాదేవి గారు ,
నా పోస్ట్ కన్నా మా వాఖ్య బాగుందండి . థాంక్ యు .
& ,జాబిల్లి గారు ,
రావాల్సిందండి . జాబిల్లిని రావద్దంటానా ?
కొత్తపాళి గారు ,
సస్పెన్స్ త్రిల్లర్స్ రాస్తున్నాననంటారా ? :))
& రావు గారు ,
ఇక కథలు రాయొచ్చంటారన్నమాట . థాంక్ యు .
తెలుగింటి అమ్మాయి గారండి ,
ఏమో నండి , ఆ గుంట కు ఎలా తెలిసిపోనాదో :))
& అశోక్ ,
నిజామాబాద్ స్టేషన్ చూడగానే మీరే ఉర్తొచ్చారండి . మీ వూరి ఫొటోలు మీకు నచ్చినందుకు థాంక్ యు .
& శివరంజని ,
అంతేనండి , ఆ సొరకాయ ను నేనొదిలినా అది నన్ను వదలక ట్రేన్ లొకి కూడా వచ్చింది .
Post a Comment