Thursday, February 19, 2009
జీవిత మే మధుర మో
వక రోజు గౌరవ కంప్యూటర్ గురించి ఏదో అడిగాడు.నాకు కంప్యూటర్ రాదు.అన్నాను నువ్వు నేర్చుకోలేదా అని అడిగాడు.లేదురా అంటే నేరుచుకో బామ్మ అన్నాడు.నాకు రాదురా అంటే కాదు బామ్మా నువ్వు చేయగలవు నేకు వస్తుంది నేర్చుకో అన్నాడు.యు.యస్.వెళ్ళినప్పుడు అను మొదటిసారిగా సంజు తో చాట్ చేయించింది.సో నా మొదటి గురువు నా కోడలన్నమాట .తరువాత బిపు కంప్యూటర్ మీద అన్ని సెట్ చేసి ఇస్తే,ఎట్లా క్లిక్ చేయాలో చూపిస్తే చాట్ చేయటము నేర్చు కున్నాను.పేపర్ ,నొవెల్స్ చదివేదానిని.అయన బ్రిడ్జి ఆడేవారు.అంతే.గౌరవ అన్నాక నాకూ నేర్చు కోవాలని అనిపించింది.మేఘ ట్యూషన్ టీచర్ అనిత కి ఫోన్ చేసి అడిగాను.మా అఫ్ఫీస్ లో నే కోర్సెస్ స్టార్ట్ చేసాము అంది. ఐ.ఫై.యస్ వెళ్ళాక వల్ల బాస్ కి నన్ను పరిచయము చేసింది. నేను కంప్యూటర్ నేర్చు కోవలను కుంటున్నాను అని నా రిక్విర్మేంట్ చెప్పాను.అయన చాల హ్యాపీ అయ్యారు. నరేష్ బాబు ను పరిచయము చేసి శ్రద్దగా నేర్పమన్నారు.నా కు వక్కదాని కే క్లాసు తేసుకునే వాడు.ఎన్ని ప్రశ్నలు అడిగినా విసుగు లేకుండా వోపిక గా స్టెప్ బై స్టెప్ నేర్పాడు .చాల థాంక్స్ టు నరేష్.ఇంకా ఫోటో షాప్ అవి నేర్పుతమన్నాడు. నేర్చుకున్దమనే అన్కుంటున్నాను.సర్ కి,అనురాధ కి థాంక్స్.ఉష ఇంట్లో పార్టీ లో కంప్యూటర్ నేర్చు కున్నావు కదా ఇప్పుడు ఏమి చేస్తున్నావు అని రవి అడిగాడు.ఏముంది చేయటానికి అన్నాను.తెలుగు బ్లాగ్ ఓపెన్ చేయి కొద్దిగా కస్ట పడితే తెలుగు లో రాయవచ్చు.అని లింక్ పంపాడు.బిపు సహాయము తో బ్లాగ్ ఓపెన్ చేశాను.ఏమి రాయాలి?సంజు ఎదయన రాయి.అంది.అప్పుడే మా నలబయవ పెళ్లి రోజు వచ్చింది.ఆ రోజు అదితి కి పరిక్షలు వుండటము వలన, అను ఊర్లో లేక పోవటము వలన ఏమి ఫంక్షన్ చేయలేదు.సంజు,సతీష్,విక్కీ వచ్చి విష్ చేసి వెళ్లారు.అప్పుడు సంజు అడిగి న ప్రశ్న నీ స్వీట్ మే మో రేస్ ఏమిటి అన్నదాని కి జవాబు రాయవచ్చు కదా అనుకున్నాను.రాసానా? మొత్తం ఇంతేనా.ఇంకా వున్నాయి.కొన్ని మర్చి పోయాను.కొన్ని కొన్ని పదాలు రాయలేక పోయాను.ప్రయత్నం అయితే చేశాను. నా మధుర స్మృతు లను బయటి కి తీసు కు రావటాని కి సహాయము చేసిన రవి ,సంజు,బిపుల కు,చదివి ప్రోత్సా హించిన జయ,శ్రీదేవి,లకు,వారి భావాలూ పంచుకున్న అమ్మ, సత్య, లకు థాంక్స్. నాకు అన్నిటా ప్రోత్సాహము ,నాకు కూల్ ఫ్యామిలీ లో రవి లెటర్ కి జవాబు రాసి ఇచ్చేంత గా సహాయ ,సహకారము లు అందించే శ్రీవారి కి వందనాలు..మధురాను భూతి కి అంతం ఏముంది.ప్రతిది మధురమే.జీవితమే మధురమో ,రాగ సుధా భరిత మో,ప్రేమ కథా మధుర మో అన్కుంటూ వుండటమే.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
inka nerchukovaali anukuntunnaara inka endhuku late nerchukondi
Post a Comment