Thursday, December 30, 2021
Sunday, December 19, 2021
Thursday, December 9, 2021
Wednesday, December 8, 2021
Sunday, December 5, 2021
Friday, December 3, 2021
Sunday, November 21, 2021
Saturday, November 13, 2021
Thursday, November 11, 2021
ఏమని పొగుడుదునే
Sunday, November 7, 2021
Tuesday, November 2, 2021
Sunday, October 31, 2021
Thursday, October 28, 2021
Tuesday, October 26, 2021
#SHORTS GREENERY OF #MINNEAPOLIS BY MALAKUMAR
Sunday, October 24, 2021
#Shorts SNOW IN MINNEAPOLIS - Short video By Malakumar
Monday, October 18, 2021
Telugu Audio Kathalu | Facebook kathalu EP13 | వాలుచూపుల వయ్యారి | Telug...
Thursday, October 7, 2021
Sunday, October 3, 2021
Sunday, September 26, 2021
Sunday, September 19, 2021
Sunday, September 12, 2021
Thursday, September 9, 2021
#Telugu Audio Book| Blog kathalu EP:O2 Ganapatibaabaa ku modam modakam...
Sunday, September 5, 2021
Sunday, August 29, 2021
saampradaayaalu EP:01 మీరజాలగలడా Sahiti blog telugu kathalu Telugu Audio...
Thursday, August 26, 2021
saampradaayaalu వరలక్ష్మీ నమోస్థుతే Telugu Audio Books - telugu kathalu...
Monday, August 23, 2021
Face Book Kathalu EP06 - సహచరి Telugu Audio Books - telugu kathalu - pod...
Tuesday, August 17, 2021
Face Book Kathalu #EP#o5 మా మంచి మాష్టారు Telugu Audio Book telugu kath...
Monday, August 9, 2021
Face Book Kathalu EP:04 నొప్పింపక తానొవ్వక Telugu Audio Book podcast ...
Sunday, August 1, 2021
Face book kathalu EP: 03 High School Sweet Heart podcast by Mala Kumar
Tuesday, July 27, 2021
Facebook Kathalu Podcast by Mala Kumar | E0 2 Mount Rushmora lo Radhamad...
Monday, June 21, 2021
Friday, June 11, 2021
Friday, May 28, 2021
Anaganaga Oka Katha By Mala Kumar | EP 21 కథా రచయిత్రి శ్రీమతి పెయ్యేటి...
Sunday, May 23, 2021
Tuesday, May 18, 2021
స్నేహితురాలికి లేఖ
Monday, May 17, 2021
Friday, May 14, 2021
Nee Jathaga Nenundaali | Kathaa maala Podcast by Mala Kumar | E11 - విధి...
Tuesday, May 4, 2021
Nee Jathaga Nenundaali | Kathaa maala Podcast by Mala Kumar | E10 - గుం...
Sunday, May 2, 2021
థాంక్ యు

Saturday, May 1, 2021
డబ్బులోయ్ డబ్బులు . . . . . 4

Friday, April 30, 2021
డబ్బులోయ్ డబ్బులు ??? 3

1971/ 1974 మూడు సంవత్సరాలు మా ఏమండి షిలిగురి (బంగ్లాదేశ్ యుద్దం సమయం లో, యుద్దం అయిపోయి పీస్ ఆయ్యాక క్వాటర్స్ కట్టి ఇచ్చారు. అప్పడు నేనూ వెళ్ళి
ఒక సంవత్సరం ఉన్నాను) ఉన్నారు. నేను మా అత్తవారింట్లో హైదరాబాద్ లో ఉండి, రెడ్డి ఉమెన్స్ కాలేజ్ లో బి.యే చదువుతున్నాను. కాలేజ్ పక్క సందులోనే మా
ఇల్లు. అప్పుడు మాకు కాలేజ్ గేట్ మూసేసేవారు. ఎందుకంటే కాలేజ్ చుట్టూ బోలెడు సినిమా థియేటర్ లున్నాయి. అందులో పాత
తెలుగు సినిమాలు మార్నింగ్ షో లు 10.30/ 11 గంటలకు వేసేవారు.
పిల్ల పోరగాళ్ళు సినిమాలకు పోయి
చెడిపోతారని గేట్ మూసేవారు. మార్నింగ్ షో టైం అయిపోయాక 11.30 తరువాత గేట్ తెరిచేవారు. అయితే మా అమ్మాయి పసిపిల్ల నేను ఫీడ్ చేయాలని
బయటకు వెళ్ళేందుకు పర్మిషన్ తీసుకున్నాను. అప్పుడే మా రెండో ఆడపడుచు పది
పరీక్షలయిపోయి కాలేజ్ లో చేరేందుకు అడ్మిషన్స్ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో ఉంది. నేను
మా అమ్మాయి పేరు చెప్పుకొని బయటకు వచ్చి, ఫీడ్ చేసి మా
ఆడపడుచును తీసుకొని సినిమాకెళ్ళేదానిని. అప్పటికి మా ఫ్రెండ్స్ గేట్ తీయగానే
వచ్చేవారు. కొంచం సినిమా అయిపోతే ఏమవుతుందిట :) మా మామగారికి సినిమాలకు వెళ్ళటమంటే
ఎలర్జీ మస్త్ కోపం వచ్చేది. ఎవరైనా వెళుతున్నారని వాసన వచ్చినా ఇంటి గేట్ తాళం
వేసేవారు. అప్పుడు ఏమండి నా ఖర్చుల కోసం నెలకు 50 రూపాయలు
పంపేవారు. ఆ రూపాయలు ఎలా సద్వినియోగం చేసానో సరదాగా మీకు చెబుదామని పోస్ట్
చేస్తున్నాను :) ఈ బాక్ గ్రౌండ్ తో చదవండి :)
నీకేమమ్మా? మీ ఆయన నెలకు 50 రూపాయలు పంపిస్తారు. హాయిగా నెలకో చీర 15 రూపాయలదీ కొనుక్కుంటావు , 20 రూపాయలైనా కొనగలవు. వారాని కో సినిమా చూడగలవు. మమ్మలినీ సినిమా కు
తీసుకెళ్ళొచ్చుకదా, సుదర్షన్ వాడు ఆడవాళ్ళకు 50 పైసలకే టికెట్ పెట్టాడట. ముందుగా వెళుతే టికెట్ దొరుకుంతుంది అని
స్వర్ణ నస పెడుతుంటే, సరే లే నేను ఇంటికెళ్ళి, అత్తయ్యగారికి చెప్పి, విజయను తీసుకొని వస్తాను, నువ్వు ముందు పదా అన్నాను. సినిమా ప్రోగ్రాం వాసన గట్టి జుబేదా, లలితా వాలి పోయారు. చేసేదేముంది. వాళ్ళనూ రమ్మన్నాను. ఇంతలో రెష్మీ, సుష్మ చేరి
పోయారు. పైగా వాళ్ళెళ్ళేటప్పుడు నన్ను జమురూధ్
తీసుకెళుతానని బేరం పెట్టారు. వరండా లోనే మామయ్యగారు ప్రత్యక్షం! “అప్పుడే వచ్చేసావు కాలేజ్ లేదా? “ అనగానే లేదండి సంజును చూసి వెళుదామని వచ్చాను అని చెప్పి చిన్నగా
లోపలికి జారుకొని, అత్తయాగారికి సినిమా ప్రోగ్రాం
గురించి రహస్యం గా (అనుకున్నాను) చెప్పి విజయను రమ్మని బయటపడ్డాను. తిరిగి ఇద్దరమూ
విడి విడి గానే ఇంటికి వచ్చాము. అమ్మయ్య నాలుగు రూపాయల్ తో ఫ్రెండ్స్ కి సినీమా
పార్టీ ఇచ్చి, వాళ్ళ బారినుండి తప్పించుకున్నాను .
మామయ్యగారి కంట పడకుండా కూడా తప్పించుకున్నాను . ఎంత తెలివో కదా !!!!
" అమ్మాయ్ నీ దగ్గర 10 రూపాయలున్నాయా?" అని మామయ్యగారు అడుగగానే వున్నాయండి అంటూ తీసుకెళ్ళాను . అవి తీసుకొని నాతో రా అని, ఇంటికి దగ్గర లో వున్న , కోపరేటివ్ బాంక్ కు తీసుకెళ్ళి , ఎకౌంట్ ఒపెన్ చేయించి , ప్రతినెలా, అందులో పది రూపాయలు డిపాజిట్ చేసి తనకు చూపించమని ఆర్డర్ పాస్ చేసారు. అది సినిమా మహత్యం . హూఊఊఊఊఉం . వచ్చే 50 రూపాయల లో 10, మా అత్తగారికి పాకెట్ మనీ ఏమండి బదులు నేనివ్వాలి. అది మా వారి హుకు . 10 ఇండియన్ బాంక్ లో, పది కోపరేటివ్ బాంక్‌లో కట్టాలి. అది మామగారి ఆర్డర్. 10 నా బ్లాక్ మనీ కింద అత్తగారి కివ్వాలి. అది అత్తగారి ఆజ్ణ. ఇక మిగిలినవి పది రూపాయలు . దానిలోనే నా చదువు, సినిమాలు , బట్టలు, మా అమ్మాయి ఖర్చు అంతా వెళ్ళాలి . మర్చేపోయాను, పైన కనిపిస్తుందే ఓ పెట్టి , అది మా అత్తగారు నేను నా వైట్ మనీ దాచుకోవటానికి ఇచ్చారు. ఆ బొట్టుపెట్టె, మా అత్తగారికి, ఆవిడ మూడో అన్నయ్య పెళ్ళి లో ఇచ్చారట. ఆ పది రూపాయలు అందులో పెట్టుకునే దానిని . ప్రతి నెలా మావారు 50 రూపాయల చెక్ పంపగానే, విజయను తోడు తీసుకొని ఆబిడ్స్ లోవున్న గ్రిండ్లే బాంక్ కు వెళ్ళి తెచ్చుకోవటమూ, సాయంకాలము లోపల ఎక్కడివక్కడ పంచేసి , మిగిలిన పదిరూపాయలకు బడ్జెట్ వేసుకోవటము, ఆ పది రూపాయలు ఖర్చైపోతే నెల ఎలా గడుపుకోవాలి అని ఖర్చు పెట్టటానికి అసలు ప్రాణమే వొప్పేదికాదు . పైగా అరటిపండ్లు , చారాణా ( 25 పైసలు ) కో డజన్ అంటే నై , నై బారాణా ( డెబ్బై ఐదు పైసలు ) కో దేవో అని చాలా బేరమాడి, బండి వాడిని మొహమాట పెట్టి , బారాణా కు పండ్లు కొన్న ఘనచరిత్ర తో, ఏమైనా కొనాలన్నా సరిగ్గా కొంటున్నా నా లేదా అనే అనుమానమొకటి. తెగ పిసినారినై పోయాను. దాని లో కూడా ఐదు రూపాయిలు ఆ పెట్టెలో, ఇంకో ఐదు రూపాయలు నా బట్టల పెట్టెలో నా సొంత బ్లాక్ మనీ దాపరికం.
సందడిలో సటాకు అన్నట్లు, మా మరిదిగారు వదినా మీరు
అన్నయ్య చెక్ కోసం ఎదురుచూడటమెందుకు? అది జాయింట్
ఎకౌంట్ కదా అన్నారు. హన్నా ఇన్ని రోజులు నాకు తెలియదే ఈ సంగతి. ఎంత కుట్ర అనుకొని ఏమండి
సెలవలో వచ్చినప్పుడు, అడుగుతే అంత దూరం ఎందుకులే, చిక్కడపల్లి లో
సిండికేట్ బాంక్ లో తీసుకో అని అక్కడ వున్న ఆయన అకౌంట్ మా జాయింట్ ఎకౌంట్
చేసేసారు. అప్పుడే ఐపోలేదు. ఓ నాలుగు సంవత్సరాల తరువాత . . . మేము సైనిక్ పురి లోఉన్నప్పుడు
ఓరోజు మామయ్యగారు ఒకాయనను వెంటపెట్టుకొనివచ్చి , స్టేట్ బాంక్ లో
కొత్తగా కిడ్డీ బాంక్ అని మొదలుపెట్టారు. ఇదిగో పిల్లలిద్దరి కోసం రెండు
తీసుకొచ్చాను. రోజూ చిల్లర డబ్బులు ఇందులో వేయి. మొదటి తారీకున ఈయన వచ్చి , వీటి తాళాలు తీసి
ఆ డబ్బులు తీసుకెళ్ళి పిల్లల ఎకౌంట్ లో జమ చేస్తాడు అని చెప్పారు. అదైందా ... ఓ పది సంవత్సరాల
తరువాత నా పార్లర్ కోసం లోన్ ఇస్తారని, బాంక్ ఆఫ్ బరోడా
లో కరెంట్ ఎక్కౌంట్ ఓపెన్ చేయించారు ఏమండి అదినూ మా మామగారి సలహా తో. ఆగండాగండి... వెళ్ళిపోకండి.
పూర్తి కహానీ వినండి. ఓసారి పార్లర్ కి
ఒకాయనను వెంట పెట్టుకొని మా మామగారు రాగానే నాకు ప్రమాద ఘంటికలు వినిపించనే
వినిపించాయి . ఇదిగో అమ్మాయ్ ఇతనూ రోజూ నువ్వు పార్లర్ మూసే సమయానికి వస్తాడు.
ఎంతో కొంత జమచేయి అంటూ నారాయణగూడా విజయా బాంక్ లో ఎకౌంట్ ఓపెన్ చేయించారు, కొన్ని
రోజులయ్యాక కాస్త ధైర్యం తెచ్చుకొని “మామయ్య గారు నాదగ్గర ఏమైనా
లక్షలు మూలుగుతున్నాయా? ఇన్ని బాంక్ ల లో ఎకౌంట్ లు
ఎందుకండీ?” అంటే , “లక్షలే కాదమ్మాయ్ పైసలు కూడా దాచాల్సిందే” అనేసారు. అంతటి తో ఐపోలేదు. మా అబ్బాయి సలహా తో, మా కోడలు మా
ఇద్దరి పేరు మీద , ఆంధ్రా బాంక్ లో జాయింట్ ఎకౌంట్
ఓపెన్ చేసింది . ఇప్పటికి ఎన్ని బాంకుల పేరులు చెప్పాను? గుర్తు
పెట్టుకున్నారా లేదా ???
ఓ ఐదారు సంవత్సరాల కిందట అనుకుంటాను, ఒక రోజు అన్ని
బాంక్ లకు వెళ్ళి ఎకౌంట్స్ అన్ని క్లోజ్ చేసాను . పాపం అందరూ ఎందుకు మేడం క్లోజ్
చేస్తున్నారు. కావాలంటే మా శ్రీనగర్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము అని తెగ
బతిమిలాడారు! ఈ ప్రక్రియ లో కాచిగూడా ఇండియన్
బాంక్ కనపడనే లేదు. అది ఎప్పుడో ఎక్కడికో షిఫ్ట్ చేసేసారట! అందుకే మా అత్తగారిలాగా
నాకూ బాంకుల మీద నమ్మకం లేదు. అందుకే నా వైట్ మనీ మా అత్తగారిచ్చిన పెట్టిలోనూ
బ్లాక్ మనీ . . . . . . లోనూ దాచుకుంటాను. అంతెందుకు ఈ మద్య తెలంగాణా
గొడవలలో ఏ .టి .యం లు కూడా పనిచేయనప్పుడు, ఏమండి, మా అబ్బాయి నా అలమారాకి కన్నం
వేసారు . నా అలమారాలో హీన పక్ష్యం లక్ష రూపాయలైన వుంటాయని మా బిపు ప్రగాఢ నమ్మకం.
నేనే అవాక్కయ్యేట్టుగా అక్షరాలా లక్ష రూపాయలు నా అలమారాలో బయట పడ్డాయి! అప్పుడు
అచ్చం మా మామగారిలా మాఏమండి "నీ దాపరికం తగలెయ్యా! ఇంట్లో
ఎవరైనా ఇన్ని డబ్బులు ఉంచుకుంటారా? అసలే చిన్నపిల్లల్లిదరితో ఒక్కదానివే ఉంటావు" అని కోపం చేసి నా డబ్బులన్నీ తీసేసుకున్నారు అయ్యాకొడుకులు నా డబ్బులన్ని
తీసేసుకున్నారు అని నేను గొడవపెడుతుంటే అందుకే మనీ ఎప్పుడూ ఇంట్లో వుంచకూడదు ఆంటీ, ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయాలి అని మాకోడలు సలహా ఇచ్చింది. ఆ తరువాత
వడ్డీ పదివేల తో సహా బాంక్ లో డిపాజిట్ చేసి, ”జాయింట్ ఎకౌంట్ లో ఉంటే నేను తీసుకుంటానని నీ అనుమానం కదా అందుకే
నీకు విడిగా నీ డబ్బులతో నీ పర్సనల్
ఎకౌంట్ ఓపెన్ చేసాను తల్లీ దాచుకో" అని పాస్ బుక్, చెక్ బుక్ చేతికిచ్చారు ఏమండి. కాకపోతే నేనెపుడూ నా పర్సనల్ ఎకౌంట్ లో నుంచి తీసి వాడను మా
జాయింట్ ఎకౌంట్ వే వాడుతాను. అంతే గా మరి!
"ఇల్లన్నాక, పిల్లలున్న చోట ఓ పది రూపాయలూ, ఒక మనిషి అన్నము వుండాలి " అన్నది మా అత్తగారు చెప్పిన మాట.
ఎంతైనా అత్తగారి మాట పట్టుచీరల మూట కదా!!!
కొస మెరుపు: నా డిగ్రీ పూర్తికాగానే, స్టేట్ బాంక్ లో పని చేసే మాఏమండి ఫ్రెండ్ కాప్టెన్. నగేష్ , “నారాయణగూడా లో స్టేట్ బాంక్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. మాలా కు ఉద్యోగం ఇస్తాము. పంపుతారా?” అని మా మామగారిని అడిగారు. కాని పిల్లలు చిన్నవాళ్ళని , మావారికి పీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ అవుతే వెళ్ళాలి కదా అనీనూ నేను వుద్యోగం లో చేరలేదు . అలా బాంక్ వుద్యోగం కూడా వచ్చిందన్నమాట! చేయక పోయినా అప్పుడప్పుడు మాఏమండిని సాధించటానికి మాత్రము పనికి వస్తోంది!!!
సరే మరి . వచ్చే వారం కలుసుకుందాము. ఏమిటీ ఇంకా వుందా అంటే
వుండదేమిటి మనీ నా మజాకా? వచ్చేవారం, ఇదే రోజు డబ్బుల
గురించి మరి కాసిని కబుర్లు. అందాకా సెలవు.
(సశేషం)
డబ్బులోయ్ డబ్బులు # # # # # 2

డబ్బులోయ్ డబ్బులు- ##2
మా మామగారికి నా షాప్పింగ్ మీద బొత్తిగా నమ్మకం లేదు. దానికి
తగ్గట్టుగా నే , కూరగాయల
రాజమ్మ దగ్గరి నుండి , బియ్యం కిరాణా దుకాణదారు వరకు నాకొక
ధర, మామయ్యగారికొక ధర చెప్పేవారు. కూరగాయల రాజమ్మ, నాకు రూపాయన్నర కిలో చెబితే, రూపాయకి బేరమాడే
కొనేదానిని. మామయ్యగారికేమో అదే కూర రూపాయి ముప్పావలాకి చెప్పి, అర్ధ రూపాయకి ఇచ్చేది. అదేమిటి రాజమ్మా అంటే పెద్దయ్య ఎట్లాగూ
బేరమాడుతాడని రూపాయి ముప్పావలా చెప్పాను అనేది. మరి అర్ధరూపాయకే ఇచ్చావుకదా అంటే
ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి చెప్పకుండా తప్పించుకునేది. బియ్యం వాడూ అంతే! నాకు
రెండురూపాయలకు కిలో ఇస్తే, మా మామగారికి రూపాయన్న రకే
ఇచ్చేవాడు. అదేమిటో నామటుకు నేను చాలానే బేరమాడే దానిని . హూం!
ఓసారి ఏమైందంటే, మాఏమండి ఓ పనివాడి ని
తీసుకొచ్చారు. ఏమండి ఎవరిని పనికి పెట్టుకున్నా, వాళ్ళకి
డిప్ప కట్టింగ్ చేయించేస్తారు. అలా కట్టింగ్ చేయించుకోని వాడికి ఉద్యోగం ఇచ్చే
మాటే లేదు. సరే ఈ సారి ఆయనకు తప్పనిసరిగా
వూరెళ్ళాల్సిన పని వచ్చి, పనివాడు శంకర్ కి కట్టింగ్
చేయించమని, నాకు రూపాయిచ్చి, పైగా చెప్పారు, నాన్నకు తెలీకుండా తీసుకెళ్ళు. నాన్నకు తెలిస్తే నారాయణగూడా బ్రిడ్జ్ మీద చారాణా కే
చేయించుకొస్తానంటాడు అని చిలక్కు చెప్పినట్టు మరీ చెప్పెళ్ళారు. తప్పేదేముంది అలాగే
వైయంసి దగ్గర, ఏమండి చెప్పిన నైస్ హేర్ కట్టింగ్ సెలూన్ కే
తీసుకెళ్ళాన . అతనూ పాపం నాకు చాలా
మర్యాదలు చేసి, మేజర్ గారి కాండిడేట్ కదమ్మా. నాకు తెలుసు ఎలా కట్టింగ్ చేయాలో అని నైస్ గా డిప్ప కట్టింగ్ చేసేసాడు.
హమ్మయ్య ఏమండి చెప్పిన పని చేసాను అని నిట్టూర్చినంతసేపు పట్టలేదు. నా నిట్టూర్పు మధ్యలో ఆగిపోవటానికి . "పనివాడికి సెలూన్ లో కట్టింగా?
రూపాయి పెట్టా? పైగా నువ్వు తీసుకెళ్ళావా?
నేనింట్లోనే వున్నాగా? నాకు చెప్పొచ్చుగా?
నారాయణగూడ బ్రిడ్జ్ మీద పావలా కే చేయించుకొచ్చేవాడిని . నీకు,
నీ మొగుడికి బొత్తిగా డబ్బులంటే లక్షం లేకుండా పోతోంది" అని
ఇంకా హాట్ బూట్ గా మా మామగారు క్లాస్ పీకేసారు. అదే సమయములో, మా మామగారికి తెలిసిన ఒకాయన వచ్చి, కాచిగూడా లో
ఇండియన్ బాంక్ బ్రాంచ్ పెట్టారని, దానికి వాళ్ళ అబ్బాయిని మేనేజర్ గా వేసారనీనూ, మీ
కెవరైనా తెలిసిన వాళ్ళుంటే, అక్కడ ఖాతాలు ఓపెన్ చేయించండి
అని ప్రాధేయ పడ్డాడు. ఇంకెవరో ఎందుకు మా పెద్దకోడలి తోనే చేయిస్తానని, నాతో అక్కడ ఎకౌంట్ ఓపెన్ చేయించి, ఇక పైన ఇలాంటి
పనికి మాలిన దండగ ఖర్చులు చేయొద్దని, ఏమైనా ప్రతినెల ఆ ఎకౌంట్లో పది
రూపాయలు వేసి, ఆయనకు చూపించాలని స్ట్రిక్ట్ వార్నింగ్
ఇచ్చారు.
మా మామగారికి నమ్మకస్తులు మా
తోడికోడలు , మా అబ్బాయి. తోడికోడలు కుడిచేయైతే, మా అబ్బాయి ఎడంచేయి. రామయ్య ఎడమ
కాలు . (మరి ఇంకో చేయి వుండదుగా. అందుకని కాలన్న మాట.) ఆయన
బజారుకు వెళ్ళలేక పోతే, ఈముగ్గురిలో ఎవరితోనైనా
తెప్పిస్తారన్నమాట. వీళ్ళూ బేరమాడటములో మా
మామగారి వారసత్వం పుణికి పుచ్చుకున్నారు. ఇక తాతా మనవడు ఏదైనా కొనటానికి
వెళ్ళారంటే, చిక్కడపల్లి , సుల్తాన్
బజార్, కోటీ అన్నీ తిరిగి, అదీనూ
నడుచుకుంటూ ఓ రూపాయి తక్కువకే తెచ్చుకుంటారు. ఓసారి మంచం నవారు కొనటానికి హోల్ మొత్తం హైదరాబాద్ ఆబిడ్స్ తప్ప తిరిగారు . ఆబిడ్స్ లో అంతా మోసగాళ్ళన్నమాట.
అందుకని అటెళ్ళరు.
అలా పొదుపు చేసిన డబ్బులు ఏ బాంక్ లో ఎన్ని నెలలకు యఫ్ . డి వేస్తే
ఎంత వడ్డీ వస్తుంది అన్నది ఆయనకు కరతామలకం. కోపరేటివ్ బాంక్ , బాంక్ ఆఫ్ బరోడా కు ప్రతిరోజూ వెళ్ళొస్తూ వుండేవారు. నా దగర 100 రూపాయలు జమ అయ్యాయంటే వాటిని ఏదో ఒక విధం గా యఫ్. డీ చేసేసేవారు. ఆ
పేపర్లన్ని ఆయన పేపర్ల తో పాటు ఒక రేకు పెట్టెలో వుంచి, దానిని
మంచం కింద వుంచేవారు. తెల్లవారుఝామున లేవగానే బర్ర్ర్ర్ర్ర్ మంటూ ఆ పెట్టిని మంచం
కిందనుండి లాగి, ఓ గంట సేపు ఆ పేపర్లు అన్నీ తిరగేసేవారు. ఇక
డబ్బులేమో ఆ పైన కనిపిస్తుందే ఆ కోట్ లో దాచేవారు. అందులో అన్నీ ముఖ్యమైనవి
వుంచేవారన్నమాట. అలా దాపుడు కే కాని ఆ
కోట్ ఆయన ఎప్పుడూ వేసుకోగా నేనైతే చూడలేదు. అది ఆయన పర్సనల్ బాంక్ అన్నమాట. మా
అత్తగారు డబ్బులు అడగగానే ఎందుకు ఎంత అని సవాలక్ష ప్రశ్నలు వేసి, నువ్వు జమిందారిణివే. నీకూ , నీ
పెద్ద కొడుకుకు (పెద్ద కొడుకంటే ఇంకెవరు మా ఏమండీనే!) డబ్బు విలువ తెలీదు అనేసి, ఆ కోట్ లోనుండి తీసి ఓ
పదిసారులు లెక్కపెట్టి మరీ ఇచ్చేవారు. పాపం అంటమే కాని ఎప్పుడూ ఇచ్చేందుకు లోటు
చేయలేదు.
మా అబ్బాయి అక్షరాలా తాత పోలికే! అరిచి ఘీ పెట్టినా వాడి దగ్గరనుంచి
ఓ పైసా రాలదు. ఏమండి వాడిని "చిన్న కిషన్ రావ్" అని , "డబ్బులుగా" అని ముద్దు ముద్దుగా పిలుచుకుంటారు.
అలా , అలమారాలో డబ్బులు దాచటము, మా అత్తగారి దగ్గర నేర్చుకుంటే, కొద్దో గొప్పో ఎలా సేవ్ చేయాలి, ఆ డబ్బును బాంక్ లో
ఎలా దాచాలి అన్నది మా మామగారి దగ్గర నేర్చుకున్నాను. మా అత్తగారు చెప్పినప్పుడు నా కళ్ళు అలా చుక్కల్లా మెరిసాయి. అందుకని ఆవిడ
గురించి రాసినప్పుడు చుక్కలు పెట్టాను. మా మామగారు చెప్పినప్పుడు ఒక ప్లస్ కాదు
రెండు ప్లస్ లు కనిపించాయి అందుకని రెండు ప్లస్‌లు పెట్టాను. ఇక నేనెంతవరకు
నేర్చుకున్నాను, ఎంతవరకు దాచుకున్నాను, ఎలా బేరాలాడాలి (ఐనా మా మామగారికి
నాకు బేరాలాడటము రాదనే ప్రగాఢ విశ్వాసము
వుండేది. కొన్ని సారులు నిజమే నేమో నని నాకూ అనిపిస్తుంది సుమీ) అని చెప్పేదానికి
ఏమి గుర్తులు, ఎక్కడా
అని దీర్ఘం వద్దు టైటిల్ దగ్గర ఆలోచించుకొని, ( ఓవేళ
మీరేమైనా సూచిస్తే ) ఆ గుర్తుల తో, నా దాపరికపు అనుభావాల తో,
వచ్చే వారం, ఇదే రోజు, ఇదే
సమయానికి, ఇదే బ్లాగ్ లోకి వస్తాను. అంతవరకు సెలవా మరి.
(సశేషం)