Sunday, August 1, 2021

Face book kathalu EP: 03 High School Sweet Heart podcast by Mala Kumar

ఇప్పటి వరకూ నా ప్రభాతకమలం లో "ఏమండి కథలు," "కమలీ(నీ)యం" నా చిన్ననాటి కథలు, వివిధ అంశాల మీద నేను రాసిన "నీ జతగా నేనుండాలి లొని కథామాల" కథలు విన్నారు. లాస్ట్ ఎపిసోడ్ నుంచి నా ఫేస్ బుక్ కథలు వినిపిస్తున్నాను. అవేమిటంటే... నేను సంవత్సరం క్రితము ఫేస్ బుక్ లోని వివిధ కథల గ్రూప్ లల్లో చేరాను. ఆ గ్రూప్ లల్లో వివిధ అంశాల మీద కథ రాయమంటారు. అంటే ఒక చిత్రమో, ఒక పదమో, ఒక వాక్యమో, లేదా కొద్ది కథనో ఇచ్చి, దానికి సరిపోను కథ రాయమంటారు. అదీ వారు చెప్పినన్ని పదాలల్లోనే మొత్తం కథను, భావము, కంటిన్యుటీ చెడకుండా రాయాలి. వర్ణలూ, ఉపోద్ఘాతాలూ, వివరణలూ వగైరా వగైరా లేకుండా మినీ కథలల్లోనే మొత్తం చెప్పేయాలన్నమాట. సో ఇదేదో బాగానే ఉందని నేనూ రాస్తున్నాను. అలా రాసినవే నా ఈ ఫేస్ బుక్ కథలు. ఈరోజు నేను వినిపించబోయే కథ 'వివాహబంధం' గురించి "పొన్నాడవారి పున్నాగవనం" గ్రూప్ లో, శ్రీమతి. వెలగపూడి భారతిగారు నిర్వహిస్తున్న "చిన్నారి పొన్నారి చిట్టి మందారాలూ - చిన్న కథలూ" లో నేను రాసిన "హై స్కూల్ స్వీట్ హార్ట్స్" కథ, ఇంకా దానిమీద భారతి గారు చేసిన సమీక్ష. మరి కథ విని మీ అభిప్రాయం కూడా చెపుతారు కదూ ఈ వీడియోకు ఇంకో విశేషము కూడా ఉంది. అదేమిటంటే దీని మీకు తెలుసుగా రచన, వాయిస్ నావేనని, ఇంకా కవర్ పేజ్, ఆడియో ఎడిటింగ్, వీడియో మిక్సింగ్, యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి, పోడ్ కాస్ట్ చేయటమూ అన్నీ నేనే చేసాను. దాదాపు నెలరోజులుగా ఇవన్నీ చేయటము నేర్చుకుంటున్నాను. నా వీడియో ఫ్రెండ్ Ramya Vuddanti మీరు నేర్చుకుంటారు, మీరు చేయగలరు అని నన్ను ప్రోత్సహించి, స్కైప్ లో బేసిక్ నేర్పించి, యూట్యూబ్ లోని ట్యుటోరియల్ వీడియోల లింక్స్ ఇచ్చింది. రమ్య స్కైప్ క్లాస్, నోట్స్, యూట్యూబ్ లోని ట్యుటోరియల్ క్లాస్ ల వీడియోలూ చూస్తూ ప్రాక్టీస్ చేసి, పోయినసారి వీడియో రమ్య సహాయముతో, ఈ సారి వీడియో పూర్తిగా స్వయంకృషితో పోడ్ కాస్ట్ చేసాను. ఇంకా ఆడియో ఎడిటింగ్ పూర్తిగా రాలేదు. మా పిల్లలు పరవాలేదు బాగుంది అని భరోసా ఇచ్చారు. ఇక ఇప్పుడు మీరు విని ఎలా చేసానో చెప్పండీ :) చిన్నారి టీచరమ్మ రమ్యకు ధన్యవాదాలు. https://www.youtube.com/watch?v=btkrKItYTv0

No comments: