Tuesday, August 17, 2021
Face Book Kathalu #EP#o5 మా మంచి మాష్టారు Telugu Audio Book telugu kath...
నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం.
కరోనా వచ్చినప్పటి నుంచి ప్రపంచమంతా ఇంటి నుంచే పని చేస్తోంది కదా. సాఫ్ట్ వేర్ వాళ్ళకు ఎలాగూ వర్క్ ఫ్రం హోం అలవాటే కానీ ఒక్క పనివాళ్ళు తప్ప మిగితా అందరూ వర్క్ ఫ్రం హోమే. పాపం దానితో ఇంటి ఇల్లాలికీ, ఆమెతోపాటు ఇంటిల్లిపాదికీ పనే పని. బళ్ళు తెరిచాకా ఆన్ లైన్ క్లాస్ లొకటి. వాటితో ఇంట్లోని పెద్దవాళ్ళందరూ పిల్లలతో పాటు మళ్ళీ బళ్ళో చేరాల్సి వచ్చింది. ఎన్ని తిప్పలో కదా! వీటి మీద బోలెడు కథలూ, జోకులూ వస్తున్నాయి పనిలోపని మీరూ ఆన్ లైన్ క్లాస్ ల మీద ఓ కథ రాసేయండి అన్నారు ఫేస్ బుక్ లోని, పొన్నాడవారి పున్నాగవనం గ్రూప్ కథల నిర్వాహకురాలు భారతిగారు. నాకు తెలుసు ఇలాంటి అవసరం ఎప్పుడో వస్తుందని. అందుకే మామేనకోడలు హరిణి వాళ్ళ అబ్బాయి శ్రేయాన్స్ ఆన్ లైన్ క్లాస్ టీచర్ గురించి, ఆ క్లాసుల గురించి మా ఫామిలీ గ్రూప్ లో చెప్పిన విషయము నక్షత్రం వేసి దాచుకున్నాను. గ్రూప్ లో టాస్క్ రాగానే దాని మీద సమాచార సేకరణ మా హరిణి దగ్గర చేసి ఇదో ఈ కథా రాసేసాను. నేను అడిగిన ప్రశ్నలన్నింటినీ ఓపికగా సమాధానాలిచ్చిన హరిణికి థాంకూలూ, వారి పేర్లు, వారి ఫొటో నా కవర్ పేజ్ కోసమూ, కథ కోసమూ వాడుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన బుజ్జిగాళ్ళు శ్రేయాన్స్, ఆయాన్స్ లకు బోలెడు హగ్స్, ఆశీర్వాదాలు.
అయ్యో అన్నట్లు కథపేరు చెప్పలేదు కదూ. కథ పేరు "మా మంచి మాష్టారు."
ఇక కథ, ఆ కథకు భారతిగారి సమీక్ష వినండి మరి.
మా మంచి మాష్టారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment