Monday, August 9, 2021

Face Book Kathalu EP:04 నొప్పింపక తానొవ్వక Telugu Audio Book podcast ...

నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం. ఇప్పుడు నేను ఫేస్ బుక్ కథలు చెపుతున్నాను కదా. ఈ రోజు నేను చెప్పబోయే కథ "నొప్పింపక తానొవ్వక" ఫేస్ బుక్ కథల గ్రూప్ లో రాసింది. ఈ కథ కొంత వరకూ ఎడ్మిన్స్ ఇచ్చారు. ఆ కథకు కొనసాగింపు మనం రాయాలన్నమాట. అదీ 400 పదాలల్లో. ఈ టాస్క్ పేరు కథ మాది- ముగింపు మీది. సరే వారిచ్చిన కథకు సరిపోయేట్టుగా రాయాలంటే కాస్త ఆలోచించాలిగా. పైగా నాకు నేను పెట్టుకున్న నియమం ప్రకారము నేను విషాదము కానీ, నెగిటివ్ మెసేజ్ వచ్చేట్లుగా కానీ, కాంట్రవర్సియల్ గా కానీ రాయకూడదు. ఈ కథలో ఒకే ఒక్క పాయింట్ చుట్టూ నా ఆలోచనలు తిరిగాయి. అదేమిటంటే భర్త చనిపోతే, శారద పిల్లలను చక్కగా పెంచి, ప్రయోజకులని చేస్తుంది. వాళ్ళు బాగానే సెటిల్ అవుతారు. కానీ తను రిటైర్ అయ్యాక గోల్డేజ్ హోం లో ఉంటుంది. ఇక ఇంకో వాక్యము జానకి తో మాట్లాడేటప్పుడు, "అదేంటీ!? నువ్వు ఓల్డేజ్ హోంలో ఉన్నావా!?" పట్టలేని ఆశ్చర్యంతో శారదవైపు చూస్తూ అంది జానకి. "అవును!? ఏం!? అయినా...! అక్కడ చాలా సౌకర్యంగా ఉంటుంది. నువ్వూ ఒంటరిగానే ఉంటున్నావని అడిగాను!?" చప్పబడిన ఉత్సాహం జానకికి దొరకనివ్వకూడదనే ప్రయత్నం చేస్తూ, చిన్నగా తన చేతులు వెనక్కు తీసుకుంది శారద." శారద ఓల్డేజ్ హోం లో ఎందుకుంది? చేయి ఎందుకు వెనకకి తీసుకుంది? ఈ రెండూ పాయిట్స్ ను హైలైట్ చేస్తూ నెగిటివ్ ఆలోచన రాకుండా పాజిటివ్ గా చూపించాలి. చాలా ఆలోచించాను. ఒకానొక సారి శారద గురించి ఎందుకు, జానకి గురించి రాయొచ్చుగా అని కూడా అనుకున్నాను. కానీ మనసొప్పలేదు. ఇక అమెరికాలో ఉన్నట్లుగా ఎందుకు రాయాలి? ఇండియాలో ఉన్నట్లుగానే రాయవచ్చుగా అంటే, ఇండియాలో ఉండేవాళ్ళు ఉంటున్నారు కానీ అమెరికాలో పిల్లలు ఉన్న పేరెంట్స్, అమెరికా వెళితే పిల్లలతోనే సద్దుకొని ఉండాల్సివస్తోంది ఇప్పటి వరకు. అలా కాకుండా అమెరికాలోనే సిటిజన్ సెంటర్ లో ఉన్నట్లు రాస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనే ఈ కథకు రూపం. అదో చాలెంజ్ గా తీసుకొని రాసాను. మరి మీరూ విని ఎలా రాసానో చెపుతారుగా. ఇక కథ వినండి. నా కథ, నా ఛానల్ మీకు నచ్చుతే సబ్స్క్రైబ్ చేయటమూ, షేర్ చేయటమూ మర్చిపోకండీ. సబ్స్క్రైబ్ చేసి ఉంటే ధన్యవాదాలు :) నొప్పింపక తానొవ్వక

No comments: