Thursday, September 30, 2010

వయసై పోతోందా ?????




చాలా సీరియస్ గా ఓ కొత్త పోస్ట్ రాద్దామని ఆలోచిస్తూ వున్నాను . ఇంతలో టింగ్ అని వినిపించింది . ఎవరా అని చూస్తే జ్యోతి గారు . మీ సెల్ నంబర్ ఎంత? అని అడిగారు . నేను నా నంబర్ ఇచ్చి మళ్ళీ అలోచనలో పడ్డాను . సడన్ గా గుర్తొచ్చింది , ఇంతకీ నా నబర్ ఎందుకడిగినట్లు ? అందుకే ????? ఇలా మార్క్ చేశాను . మీ తో ఒకావిడ మాట్లాడుతుంది అని జవాబు వచ్చింది . ఎవరు అన్నట్లు మళ్ళీ ????? పెట్టాను , మీకుతెలీదు . ఎవరావిడ ? అని క్లుప్తం గా అడిగా . నాకు తెలుసు ? అన్నారు . మరి నాకు తెలియక్కరలేదా ? నాకు తెలీకుండా ఎలా మాట్లాడుతుంది ? అని అడుగుతే నో జవాబు . ఎవరబ్బా ? నాకు పెళ్ళికావలసిన పిల్లలూ లేరు వున్నవాళ్ళు చిన్న వాళ్ళు , ఇంకేమి మాట్లాడుతుంది ఆవిడ ? ఊమ్హూ నో జవాబు . ఎన్ని క్వెషన్ మార్కులకూ నో జవాబు ? హేమిటీ నేనేమైనా సస్పెన్స్ త్రిల్లర్ సినిమా చూస్తున్నానా ? నాపాటికి నేనేదో ఆలోచనలో వుంటే గిల్లి , ఈ మౌనం ఏమిటి ? అసలు మిమ్మలిని కాదు నన్ను నేను అనుకోవాలి , మీరు అడగ్గానే వెంటనే నా నంబర్ ఇచ్చాను చూడండి అంతే అంతే అని అరిచాను . అబ్బే నో రిప్లై . ఈ జ్యోతి కంటే దుర్మార్గులు ఇంకెవరూ ఈ ప్రపంచము లో లేరు హుం అనుకొని వూరుకున్నాను . అంతకంటే ఇంకేం చేయగలను ?

మరునాడు సాయంకాలము ఓ కొత్త నంబర్ రింగ్ అయ్యింది . బహుషా జ్యొతి చెప్పినావిడే మో అనుకుంటూ తీశాను . మాలా గారాండి అని అడిగారు . అవునండి అన్నాను . నేను ఈ టి వి 2 నుండి మాట్లాడుతున్నాను , నా పేరు రమాదేవి అని వినిపించింది . ఒక్క నిమిషం నాకేమీ అర్ధం కాలేదు . నాకు ఈటివి నుండి కాల్ రావటము ఏమిటి ? ఆవిడే , అక్టోబర్ ఫస్ట్ న సీనియర్ సిటిజన్స్ డే కదండి . ఆ రోజున , బాధ్యతలు తీరిన తరువాత మీరు మీ ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతున్నారు ? అనే విషయము మీద కొంతమంది మహిళల తో మాట్లాడుదామనుకున్నాము . మీరు చాలా ఆక్టివ్ గా వుంటారని జ్యోతి గారు చెప్పారు . రేపు ఉదయము మీరు రాగలరా ? అని అడిగారు . కాని నేనింకా సీనియర్ సిటిజన్ ని కాదండి అన్నాను . ఒక్క సంవత్సరమే కదా పరవాలేదు , మీరు మీ భాద్యతలు అన్నీ తీర్చుకున్నాక , మీ ఖాళీ సమయము ను ఎలా ఉపయోగించుకుంటున్నారో చెప్పగలరా ? అబ్బే ఏడాదెందుకండీ ? 8 నెలలో సీనియర్ సిటిజన్ ను ఐపోనూ !( అబ్బా అని రమాదేవి గారు తల పట్టుకున్న దృశ్యం నా కళ్ళ ముందు కనిపించింది ) వస్తానులెండి . కాని , ఏం మాట్లాడాలో నాకు తెలీదండి . ఐనా నలుగురి లో మాట్లాడలేను అన్నాను . మీరేమీ మాట్లాడకండి , మిమ్మలిని నేను పరిచయము చేస్తానుగదా అన్నారు . కానీయండి , నేనేమీ మాట్లాడకుండా వుంటే మావారు కోపం చేస్తారండి అని నా భయం చెప్పాను . మీకెందుకండి , మా దగ్గరి కొస్తే మీరే మాట్లాడుతారు చూడండి అని ఎక్కడికి రావాలో చెప్పారు .

ఎంతైనా జ్యోతి చాలా గుడ్ గర్ల్ . జ్యోతి కంటే మంచి అమ్మాయి ఈ భూప్రపంచము లోనే లేదు . వెంటనే జ్యోతి గారి కి ఫోన్ చేసి చెప్పాను . ఆ తరువాత , మా అమ్మాయికి , అబ్బాయి కి , అమ్మ కి , అబ్బ ఫోన్ల తో ఎంత బిజీ నో ! మా వారూ వూళ్ళో లేరు . చివరకు ఎలా గో దొరికించుకొని చెప్పాను . అందరూ వాళ్ళ వాళ్ళ సలహాలిచ్చారు . పొద్దున్నే , లక్ష్మి గారి తో కలిసి వెళ్ళాను . అమ్మయ్య లక్ష్మిగారున్నారు నాకు తోడు . అక్కడ మాకు ఆతిద్యమిచ్చిన లక్ష్మిగారి ఇల్లు ఎంత బాగుందో . చాలా మంది కొత్త స్నేహితులయ్యారు . అసలు ఎంచక్కా ఫ్రెండ్స్ ఇంట్లో , ఏదో పార్టీ లో కబుర్లు చెప్పుకున్నట్లుగా వుండిందేకాని ఓ టివి ప్రోగ్రాం లా లేదు . అన్నట్లుగానే రమాదేవి గారు చక్కని , స్నేహపూరితమైన వాతావరణం ఏర్పరిచారు . ఆంకరమ్మాయి హైమ మీరీ వయసులో అనగానే , అమ్మాయ్ నాకు వయసైపోతోంది అంటే నేనొప్పుకోను . అవును , వయసైపోతోంది అనగానే ఎందుకు వొప్పుకోవాలి ? పేపర్ లో 50 ఏళ్ళ వృద్ధులు అని అప్పుడప్పుడు చూస్తుంటాను . 50 ఏళ్ళకే వృద్ధులైపోతారా ? పళ్ళ చివురులు నొప్పిగా వున్నాయని పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళుతే పరీక్షించి , ముందుగా మీకీ వయసులో కూడా పళ్ళు గట్టిగా వున్నందుకు అభినందనలండి అన్నాడు . అదేమిటీ ? అప్పుడే పళ్ళూడిపోయే ముసలిదానిలా వున్నానా అని తెగ గింజుకున్నాను . అరే కంప్యూటర్ కోర్స్ లో చేరటానికి రెండేళ్ళ క్రితం ఇన్స్టిట్యూషన్ కు వెళుతే , అక్కడ ప్రిన్సిపల్ , ఇన్స్ట్రక్టర్ ని పిలిచి , మేడం ఈవయసులో శ్రద్దగా నేర్చుకోవటానికి వచ్చారు , మనమూ శ్రద్దగా నేర్పాలి అని పరిచయము చేసారు . మేడం మీరు మిగితా వాళ్ళతో కలిసి నేర్చుకుంటారా ? విడిగా నేర్పాలా అని అడిగారు . విడిగా ఎందుకు ? అందరి తో కలిసి నేర్చుకుంటే బాగుంటుంది కదా అనగానే , మీకిబ్బందేమో అన్నాను , మీ ఇష్టం అన్నారు . ఐనా నేర్చుకోవటానికి వయసు అడ్డేమిటి ? ఇప్పుడంటే సమ్మర్ క్లాస్ లలో హాబీస్ నేర్చుకోవటానికి పిల్లలని , సెలవల్లో చేర్చటము మొదలు పెట్టారు కాని , నా చిన్నప్పుడే , మా అమ్మ సెలవలు రాగానే ఏదోవక ఆక్టివిటీ లో బిజీ గా వుంచేది . ఆ రోజూలో ' ఆంధ్రప్రభ ' వీక్లీ లో మాలతీ చందూర్ బొమ్మలు చేయటము , కుట్లు , అల్లికల గురించి రాసేవారు . అవన్నీ మా అమ్మ నా తో సమ్మర్ హాలీడేస్ లో చేయించేది . 10 థ్ లోనే టేలరింగ్ నేర్చుకున్నాను . అలా చిన్నపటి నుండే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటము మీద ఆసక్తి ఏర్పడింది . దానికి తగ్గట్టుగానే పెళ్ళయ్యాక మావారు , నేను ఏది నేర్చుకుంటానన్నా ప్రోత్సహించారు . నేనెప్పుడూ ఉద్యోగం చేయాలని అనుకోలేదు . అవకాశము వచ్చినా , ముందు పిల్లలూ , ఇల్లూ అనుకున్నాను . అందుకే ఖాళీ సమయము లో ఇలా , పూణే లో బి ఏ లో చేరాను . జబల్పూర్ లో బ్యూటీషన్ కోర్స్ చేసాను . బరోడాలో ప్రీస్కూల్ మానేజ్ మెంట్ కోర్స్ చేశాను . మావారు , ప్రతి రెండేళ్ళకూ ట్రాన్స్ఫర్ లవుతుంటే , పిల్లలకు టెక్నికల్ కోర్స్ లలో చేర్చటము కష్టమవుతుందని , పేరెంట్స్ ను చూసుకోవాలని , వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొన్నారు . ఇక్కడ సెటిల్ అయ్యాక బ్యూటీపార్లర్ ఏర్పరుచుకున్నాను . అప్పుడు ప్రతి సంవత్సరమూ , బాంబే వెళ్ళి లేటెస్ట్ కోర్స్ లు చేసేదానిని . ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు . వాళ్ళ పిల్లలూ , వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు . ఇహ ఏదో అవసరావసరాలకు తప్ప వాళ్ళ విషయాలలో మా ప్రమేయము అనవసరము అనుకున్నాము . బాధ్యతలు తీరి ఖాళీ సమయము ఇంకా ఎక్కువ దొరికింది , ఇప్పుడు ఏ కొత్త కోర్స్ చేయాలా అనె అనుకుంటున్నానే కాని వయసైపోయింది అనుకోవటము లేదు ! మీరీ వయసు లో కూడా అని ఎవరైనా అంటే , ఏమంత వయసైపోయిందని , ఐనా 60 is the 20 . నా వయసైపోయింది అని అంటే నేనెంత మాత్రమూ ఒప్పుకోను అనేసాను .అనగానే అవునవును అని వొప్పేసుకున్నారు . వాళ్ళను నేను ఎలా ఒప్పించానో , ఐనా నేను చెప్పటమేమిటి ? మీరే చూడండి .

నన్ను , రమాదేవి గారికి పరిచయము చేసిన జ్యోతి గారికి , ఈ ప్రోగ్రాము లో అవకాశమిచ్చిన , రమాదేవి గారికి , మాట్లాడించిన హైమ గారికి చాలా చాలా ధన్యవాదాలు .

రేపు అనగా అక్టోబర్ మొదటి తారీకు , శుక్రవారం , శుభముహూర్తాన , మధ్యాహ్నము 2 గంటల నుండి , 2.30 వరకు , ఈటివి 2 లో వచ్చే సఖి లో ఓ పదినిమిషాల ప్రోగ్రాం లో కనిపించ బోతున్నాను . మీరందరూ , మీ పనులు మానేసి , ఆ సమయము లో , టి వి ని ఆన్ చేసి నేను ఎప్పుడు వస్తానా అని ఎదురుచూస్తూ రాగానే చూడగలరు . మీ పనులు ఎప్పుడూ వుంటాయి కాని నేనెప్పుడూ టివి లో కనిపించను కదా ? మరి మీ అందరి గురించి కూడా చెప్పాను కదా ! ఏమి చెప్పానో తెలుసు కోవాలని లేదూ ??? వుంటుంది లెండి నాకు తెలుసు . మరి మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి . సరేనా !


షూటింగ్ ఐయిన తరువాత , మా ఇంటికి లక్ష్మి గారిని తీసుకెళ్ళాను . లక్షిమి గారిచ్చిన ధైర్యము తో , మా అడవి లోకి ఓ అడుగేసాను . మా అడవి ని చూపించాను . ఆ తరువాత లక్ష్మి గారింటికి వెళ్ళి , లక్ష్మి గారు పెట్టిన వేడి వేడి భోజనము చేసి , మా ఇంటి కెళ్ళాను . ఇవీ ఆనాటి మా ముచ్చట్లు .

రేపు మద్యాహ్నము టివి లో ' సఖి ' కార్యక్రమము తప్పక చూడండి . టింగ్ . . . టింగ్ . . .

ఇప్పుడే జ్యోతి గారు ఈ లింక్ ఇచ్చారు . ఇంట్లో లేని వారు ,కంప్యూటర్ లో ఈ లింక్ కు వెళ్ళి నా ప్రోగ్రాం చూడవచ్చు . థాంక్ యు జ్యోతి గారు .

18 comments:

Overwhelmed said...

emi matladalenu ani anni matladaara? mimmalni corect question adigithe chalu kada.. :)

అశోక్ పాపాయి said...

ayyababoye nenu ela choodali ela ela???

శిశిర said...

Congrats Mala garu.

Durga said...

mari US lo vunnavallu elaa choodaalandi? maakosam aa program mee bloglono FB lono post cheyyandi please. Chaalaa correct ga chepparandi. Ikkada vayasayipoyindani peddaga maatladukoru. Naaku maa akka ki oka Edadinnara teda ante. Adi ammama ayyindi alaage behave chestundi kooda. Nenu enno cheyamani cheppaanu kaani daaniki andulone anandam vundi. Em cheyanu. Nenu meelaage eppudu edo okati nerchukuntu vundaali anukuntaanu.
Photos bavunnayi. Nijangaane Lakshmigaarintlo godalapai muggula designs enta andangaa vunnayo!

psm.lakshmi said...

good post mala garu. program time 2 p.m. to 3 p.m. ETV 2.. madhyalo ghantaravam raavachu.

psmlakshmi

sunita said...

Congrats !

sunita said...

Congrats !

రుక్మిణిదేవి said...

మాల గారు,,congratulations,, ee roju aa program tappakundaa chustaamu..

రాజ్యలక్ష్మి.N said...

ఇప్పుడే ఈ టీవి 2 సఖి లో మీ ప్రోగ్రాం చూశానండీ.
ఇప్పటిదాకా మీ మాటలు బ్లాగ్ లో చదివాను.
ఇప్పుడు మిమ్మల్ని టీవీలో చూడటం చాలా సంతోషంగా అనిపించింది.
Congrats మాలాకుమార్ గారూ
Happy senior citizens Day.

పరిమళం said...

congratulations!malagaru..good program!

భావన said...

Congratulations Maala garu. మేము చూడలేదు గాని వూహించుకున్నా మిమ్ములను లక్ష్మి గారిని ఫొటో లను బట్టి. మిమ్ములను చూసి సీనియర్ సిటిజెన్ అవ్వటం అంటే వుషారు వచ్చేస్తోందండోయ్...

కొత్త పాళీ said...

మీరసలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉండకూడదు, మీరసలే యంగండైనమిక్ కదా! :)

Srujana Ramanujan said...

కొత్త పాళి గారు,

అవునవునవును :)

మాలా కుమార్ said...

జాబిల్లి గారు ,
అదేమిటో నండి ఎవరైనా నీకు వయసైపోతోంది అంటే అలా మాటలోచ్చేస్తాయి :)

* అశోక్ పాపాయి గారు ,
మీరు ఎక్కడో దూరాన వున్నారు . మరేం చేద్దాం చెప్పండి ?

*శిశిర గారు ,
థాంక్ యు .

మాలా కుమార్ said...

దుర్గ గారు ,
మనవలు వచ్చిన మొదట్లో కొన్ని రోజులు అలాగే వుంటుందండి . కాస్త మనవల్ మత్తు దిగాక ఈ లోకానికి వస్తారు లెండి మీ అక్క .

* లక్ష్మి గారు ,
థాంక్ యు .

*సునీత గారు ,
థాంక్ యు .

మాలా కుమార్ said...

రుక్మిణీ దేవి గారు థాంక్ యు అండి .
* రాజీ గారూ ,
చూసారా . మీరు చూసానని చెపుతుంటే నాకూ చాలా సంతోషం గా వుందండి . థాంక్ యు .

* పరిమళం గారు ,
థాంక్ యు .

మాలా కుమార్ said...

భావనా ,
అవునా ఎంత ఉషారొస్తోందేమిటి ?
* కొత్తపాళీ గారు ,
నిజమేనండి . చేతులు కాలాక ఆ విషయం తెలిసింది :)

* సృజన ,
స్చప్ . . . ఏం చేద్దాం ఆలశ్యమైపోయింది . ఇంకోసారి ఇలాంటి ప్రోగ్రాం ల జోలికి వెళ్ళను లే .

మురళి said...

అభినందనలండీ..